అమితాబ్ బచ్చన్.. రజనీకాంత్... ఇద్దరూ ఇద్దరే. ఒకరేమో నార్త్‌లో మెగాస్టార్.. మరొకరేమో సౌత్ సూపర్‌స్టార్... తమ స్టైల్, మేనరిజమ్, యాక్టింగ్‌తో ఇద్దరూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. తాజాగా అమితాబ్ పక్కనే తలైవా (నాయకుడు) చేరారు. ఇంతకీ ఏ విషయంలో అనేగా మీ డౌట్. జైపూర్‌లోని నహార్‌గఢ్ కోటలోని మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మ ఉంది. తాజాగా అక్కడ రజనీకాంత్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. రజనీ నటించిన ‘కాలా’ చిత్రం రిలీజ్‌ను పురస్కరించుకొని గురువారం రాజస్థాన్‌లోని ఆయన అభిమానులు ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మ్యూజియం డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ– ‘‘నహార్‌గఢ్ కోట మ్యూజియమ్‌కి దక్షిణాది నుంచి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 55 కేజీల బరువు, 5.9 అడుగుల ఎత్తు ఉన్న ‘నరసింహ’ సినిమాలోని లుక్‌లో తలైవా విగ్రహం ఏర్పాటు చేశాం. అది కూడా బిగ్ బీ పక్కనే. మ్యూజియమ్‌ను సందర్శించాలని రజనీకాంత్‌కు ఆహ్వానం పంపుతాం. త్వరలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment