బాలీవుడ్ నటి శ్వేత తివారీ గురించి పరిచయం అక్కర్లేదు. బీటౌన్‌లో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమె కూతురు పాలక్ తివారీ సైతం సినిమాల్లోకి అడుగుపెట్టింది. శ్వేత వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ మూవీలో కనిపించింది.
డేటింగ్ రూమర్స్..
అయితే పాలక్ తివారీపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ కూడా చేశారు. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో డేటింగ్‌లో చేస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కూతురిపై వచ్చిన డేటింగ్ రూమర్స్‌పై ఆమె తల్లి శ్వేత తివారీ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. అయితే అవన్నీ కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉంటాయని.. ఆ తర్వాత వాళ్లే మర్చిపోతారంటూ కొట్టిపారేసింది.
శ్వేత తివారీ మాట్లాడుతూ..' తన కూతురిపై వస్తున్న రూమర్స్ నన్ను బాధించవు. ఎందుకంటే అవీ కేవలం 4 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాళ్లే వార్తలను మరచిపోతారు. అందుకే వాటి గురించి బాధపడటం ఎందుకు?. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్నెట్‌లో తరచుగా ఊహాగానాలు వస్తున్నాయి. తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. అలా రూమర్స్ ప్రకారం నాకు ఇప్పటికే మూడు వివాహాలు జరిగాయి. అయినప్పటికీ ఇలాంటి విషయాలు నన్ను ప్రభావితం చేయలేవు. ఇంతకుముందు సోషల్ మీడియా లేనప్పుడు కొంతమంది జర్నలిస్టులు నా గురించి మంచి విషయాలు రాసేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు. నటీనటుల గురించి నెగెటివ్ రాస్తేనే వాళ్ల మార్కెట్ నడుస్తుంది. ఇవన్నీ నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు" అని తెలిపింది. అయితే తన కుమార్తె పాలక్ తివారీపై నెగెటివ్ ప్రచారం పట్ల ఒక తల్లిగా ఆందోళన చెందుతున్నట్లు అంగీకరించింది.
మొదట తనపై వచ్చే ట్రోల్‌లను డీల్ చేసిన పాలక్ తివారీని చూసి వాటిని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నానని శ్వేత తివారీ వివరించింది. ఎలాంచి రూమర్స్ వచ్చినా తన కూతురు బలంగా ఉన్నప్పటికీ అది కొన్నిసార్లు తనను భయపెడుతుందని తెలిపింది. నా కూతురు చాలా అమాయకంగా ఉంటుందని.. తనపై వస్తున్న రూమర్స్‌కు తిరిగి స్పందించదని వెల్లడించింది. ఆ సమయంలో ఒక తల్లిగా నాపై కొంత ప్రభావం ఉంటుందని శ్వేత చెప్పుకొచ్చింది. ఒకసారి నా స్నేహితులతో కూర్చుని మాట్లాడుతుండగా.. మా అమ్మ దేనికీ భయపడదని పాలక్ చెప్పిందని గుర్తు చేసుకుంది. కాగా.. శ్వేతా తివారీ చివరిసారిగా మిత్రన్ దా నా చల్దా, ఉమానియా, ఇండియన్ పోలీస్ ఫోర్స్ చిత్రాల్లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment