Abhinav Kohli
-
రెండో భర్త మీద ఆరోపణలు: వీడియో రిలీజ్ చేసిన అభినవ్ కోహ్లి
బాలీవుడ్ నటి శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి రియాన్ష్ అనే కొడుకున్నాడు. కొన్నేళ్లు బాగానే సాగిన వీరి సంసార సాగరం అర్ధాంతరంగా బీటలు వారింది. దీంతో 2019లో వీరు విడిపోయారు. కానీ కొడుకు రియాన్ష్ కోసం ఇద్దరూ గొడవ పడ్డారు. అతడు తనకు చెందుతాడంటే తనకంటూ వాదులాటకు దిగారు. ఈ గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్తూ శ్వేతా తివారీ సీసీటీవీ ఫుటేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. ఇందులో శ్వేతా కొడుకును భుజాన ఎత్తుకుని నడుస్తూ ఉండగా.. కోహ్లి బలవంతంగా పిల్లవాడిని లాక్కున్నట్లుగా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Shweta Tiwari (@shweta.tiwari) అయితే అతడు బలవంతంగా తన కొడుకును తీసుకున్నాడని, ఈ క్రమంలో అతడి చేతికి గాయం అయిందని చెప్పుకొచ్చింది. ఈ ఘటనతో రియాన్ష్ చాలా భయపడిపోయాడని, ఆ భయం నుంచి బయటపడేందుకు సుమారు నెల రోజులు పట్టిందని తెలిపింది. ఆ సమయంలో కనీసం రాత్రిళ్లు సరిగా నిద్రకూడా పోలేదని వాపోయింది. ఇప్పటికీ తన తండ్రి ఇంటికి వస్తున్నాడంటే గజగజ వణికిపోతున్నాడని పేర్కొంది. ఇలాంటి మానసిక స్థితిలో తన కొడుకును చూడలేకపోతున్నాని, అతడికి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా చూసుకోవాలనుందని చెప్పింది. కానీ ఈ భయంకరమైన వ్యక్తి తన కొడుకును ప్రశాంతంగా ఉంచండని మండిపడింది. దీన్ని శారీరకంగా హింసించడం అనకపోతే ఇంకేమంటారు? అని శ్వేతా ప్రశ్నించింది. View this post on Instagram A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) ఇది చూసిన అభినవ్ కోహ్లి.. శ్వేతా తివారి ఆరోపణలను తోసిపుచ్చాడు. గతేడాది శ్వేతాకు కరోనా వచ్చినప్పటి నుంచి రియాన్ష్ తన దగ్గరే ఉండిపోవాలనుకుంటున్నాడని చెప్పాడు. అందుకు ఇదే సాక్ష్యమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో ఆ బాలుడు అమ్మ దగ్గరకు వెళ్లనని చెప్తున్నట్లుగా ఉంది. ఇక ఈ వీడియోకు 'ఇప్పటికైనా నిజాన్ని బయటకు రానివ్వండి' అని క్యాప్షన్ ఇచ్చాడు. చదవండి: నా మొదటి భర్త నన్ను కొట్టడం నా కూతురు చూసింది: నటి -
వారి కంటే నేను బెటర్: శ్వేతా తివారి
‘మేరే డాడ్‌కి దుల్హాన్’ షోతో తిరిగి బుల్లితెరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు బాలీవుడ్ సీరియల్ నటి శ్వేతా తివారి. తన రెండో భర్త అభినవ్ కోహ్లి తనను మానసికంగా వేధిస్తున్నాడని.. తన కూతురు పాలక్ తివారితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఇటీవలే ఆయనపై గృహహింస కేసు పెట్టిన విషయం విదితమే. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి శ్వేతా వెల్లడించారు. ఈ క్రమంలో రెండో భర్త అభినవ్ కోహ్లిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో తనపై వచ్చిన ట్రోల్స్‌ను తిప్పికొట్టారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న ఎంతోమంది కంటే తను బెటర్ అంటూ చెప్పుకొచ్చారు. అభినవ్ కోహ్లితో రెండో వివాహం శరీరంలో ‘విషపూరితమైన ఇన్ఫెక్షన్’ వంటిదని పోల్చి చెప్పారు. అది తనను తీవ్రంగా బాధించిందని అందుకే దాన్ని తొలగించుకున్నానని తెలిపారు. ధైర్యంగా ముందుకు వచ్చి అతనితో కలిసి జీవించలేను అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేగాక ప్రస్తుతం కెరీర్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నానన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘అనేక మంది రెండో పెళ్లి చేసుకున్నాక కూడా ఎలా సమస్యలు వస్తాయని అడుగుతున్నారు. అయితే వారిని నేనొకటి అడగాలనుకుంటున్నా. రెండో పెళ్లిలో సమస్యలు ఎందుకు రావు?. నేను కనీసం ధైర్యంగా బయటకు వచ్చి ఆ సమస్యలను చెప్పుకోగలుగుతున్నాను. పెళ్లయ్యాక కూడా చాలామంది తమ ప్రియుడు, ప్రియురాళ్లతో సంబంధం కొనసాగిస్తున్నారు. వారి కంటే నేను బెటర్ కదా. ఇక నా చేతుల్లో ఒక చేయి పనిచేయకపోతే రెండో చేతితో పనిచేసుకుంటాను. అంతేగానీ జీవించడం మానేయలేను. అలాగే జీవితంలో కొన్ని తప్పులు చేస్తే జీవించడం ఆపలేను. కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తా అంతే. నా పిల్లలు, వారి సంరక్షణ చూసుకోవడం, ఇంటిని చక్కదిద్దుకోవడం వంటి పనులు చూసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
నా భార్య బతికే ఉంది: నటి భర్త
ముంబయి: ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి చనిపోయిందంటూ శనివారం సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా షేర్ అయ్యాయి. దాంతో ఇది నిజమని నమ్మిన ఆమె క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ నటి సాక్షి తన్వర్.. ఏకంగా తన ట్విటర్ పేజీలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని ట్వీట్ చేసింది. బాలాజీ టెలిఫిల్మ్స్ అండ్ మొత్తం యూనిట్ నిన్ను కోల్పోయిందంటూ ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేసింది. ఇక అది తరువాయి.. నిజంగానే శ్వేత చనిపోయిందని నెటిజన్లు శ్వేతా తివారికి నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. ఆమె బతికే ఉందని తెలుసుకోవడానికి అందరికీ ఒక రోజు పట్టింది. శ్వేతా తివారి చనిపోయిందని భావించిన ఆమె సన్నిహితులు, కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు అర్పించారు. బుల్లితెర నటుడు, శ్వేతా భర్త అభినవ్ కోహ్లీకి కొందరు ఫోన్లు చేసి సంతాపంతో పాటు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భార్య చనిపోయిందన్న వార్త విని షాకయిన అభినవ్.. భార్య శ్వేతకు కాల్ చేసి జరుగుతున్న ప్రచారం తప్పు అని తెలుసుకున్నాడు. తన భార్య బతికేఉందని, పిల్లలతో ఇంటివద్ద హాయిగా సమయం గడుపుతుందన వెంటనే మీడియా దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దయచేసి ఇలా బతికున్న వ్యక్తిని చనిపోయారని ప్రచారం చేయవద్దంటూ శ్వేతా భర్త అభినవ్ విజ్ఞప్తిచేశారు. రేయాన్ష్ అనే బాబుకు ఇటీవల జన్మనిచ్చిన ఆమె.. షూటింగ్ నుంచి విరామం తీసుకుంది. గతంలోనూ బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, దిలీప్ కుమార్, ఖాదర్ ఖాన్, ఫరీదా జలాల్ లు చనిపోయినట్లు వదంతులు ప్రచారమయ్యాయి.