Instagram Suspends Singer Chinmayi Sripada's Account - Sakshi
Sakshi News home page

Chinmayi Sripada: కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం!

Published Fri, Jun 24 2022 4:27 PM | Last Updated on Fri, Jun 24 2022 4:49 PM

Instagram Suspends Singer Chinmayi Sripada Account - Sakshi

కవలకు జన్మినిచ్చిన మరుసటి రోజే సింగర్‌ చిన్మయికి ఇన్‌స్టాగ్రామ్‌ షాకిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ పాలసీలకు విరుద్ధంగా తన పోస్టులు ఉన్నాయనే రిపోర్డ్స్‌ అందడంతో ఇన్‌స్టాగ్రామ్‌ తన అకౌంట్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని చిన్మయి స్వయంగా వెల్లడించింది. కాగా బుధవారం(జూన్‌ 22) చిన్మయి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా తెలిపింది. ఈ క్రమంలో చాలామంది ఆమెకు శుభకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు ఆమె ప్రెగ్రెన్సీపై ఆసభ్యకర మెసెజ్‌లు, కామెంట్స్‌తో ట్రోల్‌ చేశారు.

చదవండి: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి

ఈ క్రమంలో కొందరు ఆమెకు ఆసభ్యకరమైన ఫొటోలను కూడా పోస్ట్‌ చేశారు. ఇదే విషయమై ఇన్‌స్టాగ్రామ్‌ ఆమె అకౌంట్‌ను రద్దు చేసినట్లు చిన్మయి చెప్పింది. తన బ్యాకప్‌ అకౌంట్‌(కొత్త ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌), ట్విటర్‌ ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలిపింది. ఈ మేరకు చిన్మయి పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘నా ఇన్‌స్టా అకౌంట్‌ను డిలిట్‌ చేశారు. ‘నా అకౌంట్‌లో న్యూడ్‌ ఫొటో పోస్ట్‌ చేసి.. పైగా నాపై రిపోర్ట్‌ చేశారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ నా అకౌంట్‌ను రద్దు చేసింది. అయితే ఇంతకు ముందే తరచూ అబ్బాయిలు నాకు న్యూడ్ ఫోటోలు మెసేజ్ చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌కు కంప్లయింట్ చేశాను. 

చదవండి: అన్‌స్టాపబుల్‌: రెండో సీజన్‌ తొలి గెస్ట్‌ ఆ స్టార్‌ హీరోనట!

కానీ దీనిపై చాలామంది రిపోర్ట్‌ చేయడంతో తన అకౌంట్‌ను తిసేశారఇది నా కొత్త అకౌంట్‌.. చిన్మయి.శ్రీపాద(chinmayi.sripada)’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా తన ఇన్‌స్టా‍గ్రాం వేదికగా చిన్మయి సమాజంలో అమ్మాయిలు, మహిళలకు ఎదురవుతున్న పలు సమస్యల మీద గళం వినిపించేది. ఎదురుదెబ్బలతో ధైర్యం కొల్పోయిన మహిళలకు ధైర్యం నింపేది. యువతుల సమస్యలకు పరిష్కారం ఇచ్చేది. ఈ నేపథ్యంలో తనను చాలా మంది ట్రోల్ చేస్తున్నారని చిన్మయి కొంత కాలంగా చెబుతూ వస్తుంది. కానీ ఆమె అకౌంట్‌ను ఇలా రద్దు చేయడంతో చిన్మయి ఫాలోవర్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement