పాత్ర నచ్చితే చాలు చిన్న పెద్ద సినిమా అనే తేడా చూపకుండా నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. హీరో ఎవరైనా సరే నిత్యా మీనన్ పాత్ర మాత్రం చాలా ఆ సినిమాలో కీలకంగా ఉంటుంది. భారీ సినిమా, పారితోషికం ఎక్కువ అని సినిమాలు ఒప్పుకొదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలో నటిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.
(చదవండి: అభిమానులకు విజయ్ పిలుపు.. మొదటి సభకు ఏర్పాట్లు)
‘70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపిక అవుతానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పాత్రలను ఎంపిక చేసుకుంటా. . భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వచ్చినా నటించను. అలాంటి పాత్రలంటే నాకు ఆసక్తి ఉండదు. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తా’ అని నిత్యా మీనన్ అన్నారు.
(చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి)
కాగా, ‘తిరు’ సినిమాకుగాను నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, రాఖీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో స్నేహితురాలిగా నిత్యమీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ‘గోల్డెన్ వీసా’, ఇడ్లికడై అనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment