సాక్షి, సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాలకు టైమ్ కలిసి రావడం లేదా? ఆటంకాలు కలిగిస్తున్నారా? ఇలాంటి సందేహాలే చిత్ర పరిశ్రమలో వ్యక్తం అవుతున్నాయి. రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రాల్లో 2.ఓ ఒకటి. ఈ చిత్ర ప్రారంభమై మూడేళ్లు కావస్తోంది. గత ఏడాది దీపావళికే తెరపైకి రావలసింది. ఇప్పటికి పలుమార్లు విడుదల తేదీ మారిపోయింది. చివరిగా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించినా, అది వాయిదా పడడంతో రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెడీగా ఉండడంతో ఈ చిత్ర నిర్మాత ధనుష్ కాలాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే కాలా కూడా చిత్రపరిశ్రమ సమ్మె పోటుకు గురవుతోందనే ప్రచారం జరుగుతోందిప్పుడు. చిత్రాలు సెన్సార్ సర్టిఫికెట్ పొందాలంటే అందుకు నిర్మాతల మండలి ఒక లేఖను ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే కాలా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిర్మాతల మండలి అగ్గుకుంటోందని ఆ చిత్ర నిర్వాహకులు ఇటీవల జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో ఆరోపణలు చేశారు. అందుకు నిర్మాతల మండలి వివరణ ఇస్తూ సమ్మె జరుగుతుండడం వల్ల కాలా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్‌కు అనుమతి లేఖ ఇవ్వడంలో జాప్యం జరగుతోందని, అయినా వరుస క్రమంగానే అనుమతి లేఖ ఇవ్వడం జరుగుతుందని, ఆ విధంగానే కాలా చిత్రానికి అనుమతి లేఖను ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. నిర్మాతల మండలి సమ్మె కారణంగా తమ చిత్రాలకు నిర్మాతలు అనుమతి లేఖను కోరడంలో ఆసక్తి చూపడం లేదని ఈ కారణంగానే క్రమబద్ధంగా అనుమతి లేఖను అందించడంలో కాలా చిత్రానికి ఆలస్యం అవుతోందని తెలిపారు. అంతే కానీ కాలా చిత్రానికి అనుమతి లేఖ ఇవ్వడంలో ఎలాంటి సమస్యలేదని నిర్మాతల మండలి నిర్వాహకులు వివరణ ఇచ్చారు. సెన్సార్ సర్టిఫికెట్ చేతికొస్తేగానీ చిత్ర విడుదల తేదీని ప్రకటించడం కుదరదు. అయితే కాలా విడుదలకు మరో నెల రోజులు సమయం ఉన్నందున ఎంజరుగుతుందో చూడాలి.
కాలా విడుదలను అడ్డుకునే కుట్రా.?
Published Sat, Mar 24 2018 8:44 AM | Last Updated on Sat, Mar 24 2018 8:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment