Yo Yo Honey Singh and Nushrratt Bharuccha Dating Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

Yo Yo Honey Singh: హీరోయిన్‌తో సింగర్ డేటింగ్.. వీడియో వైరల్!

Published Sun, Apr 16 2023 4:40 PM | Last Updated on Sun, Apr 16 2023 4:55 PM

Yo Yo Honey Singh and Nushrratt Bharuccha dating Rumours Goes Viral - Sakshi

బాలీవుడ్ సింగర్, ర్యాపర్‌ యోయో హనీ సింగ్ గురించి బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ముంబయిలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్‌లో ఆయన ప్రదర్శన చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో బీ టౌన్‌కు చెందిన పలువురు అగ్ర తారలు హాజరయ్యారు. అయితే ఈవెంట్‌లో బాలీవుడ్ నటి నుస్రత్ బరుచా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే హనీ సింగ్ ఆమె చేతులు పట్టుకుని వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరి డేటింగ్‌లో ఉన్నారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ జంట ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు. ఓ నెటిజన్ రాస్తూ వారిద్దరు డేటింగ్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ వీరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ కామెంట్ చేశాడు. కాగా.. హనీ సింగ్ ఇటీవలే తన కొత్త పాటను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ సాధించింది.

మరోవైపు నుస్రత్ ప్రస్తుతం 'చోరీ' సినిమా కోసం సిద్ధమవుతోంది. ఆమె చివరిసారిగా అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి 'సెల్ఫీ' చిత్రంలో కనిపించింది. రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన 'తు ఝూతీ మైన్ మక్కార్'లో కూడా నుష్రత్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement