
పంజాబ్ చెందిన రాపర్ సింగర్ యో యో హనీ సింగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వివాహా బంధానికి ముగింపు పలికారు. తాజాగా యో యో హనీ సింగ్, అతని భార్య షాలిని తల్వార్‌లకు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాగా.. జనవరి 2011లో షాలిని తల్వార్‌ను హనీ సింగ్ వివాహం చేసుకున్నారు.
(ఇది చదవండి: రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!)
కాగా.. 2021లో తన భర్త హనీ సింగ్‌పై షాలిని గృహ హింస కేసు పెట్టింది. అంతే కాకుండా అతనికి వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించింది. దీంతో ఈ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో షాలినికి కోటి రూపాయల చెక్కును భరణంగా ఇచ్చాడు హనీ సింగ్. కాగా.. సింగర్ ప్రస్తుతం నటి, మోడల్ టీనా థడానీతో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. హనీ సింగ్ పంజాబీతో పాటు హిందీ, హాలీవుడ్ సినిమాలకు పాటలు పాడారు. అతని అసలు పేరు హిర్దేశ్ సింగ్ కాగా.. యో యో హనీ సింగ్ పేరుతో ఫేమస్ అయ్యారు. అతను 2003లో రికార్డింగ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించాడు. ఆ తర్వాత పంజాబీ సంగీతంలో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
(ఇది చదవండి: అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?)
Comments
Please login to add a commentAdd a comment