Sakshi Tanwar
-
నా భార్య బతికే ఉంది: నటి భర్త
ముంబయి: ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి చనిపోయిందంటూ శనివారం సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా షేర్ అయ్యాయి. దాంతో ఇది నిజమని నమ్మిన ఆమె క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ నటి సాక్షి తన్వర్.. ఏకంగా తన ట్విటర్ పేజీలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని ట్వీట్ చేసింది. బాలాజీ టెలిఫిల్మ్స్ అండ్ మొత్తం యూనిట్ నిన్ను కోల్పోయిందంటూ ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేసింది. ఇక అది తరువాయి.. నిజంగానే శ్వేత చనిపోయిందని నెటిజన్లు శ్వేతా తివారికి నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. ఆమె బతికే ఉందని తెలుసుకోవడానికి అందరికీ ఒక రోజు పట్టింది. శ్వేతా తివారి చనిపోయిందని భావించిన ఆమె సన్నిహితులు, కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆమెకు నివాళులు అర్పించారు. బుల్లితెర నటుడు, శ్వేతా భర్త అభినవ్ కోహ్లీకి కొందరు ఫోన్లు చేసి సంతాపంతో పాటు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భార్య చనిపోయిందన్న వార్త విని షాకయిన అభినవ్.. భార్య శ్వేతకు కాల్ చేసి జరుగుతున్న ప్రచారం తప్పు అని తెలుసుకున్నాడు. తన భార్య బతికేఉందని, పిల్లలతో ఇంటివద్ద హాయిగా సమయం గడుపుతుందన వెంటనే మీడియా దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దయచేసి ఇలా బతికున్న వ్యక్తిని చనిపోయారని ప్రచారం చేయవద్దంటూ శ్వేతా భర్త అభినవ్ విజ్ఞప్తిచేశారు. రేయాన్ష్ అనే బాబుకు ఇటీవల జన్మనిచ్చిన ఆమె.. షూటింగ్ నుంచి విరామం తీసుకుంది. గతంలోనూ బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, దిలీప్ కుమార్, ఖాదర్ ఖాన్, ఫరీదా జలాల్ లు చనిపోయినట్లు వదంతులు ప్రచారమయ్యాయి. -
శ్వేతాబసుకు ఏదైనా.. జరిగితే బాధ్యులెవరూ?
సినీతార శ్వేతాబసు ఉదంతంపై మీడియా కథనాలు, సోషల్ మీడియాలో కామెంట్స్ పై అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్వేతాబసు అంశం మీడియాలో వస్తున్న కథనాలపై తాజాగా టెలివిజన్ సీరియల్ కహానీ ఘర్ ఘర్ కి లో ఆమెకు తల్లిగా నటించిన సాక్షి తన్వర్ ఘాటుగా స్పందించింది. ఈ వ్యవహారంలో శ్వేతాబసును ఒక్కరినే బలి పశువును చేశారని, ఆ క్షణంలో పట్టుబడ్డ బిజినెస్ మెన్ వదిలి వేయడంపై అనేక సందేహాల్ని, అనుమానాల్ని తన్వర్ వ్యక్తం చేశారు. ఈ కేసులో వదిలివేయబడిన బిజినెస్ మెన్ ఎవరో తెలుసుకోవాలని తనకు ఆసక్తి లేదని.. అయితే ఆ వ్యాపారికి సంబంధించిన కుటుంబాలు, తల్లి, కూతుర్లు, సోదరి, భార్య, స్నేహితులకు ఆయన నిజస్వరూపం తెలిసే అవకాశం ఉండేదని సాక్షి తన్వర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎంతో సున్నితమైన అంశాన్ని మీడియా హ్యాండిల్ చేసిన తీరుపై తన్వర్ అసంతృప్తిని వెల్లగక్కారు. ఇలాంటి సెన్సెషనల్ అంశంపై సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా అభిప్రాయం చెప్పిన వారు శ్వేతాబసు కోణంలో ఎందుకు చూడటం లేదని ఆమె ప్రశ్నించారు. రిమాండ్ హోమ్ కస్టడీలో ఉన్న తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించిన తీరును ధైర్యంగా మెచ్చుకోవాల్సిందే. టెలివిజన్ సీరియల్ లో తల్లిగా తనకు శ్వేతాబసుతో ఓ ప్రత్యేక అనుబంధమున్న కారణంగా ఆమెతో మాట్లాడాటానికి... కలువడానికి ప్రయత్నించాను. అయితే అది కుదరలేదు. దాంతో శ్వేతాబసు తల్లితో మాట్లాడాను. అయితే రిమాండ్ హౌజ్ లో శ్వేతాబసును సొంత తల్లినే కలువడానికి నిరాకరించారని ఎంత మందికి తెలుసు? రిమాండ్ హౌజ్ లో ఉన్న యువతులు, మహిళలకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించే పనిలో శ్వేతాబసు నిమగ్నమయ్యారనే విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్వేతాబసు తల్లి పడుతున్న ఆవేదన ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి కేసులో పేర్లను గోప్యంగా ఉంచాలనే నిబంధనల్ని ఉల్లంఘించడం ఎంత వరకు సబబు? తన కూతురు క్రిమినల్ కాదు.. మీడియా కథనాలకు మనస్తాపం చెంది తన కూతురు ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడితే దానికి ఎవరూ బాధ్యత వహిస్తారు? అని ఓ తల్లి లేవనెత్తే ప్రశ్నకు ఎవరు జవాబిస్తారు. శ్వేతాబసు ఉదంతంపై లెక్కలేనన్ని కథనాల్ని వెల్లడించిన మీడియా.. పట్టుబడ్డ వ్యాపారి ఎవరో పోలీసులు ఎందుకు బయటపెట్టలేదు? శ్వేతాబసుపై లేని సానుభూతి ఆ వ్యాపారిపైనే ఎందుకని సాక్షి తన్వర్ ప్రశ్నించారు. ఓ నటి, సెలబ్రిటీ అనే ఒక్క కారణంతో నానా రకాలుగా కథనాల్ని అల్లడం భావ్యమా? బాధ్యాతయుతమైన మన పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు? తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు రేపిస్టులకు, హంతకులకు స్వేచ్చ కల్పిస్తున్న మనదేశంలో..కేవలం శ్వేతాబసు విషయంలో ఎందుకు నిబంధనల్ని తుంగలో తొక్కారు? చాలా సెన్సిటివ్ విషయాన్ని బజారుకీడ్చారు? అనే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని సాక్షి తన్వర్ ప్రశ్నల రూపంలో ఆవేదన వ్యక్తం చేసింది. సాక్షి తన్వర్ సంధించిన ప్రశ్నలకు మనవద్ద సమాధానం ఉందా అని దర్శకుడు రాజమౌళి కూడా ట్విటర్ లో ఓ వ్యాసాన్ని ట్వీట్ చేశారు. -
‘కామాటిపుర’ సెక్స్‌వర్కర్ ఎవరో?
వేశ్యల జీవితాలపై ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. వేశ్య పాత్రను చేయడం నటీమణులకు ఒక సవాలు వంటిదే. అటువంటి సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ప్రధాన భూమికలు పోషించి మెప్పించారు. అయితే వేశ్యల జీవితాలకు సంబంధించి ఎవరూ సృ్పశించని కోణంలో కొత్తగా సినిమా తీయాలనుకుంటున్నాడు డెరైక్టర్ అంకుశ్ భట్. ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా అయిన ‘కామాటిపుర’లో ఈ చిత్ర షూటింగ్ జరుగనుంది. ఈ సినిమా గురించి డెరైక్టర్ మాట్లాడుతూ..‘ కామాటిపుర పేరుతో వేశ్యల జీవితాలపై చిత్రం తీయాలని నిర్ణయించాం. ఇందులో ప్రధాన పాత్రకు నటి కొంకణ్‌సేన్ శర్మను తీసుకోవాలనుకున్నాం. ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని భావించి, ఆమెను సంప్రదించాం. కాని ఆమె మా అవకాశాన్ని తిరస్కరించింది. అయితే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం.. ఒప్పుకుంటుందో లేదో మాత్రం చెప్పలేం.. ప్రధాన పాత్రకు సంబంధించి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య జీవితాన్ని ఐదు దశలుగా ఆవిష్కరించదలిచాం.. కొంకణ్‌సేన్ అంగీకరించని పక్షంలో మరో నటిని చూసుకోవాల్సిందేగా.. ఈ సినిమాలో ప్రముఖ టీవీ సీరియల్స్‌లో కోడలుగా నటించి మెప్పించిన నటి సాక్షి తన్వర్ కూడా నటిస్తోంది. ఆమెను రెండో ప్రధాన పాత్రధారణిగా తీసుకుంటున్నాం. ఈ చిత్రంతో ఆమెకు ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. ఈ చిత్రంలో వ్యభిచారాన్ని ఎక్కువ చేసి చూపించడంలేదు. వేశ్యలు తమ జీవనోపాధి కోసం పగటిపూట ఏం చేస్తుంటారనేది కూడా ఇందులో చూపించబోతున్నాం. వేశ్యల మానసిక సంఘర్షణను ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కోణంలో ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నాం. ఈ చిత్రాన్ని ఎవరినో దృష్టిలో పెట్టుకుని నిర్మించడంలేదు. నటీనటుల ఎంపిక పూర్తి కాగానే రెండు నెలల్లో సినిమా సెట్స్ పైకి వెళుతుంది.