నా భార్య బతికే ఉంది: నటి భర్త | Actress Shweta Tiwari is latest victim of death hoax | Sakshi
Sakshi News home page

నా భార్య బతికే ఉంది: నటి భర్త

Published Sun, May 28 2017 7:28 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

నా భార్య బతికే ఉంది: నటి భర్త

నా భార్య బతికే ఉంది: నటి భర్త

ముంబయి: ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి చనిపోయిందంటూ శనివారం సోషల్‌ మీడియాలో పోస్టులు విపరీతంగా షేర్ అయ్యాయి. దాంతో ఇది నిజమని నమ్మిన ఆమె క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ నటి సాక్షి తన్వర్‌.. ఏకంగా తన ట్విటర్‌ పేజీలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని ట్వీట్‌ చేసింది. బాలాజీ టెలిఫిల్మ్స్ అండ్ మొత్తం యూనిట్ నిన్ను కోల్పోయిందంటూ ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేసింది. ఇక అది తరువాయి.. నిజంగానే శ్వేత చనిపోయిందని నెటిజన్లు శ్వేతా తివారికి నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. ఆమె బతికే ఉందని తెలుసుకోవడానికి అందరికీ ఒక రోజు పట్టింది.

శ్వేతా తివారి చనిపోయిందని భావించిన ఆమె సన్నిహితులు, కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు అర్పించారు. బుల్లితెర నటుడు, శ్వేతా భర్త అభినవ్‌ కోహ్లీకి కొందరు ఫోన్లు చేసి సంతాపంతో పాటు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భార్య చనిపోయిందన్న వార్త విని షాకయిన అభినవ్‌.. భార్య శ్వేతకు కాల్ చేసి జరుగుతున్న ప్రచారం తప్పు అని తెలుసుకున్నాడు. తన భార్య బతికేఉందని, పిల్లలతో ఇంటివద్ద హాయిగా సమయం గడుపుతుందన వెంటనే మీడియా దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.

దయచేసి ఇలా బతికున్న వ్యక్తిని చనిపోయారని ప్రచారం చేయవద్దంటూ శ్వేతా భర్త అభినవ్ విజ్ఞప్తిచేశారు. రేయాన్ష్ అనే బాబుకు ఇటీవల జన్మనిచ్చిన ఆమె.. షూటింగ్ నుంచి విరామం తీసుకుంది. గతంలోనూ బాలీవుడ్‌ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, దిలీప్‌ కుమార్‌, ఖాదర్‌ ఖాన్‌, ఫరీదా జలాల్‌ లు చనిపోయినట్లు వదంతులు ప్రచారమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement