Shweta tiwari
-
కూతురిపై డేటింగ్ రూమర్స్.. తనకేలాంటి బాధలేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి శ్వేత తివారీ గురించి పరిచయం అక్కర్లేదు. బీటౌన్‌లో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమె కూతురు పాలక్ తివారీ సైతం సినిమాల్లోకి అడుగుపెట్టింది. శ్వేత వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ మూవీలో కనిపించింది.డేటింగ్ రూమర్స్..అయితే పాలక్ తివారీపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ కూడా చేశారు. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో డేటింగ్లో చేస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కూతురిపై వచ్చిన డేటింగ్ రూమర్స్‌పై ఆమె తల్లి శ్వేత తివారీ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. అయితే అవన్నీ కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉంటాయని.. ఆ తర్వాత వాళ్లే మర్చిపోతారంటూ కొట్టిపారేసింది.శ్వేత తివారీ మాట్లాడుతూ..' తన కూతురిపై వస్తున్న రూమర్స్ నన్ను బాధించవు. ఎందుకంటే అవీ కేవలం 4 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాళ్లే వార్తలను మరచిపోతారు. అందుకే వాటి గురించి బాధపడటం ఎందుకు?. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్నెట్లో తరచుగా ఊహాగానాలు వస్తున్నాయి. తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. అలా రూమర్స్ ప్రకారం నాకు ఇప్పటికే మూడు వివాహాలు జరిగాయి. అయినప్పటికీ ఇలాంటి విషయాలు నన్ను ప్రభావితం చేయలేవు. ఇంతకుముందు సోషల్ మీడియా లేనప్పుడు కొంతమంది జర్నలిస్టులు నా గురించి మంచి విషయాలు రాసేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు. నటీనటుల గురించి నెగెటివ్ రాస్తేనే వాళ్ల మార్కెట్ నడుస్తుంది. ఇవన్నీ నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు" అని తెలిపింది. అయితే తన కుమార్తె పాలక్ తివారీపై నెగెటివ్ ప్రచారం పట్ల ఒక తల్లిగా ఆందోళన చెందుతున్నట్లు అంగీకరించింది.మొదట తనపై వచ్చే ట్రోల్‌లను డీల్ చేసిన పాలక్ తివారీని చూసి వాటిని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నానని శ్వేత తివారీ వివరించింది. ఎలాంచి రూమర్స్ వచ్చినా తన కూతురు బలంగా ఉన్నప్పటికీ అది కొన్నిసార్లు తనను భయపెడుతుందని తెలిపింది. నా కూతురు చాలా అమాయకంగా ఉంటుందని.. తనపై వస్తున్న రూమర్స్‌కు తిరిగి స్పందించదని వెల్లడించింది. ఆ సమయంలో ఒక తల్లిగా నాపై కొంత ప్రభావం ఉంటుందని శ్వేత చెప్పుకొచ్చింది. ఒకసారి నా స్నేహితులతో కూర్చుని మాట్లాడుతుండగా.. మా అమ్మ దేనికీ భయపడదని పాలక్ చెప్పిందని గుర్తు చేసుకుంది. కాగా.. శ్వేతా తివారీ చివరిసారిగా మిత్రన్ దా నా చల్దా, ఉమానియా, ఇండియన్ పోలీస్ ఫోర్స్ చిత్రాల్లో కనిపించారు. -
చీర కట్టులో నటి శ్వేతా తివారీ మెస్మరైజ్ లుక్స్
-
ఎవరూ నమ్మలేరు ఈ హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే
బాలీవుడ్ సెలబ్రిటీలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా మంచి అభిమానులను కలిగి ఉన్నారు మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు, చాలా మంది బాలీవుడ్ తారలు పాకిస్తాన్ చిత్రాలలో పనిచేశారని చాలా కొద్ది మందికి తెలుసు. మరోవైపు, పాకిస్థానీ నటలు కూడా బాలీవుడ్లో పనిచేసిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నారు. పాకిస్థాన్ సూపర్ హిట్ చిత్రాలలో పనిచేసిన కొంతమంది ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో మీరు తెలుసుకోండి. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. ఇండియాలో ఆమెకున్న పాపులారిటీ వల్ల పాకిస్థాన్ సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. పాకిస్థానీ చిత్రం 'కభీ ప్యార్ నా కర్ణా'లో ఆమె ఐటెం సాంగ్‌లో కనిపించింది. ఈ చిత్రంలో పాకిస్థానీ నటీనటులు వీణా మాలిక్, మోఅమర్ రాణాతో పాటు జారా షేక్ ముఖ్య పాత్రలు పోషించారు. కిరణ్ ఖేర్ ‘కిరణ్ ఖేర్’ అనే పేరు అందరికీ సుపరిచితమే. ఆమె 1985లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ను వివాహం చేసుకుంది. ఆమె నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీ నుంచి చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. 2003లో పాకిస్థాన్‌లో విడుదలైన చిత్రం 'ఖామోష్ పానీ'లో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటితో సహా ఈ చిత్రానికి కిరణ్ ఖేర్ అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు శ్వేతా తివారీ బాలీవుడ్ 'బిగ్ బాస్ 4' విజేత, ప్రసిద్ధ టీవీ షో 'కసౌతి జిందగీ కి' స్టార్ అయిన శ్వేతా తివారీ 2014లో విడుదలైన పాకిస్థానీ యాక్షన్ రొమాన్స్ చిత్రం 'సుల్తానాత్'లో పనిచేసింది ఈ హాట్ బ్యూటీ. ఇది పాకిస్థానీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికీ చెప్పబడుతోంది. రూ. 22 కోట్ల బడ్జెట్‌తో అప్పట్లో ఈ సినిమాను నిర్మించారు. గతేడాది శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాను నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడిస్తూ తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. శ్వేత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె క్షమాపణులు కూడా కోరింది. అమృత అరోరా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సోదరినే అమృతా అరోరా బాలీవుడ్లో నటిగా రాణించలేకపోయింది, అందుకే ఆమె హిందీ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. అయితే అమృత ఓ పాకిస్థానీ సినిమాలో పని చేసిందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమృతా అరోరా 'గాడ్‌ఫాదర్: ది లెజెండ్ కంటిన్యూస్' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లండన్‌లో పుట్టి పెరిగిన పాకిస్తానీ ఉస్మాన్ అఫ్జల్ అనే క్రికెటర్‌తో డేటింగ్ చేసి 2009లో షకీల్ లడక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. శిల్పా శుక్లా షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం 'చక్ దే ఇండియా' సినిమాతో తనకు భారీగా గుర్తింపు దక్కింది. అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన శిల్పా శుక్లా పాకిస్థానీ సినిమాలో కూడా నటించింది. ఆమె పాకిస్థానీ చిత్రం 'ఖామోష్ పానీ'లో కిరోన్ ఖేర్‌తో కలిసి నటించింది. బాలీవుడ్లో చేసిన సినిమాలు తక్కువే అయినా 2014లో వచ్చిన B.A PASS సినిమాకు నేషనల్ అవార్డ్‌ను అందుకుంది. ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. -
దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన నటి
Shweta Tiwari Apologies After Her Derogatory Comments On God: ప్రముఖ హిందీ సీరియల్ శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. దేవుడిపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతుండటంతో తప్పు తెలుసుకుంది. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అంతేకాకుండా తన మాటలను వక్రీకరించారని పేర్కొంది. సహ నటుడు సౌరబ్ పాత్రను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ని దేవుడితో ముడిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను దేవుడ్ని విశ్వసిస్తానని, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా ఓ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా శ్వేత భగవంతుడిపై జోక్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే భోపాల్‌లోని శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు కూడా నమోదైంది. -
దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటిపై కేసు
హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ హిందూత్వవాదులు డిమాండ్ చేస్తున్నారు. శ్వేతా తివారీ తాజాగా నటించిన వెబ్ సిరీస్ షో స్టాపర్. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె సహనటుడు రోహిత్ రాయ్‌తో కలిసి భోపాల్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా శ్వేత భగవంతుడిపై జోక్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నెటిజన్లు నటిని దుమ్మెత్తిపోశారు. భోపాల్‌లోని శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు కూడా నమోదైంది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. 'శ్వేతా తివారీ నుంచి ఆ మాటలు రావడం నేనే స్వయంగా విన్నాను. ఇది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. దీనిపై విచారణ జరపాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాను. ఆ తర్వాత నటిపై చర్యలు తీసుకోనున్నారు' అని పేర్కొన్నారు. -
ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్
Shweta Tiwari Hospitalised, Ex-Husband Reacts: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటి శ్వేతా తివారి త్వరగా కోలుకోవాలంటూ ఆమె మాజీ భర్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నా కొడుకు కస్టడీకి సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది. కానీ శ్వేత త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. చాలామంది యాక్టర్స్(నటీనటులు) ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రేమ పొందేందుకు, తమను తాము మరింత అందంగా చూపించుకునేందుకు డైట్ పేరిట తక్కువ తిని, ఎక్కువ వర్కవుట్స్ చేస్తూ తమ శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తారు. ఇలానే చేస్తూ పోతే ఏదో ఒకరోజు వారి గుండె అలిసిపోతుంది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. చదవండి: అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. ఖత్రోన్ కే ఖిలాడి సీజన్11 ఫైనలిస్ట్, హిందీ సీరియల్ నటి శ్వేత తివారి బలహీనత, లో- బీపీ కారణంగా హాస్పిటల్ పాలైంది. షూటింగ్స్‌లో బిజీ ఉండటంతో తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో ఆమె అనారోగ్యానికి గురైందని శ్వేత పీఆర్ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా తివారికి, భర్త అభినవ్‌తో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఓ రియాలిటీ షో కోసం కేప్‌టౌన్ వెళ్లేందుకు రెడీ అయిన శ్వేత.. తన కొడుకు రేయాన్ కోసం సరైన ఏర్పాట్లు చేయకుండానే దేశం విడిచి వెళ్తుందంటూ అభినవ్ ఆరోపించాడు. దీంతో తన కొడుకును బలవంతంగా అభినవ్ తీసుకెళ్లేందుకు చూస్తున్నాడంటూ సీసీటీవీ ఫుటేజిని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కాగా బాలీవుడ్ నటి శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని రెండో పెళ్లి చేసుకుంది. విభేదాల కారణంగా 2019లో వీరు విడిపోయారు. డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు View this post on Instagram A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) -
రెండో భర్త మీద ఆరోపణలు: వీడియో రిలీజ్ చేసిన అభినవ్ కోహ్లి
బాలీవుడ్ నటి శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి రియాన్ష్ అనే కొడుకున్నాడు. కొన్నేళ్లు బాగానే సాగిన వీరి సంసార సాగరం అర్ధాంతరంగా బీటలు వారింది. దీంతో 2019లో వీరు విడిపోయారు. కానీ కొడుకు రియాన్ష్ కోసం ఇద్దరూ గొడవ పడ్డారు. అతడు తనకు చెందుతాడంటే తనకంటూ వాదులాటకు దిగారు. ఈ గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్తూ శ్వేతా తివారీ సీసీటీవీ ఫుటేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. ఇందులో శ్వేతా కొడుకును భుజాన ఎత్తుకుని నడుస్తూ ఉండగా.. కోహ్లి బలవంతంగా పిల్లవాడిని లాక్కున్నట్లుగా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari) అయితే అతడు బలవంతంగా తన కొడుకును తీసుకున్నాడని, ఈ క్రమంలో అతడి చేతికి గాయం అయిందని చెప్పుకొచ్చింది. ఈ ఘటనతో రియాన్ష్ చాలా భయపడిపోయాడని, ఆ భయం నుంచి బయటపడేందుకు సుమారు నెల రోజులు పట్టిందని తెలిపింది. ఆ సమయంలో కనీసం రాత్రిళ్లు సరిగా నిద్రకూడా పోలేదని వాపోయింది. ఇప్పటికీ తన తండ్రి ఇంటికి వస్తున్నాడంటే గజగజ వణికిపోతున్నాడని పేర్కొంది. ఇలాంటి మానసిక స్థితిలో తన కొడుకును చూడలేకపోతున్నాని, అతడికి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా చూసుకోవాలనుందని చెప్పింది. కానీ ఈ భయంకరమైన వ్యక్తి తన కొడుకును ప్రశాంతంగా ఉంచండని మండిపడింది. దీన్ని శారీరకంగా హింసించడం అనకపోతే ఇంకేమంటారు? అని శ్వేతా ప్రశ్నించింది. View this post on Instagram A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) ఇది చూసిన అభినవ్ కోహ్లి.. శ్వేతా తివారి ఆరోపణలను తోసిపుచ్చాడు. గతేడాది శ్వేతాకు కరోనా వచ్చినప్పటి నుంచి రియాన్ష్ తన దగ్గరే ఉండిపోవాలనుకుంటున్నాడని చెప్పాడు. అందుకు ఇదే సాక్ష్యమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో ఆ బాలుడు అమ్మ దగ్గరకు వెళ్లనని చెప్తున్నట్లుగా ఉంది. ఇక ఈ వీడియోకు 'ఇప్పటికైనా నిజాన్ని బయటకు రానివ్వండి' అని క్యాప్షన్ ఇచ్చాడు. చదవండి: నా మొదటి భర్త నన్ను కొట్టడం నా కూతురు చూసింది: నటి -
రెండు పెళ్లిళ్లు చేసుకుని తప్పు చేశా: నటి
నటీనటుల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా ఉండవు. స్రీన్‌పై రంగుల మయంగా కనిపించే వారు వ్యక్తిగతంగా ఎన్నో చికటి రోజులను గడుపుతారు. అలాగే టీవీ నటి శ్వేతా తివారి జీవితం కూడా. శ్వేతా రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పెళ్లిళ్లు కూడా విడాకులకు దారి తీయడంతో తన ఇద్దరు పిల్లలని ఒంటరిగా పోషించుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తన విడాకులు పిల్లలపై ఏవిధంగా ప్రభావం చూపుతుందో వివరించారు. ‘నేను జీవితంలో రెండు సార్లు మోసం పోయాను. ఆ ప్రభావం నాకంటే ఎక్కువగా పిల్లలపై పడింది. నేను చేసిన పెద్ద తప్పు నా జీవితంలోకి ఇద్దరు తప్పుడు పురుషులను ఆహ్వానించడం. దాని ఫలితం ఇప్పుడు నా ఇద్దరూ పిల్లలు అనుభవిస్తున్నారు. వారికి ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎప్పుడు గందరగోళంగా కనిపిస్తారు. అంతేగాక బాధను బయటకు కనిపించకుండా దాచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారు సంతోషంగా ఎలా నవ్వుతున్నారో అర్థం కావడం లేదు. అందుకే కొన్ని సార్లు వారిద్దరిని మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకువెళ్లి వారి మనసులో ఎముందో తెలుసుకోవాలను ప్రయత్నిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన మొదటి భర్త రాజా చౌదరి తనని మానసికంగా, భౌతికంగా హంసించేవాడని, అందుకే అతడిపై గృహహింస కేసు పెట్టానని చెప్పింది. ‘పాలక్(మొదటి భర్త కూతురు) 6 సంవత్సరాల నుంచి నా భర్త రాజా చౌదరి నన్ను కొట్టడం, తిట్టడం చూసింది. తనకు చిన్నప్పటిక నుంచే పోలీసులు, లాయర్లు కేసులు తెలుసు. వారు రోజు ఇంటికి వచ్చి విచారించడం అవన్ని తన చిన్న వయసులోనే చూసింది. అందుకే నేను రాజాతో విడిపోవాలని నిర్ణయించుకున్న’ అని అన్నారు. ఇక శ్వేతా 2013లో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి రియాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. ఇక రియాన్ష్(కుమారుడు) గురించి చెబుతూ అతడికి ప్రస్తుతం 4 ఏళ్లు. ఈ వయసులోనే అతడు కూడా కోర్టు, పోలీసులు అంటే తెలుసు. ఇదంతా నావల్లే. నేను తప్పుడు వ్యక్తులను ఎంచుకోవడం వల్లే ఇలా జరిగింది. ఇందులో పూర్తిగా నా పొరపాటే ఉంది. వారిది కాదు. కానీ వారు ఎప్పుడు నాతో హ్యాపీ ఉంటారు. నన్ను నిందించరు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా పాలక్ శ్వేతా మొదట్టి భర్త రాజా చౌదరిల కూతురు, రియాన్ష్ రెండవ భర్త అభినవ్ కోహ్లిల కుమారుడు. చదవండి: ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా! అందుకే అవార్డు ఫంక్షన్‌కు నాన్న దుస్తుల్లో వెళ్లా: బాబిల్ -
ఆ వార్తలు నిజమేనంటున్న నటి
టీవీ నటి, హిందీ బిగ్‌బాస్ నాల్గవ సీజన్ విజేత శ్వేతా తివారీ కరోనా బారిన పడినట్లు వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ఇదెంత వరకు నిజమని అభిమానులు గందరగోళంలో పడ్డారు. వారందరికీ శ్వేతా తివారీ క్లారిటీ ఇచ్చేశారు. అవును, నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అని వెల్లడించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. "సెప్టెంబర్ 16 నుంచి దగ్గడం ప్రారంభమైంది. ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే ఆ తర్వాతి రోజే పాజిటివ్ అని తేలింది. దీంతో నా ఇంట్లోని గదిలోనే క్వారంటైన్లో ఉంటున్నాను. నా కూతురు పాలక్ కూడా భౌతిక దూరాన్ని స్ట్రిక్ట్‌గా పాటిస్తోంది. కొడుకు రేయాన్ష్ను నా తండ్రి అభినవ్ శుక్లా దగ్గరకు పంపించాను." (టీవీ నటుల ఛాలెంజ్.. నెటిజన్ల మండిపాటు) "కరోనాతో ఫైట్ చేసేందుకు ప్రతిరోజూ వేడినీళ్లను గుటగుటా తాగేస్తున్నాను. ఇంకా నా క్వారంటైన్ గడువు అక్టోబర్ 1 వరకు ఉంది. సెప్టెంబర్ 27న మళ్లీ ఓసారి టెస్ట్ చేయించుకుంటాను. కానీ నిజంగానే ఇది కష్ట సమయం. నాకే కాదు. అక్కడ షూటింగ్స్‌కు కూడా ఇబ్బందే. ఈ వైరస్ విలయతాండవం నుంచి ఇంకా ఎప్పుడు బయటపడతామో" అని చెప్పుకొచ్చారు. కాగా శ్వేతా తివారీకి కసౌటీ జిందగీ కే(జీవితం పెట్టే పరీక్షలు) సీరియల్ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్న ఆమె ప్రస్తుతం మేరే డాడ్ కీ దుల్హాన్లో నటిస్తున్నారు. అయితే ఆమెకు కరోనా సోకిన కారణంగా కొంతకాలం వరకు ఆమె లేని ఎపిసోడ్లను మాత్రమే చూడగలం. (భర్తపై ప్రముఖ నటి ఫిర్యాదు, అరెస్ట్) -
టీవీ నటుల ఛాలెంజ్.. నెటిజన్ల మండిపాటు
లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఉంటూ బోరింగ్‌గా ఫీల్ అవుతున్న వారి కోసం సోషల్ మీడియా వేదికగా అనేక కొత్త ఛాలెంజ్‌లు రూపొందుతున్నాయి. ఇటీవల ‘హిట్ మీ ఛాలెంజ్’ అనే ఛాలెంజ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కొంతమంది కలిసి ఒకరినొకరు కొట్టుకున్నట్లు నటించడమే ఈ ఛాలెంజ్ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ సవాల్‌ను బాలీవుడ్ బుల్లితెర నటులు స్వీకరించారు. టెలివిజన్ స్టార్స్ శ్వేతా తివారీ, కరణ్ వీర్, వికాస్ కలంత్రి, షరద్ మల్హోత్రా, డెబినా బోనెన్నర్జీతో సహా పలువురు నటులు కలిసి హిట్ మీ ఛాలెంజ్ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో ముందుగా శ్వేతా.. ఒకరిని కొట్టడంతో మొదలవ్వగా, అలా ఒకరినొకరు కొట్టుకుంటూ పోతారు. ఎవరి చేతికి దొరికిన వస్తువులను వాళ్లు ఉపయోగిస్తూ ఎదుటి వారిపై దాడికి యత్నిస్తారు. (నేను అతన్ని ప్రేమిస్తున్నాను: హీరోయిన్ ) ఈ క్రమంలో టీవీ రిమోట్, చీపురు, క్రికెట్ బ్యాట్, యాపిల్ ఇలా ఒక్కొ వస్తువును ఆయుధంగా ఉపయోగిస్తూ చివరికి డోనాల్ బిష్ట్.. క్రిప్ కపూర్ కంటిపై ఎటాక్ చేస్తుంది. అయితే తిరిగి ఆమెను ఎదుర్కొలేని అతను తన గిలార్ ట్యూన్ ప్లే చేస్తూ ఈ పోరాటానికి ముగింపు పలికాడు. అయితే ప్రతి ఒక్కరు తమ ఇంట్లోనే ఉంటూ ఈ వీడియోను రూపొందించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఇది చాలా సరదాగా ఉంది. ఈ ఛాలెంజ్ గురించి నాకు ఎవరో చెప్పినప్పుడు నేను దీన్ని చేయాలని అనుకున్నాను’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవ్వడంతో టీవీ నటుల తీరుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనన లభిస్తోంది. ‘ఫన్నీగా ఉంది. కానీ ఇలా కొట్టుకోవడం ఎందుకు ఏదైనా నిర్మాణాత్మకంగా చేయండి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇది మాకు నచ్చలేదు. మీరు గృహహింసను ప్రోత్సహిస్తున్నారు’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (బాహుబలి-2 నా జీవితాన్ని మార్చిన సినిమా) -
శ్వేతా తివారీ
‘పనిలో అంకిత భావం ఉండాలి’ అనే మాట అర్థం కాని వారెవరైనా శ్వేతా తివారీ ఏం చెబుతున్నారో వింటే చక్కగా పనిలో పడిపోతారు. శ్వేత టీవీ నటి. గుర్తుకు రావడం లేదా? స్టార్ ప్లస్ వారి ‘కసౌటీ జిందగీ కే’ (జీవితం పెట్టే పరీక్షలు) హీరోయిన్. ఇంకా గుర్తుకు రావడం లేదా? హిందీ బిగ్ బాగ్ షోలో నాలుగో సీజన్ విజేత ఈవిడే! ఇప్పుడు కూడా మీకు గుర్తుకురాకపోతే.. ఈ ఫోటో చూసినా ఆమె గుర్తుకు రారు. ఎందుకంటే.. అప్పటికీ ఇప్పటికీ శ్వేత బాగా స్లిమ్ అయ్యారు. పోనీ ‘బెగుసరాయ్’ డైలీ టీవీ సీరియల్ జ్ఞాపకం ఉందా? 2015–2016 మధ్య జీటీవీ (అండ్ టీవీ) వచ్చింది. అందులో శ్వేత వేశ్య పాత్రధారి. ‘ఎలా ఒప్పుకుంటారు?’ అలా చేయడానికి అని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ పాత ప్రశ్ననే ఓ వెబ్ షోలో శ్వేతను కొత్తగా అడిగారు షోకి వచ్చినవారు. ఆ సందర్భంలోనే ‘పనిలో అంకిత భావం’ గురించి మాట్లాడారు శ్వేత. ‘‘పని నాకు దైవంతో సమానం. ఆ రోజు నేను ఉపవాసం ఉన్నా కూడా.. క్యారెక్టర్ కోసం అవసరమైతే మాంసాహారం కూడా తింటాను’’ అని చెప్పారు. టీవీ నుంచి వచ్చిన శ్వేత ఇంకో మాట కూడా చెప్పారు.. ఎప్పటికీ టీవీని విడిచిపెట్టి పోనని! ఇది కూడా అంకిత భావమే కానీ, వృత్తి నిబద్ధత అంటే ఇంకా బాగుంటుంది. -
వారి కంటే నేను బెటర్: శ్వేతా తివారి
‘మేరే డాడ్‌కి దుల్హాన్’ షోతో తిరిగి బుల్లితెరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు బాలీవుడ్ సీరియల్ నటి శ్వేతా తివారి. తన రెండో భర్త అభినవ్ కోహ్లి తనను మానసికంగా వేధిస్తున్నాడని.. తన కూతురు పాలక్ తివారితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఇటీవలే ఆయనపై గృహహింస కేసు పెట్టిన విషయం విదితమే. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి శ్వేతా వెల్లడించారు. ఈ క్రమంలో రెండో భర్త అభినవ్ కోహ్లిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో తనపై వచ్చిన ట్రోల్స్‌ను తిప్పికొట్టారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న ఎంతోమంది కంటే తను బెటర్ అంటూ చెప్పుకొచ్చారు. అభినవ్ కోహ్లితో రెండో వివాహం శరీరంలో ‘విషపూరితమైన ఇన్ఫెక్షన్’ వంటిదని పోల్చి చెప్పారు. అది తనను తీవ్రంగా బాధించిందని అందుకే దాన్ని తొలగించుకున్నానని తెలిపారు. ధైర్యంగా ముందుకు వచ్చి అతనితో కలిసి జీవించలేను అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేగాక ప్రస్తుతం కెరీర్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నానన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘అనేక మంది రెండో పెళ్లి చేసుకున్నాక కూడా ఎలా సమస్యలు వస్తాయని అడుగుతున్నారు. అయితే వారిని నేనొకటి అడగాలనుకుంటున్నా. రెండో పెళ్లిలో సమస్యలు ఎందుకు రావు?. నేను కనీసం ధైర్యంగా బయటకు వచ్చి ఆ సమస్యలను చెప్పుకోగలుగుతున్నాను. పెళ్లయ్యాక కూడా చాలామంది తమ ప్రియుడు, ప్రియురాళ్లతో సంబంధం కొనసాగిస్తున్నారు. వారి కంటే నేను బెటర్ కదా. ఇక నా చేతుల్లో ఒక చేయి పనిచేయకపోతే రెండో చేతితో పనిచేసుకుంటాను. అంతేగానీ జీవించడం మానేయలేను. అలాగే జీవితంలో కొన్ని తప్పులు చేస్తే జీవించడం ఆపలేను. కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తా అంతే. నా పిల్లలు, వారి సంరక్షణ చూసుకోవడం, ఇంటిని చక్కదిద్దుకోవడం వంటి పనులు చూసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’
ముంబై : భర్త అభినవ్ కోహ్లి తనను మానసికంగా వేధిస్తున్నాడు అంటూ టీవీ సీరియల్ నటి శ్వేతా తివారి గృహహింస కేసును నమోదు చేయడంపై కూతురు పాలక్ తివారి స్పందించారు. తండ్రి తనను శారీరకంగా వేధించాడంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. కాగా భర్త తనను వేధిస్తున్నాడంటూ శ్వేతా తివారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో అభినవ్ తన కూతురిని కూడా కొట్టాడంటూ ఆమె ఆరోపించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తలపై శ్వేత కూతురు పాలక్ తివారి సోషల్ మీడియాలో స్పందించారు. కఠిన సమయంలో తన తల్లికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా వెల్లడించిన విషయాలన్నీ వాస్తవాలు కావని కొట్టిపారేశారు. మీడియా ఏదైనా విషయం గురించి ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, అబద్దాలను ప్రచారం చేయకూడదని సూచించారు. తన తల్లి అనేక సార్లు గృహహింసకు గురైన విషయం వాస్తవమే కానీ కేసు నమోదు చేసిన రోజు తప్ప ఏ రోజు అభినవ్ కోహ్లి తన తల్లిని కొట్టలేదని తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ లేఖ రాశారు. చదవండి : భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి అదే విధంగా సవతి తండ్రి(అభినవ్) తనను ఎప్పుడు శారీరకంగా వేధించలేదని.. కనీసం అసభ్యంగా తాకలేదని పాలక్ పేర్కొన్నారు. అభినవ్ ప్రతీసారి అసభ్యకర వ్యాఖ్యలతో తల్లిని దూషించేవాడని, దానికి ప్రత్యక్ష సాక్షురాలు తనేనని తెలిపారు. ఒక కుటుంబానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచురిస్తే ఆ కుటుంబానికి ఎంతో బాధగా ఉంటుందని వాపోయారు. ‘మీరు(మీడియాను ఉద్దేశించి) రాసే వార్తలు ఒకరి జీవితానికి సంబంధించినవని గుర్తుంచుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా పాలక్ తివారీ.. శ్వేతా తివారికి మొదటి భర్త రాజా చౌదరి ద్వారా కలిగిన సంతానం. రాజా చౌదరితో విడాకులు తీసుకున్న అనంతరం శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఉన్నాడు. -
భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి
ముంబై: ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ భర్త అనుభవ్ కోహ్లిని పోలీసులు ముంబైలో అరెస్టుల చేశారు. ఆయనపై భార్య శ్వేత గృహహింస కేసును నమోదు చేశారు. అంతేకాకుడా శ్వేత కుతూరు పాలక్ తివారీకి అతను అసభ్య ఫొటోలను చూపించినట్టు అభియోగాలు వినిపిస్తున్నాయి. నటి శ్వే తా తివారీ ఆదివారం మధ్యాహ్నం భర్తకు వ్యతిరేకంగా ముంబై సమతా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె వెంట తల్లి, కూతురు పాలక్ ఉన్నారు. మద్యం మత్తులో అనుభవ్ నిత్యం తనను కొట్టేవాడని, కోపంలో ఓసారి పాలక్‌పై కూడా అతను చేయి చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుభవ్‌ను స్టేషన్‌కు పిలిచి.. నాలుగుగంటలపాటు చర్చించిన అనంతరం అరెస్టు చేశారు. శ్వేత తివారి గతంలో రాజా చౌదరిని పెళ్లాడారు. వీరికి కూతురు పాలక్ ఉంది. గృహహింస బారిన పడిన ఆమె 2007లో రాజాతో విడాకులు తీసుకున్నారు. అనంతరం కొంతకాలం డేటింగ్ చేసిన అనుభవ్ కోహ్లిని 2013లో ఆమె పెళ్లాడారు. వీరికి రెండేళ్ల కొడుకు రెయాన్ష్ కొహ్లి ఉన్నాడు. శ్వేత-అనుభవ్ మధ్య గొడవలు రావడం ఇదే తొలిసారి కాదు. 2017లోనూ వీరు గొడవలు పడ్డట్టు కథనాలు వచ్చాయి. ‘కౌసటి జిందగి క్యా’ సీరియల్లో ప్రేరణగా అత్యంత పాపులర్ అయిన శ్వేత.. పలు టీవీ సీరియళ్లతోపాటు హిందీ బిగ్‌బాస్-4 విన్నర్‌గా నిలిచారు. -
ప్రముఖ నటి కూతురి ఫొటోలు వైరల్!
న్యూఢిల్లీ: ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో కనిపించిన యువతి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారారు. ప్రస్తుతం ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె మరెవరో కాదు.. బుల్లితెర ప్రముఖ నటి శ్వేతా తివారీ ముద్దుల తనయ పలక్ తివారీ. సొంతంగా కష్టపడి ఎదిగిన శ్వేతా తివారీ.. పలు హిందీ సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే గత మంగళవారం జీ గోల్డ్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో శ్వేతా తివారీ పాల్గొనగా అందరి దృష్టిని ఓ యువతి ఆకర్షించారు. బ్లాక్ డ్రెస్సులో దర్శనమిచ్చిన ఆమె తొలుత ఎవరై ఉంటుందోనని అందరూ భావించారు. నా వెంట వచ్చి, మా దంపతులతో పాటు ఫొటోలకు ఫోజులిచ్చింది నా కన్నకూతురు పలక్ తివారీ అంటూ శ్వేత పరిచయం చేశారు. కూతురు అందానికి ఆ ఈవెంట్లో మార్కులు పడటంతో ఆమె హ్యాపీగా ఉన్నారు. పలక్ మంచి నటిగా పేరు తెచ్చుకుంటుందని శ్వేతా ధీమాగా ఉన్నారు. మరికొందరు నటీమణులతో కలిసి వర్ధమాన తార పలక్ రెడ్ కార్పెట్ షేర్ చేసుకున్నారు. ఈవెంట్లో పలక్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పలక్కు సినిమా అవకాశాలు క్యూ కడతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-4లో విజేతగా నిలిచిన శ్వేతా తివారీ.. తన కూతురును వెండితెరకు పరిచయం చేసేందుకు యత్నిస్తున్నారు. మరో తారే జమీన్ పర్ ఫేమ్ దర్శీల్ సఫారీకి జోడీగా జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. శ్వేతా తివారీ, ఆమె మొదటి భర్త రాజా చౌదరీల కూతురు పలక్. కాగా, రాజా చౌదరీతో విడాకులు తీసుకున్న అనంతరం నటుడు అభినవ్ కోహ్లీని శ్వేతా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. -
నా భార్య బతికే ఉంది: నటి భర్త
ముంబయి: ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి చనిపోయిందంటూ శనివారం సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా షేర్ అయ్యాయి. దాంతో ఇది నిజమని నమ్మిన ఆమె క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ నటి సాక్షి తన్వర్.. ఏకంగా తన ట్విటర్ పేజీలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని ట్వీట్ చేసింది. బాలాజీ టెలిఫిల్మ్స్ అండ్ మొత్తం యూనిట్ నిన్ను కోల్పోయిందంటూ ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేసింది. ఇక అది తరువాయి.. నిజంగానే శ్వేత చనిపోయిందని నెటిజన్లు శ్వేతా తివారికి నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. ఆమె బతికే ఉందని తెలుసుకోవడానికి అందరికీ ఒక రోజు పట్టింది. శ్వేతా తివారి చనిపోయిందని భావించిన ఆమె సన్నిహితులు, కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు అర్పించారు. బుల్లితెర నటుడు, శ్వేతా భర్త అభినవ్ కోహ్లీకి కొందరు ఫోన్లు చేసి సంతాపంతో పాటు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భార్య చనిపోయిందన్న వార్త విని షాకయిన అభినవ్.. భార్య శ్వేతకు కాల్ చేసి జరుగుతున్న ప్రచారం తప్పు అని తెలుసుకున్నాడు. తన భార్య బతికేఉందని, పిల్లలతో ఇంటివద్ద హాయిగా సమయం గడుపుతుందన వెంటనే మీడియా దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దయచేసి ఇలా బతికున్న వ్యక్తిని చనిపోయారని ప్రచారం చేయవద్దంటూ శ్వేతా భర్త అభినవ్ విజ్ఞప్తిచేశారు. రేయాన్ష్ అనే బాబుకు ఇటీవల జన్మనిచ్చిన ఆమె.. షూటింగ్ నుంచి విరామం తీసుకుంది. గతంలోనూ బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, దిలీప్ కుమార్, ఖాదర్ ఖాన్, ఫరీదా జలాల్ లు చనిపోయినట్లు వదంతులు ప్రచారమయ్యాయి. -
మరో స్టార్ వారసురాలు రెడీ అవుతోంది!
భారతదేశంలో స్టార్ వారసులకు కొదవ లేదు. ఇటు టాలీవుడ్లో, అటు బాలీవుడ్లో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున స్టార్ వారసులు వెండితెరకు పరిచయమై.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే కోవలోకి చేరేందుకు మరో స్టార్ వారసురాలు సిద్ధమవుతోంది. ప్రముఖ టీవీ నటి శ్వేత తివారీ కూతురు పాలక్ తివారీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పాలక్ తివారీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. మూగ్ధమోహనమైన రూపం.. కూల్ అటిట్యూడ్ తో ఉన్న పాలక్ పలు ఈవెంట్లకు తల్లి వెంట వెళ్లి మీడియా దృష్టిలో పడింది. తర్వలో ఆమె బాలీవుడ్‌కు పరిచయమయ్యే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఫొటోలు ఇవి.. -
సిటీ.. బ్యూటీ
ప్యాషన్ ఉండాలే గానీ ఎందులోనైనా రాణించవచ్చని నిరూపించింది మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ 2014 శ్వేతాతివారి. పెళ్లి చేసుకున్నా... తనలోని మోడల్‌ను కంటిన్యూ చేసిన శ్వేత... గత ఏడాది మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ పోటీల్లో విన్నర్‌గా నిలిచింది. రాజ్‌భవన్ రోడ్ ట్రావెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ‘స్పెషల్ హాలీడే ప్యాకేజెస్’ను శనివారం లాంచ్ చేసిన సందర్భంగా శ్వేతతో ‘సిటీ ప్లస్’ చిట్‌చాట్... ఛత్తీస్‌గఢ్ రాయపురాలో ఆచారవ్యవమారాలు తు.చ. తప్పకుండా పాటించే ఫ్యామిలీ మాది. స్కూల్లో ఉన్నప్పుడు ఫ్యాషన్ షోలు, అందాల పోటీల గురించి వింటుంటే ఎంతో అబ్బురంగా ఉండేది. ఇంటర్లోకి వచ్చేసరికి మోడలింగ్ చేయాలనే కోరిక బలపడిపోయింది. విషయం ఇంట్లో చెబితే ఏమవుతుందోనన్న భయం! ధైర్యం చేశా... అందరికీ చెప్పా. అంతటి సంప్రదాయ కుటుంబమైనా... ‘నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి’ అంటూ ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే నాకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. హైదరాబాద్ వచ్చి విల్లామేరీ కాలేజీలో బీకాంలో జాయిన్ అయ్యా. అప్పుడే మిస్ ఏపీ టైటిల్ గెలుచుకున్నా. కింగ్‌ఫిషర్ మోడల్ హంట్‌లో గెలిచా. 2012లో వ్యాపారవేత్త భాస్కర్ తివారీతో పెళ్లయింది. రెండేళ్లు మోడలింగ్ మానేశా. అయితే అత్తింటి వారిని ఒప్పించి మళ్లీ మోడలింగ్ ఆరంభించాను. ఫ్యామిలీ మద్దతు ఉంటే దేన్నయినా జయించవచ్చన్న ఆత్మవిశ్వాసం కలిగింది నాలో. కౌలంలంపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించి అందాల కిరీటం దక్కించుకున్నా. ఇది నా కెరీర్లోనే స్వీట్ మెమరీ. పెళ్లయితే అమ్మాయిలకు గ్లామర్ ఫీల్డ్‌లో కెరీర్‌కు ఫుల్స్టాప్ పడుతుందంటే నేను ఒప్పుకోను. మోడల్ కావాలనుకొనే అమ్మాయిలకు ప్రాంతీయ స్థాయిలో జరిగే అందాల పోటీలు కీలకమైనవి. నాకు ఫ్యాషన్ ప్రాణం. షాపింగ్ పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా వచ్చే మోడ్రన్ డ్రెస్‌లు కొనేస్తుంటా. నగరంతో ఎంతో అనుబంధం నేను బేసిగ్గా శాఖాహారిని. మా కుటుంబ నేపథ్యం, పెరిగిన తీరు వల్ల ఎన్ని నగరాలు తిరిగినా ఆహారపు అలవాట్లు మార్చుకోలేదు. బాలీవుడ్లో ఓ థ్రిల్లర్ సినిమాలో చేయమని అడిగారు. ఇంకా ఓకే చేయలేదు. తెలుగులో అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఇక్కడి కల్చర్‌తో నాకు అటువంటి అనుబంధం ఉంది. గోల్కొండ, చార్మినార్లు అద్భుతం. ఇక సామాజిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటా. నేత్ర దానం చేశా. మీరూ నేత్ర దానం చేయండి. మనం ఈ భూమి మీద లేకపోయినా... మరొకరికి జీవితం ఇచ్చినవారమవుతాము. డయాబెటిక్ రోగిగా మా నాన్న పడే బాధ తెలుసు. అందుకే దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. - వీఎస్