delete
-
హాస్యం పేరిట నీచపు వ్యాఖ్యలు.. కేంద్రం నోటీసులతో స్పందించిన యూట్యూబ్
న్యూఢిల్లీ: ఓ కామెడీ షోలో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని శివసేన ఉద్దవ్ వర్గం భావిస్తోంది. అయితే ఈలోపు.. కేంద్ర నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను తొలగించేసింది.ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia) ఓ పాపులర్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగ పరచారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో మరికొందరు రాజకీయ నేతలు కూడా నీచపు వ్యాఖ్యలు చేశాడంటూ అల్హాబాదియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు.. పాడ్‌కాస్ట్‌లపై నిషేధం విధించాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మరోవైపు.. అతనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోను తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్రం నోటీసులు పంపింది.కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా(Kanchan Gupta) యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసిన విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే యూట్యూబ్ ఈ చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని అతనికి అవార్డు ఇచ్చారుమరోవైపు.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని యూబీటీ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెబుతున్నారు. హాస్యం పేరిట అనుచిత వ్యాఖ్యలతో హద్దులు దాటడం.. ఏ భాషలోనైనా సహించేది లేదు. ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పానెల్ వద్ద చర్చిస్తాం. ప్రధాని మోదీ అతనికి(రణవీర్ అల్హాబాదియా) అవార్డుఇచ్చారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కమిటీలో సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారామె.సమయ్ రైనా నిర్వహించే ‘ఇండియా గాట్ లాటెంట్’ అనే షోలో రణవీర్ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కటెంటెస్ట్ను ఉద్దేశించి.. ‘‘నీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటే జీవితాంతం చూస్తూ ఉండిపోతావా?. లేకుంటే.. ’’ అంటూ అతి జుగుప్సాకరమైన ప్రశ్నను సంధించాడు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు.సారీ చెప్పినా.. ‘‘నా వ్యాఖ్యలు అనుచితమైనవే కాదు.. హాస్యమైనవీ కాదు.. హాస్యం నా బలం కాదు.. నేనిక్కడ ఉన్నది క్షమాపణలు చెప్పేందుకే’’ అని ఎక్స్‌లో రణవీర్ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. అతనిపై విమర్శలు మాత్రం చల్లారడం లేదు. రణవీర్‌తో పాటు ఇండియాస్ గాట్ లాటెంట్ షో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలపైనా కేసులు నమోదు అయ్యాయి. రణవీర్ అల్హాబాదియా ఎవరంటే.. 31 ఏళ్ల వయసున్న రణవీర్ అల్హాబాదియాకు వివాదాలు కొత్తేఆం కాదు. ఇతనొక ప్రముఖ యూట్యూబర్. బీర్‌బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దానికి ఒక కోటి ఐదు లక్షల మంది దాకా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇక.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్‌ను అతను సహ వ్యవస్థాపకుడిగా నడిపిస్తున్నాడు. అంతేకాలు.. పలువురు పొలిటికల్ లీడర్ల మీద అతను పేల్చిన జోకులు విమర్శలు సైతం దారి తీశాయి.ఏమిటీ షో ఉద్దేశం ఇండియాస్ గాట్ లాటెంట్ అనేది ఒక కామెడీ షో. తమలోని హాస్యకోణాన్ని కొత్తగా ప్రదర్శించుకోవాలనుకునేవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రముఖ హాస్యనటుడు సమయ్ రైనా ఏర్పాటు చేసిన వేదిక ఇది. కేవలం హాస్యం మాత్రమే కాదు.. పాటలు పాడడం, డ్యాన్సులు.. ఇలా ఎన్నో టాలెంట్లను ఇక్కడ ప్రదర్శించొచ్చు. అయితే ఇది రెగ్యులర్ తరహాలో ఉండదు. అందుకే అంతటి ఆదరణను చురగొంది. అదే సమయంలో అక్కడి కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు, జడ్జిల కామెంట్లు అభ్యంతరకంగా ఉండడంతో పలు వివాదాల్లోనూ ఈ షో చిచ్కుకుంది. -
Tech Talk: యూట్యూబ్‌లో కామెంట్‌ను ఎడిట్, డిలీట్ చేయడానికి..
మనం చూసిన వీడియోలు, చేసిన కామెంట్స్‌ను యూట్యూబ్ సేవ్ చేస్తుంది. కామెంట్ హిస్టరీని చూడాలనుకుంటున్నారా? ఎడిట్ లేదా డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి... యూట్యూబ్ లోగోకు లెఫ్ట్‌లో ఉన్న హంబర్గర్ మెనూ బటన్‌ను క్లిక్ చేయాలి. ‘యూ’ సెక్షన్ కింద ఉన్న ‘హిస్టరీ’ని క్లిక్ చేయాలి. రైట్లో ఉన్న ‘మేనేజ్ ఆల్ హిస్టరీ’ క్లిక్ చేయాలి కామెంట్స్–ట్యాప్.డిలిట్, ఎడిట్ చేయడానికి...– ‘ఎక్స్’ ఐకాన్‌ను నొక్కితే కామెంట్ ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది.– ఎడిట్ చేయడానికి వీడియో లింక్‌ను నొక్కాలి. లోడ్ అయిన పేజీ మీ కామెంట్‌ను హైలైట్ చేస్తుంది.– ఎడిట్ చేయాలనుకుంటున్న కామెంట్ పక్కన ఉన్న త్రీడాట్ మెనూ బటన్‌పై క్లిక్ చేసి ‘సేవ్’ బటన్ నొక్కాలి.– గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్పులు చేసిన తరువాత కామెంట్ ఎడిట్ చేసినట్లు యూట్యూబ్ చూపిస్తుంది.ఇవి చదవండి: Aryan Chauhan: అద్భుతాల ఆర్యన్! -
మణిపూర్: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు
ఇంఫాల్: మణిపూర్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలైన కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణకు దారితీసిన తమ వివాదాస్పద ఉత్తర్వులో సవరణ చేసింది. మైతేయి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)ల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2023 మార్చి 27న జారీ చేసిన ఉత్తర్వులో ఒక పేరాను తొలగించింది. అప్పట్లో కోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ గిరిజనులైన కుకీలు ఆందోళన ప్రారంభించారు. క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది. రాష్ట్రంలో నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 200 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హైకోర్టు ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ గతేడాది అక్టోబర్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఉత్తర్వులో రెండు తెగల మధ్య శత్రుత్వానికి కారణమైన ఒక పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. . గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. -
యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది?
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక అంశాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఈకోవలో 2023లో అత్యధికంగా డిలీట్ చేసిన సోషల్ మీడియా యాప్‌ల జాబితా కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2023లో యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్‌ల విషయానికొస్తే.. అమెరికన్ టెక్ సంస్థ టీఆర్జీ డేటాసెంటర్ నివేదిక ప్రకారం... అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే 100 మిలియన్ల (ఒక మిలియన్ అంటే 10 లక్షలు) వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్ యాప్.. ఆ తర్వాతి ఐదు రోజుల్లో 80 శాతం మంది వినియోగదారులను కోల్పోయింది. ఆ నివేదిక ప్రకారం 2023లో చాలా యాప్‌లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది యూజర్స్ ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్స్టాగ్రామ్ యాప్‌ను 10,20,000 మందికి పైగా వినియోగదారులు డిలీట్ చేశారు. అత్యధికంగా డిలీట్ చేసిన యాప్‌ల జాబితాలో రెండవ స్థానంలో స్నాప్‌చాట్ ఉంది. దీనిని 1,28,500 మంది డిలీట్ చేశారు. దీని తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్), టెలీగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్,యూట్యూబ్, వాట్సాప్, విచాట్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఏడాది 49 వేల మంది ఫేస్బుక్ యాప్‌ను తొలగించారు. వాట్సాప్‌ను తొలగించిన వినియోగదారుల సంఖ్య 4,950గా ఉంది. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
ప్లేస్టోర్ నుంచి 22 యాప్స్ అవుట్.. ఇవి మీ మొబైల్లో ఉన్నాయా?
మాల్వేర్ దాడుల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించాలనే నేపథ్యంలో గూగుల్ ఏకంగా 22 యాప్స్ ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్స్ వినియోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు పరిశోధనలో తెలియడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కొన్ని యాప్స్ కారణంగా మొబైల్ ఛార్జింగ్ వేగంగా అయిపోవడంతో పాటు.. డేటా కూడా వేగంగా ఖాళీ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు వీటిని మాన్యువల్‌గా తొలగించాలి. ఇప్పటికే ఈ యాప్స్ 2.5 మిలియన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం. వీరందరూ ఈ యాప్స్ వీలైనంత త్వరగా తొలగించాలని సూచిస్తున్నారు. ఇదీ చదవండి: వజ్రాల వ్యాపారం.. వందల కోట్ల సంపద- సన్యాసుల్లో కలిసిపోయారు! గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన యాప్స్ జాబితాలో బారో టీవీ, DMB యాప్, Jihosoft మొబైల్ రికవరీ యాప్, మ్యూజిక్ బడా, మ్యూజిక్ డౌన్లోడర్, బారో డిజిటల్ గిఫ్టింగ్ యాప్, న్యూ లైవ్, రింగ్టోన్స్ ఫ్రీ మ్యూజిక్, స్ట్రీమ్కార్ లైవ్ స్ట్రీమింగ్, లైవ్‌ప్లే, OnAir ఎయిర్‌లైన్ మేనేజర్, మ్యూజిక్ ప్లేయర్ - ఆడియో ప్లేయర్, AT ప్లేయర్, ట్రోట్ మ్యూజిక్ బాక్స్-ఫ్రీ ట్రోట్ మ్యూజిక్ ప్లేయర్ మొదలైనవి ఉన్నాయి. -
జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్!
మీకు జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయా.. క్రియేట్ చేసి చాలా కాలం అవుతోందా.. తరచూ ఉపయోగించడం లేదా.. అయితే ఆ అకౌంట్లు త్వరలో డిలీట్ అయ్యే అవకాశం ఉంది. మనలో చాలా మందికి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. కొంత మంది అవసరంకొద్దీ రెండు.. మూడు.. ఇలా లెక్కకు మించి జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఆ అకౌంట్లను ఒకసారి కూడా ఓపెన్ చేయరు. రెండేళ్లకుపైగా ఉపయోగంలో లేని అలాంటి ఇన్‌యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను గూగుల్ త్వరలో డిలీట్ చేయనుంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. ఇన్‌యాక్టివ్ అకౌంట్లకు సంబంధించి గూగుల్ కొత్త విధానాలను ప్రకటించింది. ప్రతి 24 నెలలకు ఒకసారి లాగిన్ అవ్వాలని, పాత గూగుల్ అకౌంట్లను సమీక్షించాలని యూజర్లను కోరింది. రెండు సంవత్సరాలుగా ఆపరేట్ చేయని అకౌంట్లలో స్టోర్ అయిన డేటా డిలీట్ అయ్యేలా ఇప్పటికే గూగుల్ ఒక విధానాన్ని కలిగి ఉంది. కానీ, ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని పూర్తిగా తమ సర్వర్ల నుంచి డిలీట్ చేయనుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి గూగుల్ అకౌంట్ల కోసం ఇన్‌యాక్టివ్ విధానాన్ని మరో రెండేళ్లకు అప్డేట్ చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. యూట్యూబ్, గూగుల్ ఫొటోస్పైనా ప్రభావం కొత్త విధానం డిసెంబర్ 2023 నుంచి అమలులోకి వస్తుందని ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది. జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, యూట్యూబ్, గూగుల్ ఫోటోస్ సహా ఇనాక్టివ్ అకౌంట్లలో స్టోర్ మొత్తం మొత్తం కంటెంట్ తొలగించనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు 2020లో ప్రకటించిన విధానం ప్రకారం.. ఇనాపరేటివ్ అంకౌంట్లలోని కంటెంట్‌ను మాత్రమే తొలగించేది. ఇప్పుడు తీసుకొచ్చిన విధానంలో అకౌంట్లను కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ విధానం వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుందని, పాఠశాలలు లేదా వ్యాపార సంస్థల అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని గూగుల్ పేర్కొంది. తొలగించే ముందు నోటిఫికేషన్లు ఉపయోగంలో లేని అకౌంట్లను గూగుల్ దశలవారీగా తొలగిస్తుంది. మొదటగా డిసెంబర్లో ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అకౌంట్ క్రియేట్ చేసి తర్వాత ఎప్పుడూ ఉపయోగించని అకౌంట్లను తొలి విడతలో తొలగించనుంది. ఇలా తొలగించే ముందు ఆ అకౌంట్లకు, దానికి సంబంధించి పేర్కొన్న రికవరీ అకౌంట్లకు నోటిఫికేషన్లు పంపుతుంది. కాబట్టి మీకు గూగుల్ అకౌంట్ ఉండి తరచూ ఉపయోగించకపోతే వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల తర్వాత శ్రీవాస్ డైరెక్షన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం' మూవీ రివ్యూ) ఈ చిత్రంలో జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 5 తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా వీడియోలను పంచుకున్నారు. (ఇది చదవండి: ఓ ఆర్టిస్ట్‌గా మాత్రమే చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ!) -
ఇన్‌స్టాలో డిలీట్ చేసిన కంటెంట్‌ను రీస్టోర్ చేసుకోవడానికి...
ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ నుంచి డిలీట్ చేసిన కంటెంట్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా? ఇలాంటి వారికి సులువుగా అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి.. ► ఇన్‌స్టా ఓపెన్ చేసిన తరువాత ప్రొఫైల్‌పై ట్యాప్ చేయాలి. ► టాప్రైట్లోని ‘మోర్ ఆప్షన్స్’ ట్యాప్ చేయాలి. ► యాక్టివిటీ కంట్రోల్స్–ట్యాప్ ► రీసెంట్ డిలీటెడ్–ట్యాప్ ► టాప్‌లోని టైప్ ఆఫ్ కంటెంట్ (రీస్టోర్–ప్రొఫైల్ పోస్ట్,రీల్స్, వీడియోస్, స్టోరీస్) సెలెక్ట్ చేసుకోవాలి ► రీస్టోర్ చేయాలనుకున్నదానిపై ట్యాప్ చేయాలి. ► టాప్ రైట్‌లోని మోర్ ఆప్షన్–ట్యాప్ ► రీస్టోర్ టు ప్రొఫైల్ లేదా రీస్టోర్ టు రీస్టోర్ కంటెంట్ ట్యాప్ చేయాలి. (క్లిక్ చేయండి: ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి..) -
WhatsAp: వాట్సాప్‌లో ఈ ఫీచర్ గురించి తెలుసా?
ఒక వ్యక్తికి లేదా ఒక గ్రూప్‌కు పంపాల్సిన మెసేజ్‌ను అనుకోకుండానో, పరధ్యానంలోనో వేరొకరికి పంపే సందర్భాలు వాట్సాప్ యూజర్లకు ఎదురవుతుంటాయి. ఈ హడావిడిలో ‘డిలిట్ ఫర్ ఎవ్రీ వన్’ క్లిక్ చేయడానికి బదులుగా ‘డిలిట్ ఫర్ మీ’ క్లిక్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ ‘రివర్స్ యాక్షన్’ కోసం ‘యాక్సిడెంటల్ డిలిట్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా, మెసేజ్ డిలిట్ చేసిన తరువాత ‘మెసేజ్ డిలిటెడ్ ఫర్ మీ’ మెసేజ్‌తో చిన్న డైలాగ్బాక్స్ కనిపిస్తుంది. ఈ డైలాగ్‌బాక్స్‌లో చిన్న ‘అన్డూ’ బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే డిలిట్ చేసిన మెసేజ్ మళ్లీ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కు అందుబాటులో ఉంటుంది. (క్లిక్ చేయండి: ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి..) -
మస్క్ షాకింగ్ డెసిషన్:150 కోట్ల ట్విటర్ యూజర్లకు మంగళం!
న్యూఢిల్లీ: మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ కొత్త బాస్, టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పారు. దాదాపు 1.5 బిలియన్ల ఇన్‌యాక్టివ్ ఖాతాలను తొలగిస్తోంది. 1.5 బిలియన్ ఖాతాల నేమ్ స్పేస్‌ను ఖాళీ చేయడం1.5 బిలియన్ ఖాతాల నేమ్ స్పేస్‌ను ఖాళీ చేస్తున్నానంటూ మస్క్ శుక్రవారం ట్వీట్ చేశారు. (108 ఎంపీ కెమెరాతో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్, ఫస్ట్ సేల్ ఆఫర్ కూడా!) ప్లాట్‌ఫారమ్‌లో సంవత్సరాలుగా చురుగ్గా లేకుండా, ఎలాంటి ట్వీట్స్ లేకుండా, కనీసం లాగిన్ కూడా కాని 1.5 బిలియన్ ఖాతాల పేర్లను తొలగించనున్నట్టు తేల్చి చెప్పారు. అంతేకాదు యూజర్ అకౌంట్ స్టేటస్‌ను తెలిపే సాఫ్ట్వేర్ అప్డేట్పై తాము పనిచేస్తున్నామన్నారు. దీని ద్వారా తమ ట్వీట్లు "షాడో బ్యానింగ్" ఎందుకు ఎలా అయిందో, ఎలా అప్పీల్ చేయాలో వినియోగదారులకు తెలుస్తుందన్నారు. (భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీకి భారీ షాక్!) Twitter will soon start freeing the name space of 1.5 billion accounts — Elon Musk (@elonmusk) December 9, 2022 "ట్విట్టర్ ఫైల్స్ 2" లో సంచలన విషయాలను వెల్లడించింది. అలాగే ఒక రహస్య టీం ఆధ్వర్యంలో అప్పటి సీఈవో జాక్ డోర్సీ సెలబ్రిటీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే షాడో బ్యానింగ్ లాంటి వివాదాస్పద నిర్ణయాలను తీసుకుందని ఆరోపించింది. ఈ సీక్రెట్ గ్రూప్‌లో లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ (విజయ గద్దే), గ్లోబల్ హెడ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ (యోయెల్ రోత్), మాజీ జాక్ డోర్సే, పరాగ్ అగర్వాల్ ఇతరులు ఉన్నారని ది ఫ్రీ ప్రెస్ ఫౌండర్, ఎడిటర్ బారీ వీస్ చెప్పారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎలన్ మస్క్‌కు ఘోర అవమానం?!
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కు ఘోర అవమానం జరిగిందా?.. అవుననే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. అందుకు కారణం.. మాజీ ప్రేయసి అంబర్ హర్డ్. ఎలన్ మస్క్.. ఎట్టకేలకు ట్విట్టర్(ట్విటర్) డీల్‌ను ముగించిన సంగతి తెలిసిందే. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించిన మస్క్.. తొలుత యూజర్ల అభిమానాన్ని చురగొన్నాడు కూడా. అయితే.. ట్విట్టర్ ఆఫీస్‌లో అడుగుపెట్టాక తనదైన నిర్ణయాలతో ట్విట్టర్‌ను ఆగం పట్టిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మార్పుల పేరిట బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి.. కీలక పదవుల్లో ఉన్న వాళ్లను సాగనంపగా.. ఆపై టెస్లా ఉద్యోగులను ట్విటర్‌లోకి తెచ్చుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్ ప్రాసెస్‌కు, బ్లూటిక్ కోసం 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించి.. పక్కా కమర్షియల్ ఆలోచనను అమలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తూ కొందరు సెలబ్రిటీలు ట్విటర్‌ను వీడుతున్నారు. ట్విటర్‌ను ఇప్పటికే చాలామంది ప్రముఖులు వీడారు. టోనీ బ్రాక్స్టన్, షోండా రిమ్స్‌తో పాటు ప్రొఫెషనల్ రెజ్లర్(రిటైర్డ్)..డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ మిక్ ఫోలీ ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి నటి అంబర్ హర్డ్ కూడా చేరింది. ఆమె ఎందుకు వీడిందో అనే దానిపై స్పష్టత లేకున్నా.. సెలబ్రిటీల గుడ్‌బై మూమెంట్లో ఆమె కూడా చేరడం పట్ల మస్క్‌పై సెటైర్లు పడుతున్నాయి. మాజీ ప్రేయసి మస్క్ పరువు తీసేసిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది కూడా. మరోవైపు ఆమె మాజీ భర్త జానీ డెప్ అభిమానుల కారణంగానే ఆమె ట్విటర్‌కు గుడ్‌బై చెప్పి ఉంటుందనే వాదన సైతం చక్కర్లు కొడుతోంది కూడా. అంబర్ హర్డ్.. 2016 నుంచి 2018 మధ్య ఎలన్ మస్క్‌తో డేటింగ్ చేసింది. అయితే అప్పటికే నటుడు జానీ డెప్తో ఆమె విడాకులకు సిద్ధమైంది. అయితే మస్క్ వల్లే తన కాపురంలో చిచ్చు రగిలిందని, హర్డ్ సైకోతనం భరించలేక తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు జానీ డెప్. ఈ క్రమంలో జానీ డెప్ వేసిన పరువు నష్టం దావా కేసు.. విచారణ సందర్భంగా మస్క్ కూడా హాజరవుతాడని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. ఇక ఈ కేసులో ఈ ఏడాది మొదట్లో జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పు వెలువడడం గమనార్హం. అయితే ఆ సమయంలోనూ ఆమెకు సంబంధించిన కోర్టు ఫీజులను ఎలన్ మస్క్ చెల్లించాడనే వాదన వినిపించింది. -
అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి!
సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ యూజర్లు జాగ్రత్త! యూజర్ల బ్యాంకు ఖాతాలనుంచి నగదును తస్కరించే యాప్‌లపై తాజాగా హెచ్చరిక జారీ అయింది. ఖాతాలో డబ్బులు, బ్యాంకింగ్ సమాచారం, పిన్లు, పాస్వర్డ్లు సహా ఇతర డేటాను దొంగిలించే లక్ష్యంతో మాల్వేర్ యాప్‌లను ట్రెండ్ మైక్రో భద్రతా పరిశోధన గుర్తించింది. తక్షణమే అన్ఇన్స్టాల్ చేయాలని హెచ్చరించింది. ఇలాంటి 17 ఆండ్రాయిడ్ యాప్‌లను సంస్థ గుర్తించింది. ఇవి మొబైల్ ఫోన్లోని టెక్స్ట్ సందేశాలను కూడా అడ్డుకుంటాయని, అలాగే మరింత ప్రమాదకరమైన మాల్వేర్ బారిన పడేలా చేస్తాయని హెచ్చరించింది. గూగుల్ ప్లేస్టోర్ సేఫ్టీ మెజర్స్‌ను అధిగమిస్తాయని యాప్‌లు డ్రాపర్-యాజ్-ఎ-సర్వీస్ (DaaS) మోడల్‌కు దారితీస్తాయని పేర్కొంది. అందుకే వాటిని డ్రాపర్ యాప్‌లు అంటారని ట్రెండ్ మైక్రోలోని భద్రతా పరిశోధకులు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్‌లో గత ఏడాది ట్రెండ్ మైక్రో కొత్త డా డ్రాపర్ వెర్షన్‌ను కనుగొంది. వీటిని ప్లేస్టోర్ నుంచి తొలగించినప్పటికీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో మిగిలి ఉండే అవకాశం ఉంది కనుక తక్షణమే తొలగించాలని సూచించింది. డ్రాపర్ యాప్‌ల జాబితా కాల్ రికార్డర్ APK రూస్టర్ VPN సూపర్ క్లీనర్- హైపర్ & స్మార్ట్ డాక్యుమెంట్ స్కానర్ - పీడీఎఫ్ క్రియేటర్ యూనివర్సల్ సేవర్ ప్రో ఈగిల్ ఫోటో ఎడిటర్ కాల్ రికార్డర్ ప్రో+ అదనపు క్లీనర్ క్రిప్టో యుటిల్స్ ఫిక్స్ క్లీనర్ యూనివర్సల్ సేవర్ ప్రో లక్కీ క్లీనర్ జస్ట్ ఇన్: వీడియో మోషన్ డాక్యుమెంట్ స్కానర్ ప్రో కాంకర్ డార్క్నెస్ సింప్లీ క్లీనర్ Unicc QR స్కానర్ కాపీ క్యాట్ యాప్‌లను నిషేధించేలా గూగుల్ కొత్త విధానాన్ని తీసుకురానుందని సమాచారం. ఇతర యాప్‌ల నుండి లోగోలు, డిజైన్లు లేదా టైటిల్స్‌ను క్లోన్ చేసే యాప్‌లపై ఆగస్టు 31 నుండి నిషేధం అమలు కానుంది. వినియోగదారు డేటాను ట్రాక్ చేసే, క్లిక్ ద్వారా ప్రకటనలకు దారి మళ్లించే వీపీఎన్ఎస్ సర్వీస్ ఇందులో భాగం. అంతేకాదు మొబైల్ గేమ్స్‌లో ఫుల్ పేజీప్రకటనలపై, 15 సెకన్ల తర్వాత కూడా క్లోజ్ కాని యాడ్స్ డెవలపర్లపై ఆంక్షలు సెప్టెంబర్ 30 నుంచి అమలు కానున్నాయి. స్క్రీన్ లోడింగ్ సమయంలో/గేమ్ ముందు లేదా తరువాతి లెవల్ ప్రారంభించే ముందు కనిపించే ప్రకటనల్ని గూగుల్ నిరోధిస్తుందని నివేదిక పేర్కొంది. అయితే, గేమ్‌లో రివార్డ్‌లను అన్‌లాక్ చేసే ప్రకటనలకు ఇది వర్తించదట. -
దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్..
Singer Sravana Bhargavi Deleted Okapari Song: టాలీవుడ్లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది శ్రావణ భార్గవి. తన యూట్యూబ్ ఛానెల్లో విభిన్నమైన వ్లోగ్స్ చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. అయితే ఆమె గతకొంతకాలంగా వివాదస్పదంలో చిక్కుకుంది. దీంతో సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి పేరు మారుమోగిపోతోంది. ఇందుకు కారణం ఆమె చిత్రీకరించిన 'ఒకపరి కొకపరి వయ్యారమై' వీడియోనే. అన్నమయ్య కీర్తనను వెకిలీ చేష్టలతో చిత్రీకరించి వీడియో రిలీజ్ చేసిందని అన్నమయ్య వంశస్తులు ఆమెపై మండిపడ్డారు. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆమె చేసిన వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అది మీ చూపులోనే ఉందని, దుప్పటి కప్పుకున్న అశ్లీలంగానే కనిపిస్తుందని శ్రావణ భార్గవి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అభ్యంతరకరంగా ఉంటే దైవానుగ్రహం దక్కదని, అందుకే వీడియోను డిలీట్ చేసేది లేదని తేల్చిచెప్పింది. ఇక తీవ్ర ఆగ్రహానికి లోనైన తిరుపతి వాసులు గళం విప్పారు. శ్రావణ భార్గవి తీరుపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలువురు నిరసనలు కూడా తెలిపారు. చదవండి: మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్ దీంతో చేసేదిలేక శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్ నుంచి 'ఒకపరి కొకపరి వయ్యారమై' వీడియోను డిలీట్ చేసింది. శ్రావణ భార్గవి ఓ మెట్టు దిగి ఆ వీడియోను తొలగించడంతో తిరుపతి వాసులు, అన్నమయ్య వంశస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఏందయ్యా రాహుల్ ఈ తమాషా.. నటుడి న్యూడ్ పిక్ వైరల్ -
కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం!
కవలకు జన్మినిచ్చిన మరుసటి రోజే సింగర్ చిన్మయికి ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. ఇన్స్టాగ్రామ్ పాలసీలకు విరుద్ధంగా తన పోస్టులు ఉన్నాయనే రిపోర్డ్స్ అందడంతో ఇన్స్టాగ్రామ్ తన అకౌంట్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని చిన్మయి స్వయంగా వెల్లడించింది. కాగా బుధవారం(జూన్ 22) చిన్మయి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ క్రమంలో చాలామంది ఆమెకు శుభకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు ఆమె ప్రెగ్రెన్సీపై ఆసభ్యకర మెసెజ్‌లు, కామెంట్స్‌తో ట్రోల్ చేశారు. చదవండి: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి ఈ క్రమంలో కొందరు ఆమెకు ఆసభ్యకరమైన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఇదే విషయమై ఇన్స్టాగ్రామ్ ఆమె అకౌంట్‌ను రద్దు చేసినట్లు చిన్మయి చెప్పింది. తన బ్యాకప్ అకౌంట్(కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్), ట్విటర్ ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలిపింది. ఈ మేరకు చిన్మయి పోస్ట్ షేర్ చేస్తూ.. ‘నా ఇన్‌స్టా అకౌంట్‌ను డిలిట్ చేశారు. ‘నా అకౌంట్లో న్యూడ్ ఫొటో పోస్ట్ చేసి.. పైగా నాపై రిపోర్ట్ చేశారు. దీంతో ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్‌ను రద్దు చేసింది. అయితే ఇంతకు ముందే తరచూ అబ్బాయిలు నాకు న్యూడ్ ఫోటోలు మెసేజ్ చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌కు కంప్లయింట్ చేశాను. చదవండి: అన్‌స్టాపబుల్: రెండో సీజన్ తొలి గెస్ట్ ఆ స్టార్ హీరోనట! కానీ దీనిపై చాలామంది రిపోర్ట్ చేయడంతో తన అకౌంట్‌ను తిసేశారఇది నా కొత్త అకౌంట్.. చిన్మయి.శ్రీపాద(chinmayi.sripada)’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా తన ఇన్స్టాగ్రాం వేదికగా చిన్మయి సమాజంలో అమ్మాయిలు, మహిళలకు ఎదురవుతున్న పలు సమస్యల మీద గళం వినిపించేది. ఎదురుదెబ్బలతో ధైర్యం కొల్పోయిన మహిళలకు ధైర్యం నింపేది. యువతుల సమస్యలకు పరిష్కారం ఇచ్చేది. ఈ నేపథ్యంలో తనను చాలా మంది ట్రోల్ చేస్తున్నారని చిన్మయి కొంత కాలంగా చెబుతూ వస్తుంది. కానీ ఆమె అకౌంట్‌ను ఇలా రద్దు చేయడంతో చిన్మయి ఫాలోవర్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. Instagram has basically removed MY account for reporting men who send ME their penises on DMs. Its been going on for a while where I report but MY access was barred. Anyway that’s that. My backup account is chinmayi.sripada 🤦🏽♀️ — Chinmayi Sripaada (@Chinmayi) June 23, 2022 View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayi.sripada) -
ఇన్‌స్టా పోస్టులన్నీ డిలీట్ చేసిన బుల్లితెర నటి.. కారణం ?
TV Actress Nikki Sharma Deleted Her Instagram Posts: 'సుసురాల్ సిమర్ కా', 'బ్రహ్మరాక్షస్ 2' వంటి సీరియల్స్‌తో తనదైన నటనతో అలరించింది నిక్కీ శర్మ. తాజాగా ఆమె తన అభిమానులకు షాక్ ఇచ్చింది. తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లోని పోస్టులన్నింటిని డిలీట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పోస్ట్‌లను డిలీట్ చేయడమే కాకుండా నిక్కీ శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో ఒక మెస్సేజ్‌ను కూడా ఇచ్చింది. నేను ప్రయత్నించాను. కానీ అలసిపోయాను. నా సొంత ఆలోచనల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నాను. అని రాసుకొచ్చింది నిక్కీ శర్మ. దీంతో ఆమె అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై 'ససురాల్ సిమర్ కా' నటుడు, నిక్కీ శర్మ మాజీ సహోద్యోగి అభిషేక్ భలేరావ్ స్పందించాడు. నిక్కీ పోస్టులను డిలీట్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. 'ససురాల్ సిమర్ కాలో నాతో కలిసి నటించిన నిక్కీ శర్మ తన పోస్టులను తొలగించింది. ఆమె రాసిన మెస్సేజ్ ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో మూడు గంటలకుపైగా ఉంది. నేను ఈమెయిల్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా సాధ్యమైనంతవరకు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించాను. కానీ ఆమె అందుబాటులోకి రాలేదు.' అని తెలిపాడు. చదవండి: 'జెంటిల్ మేన్ 2'కి మరో హీరోయిన్.. నిర్మాత ప్రకటన తర్వాత డిలీట్ చేసిన మరొక ట్వీట్లో అభిషేక్ భలేరావు 'ఇందులో పోలీసులు కలుగజేసుకుంటే ఈ విషయం ఎంత దూరం వెళుతుందో అని ఆలోచిస్తున్నాను. అందుకే ఆమెను సంప్రదించేందుకు మాతో కలిసి నటించిన వారందరినీ ట్యాగ్ చేస్తున్నాను.' అని నటీనటులు దీపికా, ధీరజ్‌లను ట్యాగ్ చేశాడు. అయితే నిక్కీ మానసిక స్థితి సరిగా లేదని, ఆమె నిరాశకు గురైనట్లు ఆమె సన్నిహితుల నుంచి వచ్చిన సమాచరమని ప్రముఖ వెబ్సైట్ పేర్కొంది. అలాగే నిక్కీతో మాట్లాడిన మాజీ నటుల్లో ఒకరికి ఆమె.. తనను తాను చూసుకోగలనని, ఎలాంటి పిచ్చి పనులు చేయనని నిక్కీ చెప్పినట్లు సమాచారం. దీపికా కక్కర్, ధీరజ్ ధూపర్ నటించిన 'ససురాల్ సిమర్ కా' సీరియల్లో రోష్నీ కపూర్ పాత్రలో అలరించింది నిక్కీ శర్మ. -
రాజమౌళిని అన్‌ఫాలో చేసిన ఆలియా భట్? పోస్టులు డిలీట్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఆర్ఆర్ఆర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్ల మైలురాయిని అధిగమించి అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ విషయంలో ఆలియా భట్ అస్సలు హ్యాపీగా లేనట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ ఉన్న ఆలియాకు స్క్రీన్ స్పేస్ తక్కువ ఇవ్వడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ కారణంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసినట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సినిమా ఇంత పెద్ద సూపర్ హిట్ అయినా ఈ చిత్రానికి సంబంధించి థ్యాంక్యూ అంటూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. గతంలో షేర్ చేసిన ఆర్ఆర్ఆర్ పోస్టులను కూడా తన ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది. కేవలం ఈ సినిమాలో తన ఫస్ట్‌లుక్ మినహా మిగతా పోస్టులను తన ఖాతా నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్లో తన రేంజ్‌కు తగిన పాత్ర దక్కలేదన్న అసంతృప్తి ఆలియాలో ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్‌పై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. -
నిహారిక అకౌంట్‌ను నేనే డియాక్టివేట్ చేశాను : నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయంపై అయినా తనదైన స్టైల్లో సమాధానమిస్తుంటాయరన. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఓ యూజర్ నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎందుకు డిలీట్ చేసింది?ఆ రూమర్స్‌పై రెస్పాండ్ అవ్వండి అని అడిగారు. దీనికి రిప్లై ఇచ్చిన నాగబాబు.. 'నిజానికి నేనే కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేశాను. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్‌ని డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. కానీ నిహారిక భర్త చైతన్య తన ఇన్‌స్టా నుంచి ఇద్దరి ఫోటోలు షేర్ చేస్తూ ఆ రూమర్స్‌కి చెక్ పెట్టారు. -
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నిహారిక.. కారణం అదేనా?
మెగా డాటర్ నిహారిక కొణిదెల గుర్తించి పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఒక మనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయినా వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2020, డిసెంబర్9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇటీవలె ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించి ప్రొడ్యూసర్‌గానూ అవతరించింది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ, తన సినిమా విశేషాలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేసుకునేది. కానీ అనూహ్యంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే నిహారికి సడెన్‌గా అకౌంట్ డిలీట్ చేయడం ఏంటని నెటిజన్లు ఆరా తీశారు. అయితే రీసెంట్గా జిమ్‌లో నిహారిక షేర్ చేసిన ఓ వీడియోపై ట్రోల్స్ రావడంతో అకౌంట్ డిలీట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. మరి అకౌంట్ తొలగించడానికి ఇదే కారణమా లేక మరేదైన కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. -
'పుష్ప' డిలీటెడ్ సీన్.. సూపర్ సీన్ పోయిండాదే!
Mythri Movie Makers Released Pushpa Deleted Scene: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతుంది. టాలీవుడ్లో రూ. 100కోట్లకు పైగా కలక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ సహా ఇతర భాషల్లోనూ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈ సినిమా. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప చిత్రం నుంచి డిలీటెడ్ సీన్‌ని విడుదల చేశారు. ఇందులో.. అప్పు ఇచ్చిన వ్యక్తికి బర్రెలు అమ్మి అయినా అప్పు తీర్చేస్తాడు పుష్పరాజ్.ఈ క్రమంలో అప్పు చెల్లించినట్లు ఊరందరికి చెప్పాలంటూ అతడిపై చేయిచేసుకుంటాడు. అయితే లెంగ్త్ ఎక్కువైన కారణంగా ఈ సీన్‌ను చిత్రం నుంచి తొలగించారు. తాజాగా పుష్ప డిలీటెడ్ సీన్లో ఈ వీడియోను రిలీజ్ చేయగా కాసేపటికే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ సీన్ ఉంటే థియేటర్ దద్దరిల్లిపోయేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
క్రిస్మస్ రోజే ట్విటర్ ఖాతా తొలగించిన అరియానా.. ఫ్యాన్స్ షాక్ !
Ariana Grande Deletes The Twitter Account On Christmas: హాలీవుడ్ పాప్ సింగర్ అరియానా గ్రాండె తన పాటలు, నటనతో ఎంతో పేరు తెచ్చుకుంది. 2013-2014 మధ్యలో వచ్చిన 'సామ్ అండ్ క్యాట్' టీవీ షోతో మరింత పాపులర్ అయింది అరియానా. అలాగే 'ది వాయిస్' సీజన్‌కు న్యాయనిర్ణేతగా కూడా కనిపించి అలరించింది. సోషల్ మీడియా పుణ్యమా అని అరియానా గ్రాండె పేరు ఈ సంవత్సరం ఎక్కువగా వినిపించింది. ఈ ఏడాది మేలో లాస్ ఏంజెల్స్ లగ్జరీ రియల్టర్ డాల్టన్ గోమెజ్‌ను సీక్రెట్‌గా వివాహం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన అరియానా తాజాగా మరోసారి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా శుక్రవారం (డిసెంబర్ 25) క్రిస్మస్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలందరూ తమ ఫొటోలను, క్రిస్మస్ వేడుకలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ రోజు తన ట్విటర్ ఖాతా తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది అరియానా. ఎలాంటి సమాచారం లేకుండా తన అకౌంట్ డిలీట్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ ఏమైందా అని ఆరా తీశారు అరియానా ఫ్యాన్స్. అరియానా సైబర్ వేదింపులకు గురయి ఉంటుందని, అందుకే డిలీట్ చేసిందని కొందరు భావిస్తున్నారు. లేదా తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటనతో వచ్చేందుకు ఇలా చేసిందా అని తికమక పడుతున్నారు. ఆమె మీద ట్రోలర్స్ ప్రభావం పడిందేమోనని, వారివల్లే ఖాతా తొలగించిందేమో అని ఆరోపిస్తున్నారు. ఆమె మళ్లీ ట్విటర్‌లోకి రావాలని అరియానా ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) బ్యాంగ్ బ్యాంగ్, బ్రేక్ ఫ్రీ, సైట్ టు సైడ్ వంటి హిట్ సాంగ్స్ పాడిన అరియానా గ్రాండె ఇన్‌స్టా గ్రామ్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉంది. తన తాజా నెట్‌ఫ్లిక్స్ చిత్రం డోంట్ లుక్ అప్ ప్రచార చిత్రాలను షేర్ చేసింది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇన్‌స్టా వేదికగా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. మెర్రీ.. బీ సేఫ్, ఐ లవ్ యూ అని స్టోరీ షేర్ చేసింది ఈ బ్యూటీఫుల్ సింగర్. ఇదీ చదవండి: తన నివాసంలో ప్రియుడిని పెళ్లాడిన పాప్ సింగర్ -
పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెడితే..
ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి, ఒక గ్రూపులో పెట్టాల్సిన పోస్ట్ మరో గ్రూపులో.. వేయడం చాలామందికి జరిగేదే!. పరధ్యానంలో, కంగారులో చేసే ఈ పొరపాటు.. ఒక్కోసారి విపరీతాలకు సైతం దారితీస్తుంటాయి. ఇదే విధంగా చాలా మంది వాట్సాప్‌లో ఏమరుపాటులో స్టేటస్లు కూడా అప్డేట్ చేస్తుంటారు. అయితే ఇటువంటి సమయాల్లో పనికొచ్చే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురాబోతోంది. వాట్సాప్ ఈమధ్య మల్టీ డివైస్ సపోర్ట్, గ్రూప్స్ కాల్స్ నడుస్తుండగా.. జాయిన్ కాగలిగే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్ తీసుకొస్తోంది వాట్సాప్. స్టేటస్ విషయంలో ‘అండూ బటన్’ను తేనుంది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా యాక్సిడెంటల్‌గా ఏదైనా స్టేటస్లు అప్డేట్ చేస్తే.. వెంటనే దానిని తొలగించొచ్చు. సాధారణంగా ఏదైనా వాట్సాప్ స్టేటస్ పొరపాటున పెడితే.. డిలీట్ చేయాలంటే కొంత టైం పడుతుంది. స్టేటస్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే వచ్చే మూడు చుక్కల మెనూ మీద క్లిక్ చేశాకే డిలీట్ ఆప్షన్‌ను క్లిక్ చేసి చేయొచ్చు. కానీ, అండూ బటన్ ఫీచర్ వల్ల ఆ టైం మరింత తగ్గిపోనుంది. పొరపాటున మాత్రమే కాదు.. ఎక్కువ గ్యాలరీ కంటెంట్(వాట్సాప్ స్టోరీస్)తో వాట్సాప్ స్టేటస్లు పెట్టే వాళ్లకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని వాట్సాప్ భావిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోందని, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే క్షణంలో ఆ స్టేటస్‌ను తొలగించే వీలు ఉంటుందని ‘వాబేటాఇన్ఫో’ కథనం ప్రచురించింది. తద్వారా యాక్సిడెంటల్‌గా పోస్ట్ చేసినా.. అవతలివాళ్లు స్క్రీన్ షాట్ తీసేలోపే ఆ స్టేటస్‌ను తొలగించొచ్చు. ముందు ఐవోఎస్ వెర్షన్లో ఆతర్వాతే ఆండడ్రాయిడ్ వెర్షన్‌కు ఈ ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు. చదవండి: నెలలో 20 లక్షల మంది వాట్సాప్ అకౌంట్ల బ్యాన్! కారణం ఏంటంటే.. -
భలేవాడివి బాసు! 97 కోట్లు లాస్.. హ్యాపీగా ఉందన్న సీఈవో
‘గెలిస్తే ఏముంటుంది? ఓడితేనే కదా.. అసలు కిక్కు ఉండేది’ అనే టైప్ కాదు ఈ బాస్. అలాంటప్పుడు అంత లాస్లో ఆనందమా? ఈయనేం మనిషిరా బాబూ! అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆయన సంతోషంలో ఒక పరమార్థం ఉంది కాబట్టి. యూకేకి చెందిన ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ లష్ శుక్రవారం కీలక అడుగు వేసింది. లష్ తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ అకౌంట్లను పూర్తిగా డిలీట్ చేసి పారేసింది. కేవలం ఒక్క ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేసినందుకే 10 మిలియన్ పౌండ్లు(13.3 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో 97కోట్ల 50 లక్షలకు పైమాటే) నష్టం వాటిల్లిందని కంపెనీ సీఈవో మార్క్ కంస్టాన్‌టైన్ సంతోషంగా ప్రకటించుకున్నారు. మిగతావి కలిపితే ఆ నష్టం మరో మూడునాలుగు మిలియన్ పౌండ్ల మధ్య ఉండొచ్చని ఆయన చెప్తున్నారు. ‘‘ఇదేం పీఆర్స్టంట్ కాదు. దీనివల్ల మాకు పెద్ద దెబ్బే. అయినా ఈ నిర్ణయం తీసుకోవడానికి గట్టి కారణం ఉంది. సోషల్ మీడియా వల్ల టీనేజర్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆరోపణల్ని లష్ కంపెనీ నమ్ముతోంది. ఓవైపు పిల్లల ప్రాణాలు పోతుంటే.. ఆ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మేం ఎలా ప్రమోట్ చేసుకోగలం. కస్టమర్ల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా చేసే వ్యాపారం మాకెందుకు!. దీనికి తోడు దశాబ్దానికిపైగా క్లైమేట్ ఛేంజ్‌పై ఆందోళన వ్యక్తం అవుతున్నా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పట్టించుకోవట్లేదని, అందుకే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ ఆ అకౌంట్లను తొలగిస్తున్నాం ఒక ప్రకటనలో లష్ పేర్కొంది. అంతేకాదు కొవిడ్ సమయంలో కఠిన ఆంక్షల మధ్యే తమ వ్యాపారం ఆటుపోట్లను ఎదుర్కొంటూ నిలదొక్కుకుందని, అలాంటిది సోషల్ మీడియా ప్రమోషన్ దూరమైనంత మాత్రాన తామేం ఇబ్బందిగా భావించబోమని, తాము కస్టమర్లని నమ్ముకున్నామని మార్క్ కంస్టాన్‌టైన్ చిరునవ్వుతో ధీమాగా చెప్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్ ఎంత పవర్ఫుల్దో తెలియంది కాదు. ప్రస్తుతం ఇయర్ ఎండ్ సీజన్ నడుస్తోంది. సాధారణంగా షాపింగ్ బిజీ ఉంటుంది. ఈ తరుణంలో సోషల్ మీడియా అకౌంట్లను ప్రమోషన్ కోసం వాడుకుంటాయి కంపెనీలు. కానీ, లక్షల మంది ఫాలోవర్స్‌ను దూరం చేసుకుంటూ లష్ ఇలా నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. ఇదిలా ఉంటే లష్కు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కలిపి 11 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉండేవాళ్లు డిలీట్ చేసిన నాటికి(శుక్రవారం, 26 2021). గతంలో 2019లోనూ లష్ ఆల్గారిథమ్ విషయంలో ఫేస్‌బుక్‌పై అసంతృప్తితో కొన్నాళ్లు దూరం పెట్టింది కూడా. ఇదిలా ఉంటే జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను చాలా కంపెనీలు తొలగించడం చేశాయి. చదవండి: ది గ్రేట్ అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన పదార్థం.. వందల కోట్ల వ్యాపారానికి నాంది -
రాజ్‌కుంద్రా సంచలన నిర్ణయం..ఆ అకౌంట్లు డిలీట్
Shilpa Shetty Husband Raj Kundra Deletes Twitter Instagram Accounts: అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఆయన బయటకు రావడానికి కూడా ఎక్కువగా ఇష్టపడటం లేదట. రీసెంట్గా జరిగిన 'కర్వా చౌత్' వేడుకలోనూ రాజ్‌కుంద్రా కనపడలేదు.చదవండి: షారుక్ ఖాన్ బర్త్‌డే.. వెలిగిపోతున్న 'మన్నత్' ఇదివరకు ఆయన వరుస పోస్టులతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. అయితే పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్, అనంతరం జరుగుతున్న వివాదాలతో కుంద్రా బాగా కుంగిపోయినట్లు తెలుస్తుంది. దీంతో రాజ్‌కుంద్రా..తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. కాగా నీలి చిత్రాల కేసులో దాదాపు రెండు నెలల జైలు జీవితం అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. చదవండి: చైతూతో ఉన్న ఇంట్లోనే సమంత.. కొత్త ఫ్లాట్‌లోకి చై! నేను బలవంతురాలిని.. ఎప్పటికీ వదిలిపెట్టను: సమంత -
నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసిన సమంత
Samantha Deletes Pictures With Naga Chaitanya: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ సమంత-నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి వాళ్ల సోషల్ అకౌంట్లపై మరింత ఫోకస్ పెరిగింది. సాధారణంగానే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో షేర్చేస్తుంటుంది. చైతూతో విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల మందు నుంచి మై మమ్మా సెయిడ్(మా అమ్మ చెప్పింది) అంటూ వరుస పోస్టులు చేసిన సమంత ఈ మధ్యకాలంలో మరింత యాక్టివ్‌గా కనిపిస్తుంది.చదవండి: మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ విడాకుల ప్రకటనతో సామ్ మానసికంగా ఎంతో కుంగిపోయినట్లు ఆమె పోస్టులను బట్టి అర్థం అవుతుంది. తాజాగా చైతూతో గడిపిన పాత జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి సమంత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీ చేసేసింది. అలా ఇప్పటివరకు సుమారు 80కి పైగా ఫోటోలను తన అకౌంట్ నుంచి సామ్ తొలగించింది. కేవలం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పెట్‌డాగ్‌తో ఉన్న కలసి ఉన్న చైతూ ఫోటోలను మాత్రం అలాగే ఉంచేసింది. చివరగా చైతూ బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి 'లాల్ సింగ్ చద్దా' పోస్టును షేర్ చేసిన సామ్ ఇప్పుడు ఆ పోస్టును డిలిట్ చేసింది. త్వరలోనే నాగ చైతన్యను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయనున్నట్లు తెలుస్తుంది. చదవండి: నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్ సమంత కేసు: థంబ్‌నైల్స్ మా బాధ్యత కాదు.. సీఎల్ వెంకట్రావు -
కీలక డేటా తొలగించిన అనన్య!
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో పట్టుబడిన మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మిత్రురాలైన నటి అనన్య పాండేను విచారిస్తోంది. ఆమె నివాసం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను ఎన్సీబీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఇందులోని వాట్సాప్ చాటింగ్‌లు, ఫొటోలు, వాయిస్ నోట్లను ఆనన్య పాండే చాలావరకు తొలగించినట్లు ఎన్సీబీ గుర్తించింది. డిలీట్ చేసిన ఈ డేటాను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్యన్ ఖాన్‌తో ఆమె సాగించిన వాట్సాప్ చాటింగ్‌లలో కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల వివరాలు ఎన్సీబీ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక లావాదేవీలు, ఆర్యన్ ఖాన్‌తో చాటింగ్‌లపై ఆనన్య పాండేను ఎన్సీబీ నిశితంగా ప్రశ్నించింది. అయితే, ఆమె అన్నింటికీ ఒకటే సమాధానం చెబుతోంది. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, డ్రగ్స్ కొనడానికి ఆర్యన్‌కు ఎలాంటి సాయం చేయలేదని, అతడితో ఆర్థిక లావాదేవీలు లేవని పేర్కొంటోంది. అయితే, ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తులెవరో అనన్యకు తెలుసని ఎన్సీబీ అనుమానిస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది. నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఆరా ఆర్యన్ ఖాన్ సహా నిందితులందరి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థిస్తామన్నారు. ఈ కేసులో ఎన్సీబీ ఇప్పటిదాకా 20 మందిని అరెస్టు చేసింది. వారి ఆదాయ వనరులను పరిశీలిస్తోంది. -
వాట్సాప్‌లో ఇలా చేశారో..! మీ అకౌంట్‌ను మర్చిపోవాల్సిందే..!
Your Whatsapp Account Banned Or Deleted Did You Just Do This: వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు ఉన్నాయంటే చాలా అరుదు. స్మార్ట్ఫోన్ల రాకతో సంప్రదాయక మొబైల్ మెసేజ్‌లకు స్వస్తి చెప్పి పలు యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్ మనందరి నిత్యజీవితాల్లో ఒక భాగమైంది . అక్టోబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలను ఏడు గంటలపాటు నిలిచి పోయినా విషయం తెలిసిందే. చదవండి: Menstruation app: కళ్లింత పెద్దవి చేసుకుని చూడొద్దు వాట్సాప్‌ను సరిగ్గా వాడుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒకవేళ వాట్సాప్‌ను మిస్యూజ్ చేశామనుకోండి అంతే సంగతులు..! వాట్సాప్ యాప్‌ను మిస్యూజ్ చేస్తోన్న వారిపై వాట్సాప్ కఠినవైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 20 లక్షల ఇండియన్ ఖాతాలను వాట్సాప్ మూసివేసింది. వాట్సాప్ పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయా యూజర్ల వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేస్తుంది. మీరు ఒక వేళ తెలిసి, తెలియాక వాట్సాప్‌కు విరుద్ధంగా చేశారంటే మీ అకౌంట్‌ను వాట్సాప్ బ్లాక్ చేస్తోంది. మీరు ఇలా చేస్తే మీ వాట్సాప్ ఖాతా బ్లాక్...! థర్డ్ పార్టీ, లేదా మోడెడ్ వాట్సాప్ యాప్‌లను వాడకూడదు..! వాట్సాప్‌కు బదులుగా ఇతర క్లోనింగ్ యాప్స్ లభిస్తున్నాయి. జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్, వాట్సాప్ మోడ్ యాప్‌లను ఉపయోగించే వారివి ఖాతాలను వాట్సాప్ తొలగిస్తుంది. ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీకి భంగం వాటిల్లితుంది. స్పామ్ మెసేజ్‌లను పంపితే...! తెలియని నంబర్లకు స్పామ్మెసేజ్లను పంపితే వాట్సాప్ ఆయా యూజర్లను బ్లాక్ చేస్తోంది. ఆయా యూజర్లకు అనుమతి లేకుండా మెసేజ్‌లను పంపితే బ్లాక్ చేస్తోంది. రెసిపెంట్ ఒక వేళ మీరు పంపినా మెసేజ్‌లను స్పామ్‌గా గుర్తించి వాట్సాప్‌కు రిపోర్ట్ చేస్తే మీ వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అవుతాయి. చదవండి: ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..! టయోటా వరల్డ్ రికార్డు..! -
ప్లీజ్.. గర్భవతిని! నా పోర్న్ వీడియోల్ని తీసేయండి
కెరీర్లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్ లాంటి మాజీ పోర్న్ స్టార్స్ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరింది లానా రోడ్స్. చికాగో ఇల్లినాయిస్లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజీలోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్‌గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. కొంతకాలం క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్‌కాస్ట్ ‘టాప్ ఇన్’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్ వర్కర్స్‌తో ఇంటెరాక్షన్ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్‌లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్ వెబ్సైట్లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా. చదవండి: అడల్ట్ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా? ఇంతకీ తండ్రెవరు? మైక్ మజ్లక్ అమెరికన్ నటుడు, పాపులర్ వ్లోగర్. లానా రోడ్స్‌తో చాలాకాలంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది. చదవండి: పాక్ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్ -
ఆరోగ్య సేతు: మీ అకౌంట్ డిలీట్ చేయాలా..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం తీసుకు వచ్చిన ఆరోగ్య సేతు యాప్‌లో వినియోగదారులు తమ అకౌంట్‌ను తొలగించేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. అంతేగాక ఆరోగ్య సేతు యాప్‌లో వినియోగదారుని మొత్తం డేటాను కూడా డిలీట్ చేసేందుకు అనుమతిచ్చింది. అకౌంట్ డిలీట్ చేసిన 30 రోజులకు యాప్ నుంచి డేటా తొలగించడతుంది. అయితే అకౌంట్‌ను తొలగించడం వలన కేవలం ఫోన్ నుంచి మాత్రమే డేటా డిలీట్ అవుతుంది. ఇది ప్రభుత్వ సర్వర్ల నుంచి తీసివేసే వరకు వేచి ఉండాల్సిందే. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత యాజమానులకు) కాగా ఆరోగ్య సేతులో వినియోగదారుడు తనకు కరోనా సోకిందా అన్న విషయంతోపాటు చుట్టుపక్కల కరోనా రోగి ఉన్నట్లయితే ఆ విషయాన్ని కూడా తెలుసుకునేందుకు దోహదపడుతుంది. జీపీఎస్, బ్లూటూత్‌లో రూపొందించిన ఈ కరోనా ట్రాకింగ్ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇటీవల బ్లూటూత్ కాంటాక్ట్స్ ఆధారంగా ప్రమాద స్థాయిని అంచనా వేసే లక్షణాన్ని కూడా ఆరోగ్యా సేతు డెవలపర్లు పొందుపరిచారు. తాజాగా ఆరోగ్య సేతులో హెల్త్ డేటాను ఇతర హెల్త్ యాప్‌లలో షేర్ చేసేందుకు కొత్త అప్డేట్ను తీసుకువచ్చింది. అయితే ఈ మార్పులన్నీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని త్వరలో పొందనున్నారు. (సాహో.. ఆరోగ్య సేతు..!) అకౌంట్ డిలీట్ చేసే విధానం యాప్‌లో ఎడమవైపు ఉన్న యూజర్ ఐకాన్‌ను క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్‌ను రూపొందించడం. స్కాన్ చేయడం, ప్రభుత్వంతో డేటాను భాగస్వామ్యం చేయడం, కాల్ హెల్ప్‌లైన్ (1075), సెట్టింగ్ ఆప్షన్లు కన్పిస్తాయి. వీటిలో సెట్టింగ్‌ను క్లిక్ చేసి డిలీట్ మై అకౌంట్‌పై నొక్కాలి. అప్పుడు అకౌంట్‌ను డిలీట్ చేస్తే ఏం అవుతుందో చూపిస్తుంది. దాన్ని ఓకే చేసి మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీంతో యాప్‌లో మీ అకౌంట్ డిలీట్ అవుతోంది. (ఆరోగ్య సేతు ఉంటేనే ఏపీ సచివాలయంలోకి..) -
యూజర్లకు గూగుల్ గుడ్‌న్యూస్
కొత్తగా గూగుల్(మెయిల్) ఉపయోగించేవారికి సెర్చ్ ఇంజన్ దిగ్గజం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వారి లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్ కాబోతుంది. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు. ‘మేం ఏదైనా ప్రొడక్ట్‌ను రూపొందిచేటప్పుడు ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటాం. మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, బాధతాయుతంగా ఉండటం, నియంత్రణలో ఉంచడం. ఈ విషయంలో మరింత భద్రతను కల్పించడం కోసం గూగుల్ సరికొత్త ఆవిష్కరణను ఈ రోజు మీ ముందుకు తీసుకు వచ్చింది. డేటాకు సంబంధించి కొన్ని మార్పులు చేశాం’ అని తెలిపారు. (గూగుల్ @కరోనా సెంటర్) ఇక నుంచి గూగుల్ యూజర్ హిస్టరీ 18 నెలల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. డేటాను డిలీట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఆ పనిని మాన్యువల్‌గా చేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా డిలీట్ కానుంది. ఇది గూగుల్ అకౌంట్ కొత్తగా వాడటం మొదలుపెట్టిన వారికి మాత్రమే వర్తిస్తుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. పాత యూజర్లకు కూడా డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ- మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. వారు ఎంచుకునే ఆప్షన్ బట్టి డేటా మూడు నెలలకొకసారి లేదా 18 నెలల కొకసారి ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. దీంతో వినియోగదారుల భద్రత మరింత పెరిగే అవకాశం ఉందని గూగుల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న వినియోగదారుల సెట్టింగ్స్‌ను గూగుల్ మార్చబోవడం లేదని కూడా తెలిపారు. ఈ ఆటోమెటిక్ డిలిట్ ఆప్షన్ జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌కు వర్తించదని వారు తెలిపారు. (అందుకే మిట్రాన్ యాప్ తొలగించాం: గూగుల్) -
యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్
న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో సాధారణ వినియోగదారుడి వివరాలైతే 30 రోజుల్లో, కరోనా సోకిన వ్యక్తి వివరాలైతే 45–60 రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. ఆరోగ్య సేతు యాప్ అనేది కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన సోఫిస్టికేటెడ్ సర్వీలెన్స్ కలిగిన యాప్ అని తెలిపారు. ఈ యాప్‌ను ఇప్పటికే 9.5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, దీనిపై ప్రజలకు ఎంత నమ్మకముందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా సోకిన వారు దగ్గరలో ఉంటే హెచ్చరిచేందుకు ఈ యాప్‌ను వాడేవారిలొకేషన్ వివరాలను తీసుకుంటుందని తెలిపారు. ఇతర దేశాల్లో ఇలాంటి యాప్‌లు వాడుతున్నారని, దీనిపై అక్కడ మనదేశంలో వచ్చినట్లు ఆరోపణలు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దంటూ రాహుల్ గాంధీని కోరారు. ప్రజల కోసమే ఐసీఎంఆర్ వద్ద ఉన్న డేటాబేస్‌తో దాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. -
లాగిన్ కాకుంటే ఆ ఖాతాలు తొలగిస్తాం
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్.. యాక్టివ్‌గా లేని తన ఖాతాదారులకు వార్నింగ్ ఈ-మెయిల్స్ పంపుతోంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ట్విటర్ అకౌంట్ లాగిన్ చేయకుండా నిద్రాణవ్యవస్థలో(ఇన్‌యాక్టివ్) ఉన్న యూజర్‌నేమ్‌తో పాటు ఖాతాలను పూర్తిగా తొలగిస్తామని పేర్కొంది. అలా జరగకుండా ఉండాలంటే డిసెంబరు 11లోగా లాగిన్ అవ్వాలంటూ వినియోగదారులను ట్విటర్ హెచ్చరించింది. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు విశ్వసనీయ సమాచారం, కచ్చితత్వం కొరకు మాత్రమే తాము నిద్రావస్థలో ఉన్న ట్విటర్ అకౌంట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపింది. అయితే తాము ఒక్కసారిగా ఇన్‌యాక్టివ్ ట్విటర్ అకౌంట్లను తొలగించమని, తొలగింపు ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుందని ఈ మేరకు ట్విటర్ అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు. ట్విటర్ కస్టమర్లు యాక్టివ్‌గా ఉన్నంతవరకు వారి ఖాతా సేఫ్‌గా ఉంటాయని వివరించారు. ట్విటర్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్విటర్ ఖాతాను మరిచినవారితో పాటు చనిపోయిన ఖాతాదారుల అకౌంట్లపై ప్రభావం కనిపించనుంది. -
ఈ యాప్స్‌ను తక్షణమే తొలగించండి!
ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక. గూగుల్ ప్లే స్టోర్ లోని కొన్ని యాప్స్ చాలా హానికరమైనవిగా ఉన్నాయని తక్షణమే వీటిని అన్ఇన్స్టాల్ చేయాలని ఒక పరిశోధన సంస్థ వినియోగదారులను తాజాగా హెచ్చరిస్తోంది. వివిధ ఉపయోగరమైన యాప్స్‌తో పాటు కొన్ని హానికరమైన యాప్స్ కూడా ప్లేస్టోర్‌లో దాక్కుని ఉన్నాయని బ్రిటిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ వెల్లడించింది. దాదాపు 15 పైగా ఇలాంటి యాప్స్‌ను తన పరిశోధనలో గుర్తించినట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వాటిని ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకుని వుండి వుంటే..వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని హెచ్చరించింది. ఈ మోసపూరితమైన యాప్స్ ద్వారా వినియోగదారుల గోప్యతకు ముప్పుతో పాటు, వాటి డెవలపర్ అక్రయ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని పేర్కొంది. పరిశోధనా సంస్థ సోఫోస్ ప్రకారం వీటిని ప్రస్తుతం గూగుల్ తొలగించినప్పటికీ, ఈ 15 యాప్స్ 1.3 మిలియన్లకు పైగా మొబైల్స్‌లో డౌన్లోడ్ అయినట్టు గుర్తించింది. 2019 జనవరి- జూలై మధ్య ఇవి ఇన్స్టాల్ అయ్యాయని తెలిపింది. ఇమేజ్ మ్యాజిక్ జెనరేట్ ఈవ్స్ సేవ్ ఎక్స్పెన్స్ క్యూఆర్ ఆర్టిఫాక్స్ ఫైండ్ యువర్ మొబైల్ స్కావెంజర్ స్పీడ్ ఆటో కటౌట్ ప్రో రీడ్ క్యూఆర్ కోడ్ ఫ్లాష్ కాల్స్ & మెసేజ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఆటో కటౌట్ ఆటో కటౌట్ 2019 ఈ హానికరమైన అనువర్తనాలను వదిలించుకోవడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి, యాప్స్, నోటిఫికేషన్లోకి వెళ్లి, రీసెంట్ యాప్స్ చెక్‌చేసి అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే వాటిని అన్ ఇన్స్టాల్ చేయాలని హెచ్చరించింది. ముఖ్యంగా అవసరం లేకపోతే ఎలాంటి యాప్స్‌ను ఇన్స్టాల్ చేయవద్దని యూజర్లకు సూచిస్తోంది. -
వాట్సాప్ మరో అద్భుతమైన అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో మన పంపించే మెసేజ్‌లో వాటంతట అవే డిలీట్ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్‌ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ఈ మెసేజ్‌లు నిర్ణీత సమయం (5సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటంతట అవే ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సాప్ సెట్టింగ్స్ విభాగంలో అందజేసే ‘డిజప్పియరింగ్ మెసేజెస్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వా బేటా అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అంటే ఏదైనా సెన్సిటివ్ మెసేజ్‌ను పంపించాక, అది ఎక్కువ సేపు ఉండకూడదని భావిస్తే..డిజప్పియర్డ్ మెసేజెస్ లోకి వెళ్లి, ఆఫ్, 5 సెకండ్స్, గంట అనే అప్షన్‌ను ఎంచుకోవాలి. ఇది గ్రూపు చాటింగ్‌లో గానీ, వ్యక్తిగత చాటింగ్‌లో గానీ ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ఒక్కసారి డిలీట్ అయిన తరువాత ఇవి చాట్‌లో ట్రాక్‌లో కూడా అందుబాటులో ఉండవు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులోకి తేనుంది. ఇటీవల వాట్సాప్ స్టేటస్ స్టోరీలను డైరెక్టుగా ఫేస్బుక్ స్టోరీలో షేర్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితేతాజా అప్డేట్పై వాట్సాప్ అధికారికంగా ప్రకటన చేయాల్సి వుంది. చదవండి : వాట్సాప్ అప్డేట్ -
ఫేస్బుక్ మెసేంజర్‌లో కొత్త ఫీచర్
సోషల్‌మీడియా నెట్వర్క్ ఫేస్బుక్ తన మెసేజింగ్ ప్లాట్‌పాం మెసేంజర్‌లో కొత్త ఫీచర్‌ను జోడించనుంది. వాట్సాప్ మాదిరిగానే మెసేజ్‌లకు సంబంధించి అన్‌సెండ్ ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూజర్లు అప్పటికే సెండ్ చేసిన సందేశాన్ని తొలగించడానికి అనుమతిస్తుంది. ఇన్బాక్స్నుంచి ఒక మెసేజ్‌ను డిలీట్ చేయడంతోపాటు, అన్‌సెండ్ ఆప్షన్‌తో గ్రహీత ఇన్బాక్స్నుంచి తొలగించేందుకు కూడా అనుమతిస్తుంది. వాట్సాప్‌లో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్లాంటిదే ఇది కూడా. అలాగే ఇలా చేయడానికి అచ్చం వాట్సాప్లోలాగానే సమయ పరిమితి ఉంటుందిట. అయితే ఈ టైంను సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా వాట్సాప్ సందేశాలకు తొలగింపునకు సంబంధించిన కొత్త అప్డేట్ను జోడించింది. పొరపాటున మెసేజ్ పంపించాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్‌కు కాకుండా మరో గ్రూపు లేదా కాంటాక్ట్‌కు పంపించినట్లయితే ఆ మెసేజ్‌ను అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్ చేసుకునే అవకాశాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఇలా సెండ్ చేసిన సందేశాలను 68నిమిషాల లోపు మాత్రమే తొలగించే అవకాశం ఉంది. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ వినియోగించి మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చని వాట్సాప్‌ను మానిటర్ చేస్తున్న వాబిటెయిన్ ఇన్ఫో వెబ్సైట్ తెలిపింది. అయితే సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్న సందర్భాల్లో జరుగుతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
వాట్సాప్ కొత్త అప్డేట్
ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ వాట్సాప్ యూజర్లకు మరో వెసులుబాటును కల్పించింది. మెసేజ్‌లను డిలీట్ చేసే గడువును భారీగా పొడిగించింది. పొరపాటున సెండ్ చేసిన మెసేజ్‌ను కొంత సమయంలోపే డిలీట్ చేయాల్సి ఉంటుంది కదా.. ఈ అంశంలోనే వినియోగదారులకు భారీ ఊరట కల్పించనుంది. ఈ మేరకు తాజాగా ఈ ఫీచర్లో మరో మార్పు తీసుకురానుంది. గతేడాది కొత్త ఫీచర్ "డిలీట్ ఫర్ ఎవ్రీవన్"ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా ఒక వేళ ఏదైనా మెసేజ్ పంపించాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్‌కు కాకుండా మరో గ్రూపు లేదా కాంటాక్ట్‌కు పంపించినట్లయితే ఆ మెసేజ్‌ను అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు. ఇప్పటివరకు ఇలా సెండ్ చేసిన సందేశాలను 68నిమిషాల లోపు మాత్రమే తొలగించే అవకాశం ఉంది. తాజా అప్డేట్ ప్రకారం డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ వినియోగించి మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చని వాట్సాప్‌ను మానిటర్ చేస్తున్న వాబిటెయిన్ ఇన్ఫో వెబ్సైట్ తెలిపింది. అయితే సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్న సందర్భాల్లో జరుగుతుందని వెల్లడించింది. -
‘మహానటి’ మరో డిలీటెడ్ వీడియో హల్చల్
సాక్షి, హైదరాబాద్: లెజెండరీ నటి హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ అప్రతిహతంగా దూసుకపోతోంది. అటు విమర్శకుల ప్రశంసలతోపాటు ఇటు వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన కీర్తి సురేష్ సహా, ఈ చిత్రంలో పలు కీలక భూమికను పోషించిన ఇతర నటీనటులు, చిత్ర దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడితో పాటు ఇతర సిబ్బందిపై కూడా ప్రశంసంల వర్షం కురుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే డిలిటెడ్ సన్నివేశాల వీడియోలు ఆకట్టుకుంటున్న తీరు మరో ఎత్తు. మహానటి సినిమా ఎంత సంచలన విజయాన్నిసృష్టిస్తోందో..అంతకంటే ఎక్కువగా డిలీటెడ్ సీన్లు, వీడియోలు యూట్యూబ్‌లో హల్ చేస్తున్నాయి. తాజాగా రాజేంద్రప్రసాద్, హీరోయిన్ కీర్తి సురేష్‌పై చిత్రీకరించిన ఒక ఆసక్తికర సన్నివేశం నెట్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన డిలీటెడ్ వీడియోలు, సన్నివేశాలు ఇప్పటికే పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చాలా పాటలను, సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసివేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా ఎంజాయ్ చేయండి! -
‘మహానటి’ మరో డిలిటెడ్ వీడియో విడుదల
-
అచ్చం సావిత్రిలా హావభావాలు
మహానటి చిత్రం నుంచి తొలగించిన మరో సన్నివేశాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏఎన్నార్, సావిత్రి, జమున నటించిన దొంగరాముడు(1955) చిత్రంలోని రావోయి మా ఇంటికి.. మావోయ్.. మాటున్నది మంచి మాటున్నది... పాట వీడియోను రిలీజ్ చేశారు. సావిత్రి.. ఆర్.నాగేశ్వర రావులపై చిత్రీకరించిన పాట ఇది. కీర్తి సురేష్ అచ్చు సావిత్రిలానే హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటికి నాగ్ అశ్విన్ దర్శకుడు. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
మహానటి: రావోయి మా ఇంటికి...
-
మహానటి : మిస్సమ్మ సీన్
-
మిస్సమ్మ సీన్‌ను ఎందుకు తీసేశారు?
మహానటి చిత్ర విజయాన్ని టాలీవుడ్ మొత్తం ఆస్వాదిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం నాగ్ అశ్విన్ మరియు నిర్మాతల సాహసాన్ని అభినందిస్తున్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటికి తొలి రోజు నుంచే మంచి ఆదరణ లభిస్తోంది. ఇక చిత్ర నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను మేకర్లు ఒక్కోక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. తాజాగా తమిళ మిస్సమ్మ సినిమాలోని వారాయో వెన్నిలావే (రావోయి చందమామ) సాంగ్ సీన్‌ను విడుదల చేశారు. జెమినీ గణేషన్-సావిత్రి రోల్స్‌లో దుల్కర్-కీర్తి సురేష్‌లపై చిత్రీకరించిన సీన్ ఆకట్టుకునేలా ఉంది. అయితే బాగున్న ఈ సీన్‌ను ఎందుకు తీసేశారని? సినిమాలో ఉంచాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా సాధించటంతోపాటు ఓవర్సీస్లోనూ మహానటి ప్రభంజనం కొనసాగిస్తోంది. సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న, ప్రియాంక దత్‌లు సంయుక్తంగా నిర్మించారు. -
డిలీట్ చేసినా మళ్లీ డౌన్లోడ్ చేయొచ్చు
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో మనకు ఇతరులు పంపిన ఫొటోలు, వీడియోలు తదితరాలను మనం ఒకసారి డిలీట్ చేస్తే వాటిని మళ్లీ డౌన్లోడ్ చేయడం ఇప్పటివరకు సాధ్యమయ్యేది కాదు. అయితే ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్తగా తెచ్చిన ఫీచర్‌తో ఇది సాధ్యమే. వాట్సాప్‌లో ఎవరైనా పంపిన ఫైళ్లను ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లి డిలీట్ చేసినా.. మళ్లీ ఆ ఫైల్ పంపిన వారి చాట్ విండోలోకి వెళ్లి వాటిని మరోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ వర్షన్ 2.18.106 లేదా ఆపై వర్షన్లలో ఈ అప్డేట్ ఉన్నట్లు సమాచారం. గతంలో వాట్సాప్‌లో ఒకరు పంపిన ఫైల్‌ను గ్రహీత డౌన్లోడ్ చేయగానే ఆ ఫైల్ వాట్సాప్ సర్వర్ల నుంచి డిలీట్ అయిపోయేది. ఒకవేళ గ్రహీత ఆ ఫైల్‌ను డౌన్లోడ్ చేయకపోతే గరిష్టంగా 30 రోజుల వరకు అది సర్వర్లలో ఉండేది. ఇకపై గ్రహీత ఫైల్‌ను డౌన్లోడ్ చేసినా సరే అది వాట్సాప్ సర్వర్ల నుంచి డిలీట్ అవ్వదు. కాబట్టి వినియోగదారులు ఆ ఫైల్‌ను తమ ఫోన్లో పొరపాటున డిలీట్ చేసినా మరోసారి డౌన్లోడ్ చేసుకోగలరు. -
ఫేస్బుక్ పేజీలు డిలిట్ చేసిన టాప్ సంస్థలు
-
ఫేస్‌బుక్‌కు బ్రేక్ చెప్పిన దిగ్గజాలు
డేటా బ్రీచ్ సెగ ఫేస్‌బుక్‌ను పట్టి పీడిస్తోంది. కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయించిందన్న ఆరోపణలు దుమారం మరింత ముదురుతోంది. ఇప్పటికే డిలిట్ ఫేస్బుక్ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం సోషల్ మీడియాలో కాకపుట్టిస్తోంటే.. తాజాగా టాప్ కంపెనీలు ఈ కోవలోకి చేరడం ఫేస్‌బుక్‌ను మరింత సంకోభం లోకి నెట్టివేస్తోంది. తాజాగా మొజిల్లా, టెస్లా, స్పేస్ఎక్స్ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఫేస్‌బుక్‌ను గుడ్ బై చెపుతున్నాయి. ముఖ్యంగా లక్షలాది ఫాలోవర్లు ఉన్న టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల ఫేస్బుక్ అకౌంట్లను తొలగించినట్టు ఎలన్ మస్క్ ప్రకటించడం కలకలం రేపింది. ఈ మేరకు ఆయన ట్విటర్లో తన అభిప్రాయాలను ట్విట్ చేశారు. ఫేస్‌బుక్‌పై ఎలన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు ఫేస్బుక్ అనేది ఒకటుందనేది తనకు తెలియందంటూ వ్యంగ్యంగా కమెంట్ చేశారు. తను గానీ, తన కంపెనీలుగానీ ఫేక్ ఎండార్స్‌లు చేయమన్నారు. మరోవైపు ఇనస్టాగ్రామ్ ఒక మేరకు పరవాలేదంటూ అభిప్రాయంగా చెప్పారు. నిజాయితీగా ఉన్నంతకాలం ఇన్‌స్ట్రాగ్రామ్ ఒకే అన్నారు. ఫేస్బుక్ ఏంటి? నేను అసలు ఫేస్బుక్ వాడను.. ఎప్పటికీ వాడనంటూ ఆయన ట్వీట్ చేశారు. . సో..ఇది తనను, తన కంపెనీలను పెద్ద దెబ్బ తీస్తుందని భావించడంలేని పేర్కొన్నారు. దీంతో గత ఏడాది రోబోల విషయంలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ..ఎలన్‌మస్క్, మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని టెక్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. పొరబాటు జరిగింది క్షమించండంటూ ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ విజ్ఞప్తి చేసినప్పటికీ 5కోట్ల వినియోగదారుల సమాచారం లీక్ అంశం రేపిన ఆగ్రహం చల్లారడంలేదు.ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వెల్లువెత్తగానే స్పేస్ఎక్స్, టెస్లా ఖాతాలను తొలగించాలంటూ ట్విటర్లో ఎలన్‌మస్క్‌ను ఆయన ఫాలోవర్లు కోరారు. దీంతో ఖాతాలను తీసేస్తున్నట్లు ఎలన్ తెలిపారు. ఫేస్బుక్లో టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల ఖాతాలను తొలగించినట్లు అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. అటు ప్రముఖ సెర్చ్ ఇంజీన్ మొజిల్లా ఫైర్ఫాక్స్ కూడా తాము ఫేస్బుక్ నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అయితే మొజిల్లా తన ఖాతాను తొలగించనప్పటికీ.. ఇకపై ఈ ఖాతా నుంచి ఎలాంటి పోస్టులు చేయబోమని తెలిపింది. ‘ఫేస్బుక్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్ ఆక్టన్ కూడా ‘ఇది ఫేస్‌బుక్‌ను డిలిట్ చేయాల్సిన సమయం’ ట్వీట్‌తో డిలీట్ ఫేస్బుక్ ఉద్యమాన్ని రగిలించిన సంగతి తెలిసిందే. కాగా 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికాకు 5కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం లీక్ ఆరోపణలతో ఫేస్‌బుక్‌కు చిక్కులు ఎదురయ్యాయి. మరోవైపు కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థలో రెగ్యులేటరీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
ఇట్స్ టైం.. డిలిట్ ఫేస్బుక్
భారీ డేటా బ్రీచ్‌తో ఇబ్బందుల్లో పడ్డ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు దెబ్బమీద దెబ్బపడుతోంది. తాజాగా ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆక్టాన్ ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. ఇక ఫేస్‌బుక్‌కు టాటా చెప్పాల్సిన సమయం(ఇట్స్ టైం.. డిలిట్ ఫేస్బుక్) అంటూ తన ఫాలోయర్స్‌ను ఉద్దేశించి బ్రియాన్ ట్విట్ చేశారు. రూ.5 కోట్ల వినియోగదారులు డేటాను విక్రయించిందన్నఆరోపణలతో ఫేస్బుక్ సతమతమవుతూండగానే ట్వీట్ మరింత దుమారాన్ని రేపుతోంది. అంతేకాదు బ్రియాన్ ట్వీట్‌తో ట్విటర్లో డిలిట్ ఫేస్బుక్ హ్యాష్‌ట్యాగ్‌కు భారీ మద్దతు లభిస్తోంది. ఆయనకు దాదాపు 21వేల మంది ట్విటర్ ఫాలోవర్స్ ఉన్నారు. 2014లోసుమారు 19 బిలియన్ డాలర్లతో వాట్సాప్‌ను ఫేస్బుక్ సొంతం చేసుకుంది. ఈ విక్రయం తరువాత ఫేస్‌బుక్‌తో కొనసాగిన బ్రియాన్ గత నెలలోనే సిగ్నల్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష రహిత సంస్థను స్థాపించడం గమనార్హం. 2018, ఫిబ్రవరిలో దీన్ని మాక్సి మార్లిన్పైక్తో కలిసి స్థాపించారు. అయితే ఫేస్‌బుక్‌తో ప్రస్తుతం బ్రియాన్ రిలేషన్ప్పై సమాచారం అందుబాటులో లేదు. మరోవైపు బ్రియాన్ ట్వీట్‌పై వాట్సాప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరీ చేసినట్టు అమెరికా, బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన కన్సల్టెన్సీకి ఫేస్బుక్ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయన్న అంశంపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా, ఐరోపా విచారణ సంస్థలు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఫేస్బుక్ క్యాపిటల్ వాల్యూ, షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. It is time. #deletefacebook — Brian Acton (@brianacton) March 20, 2018 -
ఫేస్బుక్, ట్విట్టర్లకు గుడ్ బై
బోస్టన్ : సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్ లకు ఆదరణ గణనీయంగా తగ్గిపోతోంది. మెజార్టీ యువత వాటికి దూరంగా ఉండేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంట. ఈ క్రమంలో చాలా మంది వాటికి గుడ్ బై కూడా చెబుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. బోస్టన్ కు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిపై అధ్యయనం చేసింది. వీరంతా 18 నుంచి 24 ఏళ్ల లోపు వాళ్లే(భారత్ నుంచి 40 మంది పాల్గొన్నారు). గత కొంత కాలంగా వీరంతా సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారంట. 50 శాతం మంది పూర్తిగా ఉపశమనం పొందేందుకు యత్నిస్తుండగా.. 34 శాతం మంది తమ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌లను ఇప్పటికే తొలగించేశారు. మొత్తం 41 శాతం మంది సోషల్ మీడియా ద్వారా తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఛాటింగ్ కంటే ఆన్ లైన్ షాపింగ్ కే వారు ఎక్కువ సమయం కేటాయించినట్లు చెప్పటం విశేషం. రాను రాను సోషల్ మీడియాపై యువతకు ఆసక్తి తగ్గిపోతోందని.. వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవటానికి కూడా ఆసక్తి చూపటం లేదని.. పైగా వాటి వల్ల ఎలాంటి లాభం ఉండట్లేదన్న నిర్ధారణకు వస్తున్నారని.. అందుకే వాటికి దూరమౌతున్నారనంటూ... సర్వే వివరాలను ఓరిజిన్ సీఈవో మార్క్ డెన్విక్ వెల్లడించారు. డేటింగ్ యాప్ టిండర్ లాంటి వాటికి కూడా ఆదరణ తగ్గిపోతుండగా.. అమెరికాలో మాత్రం స్నాప్ ఛాట్‌కి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని సర్వే వెల్లడించింది. -
వాట్సాప్ డిలీట్ మెసేజ్ సమయం పొడిగింపు
-
మెసేజ్ డిలీట్ చేయడానికి మరికొంత సమయం
వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ ఎవరికైనా పంపితే, ఏడు నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్ చేసేవచ్చు. ఇలా మెసేజ్‌ను డిలీట్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ పీచర్‌తో సెంటర్ తనతో పాటు రిసీవర్ వద్ద కూడా మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఏడు నిమిషాల వ్యవధి సమయాన్ని వాట్సాప్ మరింత పెంచింది. చాట్‌లో మెసేజ్‌ను డిలీట్ చేయడానికి 4,096 సెకన్ల(68 నిమిషాల 16 సెకన్ల) సమయాన్ని యూజర్లకు కేటాయించింది. అంటే వాట్సాప్ యూజర్లకు మెసేజ్ డిలీట్ చేయడానికి గంట సమయం ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అభివృద్ధి చేసిన కొత్త బీటా 2.18.69 వెర్షన్లో ఈ వ్యవధిని పెంచింది. వాట్సాప్ గురించి ఎప్పడికప్పుడు అప్డేట్స్ అందించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు తీసుకొచ్చిన ఈ ఫీచర్, ఐఓఎస్, విండోస్ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. డిలీట్ మెసేజ్ ఫీచర్ సమయాన్ని పెంచడం మాత్రమే కాక, ఈ కొత్త అప్డేట్లో స్వల్ప మార్పులు కూడా చేసింది. ఈ బీటాలోనే లాక్డ్ రికార్డింగ్, స్టికర్ ప్యాక్ డిస్ప్లే సైజ్ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. -
నకిలీ వార్తలిచ్చే సైట్లను తొలగిస్తాం: గూగుల్
న్యూయార్క్: తప్పుడు సమాచారాన్ని అందించే వెబ్సైట్లపై టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కొరడా ఝులిపించింది. నకిలీవార్తలతో పాటు యాజమాన్యం, దాని ముఖ్యోద్దేశం, సొంత దేశం తదితర వివరాలను రహస్యంగా ఉంచే వెబ్సైట్లను తమ న్యూస్ ఫీడ్ నుంచి తొలగిస్తామని గూగుల్ హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ ఆదివారం పలు మార్గదర్శకాలు విడుదలచేసింది. ‘మీ గురించి లేదా మీ ఉద్దేశం గురించి తప్పుడు వివరాలు అందజేయవద్దు. మా న్యూస్ ఫీడ్‌లో ఉండే సైట్లు వినియోగదారుల్ని తప్పుదారి పట్టించడాన్ని అంగీకరించం’ అని గూగుల్ చెప్పింది. -
మెసేజ్ డిలీట్ చేసినా చదవొచ్చు.. ఎలాగంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ లో ఇటీవల వచ్చిన డిలీట్ ఫర్ ఎవ్రి వన్ ఫీచర్ అసలు పూర్తి స్థాయిలో పని చేస్తుందా?. యూజర్లు పొరపాటున పంపిన సందేశాలు రిసీవర్లు (మెసేజ్ పొందినవారు) చదివేలోగా డిలీట్ చేయవచ్చునంటూ డిలీట్ ఫర్ ఎవ్రి వన్ అంటూ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చినా ప్రయోజనం లేదని తెలుస్తోంది. తొలుత వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా సెండర్, రిసీవర్ ఇద్దరూ యాప్‌ను అప్డేట్ చేసుకున్న వారై ఉండాలి. కేవలం ఒకరు మాత్రమే యాప్ అప్డేట్ చేసుకున్నా ప్రయోజనం ఉండదని కంపెనీ హెచ్చరించింది. కానీ మరో విధంగా మెస్సేజ్ రిసీవింగ్ నెటిజన్ సెండర్ పంపిన సందేశాలను తెలుసుకునే ఛాన్స్ ఉంది. అదేలా అంటే.. ముందుగా ఆ యూజర్ తమ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'నోటిఫికేషన్ హిస్టరీ లాగ్' అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ మన ఫోన్లో ఉంటే వాట్సప్‌లో మనకు పంపి, డిలీట్ చేసిన సందేశాలను చదవవచ్చు. వాట్సప్‌లో పంపించే మెసేజ్‌లు నోటిఫికేషన్స్ రూపంలో అవతలి వ్యక్తి దృష్టికి తీసుకెళ్తాయి. అలా ఒక్కో మెసేజ్లోని తొలి 100 ఇంగ్లీష్ క్యారెక్టర్స్ నోటిఫికేషన్ హిస్టరీ లో స్టోర్ అవుతాయి. వాట్సప్ నోటిఫికేషన్స్ ని డిసేబుల్ చేయనంత వరకు ఈ విధంగా డిలీట్ చేసిన సమాచారాన్ని చదవే అవకాశం ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ 7.0, ఆ తర్వాత వచ్చిన అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రమే మీకు ఇతరులు పంపి, డిలీట్ చేసిన సందేశాలు చూసుకోవచ్చు. డిలీట్ చేసిన మెసేజ్‌ను పై చిత్రంలో చూడవచ్చు -
అందుబాటులోకి వాట్సాప్ డిలీట్ మెసేజ్
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో పొరపాటున ఎవరికైనా తప్పుడు మెసేజ్ పంపారా? ఇకపై అలాంటి వాటిని మీరు సరిదిద్దుకోవచ్చు. తప్పుగా పంపిన సందేశాలను గ్రహీతకు కనిపించకుండా డిలీట్ చేసే సదుపాయాన్ని వాట్సాప్ మంగళవారం అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానంలో మనం ఏదైనా మెసేజ్‌ను సెలక్ట్ చేసుకుని డిలీట్ బటన్ నొక్కగానే ‘డిలీట్ ఫర్ మి’, ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మొదటి ఆప్షన్‌ను ఎంచుకుంటే సందేశం మన ఫోన్లో మ్రాతమే డిలీట్ అవుతుంది. రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటే మెసేజ్ ఎవరికి పంపామో వారికి కూడా కనిపించకుండా పోతుంది. అయితే అవతలి వ్యక్తి ఫోన్లో ఆ సందేశం స్థానంలో ‘దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్’ అని చూపిస్తుంది. అంటే మనం మెసేజ్ పంపి, ఆ తర్వాత డిలీట్ చేశామని ఆ వ్యక్తికి స్పష్టంగా తెలిసిపోతుంది. సందేశం పంపిన ఏడు నిమిషాల్లోపు మాత్రమే డిలీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటు కోసం వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. -
శాశ్వతంగా ఫేస్ బుక్ డిలీట్ చేయడం ఇలానే...
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్బుక్ నుంచి వైదొలుగుద్దామని నిర్ణయించుకున్నారా? శాశ్వతంగా ఫేస్ బుక్ అకౌంట్‌ను డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫేస్ బుక్ డిలీట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్‌ను ఫాలో అయితే అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేసేయొచ్చట. డిలీట్ చేసిన అకౌంట్‌ను మళ్లీ రీ-యాక్టివేట్ చేసుకోవడానికి కూడా వీలుపడదట. ఈ ప్రక్రియతో మీరు షేర్ చేసిన ప్రొఫైల్ తో సహా మొత్తం శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి. శాశ్వతంగా ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చేసే పద్ధతి: స్టెప్ 1: ఫేస్ బుక్ లోకి లాగిన్ అయి, సెట్టింగ్స్ కు వెళ్లాలి. స్టెప్ 2: జనరల్ అకౌంట్ సెట్టింగ్స్ లో కిందుండే కాఫీ ఆఫ్ ఆల్ యువర్ ఫేస్ బుక్ డేటా 'డౌన్ లోడ్' ఆప్షన్ ను క్లిక్ చేయాలి. స్టెప్ 3: https://www.facebook.com/help/delete_account లింక్ లోకి వెళ్లాలి, డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. స్టెప్ 4: ఒక్కసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి, తుది ఆమోదం కోసం క్యాప్చా కోడ్ ఓ ఇమేజ్ రూపంలో డిస్ ప్లే అవుతోంది. ఫైనల్ గా ఫేస్ బుక్ మీ అకౌంట్ ను డిలీట్ చేస్తున్నట్టు నోటిఫై చేస్తోంది. 14 రోజుల లోపల మీ అకౌంట్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఈ 14 రోజుల్లో మీకు ఫేస్ బుక్ అకౌంట్ ను డిలీట్ చేసుకోవాలనిపించకపోతే, వెంటనే ఫేస్ బుక్ లోకి లాగిన్ అయి డిలీట్ రిక్వెస్ట్ ను క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఛాన్స్ ఉండదు. 90 రోజుల్లో మీరు పోస్టు చేసిన అన్ని పోస్టులు, ఫోటోలు, స్టేటస్ అప్ డేట్లు అన్నింటిన్నీ కంపెనీ శాశ్వతంగా డిలీట్ చేసేస్తుంది. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
అచ్చంపేట రూరల్ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సెప్టెంబర్ 1న సీపీఎస్ జీఓ వచ్చిన రోజని ఆ రోజున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించాలని కోరారు. సార్వత్రిక సమ్మెకు తమ మద్ధతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, శ్రీనివాస్, మక్బూల్అలీ, వెంకటేష్, రఘునాథ్‌రెడ్డి, అష్రఫ్, శంకర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
చెరిపేయండి... శాశ్వతంగా!
పీసీలోంచి ఫైళ్లు తొలగించాలంటే మీరు ఏం చేస్తారు? ఆ... ఏముంది.. ట్రాష్‌లో పడేస్తేసరి అంటున్నారా? బాగానే ఉంటుంది కానీ దీనిద్వారా ఫైల్ పూర్తిగా తొలగిపోదు!! హార్డ్డ్రై వ్‌లో ఎక్కడో ఓ మూలన అలాగే పడి ఉంటుంది. కాలం గడిచేకొద్దీ ఇలాంటి చెత్త అంతా పేరుకుపోయి... పీసీ నత్తనడకన నడవడం మొదలవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎంచక్కా ఈ పద్ధతులు పాటించండి! ట్రాష్‌లో పడేసి, క్లీన్ చేసిన ప్రతిసారి హమ్మయ్యా.. కొంత చెత్త వదిలించుకున్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మన పని సగమే అయినట్లు లెక్క. ఎందుకంటే ట్రాష్‌ను క్లీన్ చేసినప్పుడు ఫైల్ తాలూకూ వర్చువల్ పాథ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఫైల్ అలాగే స్టోర్ అవుతుంది. కొంచెం కష్టమైనప్పటికీ వీటిని మళ్లీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. మామూలు ఫైళ్ల విషయంలో ఫర్వాలేదేమోగానీ.... సున్నితమైన వివరాలున్న ఫైళ్ల విషయంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరం. ఈ సమస్యను అధిగమించేందుకు అదే ఫైల్‌పై మళ్లీ సమాచారాన్ని స్టోర్ చేయడం ఒక్కటే మార్గం. కానీ ఇది చేతులతో చేసే పని కాదు. మార్కెట్లో ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటివి ఏమేమి ఉన్నాయో, అవెలా పనిచేస్తాయో చూడండి... ఇరేజర్... ఈ సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే కంప్యూటర్ల కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తరువాత డిలీట్ చేయాల్సిన ఫైల్‌పై రైట్ క్లిక్ చేస్తే చాలు... కనిపించే ఆప్షన్లలో ఇరేజర్ ఐకాన్‌ను ఎంచుకోవడం ద్వారా ఫైల్‌ను శాశ్వతంగా చెరిపేయవచ్చు. ఒక్కో ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయవచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా ట్రాష్‌లో పడేసే ప్రతిఫైల్‌ను ఇలా ఓవర్‌రైట్ చేసి డిలీట్ చేసేలా ఇరేజర్ను ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సీసీ క్లీనర్... దీని గురించి మీరు వినే ఉంటారు. హార్డ్‌డిస్క్‌లో స్పేస్‌ను ఆదా చేసేందుకు తరచూ వాడే సాఫ్ట్వేర్ ఇది. సాధారణ పద్ధతుల్లో ఫైళ్లను డిలీట్ చేసిన తరువాత వాటిని గుర్తులను చెరిపేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్వేర్. పీసీలో నిర్దిష్టంగా ఫలానా ప్రాంతాల్లోని అనవసరమైన ఫైళ్లను ఓవర్‌రైట్ చేయమని సూచించే అవకాశం ఉంటుంది సీసీక్లీనర్ సాఫ్ట్‌వేర్‌తో. దీంట్లోనూ ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. సోర్స్ ఎమ్టీ ట్రాష్.. ఈ సాఫ్ట్వేర్ ఆపిల్ కంప్యూటర్ల కోసం ఉద్దేశించింది. కొనుక్కున్నప్పుడే ట్రాష్ బిన్‌కు అనుసంధానంగా ఏర్పాటై వస్తుంది. కాకపోతే ఫైల్స్ ట్రాష్‌లో పడేసిన తరువాత ఫైండర్ ఆప్షన్‌లోకి వెళ్లి సెక్యూర్ ఎమ్టీ ట్రాష్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. హార్డ్‌డ్రైవ్ మొత్తాన్ని ఓవర్‌రైట్ చేయాలనుకుంటే డిస్క్ యుటిలిటీ ఆప్‌లోకి వెళ్లి ఇరేజ్ అప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత ‘సెక్యూరిటీ ఆప్షన్’ను సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేస్తే సరి. విండోస్, ఆపిల్ పీసీలు రెండింటిలోనూ ట్రాష్బిన్ను పూర్తిగా పక్కనబెట్టి ఫైళ్లను డిలీట్ చేయాలంటే ఫైల్ ష్రెడ్డర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఫైళ్లను ఓవర్‌రైట్ చేసి శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. ఒక ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది సాఫ్ట్‌వేరే నిర్ణయించుకుంటుంది.