Shweta Tiwari Controversial Statement on New Web Series Promotion - Sakshi
Sakshi News home page

Shweta Tiwari: భ‌గ‌వంతుడిపై జోక్‌.. చిక్కుల్లో న‌టి

Published Fri, Jan 28 2022 1:24 PM | Last Updated on Fri, Jan 28 2022 2:20 PM

Shweta Tiwari Controversial Statement on New Web Series Promotion - Sakshi

హిందీ సీరియ‌ల్ న‌టి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమెపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హిందూత్వ‌వాదులు డిమాండ్ చేస్తున్నారు. శ్వేతా తివారీ తాజాగా న‌టించిన వెబ్ సిరీస్ షో స్టాప‌ర్‌. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆమె స‌హ‌న‌టుడు రోహిత్ రాయ్‌తో క‌లిసి  భోపాల్‌లో విలేక‌రుల స‌మావేశంలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా శ్వేత‌ భ‌గ‌వంతుడిపై జోక్ చేస్తూ అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీశారంటూ నెటిజ‌న్లు న‌టిని దుమ్మెత్తిపోశారు.

భోపాల్‌లోని శ్యామ‌ల హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఆమెపై కేసు కూడా న‌మోదైంది. ఈ విష‌యంపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంశాఖ‌ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా మాట్లాడుతూ.. 'శ్వేతా తివారీ నుంచి ఆ మాట‌లు రావ‌డం నేనే స్వ‌యంగా విన్నాను. ఇది నేను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాను. దీనిపై విచార‌ణ జ‌ర‌పాలని పోలీస్ క‌మిష‌న‌ర్‌ను ఆదేశించాను. ఆ త‌ర్వాత న‌టిపై చ‌ర్య‌లు తీసుకోనున్నారు' అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement