‘కామాటిపుర’ సెక్స్‌వర్కర్ ఎవరో?
‘కామాటిపుర’ సెక్స్‌వర్కర్ ఎవరో?
Published Sun, Sep 1 2013 11:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
వేశ్యల జీవితాలపై ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. వేశ్య పాత్రను చేయడం నటీమణులకు ఒక సవాలు వంటిదే. అటువంటి సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ప్రధాన భూమికలు పోషించి మెప్పించారు. అయితే వేశ్యల జీవితాలకు సంబంధించి ఎవరూ సృ్పశించని కోణంలో కొత్తగా సినిమా తీయాలనుకుంటున్నాడు డెరైక్టర్ అంకుశ్ భట్. ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా అయిన ‘కామాటిపుర’లో ఈ చిత్ర షూటింగ్ జరుగనుంది.
ఈ సినిమా గురించి డెరైక్టర్ మాట్లాడుతూ..‘ కామాటిపుర పేరుతో వేశ్యల జీవితాలపై చిత్రం తీయాలని నిర్ణయించాం. ఇందులో ప్రధాన పాత్రకు నటి కొంకణ్‌సేన్ శర్మను తీసుకోవాలనుకున్నాం. ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని భావించి, ఆమెను సంప్రదించాం. కాని ఆమె మా అవకాశాన్ని తిరస్కరించింది. అయితే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం.. ఒప్పుకుంటుందో లేదో మాత్రం చెప్పలేం.. ప్రధాన పాత్రకు సంబంధించి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య జీవితాన్ని ఐదు దశలుగా ఆవిష్కరించదలిచాం.. కొంకణ్‌సేన్ అంగీకరించని పక్షంలో మరో నటిని చూసుకోవాల్సిందేగా.. ఈ సినిమాలో ప్రముఖ టీవీ సీరియల్స్‌లో కోడలుగా నటించి మెప్పించిన నటి సాక్షి తన్వర్ కూడా నటిస్తోంది.
ఆమెను రెండో ప్రధాన పాత్రధారణిగా తీసుకుంటున్నాం. ఈ చిత్రంతో ఆమెకు ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. ఈ చిత్రంలో వ్యభిచారాన్ని ఎక్కువ చేసి చూపించడంలేదు. వేశ్యలు తమ జీవనోపాధి కోసం పగటిపూట ఏం చేస్తుంటారనేది కూడా ఇందులో చూపించబోతున్నాం. వేశ్యల మానసిక సంఘర్షణను ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కోణంలో ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నాం. ఈ చిత్రాన్ని ఎవరినో దృష్టిలో పెట్టుకుని నిర్మించడంలేదు. నటీనటుల ఎంపిక పూర్తి కాగానే రెండు నెలల్లో సినిమా సెట్స్ పైకి వెళుతుంది.
Advertisement
Advertisement