instagram accounts
-
అమ్మానాన్న బొమ్మను రక్తంతో గీసి...
యాక్రలిక్, ఆబ్స్ట్రాక్ట్, పాప్ ఆర్ట్, పెయింటర్లీ, వాటర్ కలర్, ఆయిల్ పెయింట్, పేస్టల్స్ కాదేదీ పెయింటింగ్‌కు అనర్హం అన్నట్లు... విచిత్రంగా రక్తంతో బొమ్మలు గీసి ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.. నగరానికి చెందిన అనిల్ కుమార్. కొందరు కాన్వాస్‌పై యాక్రిలిక్‌తో అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తే మరికొందరు మట్టిముద్దలతో శిల్పాలను రూపొందిస్తున్నారు.. ఇటీవల ఈ క్రియేటివిటీ మరింత పెరగడంతో ఒక్కొక్కరూ ఒక్కో వైవిధ్యమైన రీతిలో కళాకారులు మ్యాజిక్ చేస్తున్నారు. నగరానికి చెందిన యువ చిత్రకారుడు అనిల్ కుమార్ దీని కోసం బ్లడ్‌ను ఉపయోగిస్తూ... ‘రక్త’ సంబంధాలను సరికొత్తగా పునర్నిర్వచిస్తున్నాడు. అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. బ్లడ్ ఆర్ట్ అనే పదం వినడానికి ప్రత్యేకంగా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే ‘బ్లడ్ పెయింటింగ్ భావోద్వేగాలను పంచుకునేందుకు సాటిలేని మార్గం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ప్రేమికులు...తమ మధ్య ఉన్న బలమైన సంబంధాలను తెలియజెప్పేందుకు ఓ శక్తివంతమైన సాధనమని’ అనిల్ అంటున్నాడు. దైవకృపతో అబ్బిన కళ... దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అనిల్ కుమార్‌కు ఎటువంటి చదువు, సాధన లేకుండా చిత్రకళ అబ్బింది...అతని కళాత్మక ప్రయాణం 2019లో బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా ప్రారంభమైంది. ‘చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీయడం హాబీ..అలా అలా పోట్రెయిట్స్ గీయడం అలవాటైంది. బీటెక్ పూర్తి చేసినా ఏదో ఒక ఉద్యోగంలో ఇమడలేక పోట్రెయిట్ (పెన్సిల్ స్కెచింగ్) కళలో ప్రావీణ్యం సంపాదించాను. అప్పుడు నేను పెన్సిల్స్ (మైక్రో ఆర్ట్) మీద పేర్లు చెక్కడం ప్రారంభించాను’ అని అనిల్ చెప్పాడు. అయితే ఫేస్ డ్రాయింగ్లు మైక్రో ఆర్ట్ ద్వారా ప్రొఫెషనల్ అనిపించుకున్నప్పటికీ సరైన ఆర్డర్స్ లేక ఏదో ఒక ఉద్యోగం చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమ్మాయి ‘కళ్ల’తో పుట్టిన కళ... బెంగుళూర్‌కు చెందిన మైక్రో ఆర్ట్ కస్టమర్ తన సోదరి కళ్లను తన రక్తంతో గీయమని అడిగారు. ‘తొలుత నేను ఒప్పుకోలేదు. బాగా రిక్వెస్ట్ చేయడంతో చేసిన ఆ వర్క్‌ని నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే బాగా రీచ్ వచ్చింది. అయినా అప్పుడు కూడా బ్లడ్ ఆర్ట్‌ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత మా అమ్మానాన్నల మ్యారేజ్ డే రోజున నా రక్తాన్ని ఉపయోగించి వారిద్దరి చిత్రాలనూ గీశాను. అది వారి మనసుకు హత్తుకోవడం మాత్రమే కాదు నా భవిష్యత్తును మార్చేసింది’ అని అనిల్ గుర్తు చేసుకున్నాడు. దేశవిదేశాల నుంచి... అమ్మానాన్నల బొమ్మ గీసిన వీడియోను అనిల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారి 2.7 మిలియన్ల వీక్షణలు దక్కించుకుంది. దేశవిదేశాల నుంచి బ్లడ్ ఆర్ట్ గురించి సంప్రదింపులు మొదలయ్యాయి. వేలాది మంది తమ ప్రియమైన వారి బ్లడ్ పెయింటింగ్స్ కోసం నాకు మెసేజ్ చేయడం ప్రారంభించారు. ‘దాంతో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనీసం కొన్ని వారాల పాటు సమయం తీసుకోవాల్సి వస్తోంది’ అని అనిల్ చెప్పాడు. జాగ్రత్తలు తప్పనిసరి..‘ఈ మాధ్యమాన్ని ఉపయోగించి చిత్రాలు గీసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే ప్రభావితమయ్యే మొదటి వ్యక్తి చిత్రకారుడే.. కాబట్టి.. గ్లవ్స్, మాస్క్ ధరించడం వంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి’ అని అనిల్ కుమార్ స్పష్టం చేశాడు. రక్తాన్ని సేకరించడం నుంచి గోడపై కళాకృతిని అలంకరించడం వరకూ... ప్రతీది కఠినమైన పరిశుభ్రతతో జరుగుతుందని చెప్పాడు. తమకు కావాల్సిన పోట్రెయిట్‌ను గీయించుకోవాలనుకున్న కస్టమర్స్... అనుభవజ్ఞులైన ల్యాబ్ టెక్నీషియ సాయంతో చిన్న ట్యూబ్ ద్వారా సేకరించిన బ్లడ్ (సుమారు 3 నుంచి 4గ్రా) అనిల్‌కు అందిస్తారు. దానిని కనీసం వారం రోజుల వరకూ భద్రంగా నిల్వచేసే అవకాశం ఉంటుంది. రోజుకు ఒక పోర్ర్టెయిట్ను మాత్రమే పూర్తి చేస్తున్నానని అనిల్ చెబుతున్నాడు. కస్టమర్ తీసుకెళ్లేవరకూ దుర్వాసన లేదా తేమను గ్రహించకుండా ఆర్ట్‌వర్క్‌ను సంరక్షించడానికి ఫిక్సేటివ్ స్ప్రేని ఉపయోగిస్తామన్నాడు. ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతితో వేసిన సిసలైన చిత్రకళ అస్తిత్వం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితుల్లో ‘ఏఐ కూడా రీ క్రియేట్ చేయలేని బ్లడ్ ఆర్ట్ భవిష్యత్తులో మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది’ అంటున్నాడు అనిల్. -
ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిన హీరో విశ్వక్ సేన్.. అదే కారణమా?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ షాకింగ్ పనిచేశాడు. ఎప్పుడు తన ఇన్ స్టా ఖాతాని డిలీట్ చేశాడు. ట్విట్టర్ ఖాతా కనిపిస్తుంది గానీ ఇన్ స్టాలో సెర్చ్ చేస్తుంటే ఇతడి అధికారిక అకౌంట్ కనిపించడం లేదు. ఒకవేళ ప్రైవేట్‌లో పెట్టున్నా సరే కనీసం కనిపించేది కానీ పూర్తిగా ఖాతానే చూపించట్లేదు. దీంతో డిలీట్ చేశాడనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)ఇప్పుడు యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాల అప్డేట్స్ దగ్గర నుంచి మీమ్స్‌ని స్టోరీలో పెట్టడం వరకు బాగానే ట్రెండ్ ఫాలో అవుతుంటాడు. అలాంటిది రీసెంట్గా 'కల్కి' ట్రైలర్ చూసి ఓపెనియన్ నెగిటివ్‌గా చెప్పాడని ఓ యూట్యూబర్‌తో సోషల్ మీడియాలో గొడవ పెట్టుకున్నాడు. ఒకటి రెండు రోజులు ఇది చర్చనీయాంశంగా మారింది.ఈ వివాదంతో పాటు రీసెంట్గా విశ్వక్ సేన్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీపై కూడా విమర్శలు వచ్చాయి. బహుశా ఈ కారణంగానే ఇన్ స్టాకి దూరమయ్యాడా అనిపిస్తుంది. అయితే ట్విట్టర్ ఖాతా మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. మరి పూర్తిగా ఇన్ స్టాకి దూరమైపోతాడా లేదా కొన్నిరోజులు ఆగి వస్తాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మరో లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న హీరో ఆమిర్ ఖాన్.. ఎన్ని కోట్ల ఖరీదంటే?) -
ఫాలోవర్లు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..
టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో అందరూ ఈజీగా ఫేమస్ కావాలనుకుంటున్నారు. దానికోసం ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటున్నారు. అందులో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. దాదాపు ప్రతిఒక్కరు ఈ యాప్‌ను వాడుతున్నారు. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపార, వృత్తి పరమైన అంశాలను పంచుకోవడానికి ఇదో వేదికగా మారింది. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండడం అనేది ఒక గొప్ప అంశంగా పరిగణిస్తున్నారు. కొంతమంది తమని తాము ఎక్కువ మందికి పరిచయం చేసుకోవడానికి ఫాలోవర్లను పెంచుకుంటే, కంపెనీలు, బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి, సెలెబ్రెటీలు తమ అభిమానులకు చేరువలో ఉండడానికి ఇలా ఎవరికి వారు ఇందులో ఫాలోవర్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి, అందులో ఫేమస్ అవ్వడానికి ఉన్న మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అకౌంట్ ఆప్టిమైజేషన్ అకౌంట్‌కు ఏదో ఒక పేరు పెట్టేసి, నాలుగు మాటలు రాసేసి, ఒక ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా అప్లోడ్ చేస్తే సరిపోదు. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్‌గా అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. బయోలో మీ గురించి లేదా మీ బ్రాండ్ గురించి ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను రాయాలి. ఒకవేళ ఏదైనా బ్రాండ్ గురించి ప్రమోట్ చేయాలంటే అందుకు సంబందించిన లింక్‌ను బయో, హోమ్ పేజీలో ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్ల వాడకం మీ అకౌంట్‌ను రిప్రజెంట్ చేసేలా మంచి హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అసాధారణమైన హ్యాష్ ట్యాగ్ మీకంటూ ఒక గుర్తింపుని తీసుకువస్తుంది. మీ ఆలోచనలను తెలియచెప్పడానికి హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగిస్తే, అవి మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తాయి. ఎంత క్రియేటివిటీ ఉన్నా దాన్ని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఎక్కువ మంది ఫాలోవర్లు రారనే విషయాన్ని గమనించాలి. కచ్చితమైన సమయంలో.. రోజులో ఏ సమయానికి పోస్ట్‌లు అప్లోడ్ చేయాలి.. ఎలాంటి సందర్భంలో ఎలాంటి పోస్టులు పెట్టాలి అనే ఒక నిర్దేశిత క్యాలెండరు ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని పోస్టులు పెడుతున్నారనే దానికంటే ఏ టైమ్‌లో పెడుతున్నాం అనేదే ముఖ్యం. మీ ఫాలోవర్లు ఎలాంటి సమయాల్లో పోస్టులు ఎక్కువగా చూస్తారో, ఎలాంటి పోస్టులు ఇష్టపడతారో ఒక సర్వే చేయాలి. వాటి ఆధారంగా పోస్టులని క్రియేట్ చేయాలి. లైవ్ వీడియోస్ చాలా మంది ఫొటోలు పోస్ట్ చేస్తున్నాం కదా, వీడియోస్ ఎందుకులే అనే ధోరణిలో ఉంటారు. వీటితోనే ఫాలోవర్లను పెంచుకుందాం అనుకుంటారు. మారుతున్న ప్రపంచంలో ఎక్కువ శాతం యూజర్లు వీడియోస్‌కే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వీడియోస్, లైవ్ వీడియోస్ , స్టోరీలను అప్లోడ్ చేయాలి. ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..! కంటెంట్‌పై దృష్టి కొంతమంది తమ బ్రాండ్‌ను పాపులర్ చేయాలనే క్రమంలో ఫాలోవర్లు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోరు. అలాంటి సందర్భాల్లో కొత్త ఫాలోవర్లు రాకపోగా, ఉన్న ఫాలోవర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి, మీ ఫాలోవర్లు ఎలాంటి కంటెంట్‌ను ఎక్కువ ఇష్టపడుతున్నారో రీసెర్చ్ చేయాలి. దానికి అనుగుణంగా మీరు కంటెంట్‌పై దృష్టి సారించాలి. ట్రెండింగ్ విషయాల గురించి పోస్టులు పెట్టాలి. -
నెలవారీ 10కోట్ల యూజర్లను సంపాదించిన సంస్థ!
మెటా సంస్థలో భాగంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ నెలవారీగా దాదాపు 100 మిలియన్ల(10కోట్లు) వినియోగదారులను చేరుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఇటీవల కంపెనీ త్రైమాసిక ఆదాయాల గురించి మాట్లాడుతున్నపుడు ఈ విషయాన్ని చెప్పారు. సానుకూలంగా సంభాషణలు సాగించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ టూల్‌ను తీసుకొచ్చిందన్నారు. ఇన్స్టాథ్రెడ్లు రానున్న రోజుల్లో మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయని మెటా సీఎఫ్ఓ సుసాన్ లి అన్నారు. ఇన్స్టాగ్రామ్ వార్తలకు వ్యతిరేకం కాదని, సంబంధిత ప్లాట్ఫామ్లో థ్రెడ్లు వార్తలను విస్తరించట్లేదని ఇన్‌స్టా ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎక్స్(ట్విటర్)కు పోటీగా మెటా ఇన్స్టాథ్రెడ్లను జులైలో ప్రారంభించింది. -
ఇన్స్టాగ్రామ్ డౌన్ - ఫన్నీ పోస్ట్‌లతో చెలరేగిపోతున్న నెటిజన్లు
Instagram Down: మెటా యాజమాన్యంలో ఉన్న 'ఇన్స్టాగ్రామ్' (Instagram) మళ్లీ డౌన్ అయింది. ఈ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 56 శాతం మంది వినియోగదారులు ఈ అంతరాయం వల్ల ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. డౌన్ డిటెక్టర్ నివేదికల ప్రకారం.. ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు లాగిన్ అవ్వడం, ఫోటో అండ్ వీడియో షేరింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ డౌన్లోడ్ చేయడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను ఎంత మంది ఎదుర్కొన్నారు అనేదాని మీద ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఇది సుమారు 2 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ని యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నామని ట్విట్టర్లో ట్వీట్ చేస్తూనే ఉన్నారు. me thinking my account is hacked cause instagram down AGAIN 🤦🏾♂️ pic.twitter.com/GG0y0OYm3m — Jay-Wuan© (@__jaywuan) June 9, 2023 ఇన్స్టాగ్రామ్ డౌన్ కావడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాదిలో ఇది రెండవ సారి కావడం గమనార్హం. 2023 మార్చి నెలలో కూడా ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు కూడా వేలాదిమంది ఇన్స్టాగ్రామ్ వినియోగించడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఏర్పడిన అంతరాయానికి గల కారణాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది. Here we go again #instagramdown pic.twitter.com/EDT9FKtJXZ — z (they/them) (@ryzuknife) June 9, 2023 -
విజయ్ దళపతి 99 నిమిషాల్లో సరికొత్త రికార్డు
-
లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ని వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ కోట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో చాలామంది ఇందులో సమయ గడిపే వారు కూడా ఉన్నారు. అయితే ఓ విద్యార్థి మాత్రం ఇన్‌స్టాని వాడడంతో అందులో బగ్ ఉన్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని కంపెనీకి తెలియజేసి లక్షల రివార్డ్ గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన విద్యార్థి నీరజ్ శర్మ.. తన ఫోన్లో ఇన్‌స్టా వాడుతుండగా అందులో ఓ బగ్ ఉన్నట్లు గుర్తించాడు. అదేంటంటే.. అవతలి యూజర్ లాగిన్, పాస్వర్డ్ లేకుండా అతని ఖాతాలోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ థంబ్‌నైల్స్ మార్చేందుకు ఈ బగ్ అనుమతిస్తోంది. దీంతో శర్మ ఈ విషయాన్ని జనవరిలో కంపెనీకి తెలియజేశాడు. ఇందుకు స్పందనగా.. ఈ బగ్‌కు సంబంధించిన డెమో వీడియోను పంపాలని కంపెనీ శర్మను కోరింది. బగ్ ఎలా పనిచేస్తుందనే తెలిపే 5 నిమిషాల డెమో వీడియోని చిత్రీకరించి అతను కంపెనీకి పంపాడు. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, ఫేస్బుక్ శర్మకి $45,000 రివార్డ్‌ను ప్రకటించింది (అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 38 లక్షలు). అంతేకాకుండా రివార్డ్‌ని నాలుగు నెలలు ఆలస్యం చేసినందుకు కూడా $4500 అంటే రూ.3.6 లక్షలు ఆఫర్ చేసింది. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
సమంత ఇన్‌స్టాలో కేటీఆర్ పోస్ట్, షాక్‌లో ఫ్యాన్స్, సామ్ టీం క్లారిటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్స్‌తో పంచుకోవడమే కాదు జీవితానికి సంబంధించిన కోట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక విడాకుల అనంతరం ప్రతి విషయంపై నెట్టంట స్పందించింది సామ్. దీంతో ఆమె పోస్ట్స్‌పై ఆసక్తి నెలకొంది. అప్పటి నుంచి సమంత ఏ పోస్ట్ షేర్ చేసిన అది వార్తల్లోకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన ఓ పోస్ట్ అందరికి షాకిచ్చింది. ఎప్పుడు తన సినిమాల అప్డేట్స్, సామాజీక అంశాలు, ఎమోషనల్ కొట్స్, తన పెట్స్‌కు సంబంధించిన ఫొటోల షేర్ చేస్తూ అవే లోకంగా ఉండే సామ్ తొలిసారి రాజకీయాలకు సంబంధించిన పోస్ట్ పెట్టింది. అది కూడా కేటీఆర్ ఫోటో షేర్ చేస్తూ.. ‘నా ప్రజలే నా బలం, నా ధైర్యం, నా నమ్మకం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసి ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏంటీ.. సమంత రాజకీయాలపై స్పందించింది అంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. అంతేకాదు ‘ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నావా? సామ్’ అంటూ ఆమెను అంతా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్‌పై సామ్ డిజిటల్ మేనేజర్ శేషాంక బినాష్ స్పందించింది. ఇది సమంత చేసిన పోస్ట్ కాదని, సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని స్పష్టం చేసింది. ‘టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే ఇలా జరిగింది. ఒక గ్రూప్‌లో పోస్ట్ చేయాల్సిన పోస్ట్ సమంత గ్రూప్‌లో యాడ్ అయ్యింది. మేం ఈ పోస్ట్ ఎవరూ చేశారనే దానిపై ఆరా తీస్తున్నాం. దీనిపై మా ఇన్స్టాగ్రామ్ టీంతో చర్చిస్తున్నాం. వారు ఎవరో తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండ జాగ్రత్తగా ఉంటాం. మీకు అసౌకర్యం, కన్ప్యూజన్ కలిగించినందుకు క్షమాపణలు’ అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఇక ఇదే పోస్ట్‌ను స్క్రీన్ షాట్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఫ్యాన్స్‌తో పంచుకుంది. -
కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం!
కవలకు జన్మినిచ్చిన మరుసటి రోజే సింగర్ చిన్మయికి ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. ఇన్స్టాగ్రామ్ పాలసీలకు విరుద్ధంగా తన పోస్టులు ఉన్నాయనే రిపోర్డ్స్ అందడంతో ఇన్స్టాగ్రామ్ తన అకౌంట్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని చిన్మయి స్వయంగా వెల్లడించింది. కాగా బుధవారం(జూన్ 22) చిన్మయి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ క్రమంలో చాలామంది ఆమెకు శుభకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు ఆమె ప్రెగ్రెన్సీపై ఆసభ్యకర మెసెజ్‌లు, కామెంట్స్‌తో ట్రోల్ చేశారు. చదవండి: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి ఈ క్రమంలో కొందరు ఆమెకు ఆసభ్యకరమైన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఇదే విషయమై ఇన్స్టాగ్రామ్ ఆమె అకౌంట్‌ను రద్దు చేసినట్లు చిన్మయి చెప్పింది. తన బ్యాకప్ అకౌంట్(కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్), ట్విటర్ ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలిపింది. ఈ మేరకు చిన్మయి పోస్ట్ షేర్ చేస్తూ.. ‘నా ఇన్‌స్టా అకౌంట్‌ను డిలిట్ చేశారు. ‘నా అకౌంట్లో న్యూడ్ ఫొటో పోస్ట్ చేసి.. పైగా నాపై రిపోర్ట్ చేశారు. దీంతో ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్‌ను రద్దు చేసింది. అయితే ఇంతకు ముందే తరచూ అబ్బాయిలు నాకు న్యూడ్ ఫోటోలు మెసేజ్ చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌కు కంప్లయింట్ చేశాను. చదవండి: అన్‌స్టాపబుల్: రెండో సీజన్ తొలి గెస్ట్ ఆ స్టార్ హీరోనట! కానీ దీనిపై చాలామంది రిపోర్ట్ చేయడంతో తన అకౌంట్‌ను తిసేశారఇది నా కొత్త అకౌంట్.. చిన్మయి.శ్రీపాద(chinmayi.sripada)’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా తన ఇన్స్టాగ్రాం వేదికగా చిన్మయి సమాజంలో అమ్మాయిలు, మహిళలకు ఎదురవుతున్న పలు సమస్యల మీద గళం వినిపించేది. ఎదురుదెబ్బలతో ధైర్యం కొల్పోయిన మహిళలకు ధైర్యం నింపేది. యువతుల సమస్యలకు పరిష్కారం ఇచ్చేది. ఈ నేపథ్యంలో తనను చాలా మంది ట్రోల్ చేస్తున్నారని చిన్మయి కొంత కాలంగా చెబుతూ వస్తుంది. కానీ ఆమె అకౌంట్‌ను ఇలా రద్దు చేయడంతో చిన్మయి ఫాలోవర్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. Instagram has basically removed MY account for reporting men who send ME their penises on DMs. Its been going on for a while where I report but MY access was barred. Anyway that’s that. My backup account is chinmayi.sripada 🤦🏽♀️ — Chinmayi Sripaada (@Chinmayi) June 23, 2022 View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayi.sripada) -
హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్, అప్రమత్తం చేసిన యామీ
సెలెబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు ఇలా చాలా మంది సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేరుగా నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాకింగ్‌కు గురవుతుంటాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఇది సాధారణ విషయయే అయినప్పటికీ ఇలాంటి వాటి పట్ల అప్రమత్తత లేకపోతే ఎలాంటి నష్టమైన జరగొచ్చు. గతంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్ల అకౌంట్లను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి డబ్బు వసూలు చేయడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం చేస్తుంటారు. చదవండి: అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్: ఓం రౌత్ అందుకే ముందు జాగ్రత్తగా తమ ఫాలోవర్స్‌ను వారు అప్రమత్తం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ కూడా తన ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను అలర్ట్ చేసింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. దీనిపట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని, తన ఖాతా నుంచి వచ్చిన ఎలాంటి పోస్ట్, ప్రకటనలకు స్పందించవద్దని పేర్కొంది. ప్రస్తుతం ఆమె టీం దీనిపై వర్క్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది. కాగ ఇటీవల పెళ్లి చేసుకున్న యామీ ప్రస్తుతం దస్వీ మూవీతో బిజీగా ఉంది. అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. దీనితో పాటు ఆమె ‘ఓ మై గాడ్ సిక్వెల్’లో కూడా నటిస్తోంది. Hi, This is to inform you all that I've been unable to access my Instagram account since yesterday, it's probably hacked. We're trying to recover it as soon as possible. Meanwhile, if there is any unusual activity through my account, please be aware of it. Thank you! — Yami Gautam Dhar (@yamigautam) April 3, 2022 -
'టెంపర్' బ్యూటీ ఇన్‌స్టా అకౌంట్ మాయం.. అసలు సంగతి ఏంటంటే ?
Nora Fatehi Return To Instagram After Hacking Attempt: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ తన క్రేజీ బాడీ మూమెంట్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. స్పెషల్ సాంగ్స్‌లో ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ప్రత్యేక గీతాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్‌తో అభిమానులను ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది. అలాంటిది నోరా ఫతేహి ఇన్‌స్టా అకౌంట్ ఒక్కసారిగా మాయమైపోయింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనతో నోరా ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. నోరానే తన ఇన్‌స్టా పేజీని డిలీట్ చేసిందని భావించారు. అయితే అదే రోజు రాత్రి అయ్యేసరికి అసలు విషయం తెలిసింది. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది నోరా. శుక్రవారం రాత్రి మళ్లీ తన పేజీ రీస్టోర్ అయిందని పేర్కొంది. 'అందరికీ సారీ. నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసేందుకు ఉదయం నుంచి ప్రయత్నించారు. కానీ ఈ సమస్యను త్వరగా పరిష్కరించారు. వారి టీమ్‌కు ధన్యవాదాలు.' అని రీస్టోర్ అయిన అకౌంట్లో పోస్ట్ షేర్ చేసింది ముద్దుగుమ్మ. నోరా ఫతేహీకి ఇన్‌స్టాలో 37 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల నోరా ఫతేహి పులి పిల్లలకు ఆహారం పెడుతున్న వీడియో పోస్ట్ చేశాక అకౌంట్ హ్యాక్ అయింది. 'బాహుబలి', 'టెంపర్' తదితర సినిమాల్లో నోరా ఐటమ్ సాంగ్స్‌లో అలరించిన సంగతి తెలిసిందే. -
అవును.. నా అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ హీరోయిన్ ట్వీట్
Amritha Aiyer Instagram Has Been Account Hacked: ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్‌ను హ్యాక్ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. అలా హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు షేర్ చేయడమే కాకుండా ఇబ్బందికరంగా ఉండే కామెంట్స్ కూడా పెడుతుంటారు. ఇలా హ్యాక్ గురైన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ హ్యాక్‌కు గురైనా తారల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డె, టబు, ఇషా డియోల్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో మరో యంగ్ హీరోయిన్ చేరింది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో పాపులర్ అయిన అమృత అయ్యర్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. తన అకౌంట్ మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు అమృత ట్వీట్ చేసింది. ప్రస్తుతానికైతే హ్యాక్‌కు గురైన అమృత ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఎలాంటి అసభ్యకర పోస్టులు రాలేదని తెలుస్తోంది. Yes ! my Instagram has been Hacked 😞 hope it gets recovered 🙏🏻 Will come back soon . — Amritha (@Actor_Amritha) February 1, 2022 -
మాజీ లవర్‌ను ఇరికించాలని.. తనే ఇరుక్కుంది!
ప్రేమించుకున్న వాళ్లు విడిపోతే.. కొంతమంది ఎవరి దారి వారు చూసుకుంటారు! అయితే మరికొంత మాత్రం తమ ప్రేమ విషయంలో మనస్పర్థలు తలెత్తితే అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తారు. అయితే తాజాగా ఓ అమ్మాయి సోషల్ మీడియా వేదికగా తన మాజీ ప్రేమికుడిని వేధింపులకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఐర్లాండ్‌కు చెందిన 20ఏళ్ల కర్టనీ ఎయిన్స్ వర్త్ అనే ఓ అమ్మాయి, లూయిస్ జాలీని ప్రేమించింది. అయితే ఇటీవల వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అయితే అప్పటి నుంచి తన మాజీ ప్రేమికుడి మీద పగ పెంచుకుంది కర్టనీ. ఎలాగైనా తన పగ తీర్చుకోవాలని భావించిన కర్టనీ.. 30 నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి.. తనకు తానే చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్‌లు పంపించుకుంది. అనంతరం వాటిని లూయిస్ పంపించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ప్రియుడిపై పగతో వేధించాలని కర్టనీనే పలు మెయిల్ ఐడీలతో 30 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించినట్లు పోలీసులు తేల్చారు. ఆమె ఫిర్యాదు కారణంగా లూయిస్ ఉద్యోగం కూడా కోల్పోవల్సి వచ్చింది. పోలీసులు కర్టనీని అరెస్ట్ చేసి.. న్యాయస్థానంలో హాజరుపరిచారు. లూయిస్ ఏ తప్పు చేయలేదని కర్టనీ కావాలని అతన్ని వేధింపులకు గురి చేసి ఉద్యోగం కోల్పోయేలా చేసినందుకు కోర్టు ఆమెకు 10 నెలల జైలు శిక్ష విధించింది. -
నా పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాకయ్యాయి
లక్నో: తన కుమార్తె, కూతురుకు చెందిన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లు హాకింగ్‌కు గురయ్యాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు. లక్నోలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఫోన్ల ట్యాపింగ్ వదిలేయండి. నా పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఏ పనీ లేదా?’అని వ్యాఖ్యానించారు. సీఎం యోగి తన ఫోన్లను ట్యాప్ చేసి, సంభాషణల రికార్డులను ప్రతి రోజూ వింటున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘నేను బాలికను. నేను పోరాడతాను’ నినాదంతో తాను చేపట్టిన కార్యక్రమం కారణంగానే ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో మహిళలతో సభ ఏర్పాటు చేసి, పలు పథకాలు ప్రకటించాల్సి వచ్చిందని ప్రియాంక అన్నారు. చదవండి: (Mamata Banerjee: కోల్‌కతా దీదీదే.. తృణమూల్ ‘హ్యాట్రిక్’) -
ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్ పీస్ (ఇమేజ్)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు ఫేస్ బుక్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కన్నేసింది. ఈ రెండింటిలో ఫేస్‌బుక్‌కు చెందిన 10 కంటెంట్ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్ నెట్ వర్క్ ఇన్ స్టాగ్రామ్‌లో 8 పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా? కరోనా కారణంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్ కోసం ఫేస్‌బుక్‌ను ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్బుక్ స్పోక్ పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్ కంటెంట్, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్ ఇమేజెస్‌పై, 2.6 మిలియన్ల అడల్ట్ కంటెంట్ ఉన్న ఇమేజెస్‌లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్ మెంట్ కంటెంట్ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్‌ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఫేస్బుక్కే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో కూడా.. ఫేస్బుక్కే కాదు..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్‌లు, 8,11,000 వేల సూసైడ్, సెల్ఫ్ ఇంజూరీ ఇమేజ్ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ లో సైతం ఫేస్బుక్ కు చెందిన మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్‌లో జూన్ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్‌ను తొలగించింది. చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు! -
ఇన్ స్టాగ్రామ్,ఈ సూపర్ ఫీచర్ గురించి మీకు తెలుసా?!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్ స్టాగ్రామ్ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో సెన్సిటీవ్ కంటెంట్ ను కంట్రోల్ చేయవచ్చని ఇన్ స్టాగ్రామ్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతిరోజు ప్రపంచ వ్యప్తంగా 500మిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఇన్ స్టాగ్రామ్‌లో గడుపుతున్నారు. అయితే వారిలో కొంతమంది యూజర్లు అశ్లీల ఫోటోలు, మెసేజ్‌లను షేర్ చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు సెన్సిటీవ్ కంటెంట్ కంట్రోల్ ఫీచర్‌ను అప్ డేట్ చేసింది. ఈ ఫీచర్ ను వినియోగించడం ద్వారా అశ్లీల కంటెంట్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇన్‌స్టా గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేస్తే వెంటనే ఇన్స్టాగ్రామ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తొలగిస్తామని ఇన్ స్టాగ్రామ్ వెల్లడించింది. ►ఈ ఆప్షన్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ►ముందుగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను క్లిక్ చేయాలి ►క్లిక్ చేసి ప్రొఫైల్ సెంట్టింగ్ లో మెన్యు ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి ►మెన్యు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సెన్సిటీవ్ కంటెంట్ కంట్రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు లిమిట్, అలో, లిమిట్ ఈవెన్ మరో అనే ఆప్షన్ డిస్ప్లే అవుతోంది ► లిమిట్ ఈవెన్ మరో అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అశ్లీల్ కంటెంట్ మీ ప్రొఫైల్ లో షేర్ అవ్వడం ఆగిపోతుంది. చదవండి : ల్యాప్ ట్యాప్ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ బ్రాండ్ బాగుంటుందంట -
ప్రపంచవ్యాప్తంగా మొరాయిస్తున్న ఇన్స్టాగ్రామ్
న్యూఢిల్లీ, సాక్షి: సోషల్ మీడియా అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ కొద్ది రోజులుగా మొరాయిస్తోంది. దేశీయంగానూ సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బగ్ కారణంగా ఇలా జరుగుతూ ఉండవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు ఇన్స్టాగ్రామ్ ఖాతాలను వినియోగించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఈ అంశంపై ఇన్స్టాగ్రామ్ స్పందించకపోవడం గమనార్హం! రెండు రోజులుగా సమస్యలు ఎదురవుతున్నప్పటికీ పరిష్కారం ఎప్పుడన్న అంశాన్ని ఇన్స్టాగ్రామ్ వెల్లడించకపోవడంపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్తువెత్తుతున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం నుంచీ డౌన్‌డిటెక్టర్ డేటా ప్రకారం శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచీ ఇన్స్టాగ్రామ్ సాంకేతిక సమస్యలపై 800 రిపోర్ట్స్ నమోదయ్యాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కాకపోవడంపై సుమారు 5 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఫిర్యాదులు 8 గంటలకల్లా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల గూగుల్ సంబంధిత ప్లాట్‌ఫామ్స్ సైతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగినట్లు టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గత సోమవారం యూట్యూబ్, గూగుల్, జీమెయిల్, గూగుల్ డాక్స్ తదతర యాప్స్ వినియోగంలో అటు ఫోన్లు, ఇటు కంప్యూటర్లలో ఇబ్బందులు తలెత్తిన విషయం విదితమే. కొత్త ఫీచర్స్ ఇన్స్టాగ్రామ్ ఇటీవల రెండు కొత్త ఫీచర్స్‌ను జత చేసుకుంది. కోవిడ్-19పై యూజర్లకు తగిన సమాచారాన్నిఅందించేందుకు వీలుగా వీటిని అభివృద్ధి చేసింది. వైరస్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలలో లింక్ ద్వారా స్థానిక ఆరోగ్య అధికారిక సంస్థకు సంబంధించిన వివరాలను అందిస్తోంది. వ్యాక్సినేషన్ల సమాచారం, తదితర వివరాలు తెలుసుకునేందుకు దారి చూపుతోంది. అంతేకాకుండా వెర్జ్ వివరాల ప్రకారం వ్యాక్సిన్లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని బ్లాక్ చేసేందుకూ తాజా ఫీచర్స్‌ను రూపొందించింది. -
నిర్లక్ష్యం వద్దు.. అందరికి ఒకేలా ఉండదు..
ముంబై : టాలీవుడ్.. బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా యారియాన్ సినిమా ఫేం హిమాన్ష్ కోహ్లి కరోనా సోకిందంటూ శుక్రవారం ఇన్‌స్టా ద్వారా స్వయంగా వెల్లడించాడు. 'ఈ మధ్యనే కరోనా పరీక్ష చేయించుకున్నా.. శుక్రవారం పాజిటివ్ అని తేలింది.. రెండు వారాలు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నా.. అందరూ జాగ్రత్తగా ఉండండి' అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని.. లక్షణాలనేవి అందరికి ఒకేలా ఉండవంటూ ఒక సుధీర్ఘ పోస్టును ఇన్‌స్టాలో షేర్ చేశాడు. హిమాన్ష్ కుటుంబంలో మొదట తన తండ్రి, తల్లితో పాటు చెల్లికి కరోనా సోకింది. వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉండగానే ఇప్పుడు హిమాన్ష్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. హిమాన్ష్ కోహ్లి రాసిన సారాంశం ఇలా ఉంది. (చదవండి : అరెస్టు అయ్యేందుకు సిద్ధం.. ప్రేమించడం నేరం కాదు!) 'భగవంతుడి దయ వల్ల , మీ అందరి ప్రార్థనల కారణంగా నా కుటుంబం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటుంది. తాజాగా నేను కరోనా బారిన పడ్డాను. కరోనా సోకకముందు మేము చాలా దైర్యంగా ఉన్నాం.. ఇమ్యూనిటీ పవర్ ఉందిగా.. మాకేం కాదులే.. కరోనాతో పోరాడుతుందిలే అని భావించేవాళ్లం దాంతో పాటు కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. కానీ మా అమ్మ, నాన్న, చెల్లికి కరోనా సోకిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వారిలో ఏ ఒక్కరికి ఒకే రకమైన లక్షణాలు కనిపించలేదు. వారి పరిస్థితి చూసి నేను టెస్ట్‌కు వెళితే కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అందుకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. దయచేసి కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి.. మాకేం కాదులే అన్న ధోరణి వదిలేయండి.. లక్షణాలు అనేవి అందరికి ఒకేలా కనిపించడం లేదు. నేను ఏదో భయపెట్టాలని మాత్రం చెప్పట్లేదు.. నేను నిర్లక్ష్యంగా వ్యవహరించానే కాబట్టే ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నా.. మీకు ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుంటూ ఇదంతా చెప్పా. అందరూ జాగ్రత్తగా ఉండండి.. స్టే సేఫ్.. బి హ్యాపీ.. అంటూ 'రాసుకొచ్చాడు. కాగా 2014లో యారియాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హిమాన్ష్ కోహ్లి ఆ తర్వాత రాంచీ డైరీస్, అభీ నహీ తోహ్ కబీ నహీ, బూందీ రహితా, దిల్ జోనా కెమ్ సాకా వంటి చిత్రాలో నటించాడు. బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్తో ప్రేమాయణం నడిపిన హిమాన్ష్ .. గతేడాది వారిద్దరి మద్య జరిగిన బ్రేకప్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. -
ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలున్న యువతులే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా యువతులు, మహిళల్ని పరిచయం చేసుకొని.. కొన్నాళ్ల పాటు స్నేహంగా ఉంటూ చాటింగ్ చేస్తాడు... ఆపై తన వద్ద కొన్ని ‘ఫొటోలు’ ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతాడు... ఓ బాధితురాలి నుంచి వీలున్నంత వసూలు చేసిన తర్వాత ఆమె స్నేహితురాళ్లనే టార్గెట్‌గా చేసుకుంటాడు... ఈ పంథాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వందల మందిని మోసం చేసిన ఓ బ్లాక్‌మెయిలర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై సైబర్ క్రైమ్ ఠాణా సహా నగరంలోనే ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి గురువారం వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహ్మద్ అహ్మద్ ఆరో తరగతి వరకే చదివాడు. ఆపై తన స్వస్థలంలోనే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఖాతా ఉన్న ఇతగాడు దాని ద్వారానే మహిళలు, యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. వాళ్లు యాక్సప్ట్ చేసిన తర్వాత కొన్నాళ్లు స్నేహపూర్వకంగా చాటింగ్ చేస్తాడు. ఇలా వారి నమ్మకం పొందే అహ్మద్ సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత నుంచి వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్ చేసే ఇతగాడు ఎదుటి వారు పూర్తిగా తనను నమ్మారని నిర్థారించుకున్నాక అసలు పని ప్రారంభిస్తాడు. వారి ఇన్‌స్ట్రాగామ్ ఖాతా నుంచి సంగ్రహించిన ఫొటోలను వారికే షేర్ చేస్తాడు. వీటితో పాటు తన వద్ద మరికొన్ని వ్యక్తిగత ఫొటోలు ఉన్నాయంటూ బెదిరిస్తాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం చెల్లించాలంటాడు. ఇలా టార్గెట్ చేసిన యువతి/మహిళ నుంచి అందినకాడికి తన ఖాతాల్లో డిపాజిట్ లేదా ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఇలా ఓ బాధితురాలి నుంచి వసూలు చేయడం పూర్తయిన తర్వాత ఆమె పేరు, ఫొటోతో ఇన్‌స్ట్రాగామ్‌లోనే నకిలీ ఖాతా సృష్టిస్తాడు. దీని ఆధారంగా ఆమె ఫ్రెండ్ లిస్ట్‌లోని యువతులు, మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. యాక్సప్ట్ చేసిన వారితో కొన్నాళ్లు చాటింగ్, కాల్స్ చేసి ఆపై బెదిరింపులకు దిగుతాడు. బాధితుల నుంచి డబ్బు వసూలు చేయడంతో పాటు తనతో సన్నిహితంగా ఉండాలనీ బెదిరిస్తాడు. ఇతడిపై నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌తో పాటు కామాటిపుర, గోల్కొండ, నారాయణగూడ, మీర్‌చౌక్, ఫలక్‌నుమ, సంతోష్‌నగర్, నేరేడ్మెట్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతడి వల్లోపడి రూ.10 వేలు చెల్లించిన ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీన్ని ఇన్స్పెక్టర్ బి.రమేష్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి అహ్మద్‌ను నిందితుడిగా గుర్తించారు. ఆదోని వెళ్లిన ప్రత్యేక బృందం గురువారం అరెస్టు చేసి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వందల మందిని ఇతగాడు ఈ పంథాలో మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ వివరాలు సేకరించడానికి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
హ్యకర్స్‌పై మండిపడ్డ పూజా
తన సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యక్ చేసిన వారిపై హీరోయిన్ పూజా హెగ్డే మండిపడ్డారు. మీరు బాగుపడరంటూ హ్యకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను సుమారు గంటసేపు హ్యక్ చేసినట్లు ఆమె గురువారం తెలిపారు. అయితే వెంటనే అకౌంట్‌ను సరిచేయాలని తన టెక్నికల్ టీమ్‌కు చెప్పినట్లు వెల్లడించారు. ఈ మేరకు పూజా ట్వీట్ చేశారు.‘బుధవారం రాత్రి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యక్ అయ్యింది. నేను నా టెక్నికల్ టీమ్‌కు ఇన్ఫార్మ్ చేశాను. వాళ్లు నాకు సహాయం చేస్తున్నారు. నా అకౌంట్ నుంచి ఏవైనా మెసెజ్‌లు, పోస్టులు వస్తే దయచేసి అంగీకరించవద్దు. అలాగే ఎలాంటి వ్యక్తిగత సమాచారం పంపించవద్దు. థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. (దుల్కర్‌కు జోడిగా బుట్టబొమ్మ!) Hi guys, so I’ve been informed by my team that my insta account has been hacked and my digital team is helping me with it. Please do not accept any invitations or pass out any personal information out to the person asking. Thank you. — Pooja Hegde (@hegdepooja) May 27, 2020 అయితే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని పూజా తెలిపారు. గంట నుంచి ఇన్‌స్టా అకౌంట్ భద్రత గురించి ఆలోచిస్తున్నానని, ఇప్పుడు అంతా బాగుందని అన్నారు. తనకు సహాయం చేసినందుకు టెక్నికల్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి ఎప్పటిలాగే ఇన్‌స్టాను ఉపయోగిస్తానని పేర్కొన్నారు. కాగా సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యక్ అవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకముందు అనుపమ పరమేశ్వరన్, కలర్స్ స్వాతి అకౌంట్లు కూడా హ్యక్ అయ్యాయి. (ధోని రిటైర్మెంట్పై సాక్షి ట్వీట్.. డిలీట్) Spent the last hour stressing about the safety of my Instagram account. Thanking my technical team for instant help at this hour. Finally, got my hands back on my Instagram 🥰 Any message, follow back or post in d past hour from my account has been done will be undone. Ty. — Pooja Hegde (@hegdepooja) May 27, 2020 -
ప్రియా.. ప్రియా... వెళ్లొద్దే!
రెండేళ్ల క్రితం ‘ఒరు అడార్ లవ్’ సినిమా టీజర్లో కన్ను కొడుతూ కనిపించి, ‘కన్నుకుట్టి’గా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు ప్రియా ప్రకాష్ వారియర్. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన ఒక్కరోజులోనే ఆరులక్షల ఫాలోయర్స్‌ను సంపాదించిన ఇండియన్ సెలబ్రిటీగా సోషల్ మీడియా రికార్డును దక్కించుకున్న ఘనత ప్రియాది. తాజాగా ప్రియ తన ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడం చర్చనీయాంశమైంది. ‘‘మా అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసింది. ఇది తాత్కాలికం మాత్రమే. తను కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటోంది. కొంత సమయం తర్వాత ఆమె తిరిగి ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ కావొచ్చు’’ అని ప్రియ తండ్రి ప్రకాష్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రియ తన అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించిందని, అందుకే ప్రియ ఇలా చేశారని టాక్. సోషల్ మీడియా స్టార్ కన్నా కూడా నటిగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఇలా చేశారని కొందరు అంటున్నారు. మరోవైపు ఇటీవలే టిక్‌టాక్‌లో జాయిన్ అయ్యారు ప్రియాప్రకాష్. ప్రస్తుతం ఆమె ఫేస్బుక్, టిక్‌టాక్ అకౌంట్స్ యాక్టివ్గానే ఉన్నాయి. ఇన్‌స్టా నుంచి ఈ కన్నుకుట్టి వెళ్లగానే ‘ప్రియా.. ప్రియా.. వెళ్లొద్దే’ అంటూ అభిమానులు బాధపడిపోతున్నారు. -
అమ్మా తప్పు చేశానా?
మంచివాళ్లనుకున్న అబ్బాయిలు మంచి స్కూళ్లలోని అబ్బాయిలు మంచి కుటుంబాల అబ్బాయిలు ఇలా ఎలా చేయగలుగుతారు?.. మోనా తల్లి విస్మయం. మోనాకైతే లోకం మీదే నమ్మకం పోయింది. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి వందల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి వేల లైక్స్ ఉండే అమ్మాయి బాయ్స్ దగ్గర తన మార్ఫింగ్ ఫొటోలు చూసి గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అబ్బాయిలూ.. ఆలోచించండి. ఏడిపించడం ఫన్ అవుతుందా?! ‘‘అమ్మా.. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు వద్దంటున్నా వినకుండా ఫొటోలు షేర్ చేసి తప్పు చేశాను కదా..’’ గట్టిగా ఏడుస్తోంది మోనా (పేరు మార్చాం). పద్నాలుగేళ్ల అమ్మాయి. ఢిల్లీలో మంచి పేరున్న స్కూల్లో చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ ‘బాయ్స్ లాకర్ రూమ్’ స్క్రీన్ షాట్స్‌లో మోనా మార్ఫింగ్ ఫొటో ఉంది. మోనాపై బాయ్స్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ఉన్నాయి. వాటిని తనే తల్లికి చూపించింది. ‘‘లేదురా.. నువ్వు తప్పేం చేయలేదు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. అబ్బాయిలదే తప్పు. నేను నీవైపే ఉన్నాను. వాళ్లకు బద్ధొచ్చేలా చేస్తాను’’ అన్నారు మోనా తల్లి. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. అబ్బాయిలు మళ్లీ ఇలాంటి పని చేయకుండా గట్టి శి„ý పడేలా చేయడానికి ఏమేమి చట్టాలు ఉన్నాయో పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టారు. ∙∙ ఇది ఢిల్లీలో జరిగిన ఘటన. అయితే మిగతా చోట్ల భవిష్యత్తులో బయట పడబోయే ఘటన కూడా కావచ్చు! ‘బాయ్స్ లాకర్ రూమ్’ అనే మాటను దేశం ఈ ఆదివారం తొలిసారిగా వినింది. ఇదేమీ భారత్‌పై ఉగ్రవాదులు తలపెట్టిన దాడుల ఆపరేషన్ పేరు కాదు. దేశవిద్రోహల కోడ్ లాంగ్వేజి కూడా కాదు. ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అకౌంట్ పేరు. అందులో ఉన్నవాళ్లంతా పసితనం వీడని పద్నాలుగూ పదిహేనేళ్ల మగ పిల్లలే. ఢిల్లీలోని ఐదారు స్కూళ్లలోని వాళ్లు. వాళ్లలోనే ఒకరిద్దరు అడ్మిన్లు. ఆ అకౌంట్ చాట్ గ్రూప్‌లో జరిగే రహస్య సంభాషణలన్నీ తమ క్లాస్మేట్స్ అయిన ఆడపిల్లల గురించే! వాళ్ల ఫొటోలను షేర్ చేస్తారు. మార్ఫింగ్ చేస్తారు. కామెంట్స్ రాస్తారు. నవ్వుకుంటారు. వాటిల్లో బాడీ షేమింగ్ ఉంటుంది, రేపిస్టు మెంటాలిటీ ఉంటుంది. వీళ్ల చాటింగ్ స్క్రీన్ షాట్స్ కొందరు అమ్మాయిల (వాళ్లలో మోనా కూడా ఉంది) ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో షేర్ అవడంతో ‘బాయ్స్ లాకర్ రూమ్’ సంగతి బయటపడింది. ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లల్ని మానసికంగా కృంగదీసి, వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే చాటింగ్ అది. సున్నిత మనస్కులు తట్టుకోలేరు. కరోనా వైరస్‌ను వుహాన్‌లో మొదట ఒక చైనా నర్సు గుర్తించారు. అలా ఈ ప్రమాదాన్ని మనదేశంలో వెంటనే గుర్తించిన వ్యక్తి.. స్వాతీ మలీవాల్. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్. ఢిల్లీపోలీసులకు, ఇన్స్టాగ్రామ్ సంస్థకు మర్నాడే.. అంటే సోమవారమే.. ఆమె నోటీసులు పంపారు. ఇలాంటి తత్వం ఉన్న మగపిల్లలకు తక్షణం ఒక బలమైన హెచ్చరిక వెళ్లాలి అని స్వాతి అనుకున్నారు. ∙∙ మంగళవారం ఉదయానికి పోలీసులు లాకర్ రూమ్ సభ్యుడొకరిని కనిపెట్టారు. పద్నాలుగేళ్ల విద్యార్థి అతడు. ఢిల్లీలో పేరున్న స్కూల్లో చదువుతున్నాడు. ‘రూమ్’ తాళం చెవిలా దొరికాడతడు. మిగతా సభ్యులు పేర్లు, వాళ్లు ఏయే స్కూళ్లలో చదువుతున్నదీ అతడి నుంచి, అతడి స్నేహితుల నుంచి పోలీసులు రాబట్టారు. వాళ్లలో ఒకరిద్దరు ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏప్రిల్ మొదటివారంలో ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొదలైంది. ఒకర్నుంచి ఒకరు జమ అయ్యారు. ఇద్దరు అడ్మిన్లు కాబట్టి గ్రూపు త్వరత్వరగా వృద్ధిచెందింది. గ్రూపు టాపిక్ ఒక్కటే.. అమ్మాయిలు.. అమ్మాయిలు.. అమ్మాయిలు! తెలిసిన అమ్మాయిలు. క్లాస్మేట్స్ అయిన అమ్మాయిలు! వాళ్ల ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సంపాదించడం, ఇందులో షేర్ చేయడం. షేమింగ్ చేయడం! బుధ, గురువారాల్లో వీళ్లలో మరికొందరు బయటపడ్డారు. వీరిపైన ఏం చర్య తీసుకుంటారని తెలియకపోయినా, ఈ పిల్లల తల్లిదండ్రులు మాత్రం.. ‘పోలీసులు ఇంటికి రావడం’ అనే శిక్షను అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్‌తో జువెనైల్ జస్టిస్ బోర్డు.. కేసులేమీ తీసుకోవడం లేదు. దాంతో పోలీసులు నిందిత విద్యార్థులను ప్రస్తుతానికి వాళ్ల తల్లిదండ్రుల అదుపులోనే ఉంచుతున్నారు. మొబైల్ ఫోన్స్ తీసేసుకున్నారు. తమకు తెలియకుండా వాళ్లను సిటీ బయటికి పంపించడం చేయకూడదని చెప్పి వెళుతున్నారు. బాయ్స్ లాకర్ రూమ్ చాట్‌లో తమ కూతుళ్ల ఫొటోలు ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రుల పరిస్థితీ దాదాపుగా అలానే ఉంది. ‘‘అమ్మా.. నా తప్పేమీ లేదు కదా’’ అని కూతురు అపరాధిలా అడగడం ఏ తల్లిని మాత్రం బాధించదు! ∙∙ తల్లి చెబుతున్న దానిని బట్టి మోనాకైతే ఈ అనుభవం తర్వాత లోకం మీదే నమ్మకం పోయింది! ‘నేనీ సమాజంలో ఉండలేను మమ్మీ’ అంటోంది. ‘ఫొటోలు షేర్ చెయ్యకమ్మా.. ఎవరైనా మిస్ యూజ్ చేస్తారు’ అని మొదట్లో తల్లి చెప్పినప్పుడు మోనా నవ్వింది. ‘పిచ్చి భయాలు మమ్మీ నీవన్నీ. మీ రోజుల్లో అలా ఉండేదేమో. బాయ్స్ ఇప్పుడు మర్యాదగా ఉంటున్నారు. గర్ల్స్‌ని, ఆడవాళ్లని రెస్పెక్ట్ చేస్తున్నారు’ అని మోనా అంది. ఇప్పుడు అదే బాయ్స్ ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు! ఎందుకిలా చేశారు అని అడితే.. ‘ఫర్ ఫన్’ అంటున్నారు! దుర్గంధం ఈ దర్గంధపూరిత ప్రవర్తనకు అబ్బాయిల తల్లిదండ్రులనే నిందించాలి. ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వక పోవడం మీ హక్కు అన్నట్లు అబ్బాయిల్ని పెంచుతున్నారు. బాయ్స్.. ఈ పనికి మీరు సిగ్గుపడాలి. – నటి సోనమ్ కపూర్ ఇంత విషమా! ఈ వయసులో ఇంత పురుషాహంకారం అంటే ఈ విషం ఎంతవరకూ పాకపోబోంది! అత్యాచారాలను ప్రేరేపించే ఇలాంటి ఆలోచనా ధోరణులను ఇప్పుడే అదుపులో పెట్టాలి. – నటి స్వరా భాస్కర్ -
పెట్స్‌కి ఓనర్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్
సిటీలో పెట్స్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే మనలాగే పెట్స్‌కు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ పెరుగుతుండటం చెప్పుకోదగిన విశేషం. దీంతో అత్యధిక సంఖ్యలో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పెట్స్ చేసే సందడిని సోషల్ మీడియా పేజ్‌లో అప్డేట్ చేసి ఇతరులతో పంచుకోవడం.. వారు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్ పెట్టడంతో రెండు వైపుల వారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతో రోజురోజుకీ పేజ్‌లకు క్రేజ్ పెరుగుతోంది. సాక్షి, కాలేజ్ కరస్పాండెంట్: ఎక్కువ మంది నగరానికి చెందిన టీనేజర్లు పెట్స్ కోసం ప్రత్యేక అకౌంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రెండ్ చూసి పెట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో ఒక పేజ్ స్టార్ట్ చేశారు. ఆ పేజ్ మీద అందరి పెట్స్‌ని పోస్ట్ చేసి అత్యధిక లైక్స్ వచ్చిన పెట్ని విజేతగా నిర్ణయించే తరహా పోటీలు, విజేతలకు పెడిగ్రీన్ వంటి డాగ్‌ఫుడ్ నుంచి పెట్స్‌కి అవసరమైన మరెన్నో బహుమతులు ఇస్తామనే ప్రకటనలూ పెరిగాయి. సెలబ్రిటీలే స్ఫూర్తి.. చాలామంది సెలబ్రిటీలీ పెట్ వర్కింగ్‌కి ఊపునిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెట్ డయానా చోప్రాకి ఇన్‌స్ట్రాగామ్‌లో 1.49లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. టాలీవుడ్ స్టార్ సమంత అక్కినేనికి కూడా ఒక పెట్ అకౌంట్ ఉంది. ముంబైకి చెందిన మాన్సి తల్వార్ బీగిల్స్, మేనార్డ్, క్లో... పెట్స్ పేజ్‌కు 24వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నగరానికి చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్‌బాస్ ఫేమ్ దీప్తి సునయన తన పెట్ టొమ్మీ కోసం ఏర్పాటు చేసిన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌కు 3,865 ఫాలోవర్స్ ఉన్నారు. టంగ్ ఔట్ ట్యూజ్ డేస్, హెడ్ టిట్ థర్స్‌డేస్, స్నగ్ విత్ పగ్... వంటి పేర్లతో సిటీలోని పెట్స్ ఫొటోలు, వీడియోలు కనువిందు చేస్తున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా షూట్స్ కూడా పెట్టుకుంటున్న పెట్ ఓనర్స్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. బడ్ని నేను బాగా ట్రైన్ చేశా. చాలా మందికి పెట్స్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ రకరకాల కారణాల వల్ల వాళ్లు వాటిని పెంచలేకపోతుంటారు. అలాంటివారికి బడ్ లేదా సింబాతో నా అనుభవాలు షేర్ చేసుకోవడం నాకు నచ్చుతుంది. పెట్స్ మనల్ని నవ్వుల్లో ముంచుతాయి. హ్యాపీగా ఉంచుతాయి. అంతేకాదు జీవితం సంక్లిష్టమైంది కాదని నేర్పుతాయి. వీటివల్ల ప్రతి పరిస్థితిని చాలా ఈజీగా డీల్ చేయగలుగుతాం. తాజాగా మా కొత్త పప్ సింబాకు చాలా లైక్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నాకు ఒక డాగ్, ఒక పిల్లి ఉన్నాయి. ఓ నెల తర్వాత రెండు పిల్లులు, ఒక డాగ్. సో.. ఈ అకౌంట్ ఒక్కరిది కాదు.. నాతో జీవించే మూగప్రాణులన్నింటిదీ. – ఆయుషి నా పెట్‌కి గుర్తింపు కావాలని.. ఇట్స్ మీ టామీ.. అనే నా పెట్ పేజ్‌కి భలే క్యూట్ కామెంట్స్ వస్తుంటాయి. నా పెట్‌కి ఒక గుర్తింపు రావాలని, దానితో నా జ్ఞాపకాలన్నీ మిగిలిన వారితో షేర్ చేసుకోవాలని ఇది స్టార్ట్ చేశా. టామీ నా మీదకు జంప్ చేయడం, నాతో ఫైట్ చేయడం.. నేను కొన్ని నిమిషాలు కనపడకపోతే వెతుక్కోవడం.. వంటి చేష్టలన్నీ నేను రికార్డ్ చేస్తుంటాను. నా ఫ్రెండ్స్ బంధువులు అందరికీ పెట్స్‌తో నా ఫీట్స్ చూడటం చాలా ఇష్టం. – ప్రణవి, కాలేజ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ లైక్ చేసే పెట్ నాది.. నా పెట్ జ్యూస్ ఇంటికి వచ్చే ఫ్రెండ్స్‌కి జ్యూస్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. దాంతో దాని ఫొటోస్ పంపమని దాని గురించిన రోజువారీ విశేషాలు చెప్పమంటున్నారు. అందుకే ఈ ఆలోచన వచ్చి అకౌంట్ స్టార్ట్ చేశా. దీని ద్వారా దాని గురించి తెలుసుకోవడంతో పాటు మాట్లాడుకోవడానికి కూడా వారికి కుదురుతోంది. అంతేకాకుండా అది ఎదుగుతున్న తీరు, దాని చేష్టల్లో మార్పు చేర్పులు.. వీటన్నింటికీ ఒక కేటలాగ్ నాకు తయారవుతోంది కూడా. మంచం మీద నన్ను చుట్టుకుని పడుకుని ఉండే పోస్ట్ నా ఫేవరెట్. – విశ్వజోషి -
అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన కోహ్లి!
భారత క్రికెట్ జట్టు సారథిగా.. బ్యాట్స్‌మెన్‌గా కెరీర్లో దూసుకుపోతున్న విరాట్ కోహ్లి ఖాతాలో మరో అత్యంత అరుదైన ఘనత చేరింది. బ్యాట్‌తో పరుగుల రికార్డులు సృష్టిస్తున్న కోహ్లికి వీరాభిమానులెం తక్కువ లేరని మరోసారి రుజువైంది. బ్యాట్‌తో మైదానంలో అడుగు పెడితే చాలు స్టేడియం అంతా కోహ్లి పేరుతో మారుమ్రోగాల్సిందే. ఇలా ఎంతోమంది అభిమానులను సంపాదించిన కోహ్లికి మైధానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్‌ను సంపాదించి తొలి భారతీయుడిగా నిలిచాడు. టాప్ బాలీవుడ్ సెలబ్రెటీలను వెనక్కు నెట్టి అత్యధికంగా 5 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ముందంజలో ఉన్నాడు. దీంతో ఆయన తన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో ‘హాయ్ గాయ్స్.. మీ అందరికి ధన్యవాదాలు, మనం ఇప్పుడు ఇన్‌స్టాలో 50 మిలియన్ మైలు రాయిని సాధించాం. ఇదంతా మీ ప్రేమ, మద్దతునే సాధ్యమైంది.. మీ అభిమానానికి ధన్యవాదాలు’ అంటూ కోహ్లి షేర్ చేసిన ఈ వీడియో ఆయన అభిమానులను, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటొంది. (యాహూ.. సచినే విజేత.. గెలిపించిన ఫ్యాన్స్) View this post on Instagram 5⃣0⃣ Million strong on @instagram 💪🏼 Thank you guys for all the love and support. 🙏🏼😇 A post shared by Virat Kohli (@virat.kohli) on Feb 17, 2020 at 10:45pm PST ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న భారత సెలబ్రేటి జాబితాలో కోహ్లీ తర్వాత బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకోనేలు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20 కోట్ల మంది ఫాలోవర్లతో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు. ప్రముఖ మ్యూజిషియన్ ఆరియానా గ్రాండే ఖాతాలో 17.5 కోట్ల మంది ఫాలోవర్లతో రెండవ స్థానంలో నిలవగా,హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్(ది రాక్) 17.2 కోట్ల మంది ఫాలోవర్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. -
సౌదీలో 88వేల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్
వాషింగ్టన్: సౌదీ అరేబియాలో ఆ దేశ అధికారులకు అనుకూలంగా సందేశాలు పోస్ట్ చేస్తున్నందుకు గానూ దాదాపు 88 వేల అకౌంట్లను శుక్రవారం బ్లాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఇక ట్రంప్‌నకు అనుకూలంగా, ప్రత్యర్థులను కించపరిచే రీతిలో పోస్టులు చేసినందుకు గానూ వియత్నాం, అమెరికా, జార్జియాలలో 600 అకౌంట్లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు బ్లాక్ చేశాయి. అలాగే వియత్నాంలోని ఓ నెట్‌వర్క్‌ను బ్లాక్ చేసినట్లు ఫేస్బుక్ తెలిపింది. సౌదీలో బ్లాక్ చేసిన 88 వేల అకౌంట్లలో 5,927 అకౌంట్ల సమాచారాన్ని ట్విట్టర్ విడుదల చేసింది. సౌదీకి చెందిన సోషల్ మీడియామార్కెటింగ్ సంస్థ స్మాట్ సమాచార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ట్విట్టర్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.