ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిన హీరో విశ్వక్ సేన్.. అదే కారణమా? | Actor Vishwak Sen Deletes Instagram Account | Sakshi
Sakshi News home page

Vishwak Sen: అ గొడవ వల్లే విశ్వక్ సేన్ ఇలా చేశాడా?

Jun 28 2024 2:18 PM | Updated on Jun 28 2024 2:44 PM

Actor Vishwak Sen Deletes Instagram Account

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ షాకింగ్ పనిచేశాడు. ఎప్పుడు తన ఇన్ స్టా ఖాతాని డిలీట్ చేశాడు. ట్విట్టర్‌ ఖాతా కనిపిస్తుంది గానీ ఇన్ స్టాలో సెర్చ్ చేస్తుంటే ఇతడి అధికారిక అకౌంట్ కనిపించడం లేదు. ఒకవేళ ప్రైవేట్‌లో పెట్టున్నా సరే కనీసం కనిపించేది కానీ పూర్తిగా ఖాతానే చూపించట్లేదు. దీంతో డిలీట్ చేశాడనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)

ఇప్పుడు యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాల అప్డేట్స్ దగ్గర నుంచి మీమ్స్‌ని స్టోరీలో పెట్టడం వరకు బాగానే ట్రెండ్ ఫాలో అవుతుంటాడు. అలాంటిది రీసెంట్‌గా 'కల్కి' ట్రైలర్ చూసి ఓపెనియన్ నెగిటివ్‌గా చెప్పాడని ఓ యూట్యూబర్‌తో సోషల్ మీడియాలో గొడవ పెట్టుకున్నాడు. ఒకటి రెండు రోజులు ఇది చర్చనీయాంశంగా మారింది.

ఈ వివాదంతో పాటు రీసెంట్‍‌గా విశ్వక్ సేన్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీపై కూడా విమర్శలు వచ్చాయి. బహుశా ఈ కారణంగానే ఇన్ స్టాకి దూరమయ్యాడా అనిపిస్తుంది. అయితే ట్విట్టర్ ఖాతా మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. మరి పూర్తిగా ఇన్ స్టాకి దూరమైపోతాడా లేదా కొన్నిరోజులు ఆగి వస్తాడా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: మరో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న హీరో ఆమిర్ ఖాన్.. ఎన్ని కోట్ల ఖరీదంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement