జరీనా ఆగయా | Huma Qureshi as Zareena looks ravishing | Sakshi
Sakshi News home page

జరీనా ఆగయా

Published Sat, May 26 2018 5:40 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Huma Qureshi as Zareena looks ravishing - Sakshi

ప్రశాంతంగా కనిపిస్తోన్న జరీనా కళ్లలో మాత్రం ఏదో కథ ఉంది. మరి ఆమె గురించి పూర్తీగా తెలియాలంటే మాత్రం ‘కాలా’ సినిమా చూడాల్సిందే. రజనీకాంత్‌ హీరోగా ‘కబాలి’ ఫేమ్‌ పా.రంజిత్‌ దర్శకత్వంలో దర్శక–నటుడు, నిర్మాత ధనుష్‌ నిర్మించిన సినిమా ‘కాలా’. హ్యూమా ఖురేషి, అంజలిపాటిల్‌ కథానాయికలు. నానా పటేకర్, ఈశ్వరీ రావ్, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాలో 45ఏళ్ల జరీనా పాత్ర చేశారు హ్యూమా ఖురేషి.

ఆమె లుక్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది.‘‘రజనీకాంత్‌గారి ‘కాలా’ సినిమాలో జరీనా క్యారెక్టర్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది’’అన్నారు హ్యూమా. ‘‘జరీనా పాత్రకోసం చాలా మంది కథానాయికలను పరిశీలించాం. కానీ ‘గ్యాంగ్‌ ఆఫ్‌ వస్పేయపూర్‌’లో హ్యూమాను చూసినప్పుడు జరీనా క్యారెక్టర్‌కు ఆమె కరెక్ట్‌ అనిపించింది. రజనీ, ధనుష్‌లు కూడా హ్యూమాను ఓకే చేశారు’’ అన్నారు రంజిత్‌. ‘కాలా’ చిత్రం జూన్‌ 7న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement