
TV Actress Nikki Sharma Deleted Her Instagram Posts: 'సుసురాల్ సిమర్ కా', 'బ్రహ్మరాక్షస్ 2' వంటి సీరియల్స్‌తో తనదైన నటనతో అలరించింది నిక్కీ శర్మ. తాజాగా ఆమె తన అభిమానులకు షాక్ ఇచ్చింది. తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లోని పోస్టులన్నింటిని డిలీట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పోస్ట్‌లను డిలీట్ చేయడమే కాకుండా నిక్కీ శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో ఒక మెస్సేజ్‌ను కూడా ఇచ్చింది. నేను ప్రయత్నించాను. కానీ అలసిపోయాను. నా సొంత ఆలోచనల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నాను. అని రాసుకొచ్చింది నిక్కీ శర్మ.
దీంతో ఆమె అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై 'ససురాల్ సిమర్ కా' నటుడు, నిక్కీ శర్మ మాజీ సహోద్యోగి అభిషేక్ భలేరావ్ స్పందించాడు. నిక్కీ పోస్టులను డిలీట్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. 'ససురాల్ సిమర్ కాలో నాతో కలిసి నటించిన నిక్కీ శర్మ తన పోస్టులను తొలగించింది. ఆమె రాసిన మెస్సేజ్ ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో మూడు గంటలకుపైగా ఉంది. నేను ఈమెయిల్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా సాధ్యమైనంతవరకు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించాను. కానీ ఆమె అందుబాటులోకి రాలేదు.' అని తెలిపాడు.
చదవండి: 'జెంటిల్ మేన్ 2'కి మరో హీరోయిన్.. నిర్మాత ప్రకటన
తర్వాత డిలీట్ చేసిన మరొక ట్వీట్‌లో అభిషేక్ భలేరావు 'ఇందులో పోలీసులు కలుగజేసుకుంటే ఈ విషయం ఎంత దూరం వెళుతుందో అని ఆలోచిస్తున్నాను. అందుకే ఆమెను సంప్రదించేందుకు మాతో కలిసి నటించిన వారందరినీ ట్యాగ్ చేస్తున్నాను.' అని నటీనటులు దీపికా, ధీరజ్‌లను ట్యాగ్ చేశాడు. అయితే నిక్కీ మానసిక స్థితి సరిగా లేదని, ఆమె నిరాశకు గురైనట్లు ఆమె సన్నిహితుల నుంచి వచ్చిన సమాచరమని ప్రముఖ వెబ్‌సైట్ పేర్కొంది. అలాగే నిక్కీతో మాట్లాడిన మాజీ నటుల్లో ఒకరికి ఆమె.. తనను తాను చూసుకోగలనని, ఎలాంటి పిచ్చి పనులు చేయనని నిక్కీ చెప్పినట్లు సమాచారం. దీపికా కక్కర్, ధీరజ్ ధూపర్ నటించిన 'ససురాల్ సిమర్ కా' సీరియల్‌లో రోష్నీ కపూర్ పాత్రలో అలరించింది నిక్కీ శర్మ.
Comments
Please login to add a commentAdd a comment