‘కాలా’ ముంబై మాఫియా డాన్. కలర్ బ్లాక్ అవ్వొచు కానీ క్యారెక్టర్ మాత్రం ఫుల్ వైట్. మరి అలాంటి డాన్ ఇంట్రో సాంగ్ అంటే ఎలా ఉండాలి? తన గొప్పతనాన్ని పొగుడుతూనే, తన గుణాన్ని వివరించాలి. ఈ స్టైలిష్ డాన్‌కు అలాంటి పాటనే కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని మే డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘‘కాలా ఫస్ట్ సాంగ్ మీ అందరి కోసం.
మాస్ డార్లింగ్‌తో అందరం కలిసి ర్యాప్ పాడదాం రండి’’ అని ధనుష్ పేర్కొన్నారు. ఈ పాటలోని కాలా గురించి వర్ణిస్తూ.. ‘‘యమ గ్రేటు.. కాలా సేఠు. భయము ఎరుగని వన్నె తరగని.. ఎంత ఎదిగినా ఒదిగినవాడు. మనము తలవగా మనసు పిలవగా కలత తీర్చడానికి ఇటు వచ్చినాడు చూడు. నలుపే మన శ్రమ జీవుల వర్ణం, గెలుపే కరికాలుడి సొంతం’’ అంటూ ర్యాప్‌తో సాగే ఈ పాటలోని లైన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో హీరోగా నటించనున్న నెక్ట్స్ సినిమాకు రెమ్యునరేషన్‌గా రజనీకాంత్ 65 కోట్లు తీసుకోనున్నారని సమాచారం. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment