తమిళసినిమా (చెన్నై): విడుదలకు సిద్ధమైన ‘కాలా’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ముంబైలో నివసించిన తమిళుడు త్రివియం నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో తన తండ్రిని అవమానించేలా చూపారని త్రివియం కుమారుడు.. నటుడు రజనీకాంత్‌కు నోటీసులు పంపారు. 1957లో తూత్తుకుడిలో కరవు తాండవించడంతో త్రివియం ముంబై వలస వెళ్లి, అక్కడ నివసిస్తున్న తమిళులకు అండగా నిలిచారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంపై రజనీకాంత్, నిర్మాత ధనుష్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రూ.102 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment