
రజనీకాంత్
‘వందుట్టేన్ను సొల్లు’ అంటున్నారు రజనీకాంత్. అంటే వచ్చానని చెప్పు అని అర్థం. మరి.. వణక్కం అంటే ఏంటి? అంటే ‘నమస్కారం’ అని అర్థం. ఇంతకీ రజనీ ఎక్కడికి వచ్చారు? అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి. ‘కబాలి’ సినిమాలో పలికిన పవర్‌ఫుల్ డైలాగ్ (‘వందుట్టేన్ను సొల్లు’) తోనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోకి అఫీషియల్‌గా అడుగుపెట్టారు రజనీకాంత్. రెండేళ్లుగా అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా అని అభిమానులను ఊరించి ఎట్టకేలకు న్యూ ఇయర్‌కి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారాయన.
రాజకీయాల్లో యువతను టార్గెట్ చేసే విధంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌లను ఓపెన్ చేశారని సమాచారం. ఇంతకు ముందు రజనీకాంత్ కేవలం ట్విట్టర్‌లో మాత్రమే ఉన్నారు. ట్విట్టర్ ఖాతాలో తన సినిమాలకు సంబంధించిన విషయాలు, ఏదైనా కామెంట్స్ తెలియజేస్తూ యాక్టీవ్‌గా ఉంటుంటారు. ఇప్పుడాయన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ అల్లుడు, హీరో ధనుష్ నిర్మించిన ‘కాలా’ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment