ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్‌ | TV Actress Shweta Tiwari Hospitalised Ex Husband Reacts | Sakshi
Sakshi News home page

Shweta Tiwari: 'అందం కోసం అవన్నీ చేస్తారు..ఏదో ఒకరోజు గుండె అలసిపోతుంది'

Published Thu, Sep 30 2021 11:37 AM | Last Updated on Thu, Sep 30 2021 12:32 PM

TV Actress Shweta Tiwari Hospitalised Ex Husband Reacts - Sakshi

Shweta Tiwari Hospitalised, Ex-Husband Reacts: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటి శ్వేతా తివారి త్వరగా కోలుకోవాలంటూ ఆమె మాజీ భర్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. నా కొడుకు కస్టడీకి సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది. కానీ శ్వేత త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. చాలామంది యాక్టర్స్‌(నటీనటులు) ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రేమ పొందేందుకు, తమను తాము మరింత అందంగా చూపించుకునేందుకు డైట్‌ పేరిట తక్కువ తిని, ఎక్కువ వర్కవుట్స్‌ చేస్తూ తమ శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తారు. ఇలానే చేస్తూ పోతే ఏదో ఒకరోజు వారి గుండె అలిసిపోతుంది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. చదవండి: అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్‌ కాపీలా ఉందే..

ఖత్రోన్ కే ఖిలాడి సీజన్‌11 ఫైనలిస్ట్‌, హిందీ సీరియల్‌ నటి శ్వేత తివారి బలహీనత, లో- బీపీ కారణంగా హాస్పిటల్‌ పాలైంది. షూటింగ్స్‌లో బిజీ ఉండటంతో తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో ఆమె అనారోగ్యానికి గురైందని శ్వేత పీఆర్‌ టీం సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా తివారికి, భర్త అభినవ్‌తో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఓ రియాలిటీ షో కోసం కేప్‌టౌన్‌ వెళ్లేందుకు రెడీ అయిన శ్వేత.. తన కొడుకు రేయాన్‌ కోసం సరైన ఏర్పాట్లు చేయకుండానే దేశం విడిచి వెళ్తుందంటూ అభినవ్‌ ఆరోపించాడు. దీంతో తన కొడుకును బలవంతంగా అభినవ్‌ తీసుకెళ్లేందుకు చూస్తున్నాడంటూ సీసీటీవీ ఫుటేజిని రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా బాలీవుడ్‌ నటి శ్వేతా తివారి 2013లో అభినవ్‌ కోహ్లిని రెండో పెళ్లి చేసు​కుంది. విభేదాల కారణంగా 2019లో వీరు విడిపోయారు. డ్రగ్స్‌ అమ్ముతూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement