
బాలీవుడ్ నటి శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి రియాన్ష్ అనే కొడుకున్నాడు. కొన్నేళ్లు బాగానే సాగిన వీరి సంసార సాగరం అర్ధాంతరంగా బీటలు వారింది. దీంతో 2019లో వీరు విడిపోయారు. కానీ కొడుకు రియాన్ష్ కోసం ఇద్దరూ గొడవ పడ్డారు. అతడు తనకు చెందుతాడంటే తనకంటూ వాదులాటకు దిగారు. ఈ గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్తూ శ్వేతా తివారీ సీసీటీవీ ఫుటేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. ఇందులో శ్వేతా కొడుకును భుజాన ఎత్తుకుని నడుస్తూ ఉండగా.. కోహ్లి బలవంతంగా పిల్లవాడిని లాక్కున్నట్లుగా కనిపిస్తోంది.
అయితే అతడు బలవంతంగా తన కొడుకును తీసుకున్నాడని, ఈ క్రమంలో అతడి చేతికి గాయం అయిందని చెప్పుకొచ్చింది. ఈ ఘటనతో రియాన్ష్ చాలా భయపడిపోయాడని, ఆ భయం నుంచి బయటపడేందుకు సుమారు నెల రోజులు పట్టిందని తెలిపింది. ఆ సమయంలో కనీసం రాత్రిళ్లు సరిగా నిద్రకూడా పోలేదని వాపోయింది. ఇప్పటికీ తన తండ్రి ఇంటికి వస్తున్నాడంటే గజగజ వణికిపోతున్నాడని పేర్కొంది. ఇలాంటి మానసిక స్థితిలో తన కొడుకును చూడలేకపోతున్నాని, అతడికి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా చూసుకోవాలనుందని చెప్పింది. కానీ ఈ భయంకరమైన వ్యక్తి తన కొడుకును ప్రశాంతంగా ఉంచండని మండిపడింది. దీన్ని శారీరకంగా హింసించడం అనకపోతే ఇంకేమంటారు? అని శ్వేతా ప్రశ్నించింది.
ఇది చూసిన అభినవ్ కోహ్లి.. శ్వేతా తివారి ఆరోపణలను తోసిపుచ్చాడు. గతేడాది శ్వేతాకు కరోనా వచ్చినప్పటి నుంచి రియాన్ష్ తన దగ్గరే ఉండిపోవాలనుకుంటున్నాడని చెప్పాడు. అందుకు ఇదే సాక్ష్యమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో ఆ బాలుడు అమ్మ దగ్గరకు వెళ్లనని చెప్తున్నట్లుగా ఉంది. ఇక ఈ వీడియోకు 'ఇప్పటికైనా నిజాన్ని బయటకు రానివ్వండి' అని క్యాప్షన్ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment