బెంగళూరులో ఓ థియేటర్ వద్ద ‘కాలా’ టీషర్టులతో యువకులు
సాక్షి, బెంగళూరు: అందరూ ఊహించిన విధం గానే నటుడు రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాకు కర్ణాటకలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కావేరి జలాల వివాదంపై రజనీ తమిళనాడుకు అనుకూలంగా ప్రకటన చేసినందున ఆయన సినిమాను అడ్డుకుని తీరతామని కన్నడ సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో సినిమా విడుదల కష్టసాధ్యమైంది. కొన్ని థియేటర్లు, మల్టిప్లెక్స్ ల వద్ద భారీ పోలీసు భద్రతతో కాలాను ప్రదర్శించారు.
కన్నడ రక్షణవేదిక కార్యకర్తలు, కన్నడ చళువలి వాటాల్ సంఘం నేత వాటాల్ నాగరాజ్ ఆధ్వర్యంలో బెంగళూరులో ఆందో ళనలు నిర్వహించారు. దాదాపు 200 మంది నిరసనకారులు మల్టీఫ్లెక్స్‌ల వద్ద సినిమాను అడ్డుకున్నారు. బెంగళూరు యశ్వంతపూర్‌లో ఉన్న ఓరియన్ మాల్, లిడో మాల్, మల్లేశ్వరంలో ఉన్న మంత్రి మాల్ వద్ద ఆందోళనకారులు దూసుకురాగా, పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అనేకచోట్ల నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అయినా పలు చోట్ల సినిమాను ఆందోళనకా రులు అడ్డుకోవడంతో నిర్వాహకులు మధ్య లోనే ఆపేసి ప్రేక్షకులకు టికెట్ డబ్బులను తిరిగి ఇచ్చేశారు.
రూ. 2.5 కోట్లు నష్టం..
కర్ణాటకలో రజనీకాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయన సినిమా అంటే అభి మానులు విరగబడతారు. కాలాను అడ్డుకోవ డంతో తొలిరోజు దాదాపుగా రూ. 2.5 కోట్లు నష్టం వాటిల్లింది. వారానికి రూ.12 నుంచి15 కోట్ల వ్యాపారాన్ని కాలా చిత్రం నష్టపోబోతుం దని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment