సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ సినిమా విడుదలకు కష్టాలు తప్పడం లేదు. గురువారం ఉదయం 4 గంటల నుంచే కాలా ప్రదర్శన ప్రారంభం అవ్వాల్సి ఉండగా.. కన్నడ సంఘాలు సినిమాను అడ్డుకుంటున్నాయి. రాజధాని బెంగళూరు నగరంలో కన్నడిగులు గ్రూపులుగా ఏర్పడి కాలా విడుదలయ్యే థియేటర్ల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
కాలా ప్రదర్శిస్తే సహించేది లేదని, తాము విధ్వంసం సృష్టిస్తే ఆస్తినష్టం కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని థియేటర్ల యాజమాన్యాలను బెదిరించడంతో రజనీ మూవీని కష్టాలు వెంటాడుతున్నాయి. థియేటర్లకు వచ్చిన రజనీ అభిమానులు సినిమా చూస్తామా లేదా అని నిరాశ చెందుతున్నారు. కొన్ని థియేటర్లు కొన్ని షోలు వాయిదా వేసినట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం ఆయా థియేటర్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది, కానీ సినిమా విడుదలకు సహకరిస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
కాగా, తాను ఏ తప్పూ చేయలేదని, సినిమా చూడాలనుకునే వారిని దయచేసి అడ్డుకోవద్దని.. మీ సహకారం నాకెంతో అవసరమని చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని నివాసం వద్ద మీడియా సమావేశంలో రజనీకాంత్ కన్నడలో అర్థించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విడుదలవుతున్న కాలా మూవీపై కేవలం కర్ణాటకలో వివక్ష చూపెట్టవద్దని రజనీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment