
Shweta Tiwari Apologies After Her Derogatory Comments On God: ప్రముఖ హిందీ సీరియల్ శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. దేవుడిపై ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతుండటంతో తప్పు తెలుసుకుంది. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అంతేకాకుండా తన మాటలను వక్రీకరించారని పేర్కొంది.
సహ నటుడు సౌరబ్ పాత్రను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ని దేవుడితో ముడిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను దేవుడ్ని విశ్వసిస్తానని, తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
కాగా ఓ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా శ్వేత భగవంతుడిపై జోక్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే భోపాల్‌లోని శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు కూడా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment