ఎంట్రీ సాంగ్‌లో నిత్యామీనన్ | Nithya Menen in Entry Song | Sakshi
Sakshi News home page

ఎంట్రీ సాంగ్‌లో నిత్యామీనన్

Published Mon, Dec 21 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

ఎంట్రీ సాంగ్‌లో నిత్యామీనన్

ఎంట్రీ సాంగ్‌లో నిత్యామీనన్

సాధారణంగా చిత్రాల్లో ఎంట్రీ పాటతో బిల్డప్ ఇవ్వడం అనేది కథా నాయకులకే జరుగుతుంది. నాయికలకు అలా ఎంట్రీ పాటతో పరిచయం చేయడం అరుదే. అలాంటి అరుదైన నటీమణుల్లో తాజాగా నటి నిత్యామీనన్ చేరారు. పాత్రల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారించే ఈ మలయాళ కుట్టి బహు భాషా నటి అన్నది తెలిసిందే. తమిళం, మలయాళం, తెలుగు భాషలతో పాటు కన్నడంలోనూ మంచి ప్రాచుర్యం పొందారు.
 
  అయితే కన్నడంలో నిత్యామీనన్ నటిగా తొలుత పరిచయం అయ్యారన్న విషయం చాలా మందికి తెలియదు. 2006లో సెవెన్ ఓ క్లాక్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ అయ్యారు.  తాజాగా తమిళం, కన్నడం భాషలలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ముడింజ ఇవనై పుడి అనే చిత్రంలో నటిస్తున్నారు. సుదీప్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని పెద్ద బిల్డప్ ఇచ్చేలా ఇంట్రో సాంగ్‌ను పొందుపరుస్తున్నారట.
 
 ఇంతకుముందు ఖుషీ చిత్రంలో మేగం కరుక్కుదు మిన్నల్ చిదిక్కుదు అనే పాట నటి జ్యోతికకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో ముడింజ ఇవనై పిడి చిత్రంలో నిత్యామీనన్‌కు ఆ ఇంట్రో సాంగ్ అంత పేరు తెచ్చిపెడుతుందంటున్నారు చిత్ర యూనిట్. ఆ పాట యువతను గిలిగింతలు పట్టిస్తుందట. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ముడింజా ఇవనై పిడి చిత్రంపై అంచనాలు పెరగడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement