Entry Song
-
పిల్లలతో ఆటాపాటా
కమర్షియల్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వీలున్నంతగా హీరోను ఆకాశానికి ఎత్తేసేలా, ఫ్యాన్స్ విజిల్స్‌తో థియేటర్స్ దద్దరిల్లేట్టు ఉండేలా ప్లాన్ చేస్తుంటారు దర్శకులు. తాజాగా విజయ్ కొత్తచిత్రంలో ఎంట్రీసాంగ్ను వందమంది పిల్లలతో షూట్ చేస్తున్నారట. తమిళంలో హీరో విజయ్–దర్శకుడు అట్లీది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘తేరీ, మెర్సల్’ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. మూడోసారి కలసిన ఈ హిట్ కాంబినేషన్ ఫస్ట్ రెండు సినిమాలకంటే భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుంది. ఈ సినిమాలో విజయ్ పరిచయ గీతాన్ని సుమారు వందమంది పిల్లలతో షూట్ చేస్తున్నారట. దీనికోసం చెన్నైలో ఓ భారీ సెట్‌ను కూడా నిర్మించారట. స్పోర్ట్స్ బ్యాడ్రాప్‌లో సాగనున్న ఈ చిత్రంలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపిస్తారు. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. -
యమ గ్రేటు.. కాలా సేఠు
‘కాలా’ ముంబై మాఫియా డాన్. కలర్ బ్లాక్ అవ్వొచు కానీ క్యారెక్టర్ మాత్రం ఫుల్ వైట్. మరి అలాంటి డాన్ ఇంట్రో సాంగ్ అంటే ఎలా ఉండాలి? తన గొప్పతనాన్ని పొగుడుతూనే, తన గుణాన్ని వివరించాలి. ఈ స్టైలిష్ డాన్‌కు అలాంటి పాటనే కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని మే డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘‘కాలా ఫస్ట్ సాంగ్ మీ అందరి కోసం. మాస్ డార్లింగ్‌తో అందరం కలిసి ర్యాప్ పాడదాం రండి’’ అని ధనుష్ పేర్కొన్నారు. ఈ పాటలోని కాలా గురించి వర్ణిస్తూ.. ‘‘యమ గ్రేటు.. కాలా సేఠు. భయము ఎరుగని వన్నె తరగని.. ఎంత ఎదిగినా ఒదిగినవాడు. మనము తలవగా మనసు పిలవగా కలత తీర్చడానికి ఇటు వచ్చినాడు చూడు. నలుపే మన శ్రమ జీవుల వర్ణం, గెలుపే కరికాలుడి సొంతం’’ అంటూ ర్యాప్‌తో సాగే ఈ పాటలోని లైన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో హీరోగా నటించనున్న నెక్ట్స్ సినిమాకు రెమ్యునరేషన్‌గా రజనీకాంత్ 65 కోట్లు తీసుకోనున్నారని సమాచారం. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. -
ఎంట్రీ సాంగ్‌లో నిత్యామీనన్
సాధారణంగా చిత్రాల్లో ఎంట్రీ పాటతో బిల్డప్ ఇవ్వడం అనేది కథా నాయకులకే జరుగుతుంది. నాయికలకు అలా ఎంట్రీ పాటతో పరిచయం చేయడం అరుదే. అలాంటి అరుదైన నటీమణుల్లో తాజాగా నటి నిత్యామీనన్ చేరారు. పాత్రల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారించే ఈ మలయాళ కుట్టి బహు భాషా నటి అన్నది తెలిసిందే. తమిళం, మలయాళం, తెలుగు భాషలతో పాటు కన్నడంలోనూ మంచి ప్రాచుర్యం పొందారు. అయితే కన్నడంలో నిత్యామీనన్ నటిగా తొలుత పరిచయం అయ్యారన్న విషయం చాలా మందికి తెలియదు. 2006లో సెవెన్ ఓ క్లాక్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ అయ్యారు. తాజాగా తమిళం, కన్నడం భాషలలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ముడింజ ఇవనై పుడి అనే చిత్రంలో నటిస్తున్నారు. సుదీప్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని పెద్ద బిల్డప్ ఇచ్చేలా ఇంట్రో సాంగ్‌ను పొందుపరుస్తున్నారట. ఇంతకుముందు ఖుషీ చిత్రంలో మేగం కరుక్కుదు మిన్నల్ చిదిక్కుదు అనే పాట నటి జ్యోతికకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో ముడింజ ఇవనై పిడి చిత్రంలో నిత్యామీనన్‌కు ఆ ఇంట్రో సాంగ్ అంత పేరు తెచ్చిపెడుతుందంటున్నారు చిత్ర యూనిట్. ఆ పాట యువతను గిలిగింతలు పట్టిస్తుందట. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ముడింజా ఇవనై పిడి చిత్రంపై అంచనాలు పెరగడం గమనార్హం.