kala movie
-
ఈశ్వరి రావు ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
Kala: జంతువు కోసం మనిషి జంతువుగా మారితే!
యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా అడ్డాగా మారిపోయింది. ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాలకు సైతం పచ్చ తివాచీ పరుస్తోంది. అందులో భాగంగా తాజాగా మలయాళ హిట్ మూవీ కాలా తెలుగులో అనువాదమవుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ సోమవారం రిలీజైంది. జంతువు కోసం జంతువులా మారిన మనుషులు క్రూరంగా కొట్టుకోవడం, సౌండ్ ఎఫెక్ట్స్ దీనికి తగ్గట్లు ఉండటంతో యాక్షన్ ప్రియులను ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది మార్చి 25న థియేటర్లలో రిలీజ్ అయిన కాలా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీని కథ విషయానికొస్తే.. అనుకోకుండా జరిగిన ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన శునకం కారణంగా ఇద్దరి మధ్య ఏర్పడే భావోద్వేగాల పరంపరే కాలా. స్టోరీ లైన్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ మనుషులకు, మూగ జీవాలకు మధ్య ఉండే అనుబంధాన్ని రియలిస్టిక్ యాక్షన్‌తో కళ్లకు కట్టినట్లు చూపించారు. టొవినో థామస్‌తో పాటు సుమేష్ మూర్, దివ్యా పిళ్ళై, లాల్ పాల్, ప్రమోద్ వెల్లియానంద్ కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ త్రిల్లర్కు విఎస్ రోహిత్ దర్శకత్వం వహించాడు. టొవినో థామస్, విఎస్ రోహిత్, అఖిల్ జార్జ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జూన్ 4న ఆహాలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. చదవండి: In The Name of God : తొలిసారి ప్రియదర్శి అలా.. ముక్కలైన విమానం.. హాలీవుడ్ నటుడి దుర్మరణం -
బాలీవుడ్లో మరో వారసుడొస్తున్నాడు..
బాలీవుడ్లో వారసుల జాబితా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ లిస్ట్‌లో బాబిల్ ఖాన్ పేరు చేరింది. దివంగత ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ వారసుడే ఈ బాబిల్. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్కా శర్మ ప్రొడక్షన్ హౌస్ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీలో బాబిల్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘కాలా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. అన్విత దత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో డిమ్రీ త్రిపాఠి హీరోయిన్. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావడం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు కరోనా ఖరీదైన డ్రెస్‌లో మెరిసిన తమన్నా.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్ -
నగరానికి తమిళ సూపర్ స్టార్
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘కాలా’ సందడి చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తన కాలా చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి నగరానికి వచ్చారు. రజనీకాంత్‌ను చూడడానికి ప్రయాణికులు గుంపుగా చేరడంతో దేశీయ టెర్మినల్ వద్ద సందడి చోటు చేసుకుంది. ఆయనతో పాటు చిత్రనిర్మాణ బృందం కూడా ఉంది. -
కాలాకు మరో కష్టం
తమిళసినిమా (చెన్నై): విడుదలకు సిద్ధమైన ‘కాలా’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ముంబైలో నివసించిన తమిళుడు త్రివియం నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో తన తండ్రిని అవమానించేలా చూపారని త్రివియం కుమారుడు.. నటుడు రజనీకాంత్‌కు నోటీసులు పంపారు. 1957లో తూత్తుకుడిలో కరవు తాండవించడంతో త్రివియం ముంబై వలస వెళ్లి, అక్కడ నివసిస్తున్న తమిళులకు అండగా నిలిచారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంపై రజనీకాంత్, నిర్మాత ధనుష్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రూ.102 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. -
‘ఇంకా ఆ ఘడియ రాలేదు’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఈ వేడుకకు వచ్చిన వారంతా ఏ విషయంపై ఎదురుచూస్తున్నారో ఊహించగలను, నేనేం చేసేది.. ఇంకా ఆ సమయం రాలేదు’ అని నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. చెన్నైలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘కాలా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఆయన అనేక విషయాలను నర్మగర్భంగా ప్రస్తావించారు. రాజకీయ పార్టీ ప్రకటనపై మాత్రం ఇంకా జాప్యం జరగనున్నట్లు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘‘గత నాలుగు దశాబ్దాలుగా నా పనైపోయిందని కొందరు హేళన చేస్తూనే ఉన్నారు. తమిళనాడు ప్రజలు, ఆ దేవుడు నేను ముందుకు సాగేలా చేస్తూనే ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు, ఆక్షేపణలు చేసినా నా మార్గంలో నేను పయనిస్తూనే ఉంటా. దక్షిణాదిన నదుల అనుసంధానం నా కల. ఒకవేళ ఈ కల నెరవేరకపోయినా ఫరవాలేదు. మన ఆలోచనలే బలం, మంచి ఆలోచనలతో చెడు ఆలోచనలు తుడిచివేయండి, అపుడే జీవితం బాగుంటుంది. సినిమాల పరంగా అనేక విషయాలు మాట్లాడాను, అయితే అందరూ మరో విషయం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. నేనేం చేసేది ఇంకా ఆ తేదీ రావాలి. సమయం వస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో తమిళనాడుకు, ప్రజలకు మంచి రోజులు వస్తాయి’’అని రజనీ ప్రసంగం ముగించారు. -
యమ గ్రేటు.. కాలా సేఠు
‘కాలా’ ముంబై మాఫియా డాన్. కలర్ బ్లాక్ అవ్వొచు కానీ క్యారెక్టర్ మాత్రం ఫుల్ వైట్. మరి అలాంటి డాన్ ఇంట్రో సాంగ్ అంటే ఎలా ఉండాలి? తన గొప్పతనాన్ని పొగుడుతూనే, తన గుణాన్ని వివరించాలి. ఈ స్టైలిష్ డాన్‌కు అలాంటి పాటనే కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని మే డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘‘కాలా ఫస్ట్ సాంగ్ మీ అందరి కోసం. మాస్ డార్లింగ్‌తో అందరం కలిసి ర్యాప్ పాడదాం రండి’’ అని ధనుష్ పేర్కొన్నారు. ఈ పాటలోని కాలా గురించి వర్ణిస్తూ.. ‘‘యమ గ్రేటు.. కాలా సేఠు. భయము ఎరుగని వన్నె తరగని.. ఎంత ఎదిగినా ఒదిగినవాడు. మనము తలవగా మనసు పిలవగా కలత తీర్చడానికి ఇటు వచ్చినాడు చూడు. నలుపే మన శ్రమ జీవుల వర్ణం, గెలుపే కరికాలుడి సొంతం’’ అంటూ ర్యాప్‌తో సాగే ఈ పాటలోని లైన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో హీరోగా నటించనున్న నెక్ట్స్ సినిమాకు రెమ్యునరేషన్‌గా రజనీకాంత్ 65 కోట్లు తీసుకోనున్నారని సమాచారం. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. -
జస్ట్ చెకప్ మచ్చీ
రజనీకాంత్ రెండు వారాలపాటు అమెరికాలో ఉంటారు. షూటింగ్ కోసం కాదు. మెడికల్ చెకప్ కోసం. మెడికల్ చెకప్ కోసమా? తలైవర్ (నాయకుడు – అభిమానులు అలానే పిలుస్తారు)కి ఏమైంది? అని కంగారుపడకండి. తలైవర్ రొంబ (బాగా) ఆరోగ్యంగానే ఉన్నారు. ఇది జస్ట్ రెగ్యులర్ మెడికల్ చెకప్పే మచ్చీ. రజనీ ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఈసారి అమెరికా ప్రయాణం అయ్యారు. రజనీతో పాటు ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా వెళ్లారని సమాచారం. మే సెకండ్ వీక్ వరకూ అమెరికాలోనే ఉంటారట రజనీకాంత్. తిరిగి రాగానే తన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ మూవీ ‘కాలా’ సినిమా ప్రమోషన్లో పాల్గొంటారట. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్ పతాకంపై ధనుష్ నిర్మించారు. మామ రజనీ సినిమాను అల్లుడు ధనుష్ నిర్మించడం ఇదే ఫస్ట్ టైమ్. ‘కాలా’ సినిమా ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా రంజాన్ స్పెషల్‌గా జూన్ 7న రిలీజ్ కానుంది. -
14 కాదు.. కొన్నే!
అవును. పధ్నాలుగు కాదు.. కొన్నే! ఏంటీ కన్ఫ్యూజ్ అవుతున్నారా? మరేం లేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 14 కట్స్ ఇచ్చిందని, ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిందనే వార్త జోరుగా ప్రచారమవుతోంది. పా. రంజిత్ దర్శకత్వంలో వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై హీరో, రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వండర్‌బార్ ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ స్పందిస్తూ – ‘‘మా సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ రావడం వాస్తవమే. కానీ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారనీ, సెన్సార్ బోర్డ్ 14 కట్స్ చెప్పారని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. సెన్సార్ బోర్డ్ సభ్యులు కొన్ని కట్స్ చెప్పారు కానీ 14 మాత్రం కాదు’’ అని పేర్కొన్నారాయన. ‘కాలా’ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ బ్యానర్‌కు రజనీకాంత్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని కోలీవుడ్ టాక్. ఇది నిజం కాదని కార్తీక్ సుబ్బరాజ్ స్పష్టం చేశారు. ‘‘తలైవర్‌తో (రజనీకాంత్) నేను చేయబోయే సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉండదు. అది పూర్తి ఫిక్షన్ స్టోరీ. ఫ్యాన్స్ రజనీసార్ నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ సినిమాలో ఉంటాయి’’ అని పేర్కొన్నారు కార్తీక్ సుబ్బరాజ్. -
కాలా విడుదలను అడ్డుకునే కుట్రా.?
సాక్షి, సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాలకు టైమ్ కలిసి రావడం లేదా? ఆటంకాలు కలిగిస్తున్నారా? ఇలాంటి సందేహాలే చిత్ర పరిశ్రమలో వ్యక్తం అవుతున్నాయి. రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రాల్లో 2.ఓ ఒకటి. ఈ చిత్ర ప్రారంభమై మూడేళ్లు కావస్తోంది. గత ఏడాది దీపావళికే తెరపైకి రావలసింది. ఇప్పటికి పలుమార్లు విడుదల తేదీ మారిపోయింది. చివరిగా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించినా, అది వాయిదా పడడంతో రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెడీగా ఉండడంతో ఈ చిత్ర నిర్మాత ధనుష్ కాలాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే కాలా కూడా చిత్రపరిశ్రమ సమ్మె పోటుకు గురవుతోందనే ప్రచారం జరుగుతోందిప్పుడు. చిత్రాలు సెన్సార్ సర్టిఫికెట్ పొందాలంటే అందుకు నిర్మాతల మండలి ఒక లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కాలా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిర్మాతల మండలి అగ్గుకుంటోందని ఆ చిత్ర నిర్వాహకులు ఇటీవల జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో ఆరోపణలు చేశారు. అందుకు నిర్మాతల మండలి వివరణ ఇస్తూ సమ్మె జరుగుతుండడం వల్ల కాలా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్‌కు అనుమతి లేఖ ఇవ్వడంలో జాప్యం జరగుతోందని, అయినా వరుస క్రమంగానే అనుమతి లేఖ ఇవ్వడం జరుగుతుందని, ఆ విధంగానే కాలా చిత్రానికి అనుమతి లేఖను ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. నిర్మాతల మండలి సమ్మె కారణంగా తమ చిత్రాలకు నిర్మాతలు అనుమతి లేఖను కోరడంలో ఆసక్తి చూపడం లేదని ఈ కారణంగానే క్రమబద్ధంగా అనుమతి లేఖను అందించడంలో కాలా చిత్రానికి ఆలస్యం అవుతోందని తెలిపారు. అంతే కానీ కాలా చిత్రానికి అనుమతి లేఖ ఇవ్వడంలో ఎలాంటి సమస్యలేదని నిర్మాతల మండలి నిర్వాహకులు వివరణ ఇచ్చారు. సెన్సార్ సర్టిఫికెట్ చేతికొస్తేగానీ చిత్ర విడుదల తేదీని ప్రకటించడం కుదరదు. అయితే కాలా విడుదలకు మరో నెల రోజులు సమయం ఉన్నందున ఎంజరుగుతుందో చూడాలి. -
డాన్ ఆఫ్ ది డాన్స్!
డాన్స్ చాలామంది ఉండొచ్చు. కానీ డాన్స్‌నే డామినేట్ చేసే డాన్ ‘కాలా’. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో వండర్‌బార్ పతాకంపై దర్శక–నిర్మాత–నటుడు ధనుష్ నిర్మించిన చిత్రం ‘కాలా’. ఇందులో హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్, సముద్రఖని, నానా పటేకర్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చిత్రబృందం ఎనౌన్స్ చేసింది. ‘బాషా’, ‘కబాలి’ సినిమాల్లో డాన్ రోల్ చేసిన రజనీ ‘కాలా’ చిత్రంలోనూ డాన్ పాత్ర చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా లుక్ ఇప్పటికే బాగా ఆకట్టుకుంది. ‘కాలా’ రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి రజనీ ‘2.0’ ఈ సమ్మర్లో రిలీజ్ అవ్వడం లేదన్నది ఫిక్స్ అన్నమాట. ఈ ‘2.0’ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారు. ఈ వార్త వచ్చి రెండు రోజులైందో లేదో ఇప్పుడు వేరే డేట్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట. -
ఆమె అలాంటి పాత్రలో నటిస్తుందా..!
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కాలా. అల్లుడ, యువ హీరో ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ హూమాఖురేషి నటిస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. ఈ మాట వాస్తవం అయినా, రజనీకాంత్ కు జంటగా నటిస్తున్నది మాత్రం హీరోయిన్ ఈశ్వరీ రావు అట. మరి హూమాఖురేషి పాత్ర ఏమిటనే ఆసక్తి ప్రేక్షకుల లో మొదలైంది..? ఇందులో తను ఒక వేశ్యగా నటిస్తున్నారట. అయినా ఈ అమ్మడి పాత్ర చాలా బలమైనదిగా ఉంటుందట. ప్రస్తుతం కాలా చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఇందుకోసం ముంబాయిలోని ధారవి ప్రాంతాన్ని మరపించేలా బ్రహ్మాండమైన సెట్‌ను వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో కబాలి చిత్రంలో కంటే రాజకీయం అధికంగా ఉంటుందట. కాలాలోని రాజకీయపరమైన సంభాషణలు పెద్ద చర్చకు దారి తీస్తాయంటున్నారు. అలాంటి సంభాషణలను రజనీకాంత్ కోరి మరీ రాయించుకున్నారనే ప్రచారం సోషలో మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏదేమైనా కాలా చిత్రంపై అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయన్నది నిజం.పలు విశేషాలతో కూడిన ఈ చిత్ర రూపకల్పన శరవేగంగా జరుగుతోంది. కబాలి వంటి సెన్సేషనల్ చిత్రం తరువాత రజనీ, దర్శకుడు పా. రంజిత్ ల కాంబినేషనల్లో తెరకెక్కుతున్న చిత్రం కాలా. భాషా తరువాత అంతటి పవర్ పుల్ పాత్రలో డాన్‌గా రజనీకాంత్ ను ఈ చిత్రంలో చూడబోతున్నామంటున్నాయి చిత్ర వర్గాలు.