national awards
-
గ్రూప్-3 పరీక్షలో ఆస్కార్, జాతీయ అవార్డ్స్‌పై సినిమా ప్రశ్నలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల్లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ అవార్డ్స్ గురించి ఒక ప్రశ్న రాగా.. ఆస్కార్ అవార్డ్స్ గురించి మరో ప్రశ్న రావడం జరిగింది. నవంబర్ 17,18 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్ష నిర్వహిస్తుంది. అయితే, ఈ ఆదివారం ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు సినిమా పరిశ్రమ నుంచి ఈ క్రింది ప్రశ్నలు రావడం జరిగింది.1. కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది ?A) ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్B) ఆట్టంC) బ్రహ్మాస్త్ర D) కాంతార2. ఆస్కార్ అవార్డు -2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం 'టు కిల్ ఎ టైగర్' దర్శకుడు ఎవరు ?A) ఆర్. మహదేవన్B) నిఖిల్ మహాజన్C) కార్తికి గొన్సాల్వ్స్D) నిషా పహుజాఆస్కార్ 2024, 70వ జాతీయ ఆవార్డ్స్ ప్రకటన కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ రెండు ప్రశ్నలకు చాలామందికి సమాధానం తెలిసే ఉండవచ్చు. ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం 'ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్'. ఇదీ మరాఠీ చిత్రం. రెండో ప్రశ్నకు జవాబు 'నిషా పహుజా'. రంజిత్ అనే రైతు 13 ఏళ్ల కూతురు సామూహిక అత్యాచారానికి గురైన కేసుపై తీసిన సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
అలాంటి సినిమాల్లో నటించను : నిత్యా మీనన్
పాత్ర నచ్చితే చాలు చిన్న పెద్ద సినిమా అనే తేడా చూపకుండా నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. హీరో ఎవరైనా సరే నిత్యా మీనన్ పాత్ర మాత్రం చాలా ఆ సినిమాలో కీలకంగా ఉంటుంది. భారీ సినిమా, పారితోషికం ఎక్కువ అని సినిమాలు ఒప్పుకొదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలో నటిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.(చదవండి: అభిమానులకు విజయ్ పిలుపు.. మొదటి సభకు ఏర్పాట్లు)‘70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపిక అవుతానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పాత్రలను ఎంపిక చేసుకుంటా. . భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వచ్చినా నటించను. అలాంటి పాత్రలంటే నాకు ఆసక్తి ఉండదు. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తా’ అని నిత్యా మీనన్ అన్నారు. (చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి)కాగా, ‘తిరు’ సినిమాకుగాను నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, రాఖీ ఖన్నా హీరోయిన్గా నటించింది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో స్నేహితురాలిగా నిత్యమీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ‘గోల్డెన్ వీసా’, ఇడ్లికడై అనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. -
నేషనల్ అవార్డ్స్ లో బాలీవుడ్ కి బిగ్ షాక్
-
ఆ అవార్డుకు రిషబ్ శెట్టి అర్హుడు: అల్లు అర్జున్
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన రిషబ్ శెట్టి, ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన నిత్యామీనన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు‘నేషనల్ అవార్డు విన్నర్స్ అందరికి నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.అవార్డు బాధ్యత పెంచింది : చందూ మెండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సంగతి తెలిసిందే. -
జగనన్న మహిళా మార్టులకు జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని మహిళలకు ఉపాధి చూపడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసి న సంస్కరణలకు మరోసారి జాతీయ స్తాయి గుర్తింపు లభించింది. ‘దీన్ దయాళ్ అంత్యోదయ యోజ న–జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్’ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకుగా ను పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)ను అ వార్డులు వరించాయి. 2023–24 సంవత్సరానికి గా ను సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ (స్పార్క్) అవార్డు, పెర్ఫార్మెన్స్ రికగ్నేషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్సియల్ ఇంక్లూజన్ అండ్ స్ట్రీట్ వెండోర్స్ ఎంపవర్మెంట్ (ప్రయిస్) పురస్కారం వచ్చాయి.ఈ అవార్డులు మెప్మాకు రావడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. గురువారం న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సహాయమంత్రి తోఖాన్ సాహు చేతుల మీదుగా మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి అవార్డులను అందుకున్నారు. స్టేట్ మిషన్ మేనేజర్లు ఆది నారాయణ, రంగాచార్యులు, ఎన్ఎన్ఆర్ శ్రీనివాస్, ప్రభావతి పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం కృషితో..సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందించే నగదుతో మహిళలను స్వయం ఉపాధి వైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంత మహిళలను ప్రోత్సహించి 2 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యుల భాగస్వామ్యంతో జగనన్న మహిళా మార్టులను 15 మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలే పెట్టుబడిదారులు, ఉద్యోగులు, నిర్వాహకులు, వాటాదార్లుగా ఉన్న ఈ మార్టులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది లాభాలను ఆర్జిస్తున్నాయి. మార్టులు ఏర్పాటు చేసిన అతితక్కువ కాలంలోనే రూ.60 కోట్లకు పైగా వ్యాపారం చేయడం గమనా ర్హం. వీటి నిర్వహణ పనితీరును పరిశీలించిన కేంద్రం స్పార్క్ అవార్డు ప్రదానం చేసింది. ఆర్థిక చేయూత, సాధికారత సాధించడంలో మెప్మా విభాగం అత్యుత్తమ పనితీరు కనబర్చింది. వీధి వ్యాపారులకు సరైన సమయంలో ఆర్థిక సాయం అందించడంతో పాటు వారు సరైన మార్గంలో వ్యాపారాలు చేసేలా ప్రోత్సహించినందుకుగాను ప్రయిస్ అవార్డును ప్రదానం చేశారు. -
టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ను జాతీయ స్థాయిలో ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలు వరించాయి. రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో ఈ అవార్డులు లభించాయి. నష్టాలను అధిగమించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో అంతర్గతంగా చేస్తున్న కొత్త ఆవిష్కరణలకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) 2022–23కుగాను తెలంగాణ ఆర్టీసీని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. నాలుగు ఫస్ట్.. ఒకటి సెకండ్.. రోడ్డు భద్రత విభాగానికి సంబంధించి మఫిసిల్ కేటగిరీ (బస్సుల సంఖ్య 4,001–7,500 ఉన్న సంస్థల పరిధి)లో ఆర్టీసీ మొదటి స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ... రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమేయం తక్కువ ఉండేలా చూడటంలో టీఎస్ఆర్టీసీ తొలి నుంచీ టాపర్‌గా ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు కారణమైన నిష్పత్తి 0.05గా ఉంది. ఇంధన పొదుపులోనూ ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరుకు తిరిగే కిలోమీటర్ల (కేఎంపీఎల్) విషయంలో ఉత్తమంగా నిలిచింది. మఫిసిల్ కేటగిరీలో 5.35 కేఎంపీఎల్‌తో మొదటి స్థానం, పట్టణ ప్రాంతాల కేటగిరీలో 4.61 కేఎంపీఎల్‌తో రెండో స్థానంలో నిలిచింది. టీఎస్ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరు డీజిల్‌కు దాదాపు 5.14 కి.మీ. మేర తిరుగుతున్నాయి. ఇక సిబ్బంది సంక్షేమం, ఉత్పాదకత కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. గతేడాది ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసింది. తీవ్ర గుండె సమస్యలున్న 250 మందిని గుర్తించి వారికి చికిత్సలు అందిస్తోంది. సిబ్బంది నైపుణ్యం పెరిగేలా సామూహిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. వాటికి ఈ పురస్కారం లభించింది. డిజిటల్ కార్యక్రమాల అమలు విభాగంలోనూ సంస్థకు మొదటి స్థానం సాధించింది. ప్రయాణికులు, సిబ్బంది కోసం కొత్త యాప్‌లు, టికెట్ల రిజర్వేషన్ పద్ధతిలో మార్పులు, బస్ ట్రాకింగ్ కోసం గమ్యం యాప్ తదితరాలకు ఈ పురస్కారం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ పురస్కారాలు లభించాయని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనగా ఉత్తమ పనితీరుతో టీఎస్ఆర్టీసీ దేశంలోని ఇతర ఆర్టీసీలకు ఆదర్శంగా నిలిచిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు. -
రాష్ట్ర విద్యుత్ సంస్థలకు జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరోసారి తమ ప్రతిభను నిరూపించాయి. రెండు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ (ఐఎస్ఓఏ) అప్లికేషన్కుగానూ స్కోచ్ సెమీ ఫైనలిస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో) దక్కించుకుంది. ఈ అప్లికేషన్‌ను ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) అభివృద్ధి చేసింది. అలాగే పంప్డ్ స్టోరేజ్ పవర్ (పీఎస్పీ) ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించినందుకుగానూ ఉత్తమ నోడల్ ఏజెన్సీగా బిజినెస్ కనెక్ట్ అవార్డును ఏపీ నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) కైవసం చేసుకుంది. అవార్డులు వచ్చాయి ఇలా.. డిస్కంలు ఓపెన్ యాక్సెస్ (ఓఏ) వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్రంలో వివిధ పవర్ డెవలపర్లు అనేక పవర్ ప్లాంట్లను స్థాపించారు. ఓఏ వినియోగదారులలో వేగవంతమైన పెరుగుదల కారణంగా, నోడల్ ఏజెన్సీ అయిన ఏపీఎస్‌ఎల్‌డీసీ, ఎనర్జీ బిల్లింగ్ సెంటర్ (ఈబీసీ) సకాలంలో నెలవారీ విద్యుత్, డిమాండ్ సెటిల్మెంట్లు చేయటం కష్టంగా మారింది. దీంతో బహుళ ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు వివిధ ఓపెన్ యాక్సెస్ జనరేటర్ల నుంచి విద్యుత్ సరఫరాను పొందడంలో జాప్యం జరిగేది. దీంతో ఏపీఎస్‌ఎల్‌డీసీ అంతర్గత ఐటీ బృందం ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ల ఆలస్యాన్ని తగ్గించేందుకు ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ సెటిల్మెంట్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. దీనివల్ల ఈ ప్రక్రియ సులభం అయ్యింది. ఇక పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్‌ను ప్రోత్సహించడానికి అనువుగా ఉన్న ప్రదేశాలను గుర్తించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. 44.79 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యం ఉన్న 39 అనువైన ప్రదేశాల్లో టెక్నో–కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ (టీసీఎఫ్‌ఆర్)ను నెడ్కాప్ తయారు చేసింది. అలాగే 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్, 2,300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాలతో కూడిన 4,280 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ (ఐఆర్ఈపీఎస్) పాణ్యం మండలం పిన్నాపురం వద్ద నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. ఈ చర్యలు జాతీయ స్థాయిలో అవార్డులు రావడానికి కారణమయ్యాయి. సీఎం సహకారంతోనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతోనే రాష్ట్ర విద్యుత్ సంస్థలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధిస్తున్నాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. జాతీయ అవార్డులు వరించిన సందర్భంగా స్థానిక విద్యుత్ సౌధలో అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల అలుపెరగని కృషితో ఏపీ విద్యుత్ సంస్థలు భవిష్యత్తులో కూడా మరెన్నో అవార్డులు సాధించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ అవార్డులు సాధించిన ఏపీ ట్రాన్స్‌కో, నెడ్కాప్ను అభినందించారు. ఈ సమావేశంలో ఏపీజెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, నెడ్కాప్ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి. మల్లారెడ్డి, డైరెక్టర్ (గ్రిడ్) ఏకేవీ భాస్కర్, డైరెక్టర్ (ఫైనాన్స్) టీ వీరభద్రారెడ్డి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
స్వచ్ఛతలో 5వ ర్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏటా అందజేసే ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. పరిశుభ్రమైన నగరాలు (క్లీన్ సిటీస్), అతి పరిశుభ్రమైన (క్లీనెస్ట్) కంటోన్మెంట్, సఫాయిమిత్ర సురక్ష, గంగా టౌన్స్, మంచి పనితీరు కనబరచిన రాష్ట్రాలు (బెస్ట్ పెర్ఫారి్మంగ్ స్టేట్స్) కేటగిరీలన్నీ కలిపి 110 అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణకు నాలుగు జాతీయ అవార్డులు లభించగా.. మొత్తం 3,029.32 పాయింట్లతో రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది క్లీనెస్ట్ సిటీ అవార్డును ఉమ్మడిగా ఇండోర్, సూరత్‌లు గెలుచుకున్నాయి. ఆలిండియా క్లీన్ సిటీ కేటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 9వ ర్యాంకును కైవసం చేసుకుంది. మరికొన్ని అవార్డులు లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీలో తెలంగాణలో క్లీన్ సిటీగా గుండ్ల పోచంపల్లి అవార్డు గెలుచుకుంది. 25 వేలు –50 వేలు జనాభా కేటగిరీలో సౌత్ జోన్లో క్లీన్ సిటీగా నిజాంపేట్, 50 వేలు – 1 లక్ష జనాభా కేటగిరీలో సౌత్ జోన్లో క్లీన్ సిటీగా సిద్దిపేట స్థానిక సంస్థలు అవార్డులు కైవసం చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఓడీఎఫ్ కేటగిరీలో 19, ఓడీఎఫ్+ కేటగిరీలో 77, ఓడీఎఫ్++ కేటగిరీలో 45, వాటర్+ కేటగిరీలో 2 స్థానిక సంస్థలు ఉన్నాయి. చెత్త రహిత నగరాల్లో హైదరాబాద్‌కు 5 స్టార్ రేటింగ్ రాగా, సిద్దిపేట, నిజాంపేట్, గుండ్ల పోచంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పీర్జాదిగూడ, సిరిసిల్ల, భువనగిరి, నార్సింగి స్థానిక సంస్థలకు 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. గురువారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీలు అవార్డులను అందజేశారు. -
ఏపీ జిల్లాలకు పలు జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులు ప్రకటించింది. వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ అమలులో ఏపీకి జాతీయ అవార్డులు దక్కాయి. వ్యవసాయ ఉత్పత్తుల కేటగిరీలో అల్లూరి జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. కాఫీ సాగుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉత్తమ జిల్లాగా నిలిచింది. వ్యవసాయేతర ఉత్పత్తుల సాగులో దేశంలోనే ఉత్తమ జిల్లాకు కాకినాడకు జాతీయ అవార్డు దక్కింది. అన్నమయ్య, గుంటూరు జిల్లాలు స్పెషల్ మెన్షన్ అవార్డులకు ఎంపికయ్యాయి. -
మౌలానా ఆజాద్ జాతీయ అవార్డులు అందించిన సీఎం వైఎస్ జగన్
-
అల్లు అర్జున్‌పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని జాతీయస్థాయిలో అవార్డులను పొందాయి. ఈ ఘనతను పురస్కరించుకుని మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. టాలీవుడ్లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన విషయం. కానీ.. ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రావడం లేదు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదు? బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణం. రాజమౌళి మన తెలుగు సినిమాని ఆస్కార్‌కు తీసుకువెళితే అది తెలుగు పరిశ్రమకు, తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రకాష్ రాజ్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు రావడం తెలుగు సినిమా గర్వకారణం. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు ఎందుకంటే అల్లు అర్జున్ కష్టం అలాంటిది. తను మొదటి సినిమా చేస్తున్నప్పుడు అల్లు అరవింద్‌గారు బన్నీని ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లమంటే.. నేను ఇతర సినిమా షూటింగ్స్‌లో ఉన్నపుడు అల్లు అర్జున్ వచ్చి ట్రైపాయిడ్ కెమెరా దగ్గర కింద కూర్చుని నన్ను చూస్తున్న క్షణాలు నాకు గుర్తున్నాయి. తరువాత మేము గంగోత్రి చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో నేను తన నటన చూసి అల్లు అరవింద్‌తో 'దిస్ బోయ్ విల్ గ్రో' అన్నాను. నేను బన్నీలో ఉన్న ఆకలి చూశాను. బన్నీ ఈ రోజు ఉన్న చాలా మంది యువతకి ఒక ఉదాహరణగా నిలిచాడు. నువ్వు ఇప్పుడెలా ఉన్నావనేది కాదు.. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలుంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితే ఈ రోజు బన్నీకి జాతీయ అవార్డు వచ్చింది. బన్నీకి జాతీయ అవార్డు వస్తే నా బిడ్డకి వచ్చినట్టు భావిసున్నా. నాకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే అక్కడివారు తక్కువగా చూసేవారు. కానీ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు తెలువారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనకి అవార్డు వస్తేనే కాదు మనవాళ్లకి వస్తే కూడా మనకి వచ్చినట్టు. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు కానీ ఇదెందుకు మన సినీ పెద్దలకి రావట్లేదు? మన సినిమాతో బౌండరీస్ దాటేస్తున్న సమయంలో అవతలి వాళ్లకంటే మన వాళ్లని మనం గౌరవించకపోతే ఎలా..? అంటూ ప్రకాష్ రాజ్ సినీ పెద్దలను ప్రశ్నించారు. -
సినిమాలు... కళాకారులు సమాజంలో మార్పుకి సారథులు
‘‘జాతీయ అవార్డుల ప్రదానం భారతదేశంలోని భిన్నత్వాన్నీ, అందులో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్నీ సూచిస్తోంది. సినిమా అనేది కేవలం వ్యాపారమో, వినోదమో కాదు... శక్తిమంతమైన మాధ్యమం. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉపయోగ పడుతుంది. సమస్యల పట్ల సున్నితత్వాన్ని పెంచుతుంది. అర్థవంతమైన సినిమాలు సమాజంలోని, దేశంలోని సమస్యలను, విజయాలను ఆవిష్కరిస్తాయి. ముర్ము నుంచి పురస్కారం అందుకుంటున్న కీరవాణి సినిమాలు, కళాకారులు సమాజంలో మార్పుకు సారథులు. దేశం గురించి సమాచారం అందించడంతో పాటు ప్రజల మధ్య అనుబంధం పెరగడానికి సినిమా కారణం అవుతుంది. సమాజానికి ప్రతిబింబం, మెరుగుపరిచే మాధ్యమం సినిమాయే. ప్రతిభ ఉన్న ఈ దేశంలో సినిమాతో అనుబంధం ఉన్న ప్రతిభావంతులు ప్రపంచ స్థాయిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పి, దేశ అభివృద్ధికి ముఖ్య కారణం అవుతారు’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం జరిగిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డులు అందించారు. 2021 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును నటి వహీదా రెహమాన్, ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ (పుష్ప), ఉత్తమ నటి అవార్డును ఆలియా భట్ (గంగూబాయి కతియావాడి), కృతీ సనన్ (మిమి) అందుకున్నారు. ఉత్తమ చిత్రం (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ – హిందీ) అవార్డును దర్శకుడు ఆర్. మాధవన్, ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ (మరాఠీ ఫిల్మ్ – గోదావరి) అవార్డు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘ఉప్పెన’కు దర్శకుడు బుచ్చిబాబు సన, నిర్మాత నవీన్ యెర్నేని పురస్కారాలు స్వీకరించారు. పూర్తి స్థాయి వినోదం అందించిన ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’కు నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు దాసరి కల్యాణ్, దర్శకుడు రాజమౌళి అవార్డులు అందుకున్నారు. ఇదే చిత్రానికి ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్‌కి ఎంఎం కీరవాణి, నేపథ్య గాయకుడుగా ‘కొమురం భీముడో..’ పాటకు కాలభైరవ, యాక్షన్ డైరెక్షన్ కి కింగ్ సాల్మన్, కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస మోహన్ పురస్కారాలు అందుకున్నారు. చంద్రబోస్ ఇంకా ఉత్తమ సంగీతదర్శకుడిగా ‘పుష్ప: ది రైజ్’కి దేవిశ్రీ ప్రసాద్, ‘కొండ΄పోలం’ చిత్రంలో ‘ధంధం ధం..’ పాటకు గాను ఉత్తమ రచయిత అవార్డును చంద్రబోస్, ఉత్తమ సినీ విమర్శకుడిగా పురుషోత్తమాచార్యులు (తెలుగు), ఇంకా పలు భాషలకు చెందిన కళాకారులు పురస్కారాలను స్వీకరించారు. ఈ వేదికపై వహీదా గురించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ – ‘‘వహీదా చక్కని నటనా నైపుణ్యం, మంచి వ్యక్తిత్వంతో చిత్ర పరిశ్రమలో శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఆలియా భట్ వ్యక్తిగత జీవితంలోనూ ఒక మహిళగా హుందాతనం, ఆత్మవిశ్వాసంతో తనదైన ముద్ర వేసుకున్నారు. మహిళా సాధికారత కోసం మహిళలే చొరవ తీసుకోవాలని సూచించేలా వహీదా ఉదాహరణగా నిలిచారు’’ అన్నారు. ‘‘ప్రపంచంలో మంచి కంటెంట్ హబ్‌గా భారత శక్తి సామర్థ్యాలను నిరూపించడానికి ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్) రంగం ఉపయోగపడుతుంది’’ అన్నారు అనురాగ్ ఠాకూర్. కృతీ సనన్ సినిమా అనేది సమష్టి కృషి – వహీదా రెహమాన్ స్టాండింగ్ ఒవేషన్ మధ్య ఒకింత భావోద్వేగానికి గురవుతూ పురస్కారం అందుకున్న వహీదా రెహమాన్ మాట్లాడుతూ– ‘‘దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. నేనిక్కడ ఉన్నానంటే దానికి కారణం నేను భాగమైన ఈ అద్భుతమైన ఇండస్ట్రీ. అగ్రదర్శకులతో, నిర్మాతలతో, సాంకేతిక నిపుణులతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్, డైలాగ్ రైటర్స్... ఇలా అందరి గురించి ప్రస్తావించాలి. ఈ అవార్డు తాలూకు ఆనందాన్ని అన్ని సినీ శాఖలవారితో పంచుకోవాలనుకుంటున్నాను. ఏ ఒక్కరో సినిమా మొత్తాన్ని రూ΄పోందించలేరు. సినిమా సమష్టి కృషి. ఇది పరిశ్రమ మొత్తానికి దక్కిన పురస్కారం’’ అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కమర్షియల్ సినిమా అయిన పుష్పకు అవార్డు దక్కడం మాకు నిజంగా డబుల్ అచీవ్మెంట్. – అల్లు అర్జున్ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీయడం నా మొదటి లక్ష్యం. అలాంటి సినిమాలకు అవార్డులు రావడం బోనస్ లాంటిది. ముగ్గురు.. నలుగురు.. ఎంతో మంది టెక్నీషియన్లతో కలిసి చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం... మా సినిమాకు ఆరు అవార్డులు రావడం ఆనందదాయకం. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన తొలి రోజు ఎంతో ఉత్కంఠతో ఉన్న మాకు ప్రశంసలు రావడం మరచిపోలేని ఘటన. – దర్శకుడు రాజమౌళి ‘ఉప్పెన’ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్, రవి, మా గురువు సుకుమార్ వల్లే సాధ్యమైంది. వైష్ణవ్, కృతీ, విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్‌లకు ధన్యవాదాలు. – దర్శకుడు బుచ్చిబాబు సన ‘ఆర్ఆర్ఆర్’లో పని చేయడం నాకో మంచి అవకాశం. ఇది దేవుడు ఇచ్చిన బహుమతి. రాజమౌళి నాకు గురువు. నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు – స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సాల్మన్ -
‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’లో చేనేత హవా
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా–ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) జాతీయ అవార్డుల ప్రక్రియ తుది దశకు చేరింది. ఓడీఓపీ జాతీయ అవార్డు–2023కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 25నుంచి జూలై 31 మధ్య దేశంలోని 751 జిల్లాల నుంచి 1,102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళా ఉత్పత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. వడపోత అనంతరం దేశంలో మొత్తం 63 ఉత్పత్తులను పరిశీలనకు తీసుకున్నారు. వాటిలో ఏపీ నుంచి 14 ఉత్పత్తులకుచోటు లభించింది. వీటిని ఇన్వెస్ట్ ఇండియా బృందం (జాతీయ స్థాయి టీమ్) క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ నెల 10న మొదలైన ఈ బృందం పర్యటన ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. 14 ఉత్పత్తులు ఇవే.. రాష్ట్రం నుంచి పరిశీలనకు ఎంపికైన ఉత్పత్తులలో పొందూరు ఖద్దరు (శ్రీకాకుళం), బొబ్బిలి వీణ (విజయనగరం), అరకు కాఫీ (ఏఎస్ఆర్), సముద్ర రొయ్యలు (విశాఖ), పులగుర్త చొక్కాలు, చీరలు (తూర్పుగోదావరి), ఉప్పాడ జాందానీ చీరలు (కాకినాడ), కొబ్బరి, కొబ్బరి పీచు (అంబేడ్కర్ కోనసీమ), మంగళగిరి చేనేత చీరలు (గుంటూరు), పెద్ద రొయ్యలు (బాపట్ల), ఉదయగిరి చెక్క కత్తిపీట (నెల్లూరు), చేనేత సిల్క్ చీరలు (కర్నూలు), మదనపల్లె సిల్క్ చీరలు (అన్నమయ్య), సిల్క్ చీరలు (శ్రీ సత్యసాయి), వెంకటగిరి చీరలు (తిరుపతి) ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇండియా తరఫున ఆరాధన, హరిప్రీత్‌సింగ్, నమీర అహ్మద్, రాబిన్ ఆర్ చెరియన్, సోనియా, ఆకాంక్ష, జిగిషా తివారీ బృందం వేర్వేరుగా 8 రోజులపాటు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవార్డుకు ఎంపికైతే మంచి మార్కెటింగ్ వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తుల ప్రతిభను వెలికితీసి వాటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓడీఓపీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహించేలా అవార్డులు ఇస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 24 జిల్లాల్లో ప్రత్యేకత సంతరించుకున్న 38 రకాల ఉత్పత్తులను ఎంపిక చేసి ఓడీఓపీ జాతీయ అవార్డుకు దరఖాస్తు చేశాం. ఏపీ నుంచి 14 ఉత్పత్తులను తుది పరిశీలనకు ఎంపిక చేయగా.. వాటిలో 8 చేనేత వస్త్రాల ఉత్పత్తులు ఉండటం గొప్ప విషయం. జాతీయ అవార్డుకు ఎంపికైన వాటికి మార్కెటింగ్ రంగంలో మంచి గుర్తింపు లభించి ఆయా జిల్లాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుంది. – కె.సునీత, ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర చేనేత జౌళి శాఖ -
తెలంగాణ పల్లెకు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ/చిన్నకోడూరు(సిద్దిపేట): రెండు తెలంగాణ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన జనగామ జిల్లా పెంబర్తితోపాటు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం ఈ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. చంద్లాపూర్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల మంత్రి హరీశ్‌రావు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. హరీశ్‌రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. పెంబర్తి... చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీక ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్రం చొరవతీసుకుంది. చంద్లాపూర్.. కళాత్మకత, చేనేతల కలబోత రంగనాయక స్వామి ఆలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభా మ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యా నికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబో తకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పె రుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీర ల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు గ్రామీ ణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటు గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కార ణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవతో చంద్లాపూర్ లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. -
మెగా ఫ్యాన్స్ సపోర్ట్‌తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే
‘‘ఒకరు అదే పనిగా మనల్ని విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే... బయటకు చెప్పలేం... చాలా అవమానాలుంటాయి.. నాది అత్యాస.. నాకు అన్నీ కావాలి... నేషనల్ బెస్ట్ హీరో అని ఊరికే ఇచ్చేయరు’’... ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు అల్లు అర్జున్. ‘జాతీయ ఉత్తమ నటుడు’ అవార్డు దక్కించుకున్న ఆనందంలో ఉన్న అల్లు అర్జున్‌తో శనివారం జరిపిన ఇంటర్వ్యూలోని విశేషాలు ఈ విధంగా... ► జాతీయ ఉత్తమ నటుడి ప్రకటన రాగానే మీ రియాక్షన్? అల్లు అర్జున్: ఇంగ్లీష్‌లో ఎలైటెడ్ (ఉక్కిరి బిక్కిరి.. పట్టరానంత ఆనందం...) అంటారు. నా ఫీలింగ్ అదే. అయితే ఈ అవార్డు నాకు వచ్చింది నా వల్ల కాదు. సుకుమార్ వల్ల వచ్చిందన్నది నా ఫస్ట్ ఫీలింగ్. అవార్డు ప్రకటన రాగానే నేను, సుకుమార్ ఆప్యాయంగా హత్తుకుని, ఆ ఉద్విగ్న క్షణాల్లో అలా ఓ నిమిషానికి పైగా ఉండిపోయాం. మైత్రీ మూవీ మేకర్స్ కాకుండా ‘పుష్ప’ని ఎవరు తీసినా ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. నాతో ‘పుష్ప’ తీశారని అలా అనడంలేదు. ‘రంగస్థలం’ చూసినçప్పుడే ‘మైత్రీ సపోర్ట్ చేసింది కాబట్టే నువ్వు అనుకున్న సినిమా తీయగలిగావు. ఈ సినిమాని వేరే ఏ బేనర్‌తో చేసినా తీయలేకపోయేవాడివి’ అని సుకుమార్‌తో అన్నాను. ‘పుష్ప’కి కూడా ఇదే వర్తిస్తుంది. ► ఈ తరంలో తెలుగులో ఉన్న ‘బెస్ట్ యాక్టర్స్’లో మీరు ఒకరు. ముందు తరాల్లో ఎందరో ‘బెస్ట్ యాక్టర్స్’ ఉన్నారు. వారికి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు లభించలేదు. ఈ విషయంపై మీ అభి్రపాయం.. నాకు అవార్డు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో.. ముందు తరాల వారికీ, నా సమకాలీన నటులకు అవార్డు రాలేదన్నది అంతే బాధాకరమైన విషయం. వారంతా అర్హులే. జాతీయ అవార్డు దక్కించుకునే స్థాయి నటనను అందరూ ప్రదర్శించారు. కానీ ఎందుకో వారికి రాలేదు. సామర్థ్యం లేక వారికి అవార్డులు రాలేదనుకుంటే అది మన తెలివితక్కువతనమే. మన పరిశ్రమలో ఎప్పుడూ గొప్ప నటులు ఉంటూనే ఉన్నారు. కానీ ఎందుకో కుదర్లేదు.. ఈసారి కుదిరింది. ► అంటే.. కాస్త అదృష్టం కూడా కలిసి రావాలంటారా? అదృష్టాన్ని నమ్మను. మన కృషి మనం చేస్తూ ఉంటే సరైన చాన్స్, టైమ్ వచ్చినప్పుడు కొడితే ఆ పాయింట్‌ను అదృష్టం అంటా. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే విషయంలో నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాను. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలకు దేశవ్యాప్త గుర్తింపు దక్కడం, తెలుగు సినిమాలపై అందరి దృష్టి పడటం అనేది అవకాశం. సో... నా కృషికి చాన్స్, టైమ్ కలిసి స్ట్రైక్ అయ్యాయి. ఇది లక్ అంటాను. ► మీ 20 ఏళ్ల సక్సెస్ఫుల్ కెరీర్లో మీ కుటుంబం, అభిమానుల, ఇండస్ట్రీ భాగస్వామ్యం ఎంత.. నా సక్సెస్‌లో అందరి సపోర్ట్ ఉంది. ఏ సపోర్ట్ లేదని అనలేను. నా ఫ్యామిలీ, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఎక్కువ శాతం ఉన్న నా సొంత ఫ్యాన్స్ సపోర్ట్‌తో పాటు మెగా ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ ప్రోత్సాహం కూడా ఉంది. ► మీ కెరీర్ ఫస్ట్ మొదలైంది మెగా ఫ్యాన్స్ సపోర్ట్‌తోనే. ఆ తర్వాత మీకు సొంత ఆర్మీ (అభిమానులు) ఏర్పాటైంది. ఇలా ఓన్ ఫ్యాన్ బేస్ డెవలప్ అయ్యాక పాజిటివిటీతో పాటు నెగటివిటీ కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఎలా చూస్తారు.. నేనే కాదు.. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఒకచోటు నుంచి మొదలై, జీవితంలో ఎదిగే క్రమంలో కొంత టైమ్ గడిచాక తనకంటూ ఓ డెవలప్మెంట్ జరుగుతుంది. అది సహజం.. ఇందుకు ఉదాహరణగా చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల కన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇదొక సహజమైన ప్రయాణం. ► కానీ ఎక్కడ మొదలయ్యారో ఆ నీడలో ఉండాలని వేరేవాళ్లు అనుకోవడం సహజంగా జరుగుతుంటుంది.. నేనేమనుకుంటానంటే.. ఒకరు విశేషంగా ఎదుగుతూ, ఓ లెవల్‌కి వచ్చాక.. వారు మన దగ్గర ఉండలేరని వారికే అర్థం అయిపోతుంది.. వాళ్లు ఇక్కడ సరిపోరని. అది పేరెంట్స్ అయినా కావొచ్చు.. ఫ్యామిలీలో ఎవరైనా కావొచ్చు. అయితే వాళ్లు ఎప్పుడు కోరుకుంటారంటే.. వాళ్లకంటే తక్కువగా ఉన్నప్పుడో.. ఇప్పుడు వాళ్లు ఎంత ఉన్నారో.. మనం అంతే ఉన్నప్పుడు ఎందుకు బయటకు వెళ్లాలని కోరుకుంటారు. అదే మనం ‘టెన్ ఎక్స్’ ఎదిగాం అనుకుంటే అప్పుడు వాళ్లు కోరుకోరు. ఇదంతా సైజ్ డిఫరెన్స్పై ఆధారపడి ఉంటుంది. ► చిరంజీవిగారి ఇంటికి వెళ్లారు కదా. ఆయన స్పందన.. చిరంజీవిగారు చాలా మంచి మాట అన్నారు. ఓ జాతీయ అవార్డు రావడానికి ఓ నటుడికి కావాల్సిన కారణాలు ఇరవై ఉంటే.. అన్ని కారణాల్లోనూ నువ్వు వంద మార్కులు కొడతావ్ అన్నారు. బాడీ లాంగ్వేజ్.. మేకప్ కావొచ్చు... సంభాషణల ఉచ్చారణ కావొచ్చు.. ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. చిరంజీవిగారికి ఉన్న అనుభవంతో ఓ విషయాన్ని ఆయన మనకన్నా బాగా చూడగలరు. బాగా పెర్ఫార్మ్ చేశావ్. చెప్పాలంటే.. నీకు ఇవ్వకపోతే తప్పయిపోయేది అనే స్థాయిలో పెర్ఫార్మ్ చేశావన్నారు. ► ఏదైనా మనకు దక్కినప్పుడు అందుకు మనం నిజంగా అర్హులమేనా? అనే ఓ ఆలోచన కలగడం సహజం. నేషనల్ అవార్డు ప్రకటించినప్పుడు అలాంటి ఆలోచన మీకేమైనా కలిగిందా? నేనూ సుకుమార్‌గారు ఎప్పుడూ నిజం అనేది ఒకటి ఉంటుందని మాట్లాడుకుంటుంటాం. మేం నిజాయితీగా కష్టపడ్డాం. ఆ కష్టం ప్రజలకు కనెక్ట్ అయ్యింది. ఇది నిజం. ఒక సినిమా బాగుందా? లేదా అనేది నిజం మాట్లాడుతుంది. బాగోలేని సినిమాను నేను ఎంత ప్రమోట్ చేసినా వర్కౌట్ కాదు. కానీ మనం నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఆ కష్టమే మాట్లాడుతుంది. అది నిజం. అప్పుడు నిజం దానంతట అదే మాట్లాడుతుంది. ఒకవేళ నేను సినిమాలో బాగా యాక్ట్ చేసి, నేనే బాగోలేదని చెప్పినా కూడా నా మాట ఎవరూ నమ్మరు. ఎందుకంటే నిజం నాకంటే గొప్పది.. నన్ను మించినది అనేది నా అభప్రాయం. ► తెలుగు సినిమాకు ఈ ఏడాది ఎక్కువగా జాతీయ అవార్డులు వచ్చాయి... ఈ విషయం గురించి ఏమంటారు? ఈ గౌరవం దక్కడానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ముఖ్య కారణంగా చెప్పుకోవాలి.. ‘పుష్ప’ కూడా. ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ను గౌరవించుకోకపోతే అది తప్పవుతుందనే ఓ ప్రత్యేక ఫీలింగ్ ఆ సినిమాపై ఉంది. ఏదో ఆస్కార్స్‌కు వెళ్లింది కదా అని కాకుండా నిజంగా ఆ సినిమాకు సంబంధించి ఎవరెవరికి రావాలో వారికి ఇచ్చారు. తెలుగు సినిమాకు ప్రాముఖ్యత చేకూర్చారు. అందుకు తగ్గ కష్టం కూడా ఆ సినిమాలు పడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ ప్రామిసింగ్‌గా ఉంది. ఈ ఇంపాక్ట్ వారిపై (జ్యూరీని ఉద్దేశిస్తూ..) కూడా ఉంటుంది. ► ఈ సమయంలో మీ తాత (ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య)గారు ఉండి ఉంటే సంతోషించేవారు.. ఆయన జీవించి ఉన్నట్లయితే.. ఇన్నేళ్ల చరిత్రలో నా మనవడు కొట్టాడు. తన జీవితానికి ఇది చాలని ఆయన ఫీలయ్యే సందర్భం కచ్చితంగా అయ్యుండేది. ఆ విషయం పక్కన పెడితే... నేను నేషనల్ అవార్డుని సాధించడం మా నాన్నగారు చూడగలిగారు. నాకు అదే చాలా అదృష్టం. ► ‘పుష్ప’లో నటనపరంగా తగ్గేదే లే అన్నట్లు నటించారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుత నటనతో పాటు ఆ సినిమా ఆస్కార్‌తో గ్లోబల్‌గా రీచ్ అయింది. తమిళ ‘జై భీమ్’లో సూర్య నటన అద్భుతం.. ఈ పెద్ద పోటీలో జాతీయ అవార్డు ఎవరికి దక్కుతుందనే కోణంలో ఆలోచించారా? మనం సౌత్‌లో ఉన్నాం కాబట్టి ఈ రెండు సినిమాల గురించే మాట్లాడటం సహజం. అయితే పోటీలో హిందీ నుంచి ‘షేర్షా, సర్దార్ ఉద్దమ్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇంకా వేరే భాషల నుంచి వేరే చిత్రాల్లో నటించిన హీరోలు ఉన్నారు. పోటీలో 20 మందికి పైగా ఉన్నారు. కానీ ఫైనల్‌గా నేషనల్ హీరో ఒక్కడే. ఈ ప్రాసెస్‌లో ‘పుష్ప’ హీరోకి అవార్డు దక్కే అర్హత పూర్తిగా ఉంది. ఎందుకంటే నేషనల్ హీరోని సెలక్ట్ చేసేటప్పుడు అతని నటన చూస్తారు.. సినిమాని కాదు. అయినా బెస్ట్ ఫిలిం కింద నేషనల్ అవార్డుకి ‘పుష్ప’ని తీసుకోరు. ఎందుకంటే స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి. అందుకే ఉత్తమ చిత్రం కేటగిరీకి మేం ‘పుష్ప’ని పంపించలేదు. బెస్ట్ యాక్టర్ కేటగిరీ అనేది పూర్తిగా నటనని బేస్ చేసుకునే ఇస్తారు. ఆ విధంగా పుష్పరాజ్.. బెస్ట్ అనుకుని, నామినేషన్‌కి పంపించాం. మా నమ్మకం నిజమైంది. ► 20 ఏళ్ల కెరీర్.. 20 మందికి పైగా హీరోలతో పోటీ పడి నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఈ ఆనందంలో మీ కెరీర్‌ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? యాక్చువల్‌గా ఇలా ఆనందంగా ఉన్నప్పుడు కాదు.. ‘సాడ్ మూమెంట్స్’ అప్పుడే ఎక్కువ ఎనలైజ్ చేసుకుంటాం. హ్యాపీ అప్పుడు హాయిగా అలా వెళ్లిపోతాం. 20 ఏళ్ల లైఫ్ టైమ్‌లో ఏ మనిషికైనా హ్యాపీ.. సాడ్ ఈ రెండూ ఉంటాయి. బయట చూసేవాళ్లకు అంతా స్మూత్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ మనిషి జీవితం కూడా ఈ రెండూ లేకుండా ఫ్రిజ్‌లో పెట్టిన మటన్లా ఫ్రీజ్ అయిపోవడం జరగదు (నవ్వుతూ). ఏ చెట్టుకి ఆ గాలి. బయటకు చెప్పలేకపోవచ్చు కానీ.. చాలా అవమానాలు ఉంటాయి. ఆ చెప్పలేనివి జరిగినప్పుడు విశ్లేషణ అనేది మొదలవుతుంది. అందులోంచే నేర్చుకోవడం, నడుచుకోవడం కూడా తెలుస్తుంది. ► మీరన్నట్లు అవమానాలు సహజం. పైగా ఇప్పుడీ డిజిటల్ వరల్డ్‌లో ట్రోల్స్ ఎక్కువ.. వీటిని పట్టించుకుంటారా? హండ్రెడ్ పర్సంట్ అన్నీ పట్టించుకుంటాను. కాకపోతే ‘ఫన్’గా తీసుకుంటాను. మన కోసం ఒకళ్లు పని గట్టుకుని టైమ్ కేటాయించి, అదే పనిగా విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే కదా (నవ్వుతూ). మా స్టాఫ్‌లో ఒకరు.. ‘చూడండి సార్.. మీ గురించి ఇలా అనుకుంటున్నారు’ అంటే, ‘మంచిదే కదా.. మనం ఎదిగినట్లు అర్థం’ అన్నాను. ఏమీ లేకుండా మిగిలిపోయినవాళ్లను ఎవరూ పట్టించుకోరు. సో.. మనల్ని పట్టించుకున్నారంటేనే మనం సాధిస్తున్నాం అని అర్థం. ► మరి.. ‘మెగా ఫ్యాన్స్’, ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అంటూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది కదా.. ఆ వార్ని కూడా పట్టించుకుంటారా? నేను ఏదైనా ఒకటి పట్టించుకోనంటే ఆ ఫ్యాన్ వార్ని మాత్రమే. నేనస్సలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకునేంత టైమ్ లేదు. ఫ్యాన్స్ పని ఫ్యాన్స్ చూసుకుంటారు. నా పని నేను చూసుకుంటాను. ► వసూళ్లు, అవార్డుల గురించి పట్టించుకుంటారా..? వీటి గురించి అయితే పక్కాగా ఆలోచిస్తాను. వేరే వాటి గురించి ఆలోచించను. నా ఫోకస్ అంతా వాటిపైనే ఉంటుంది. మిగతావారి గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం అన్నీ కావాలి. అవార్డులు కావాలి... కలెక్షన్స్ కావాలి. ప్రజల్లో పేరు, నా సినిమా నిర్మాతలకు డబ్బులు రావాలి. జనాలకు పిచ్చెక్కిపోయే సినిమాలు ఇవ్వాలి.. ఇలా నాకు అన్నీ కావాలి. ఆ క్లారిటీ నాకు ఉంది. నాది అత్యాశ.. నాకు అన్నీ కావాలి. అందుకే తగ్గేదే లే అంటూ హార్డ్ వర్క్ చేస్తాను. ఆగేదే లే అంటూ సినిమాలు చేసుకుంటూ వెళతాను.. ► ‘పుష్ప 2’ తర్వాత మీ ప్రాజెక్ట్? ప్రస్తుతం ‘పుష్ప 2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనే ప్రజెంట్ నా మైండ్‌లో ఉంది. ‘పుష్ప 2’ తర్వాత నా తర్వాతి సినిమాపై మరింత క్లారిటీ ఇస్తాను. ► ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మీరు చేసిన ‘అల.. వైకుంఠపురములో.., పుష్ప’ హిట్. ఆ గ్యాప్‌లో మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే ఈ హిట్స్‌కి కారణమా.. నా గురించి నేను వంద శాతం తెలుసుకోవడానికి ఆ సమయం నాకు దొరికినట్లయింది. నేను ఏం తప్పులు చేశాను? ఎటు వెళ్తున్నాను అని ఆలోచించుకున్నాను. కొందరు సలహాలు ఇచ్చారు. చెప్పాలంటే నన్ను నేను సరిద్దుకున్న సమయం అది. అలా నన్ను నేను సరిదిద్దుకుని ఇకనుంచి తగ్గేదే లే... ఆపేదేలే అనుకున్నాను. ► జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించారు. ఇక వాట్ నెక్ట్స్ అనే ప్రెజర్ ఏమైనా? దేశవ్యాప్తంగా సినిమా పెరుగుతోంది. తెలుగు సినిమా మరింతగా ప్రగతి పథంలో ముందుకు వెళుతోంది. ఇప్పుడు మనం ఏ ప్రయోగాలు చేసినా రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రెజర్ కాదు.. పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. చెప్పాలంటే ఎవరికైనా ప్రెజర్ లేదూ అంటే అది మనకే. తెలుగు పరిశ్రమతో పోటీపడాలని ఇతర ఇండస్ట్రీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ► మీ నాన్నగారు (నిర్మాత అల్లు అరవింద్) చాలా సంతోషపడి ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు... అవార్డు సాధించిన నాకన్నా.. మా నాన్నగారికి ఎక్కువ శుభాకాంక్షలు వచ్చాయి (నవ్వుతూ). మా అమ్మ అయితే ఆనందంతో మాట్లాడలేకపోయారు. అమ్మ హగ్‌లోనే ఆమె సంతోషం అర్థమైపోయింది. అలాగే నా సినిమా గురించి మా ఆవిడ (స్నేహా) ఎప్పుడూ భావోద్వేగానికి లోనవ్వదు. కానీ తొలిసారి ఎమోషన్‌కి గురై, నన్ను హత్తుకుంది. -
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయని పేర్కొన్నారు. ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్ (కొండ పొలం) అవార్డు గెలుచుకోవటం సంతోషమని సీఎం అన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ సాధించారు. చదవండి: జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ The Telugu Flag flies high at the 69th National Film Awards! My best wishes and congratulations to @alluarjun on winning the National award for best actor and @ThisIsDSP on winning the National Award for best music for Pushpa. Kudos and congratulations to @ssrajamouli garu and… — YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2023 -
జాతీయ బాలల పురస్కారాలు.. దరఖాస్తులకు ఆహ్వానం
సాక్షి, విజయవాడ: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాలు-2024 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఏపీకి చెందిన వివిధ రంగాలలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన 18 సంవత్సరాల లోపు బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. క్రీడలు, సామాజిక సేవా రంగం, ధైర్య సాహసాలు, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ , సాంస్కృతిక సంప్రదాయాలు, శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానం రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలలు 31, ఆగస్టు, 2023 లోపు http://awards.gov.in వెబ్ సైట్ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అప్పారావు తెలిపారు. -
ఏపీకి నాలుగు జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022) దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ తృతీయ స్ధానంలో నిలిచింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేతుల మీదుగా జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగానే మంత్రి, అధికారులను సీఎం జగన్ అభినందించారు. -
నాలుగు జాతీయ జల అవార్డులను ఒడిసిపట్టిన ఆంధ్రప్రదేశ్...ఇంకా ఇతర అప్డేట్స్
నాలుగు జాతీయ జల అవార్డులను ఒడిసిపట్టిన ఆంధ్రప్రదేశ్...ఇంకా ఇతర అప్డేట్స్
-
ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లకు జాతీయ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీకి చెందిన ఇద్దరు డ్రైవర్లకు జాతీయ పురస్కారాలు దక్కాయి. తమ సర్వీసు కాలంలో ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా బస్సులు నడిపినందుకు రహదారి భద్రత కేటగిరీలో వీరికి ‘హీరోస్ ఆన్ ది రోడ్’ పురస్కారం దక్కింది. కుషాయిగూడ డిపోకు చెందిన రంగారెడ్డి, సూర్యాపేట డిపోకు చెందిన సోమిరెడ్డిలకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) పురస్కారాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వీరికి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
నేడు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: ‘నేను కచ్చితంగా నేడు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేస్తాను’అనే ఇతివృత్తంతో నేడు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుగనుంది. 2011లో ప్రారంభమైన జాతీయ ఓటర్ల దినోత్సవం ఏటా జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఢిల్లీలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2022 ఎన్నికల సమయంలో ఐటీ, భద్రత, ఓటరు జాబితా, ఓటర్లకు అవగాహన వంటి అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
తెలంగాణకు మరో రెండు జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణలో తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్‘లో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాతృ మరణాలను పూర్తిగా నివారించాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్పవార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్ డైరెక్టర్ (మెటర్నల్ హెల్త్) డాక్టర్ ఎస్ పద్మజ అవార్డులు అందుకున్నారు. మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో ప్రసవసేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలి సారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని కోసం ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటి వరకు ఇలా శిక్షణ పొందిన 212 మంది మిడ్ వైఫరీలను ప్రభుత్వం 49 ఆస్పత్రుల్లో నియమించింది. ఇక హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించడం, చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించడం, వారిని నిరంతరం పరిశీలించడం ( ట్రాకింగ్), ఉత్తమ చికిత్స అందేలా రిఫర్ చేయడంకోసం వైద్య అధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలతో ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేసింది. దీంతో హై రిస్క్ కేసులను ముందుగా గుర్తించి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించి, ఆసుపత్రులకు తరలించి, సరైన చికిత్స అందించే అవకాశం కలిగింది. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహన సేవలు గర్భిణులకు వరంగా మారాయి. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయి. చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి: హరీశ్ ‘‘సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మరో రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం మా వైద్య సిబ్బంది పనితీరుకు నిదర్శనం. 2014లో 92గా ఉన్న ఎంఎంఆర్ ఇప్పుడు 43కు తగ్గటం గొప్ప విషయం. ఈ ఘనతలు సాధించడంలో క్షేత్రస్థాయిలో ఉండి వైద్య సేవలు అందించే ఆశాలు, ఏఎన్ఎంల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల నిరంతర కృషి ఉందని’ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఇదీ చదవండి: Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..? -
జాతీయ స్థాయిలో ఏపీ వైద్యశాఖకు రెండు అవార్డులు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర వైద్యశాఖకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. పల్లె ప్రజలకు వైద్యసేవలు చేరువచేయడం కోసం నెలకొలి్పన డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నిర్వహణ, వీటిలో టెలీ మెడిసిన్ వైద్యసేవలను అమలు చేస్తున్నందుకు గానూ యూనివర్సల్ హెల్త్ కవరేజ్(యూహెచ్‌సీ) డే సందర్భంగా కేంద్ర వైద్యశాఖ ప్రదానం చేస్తున్న అవార్డులకు రాష్ట్రం ఎంపికైంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న యూహెచ్‌సీ డే వేడుకల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, అధికారులు పాల్గొని అవార్డులు స్వీకరించనున్నారు. విలేజ్ క్లినిక్‌లతో వైద్యసేవలు చేరువ గ్రామీణ ప్రజలకు వైద్యసేవలను చేరువచేయడం కోసం ప్రభుత్వం 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలకొల్పుతోంది. నాడు–నేడు కింద క్లినిక్‌లను రూ.1,692 కోట్లతో ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే 8,351 క్లినిక్‌లు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాయి. వీటిని ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ సెంటర్(ఏబీ–హెచ్డబ్ల్యూసీ)లుగా నిర్వహిస్తున్నారు. ఈ సేవలకు గానూ రాష్ట్ర వైద్యశాఖ అవార్డుకు ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఏపీ సహా 20రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవార్డులు అందిస్తున్నారు. అవార్డుకు ఎంపికైన అన్ని రాష్ట్రాల్లో విలేజ్ క్లినిక్‌ల నిర్వహణలో ఏపీ అగ్రస్థానంలో ఉండటం విశేషం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు 12రకాల వైద్యసేవలు, 14 రకాల వైద్యపరీక్షలు, 67రకాల మందులను అందిస్తున్నారు. 2.84కోట్ల మందికి టెలీ మెడిసిన్ సేవలు అన్ని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో టెలీ మెడిసిన్ సేవలు అమలవుతున్నాయి. క్లినిక్‌కు వచ్చిన ప్రజలకు పీహెచ్సీ వైద్యుడు, స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ అవసరమైతే టెలీ మెడిసిన్ ద్వారా కూడా అందుతున్నాయి. టెలీ మెడిసిన్ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా 27 హబ్‌లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. వీటిలో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఇతర స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారు. రాష్ట్రంలో 2019 నుంచి 2.84 కోట్ల టెలీ కన్సల్టేషన్లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 8 కోట్ల కన్సల్టేషన్లు నమోదు కాగా, ఏపీ నుంచి 2.84కోట్లు ఉండటం విశేషం. విలేజ్ క్లినిక్‌లలో టెలీ మెడిసిన్ సేవల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో మూడు రాష్ట్రాలకు అవార్డులు దక్కగా, అందులో ఏపీ ఒకటి కాగా, మిగిలినవి తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. -
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసా న్ని పెంపొందించడం, వారిని శక్తివంతం చేయడం ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2021, 2022 సంవత్సరాల కుగాను వికలాంగుల సాధికారత జాతీయ అవార్డులను రాష్ట్రపతి అందించారు. దివ్యాంగులను సశక్తులుగా తయారు చేసే ప్రక్రియలో భాగమైన సంస్థకు ఇచ్చే జాతీయ పురస్కారాన్ని 2022 సంవత్సరానికి తెలంగాణకు చెందిన డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు అందించారు. రెడ్డీస్ ఫౌండేషన్ తరపున సంస్థ చైర్మన్ కె.సతీశ్‌రెడ్డి రాష్ట్రపతి చేతు ల మీదుగా అవార్డును అందుకున్నారు. కూచిపూడి, భరతనాట్యం శాస్త్రీయ నాట్యకారిణి ఏపీ విజయనగరానికి చెందిన దివ్యాంగ బాలిక శ్రేయామిశ్రా(16)కు 2022 సంవత్సరానికి శ్రేష్ఠ్ దివ్యాంగ బాలిక విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందించారు. -
68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం
-
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మరోసారి ఏపీ సత్తా చాటింది. తిరుపతి కార్పొరేషన్ జాతీయ అవార్డు దక్కించుకుంది. పులివెందుల మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు లభించింది. విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లు, పుంగనురు, సాలూరు అవార్డులు దక్కించుకున్నాయి. గత ఏడాదిలానే ఈ ఏడాది ఏపీకి ఆరు అవార్డులు దక్కాయి. అక్టోబర్ 2న అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ తెలిపారు. చదవండి: అందుకే హెల్త్ యూనివర్శిటికీ వైఎస్సార్ పేరు.. వాస్తవాలివిగో.. -
ఉత్తమ పంచాయతీలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం
సత్తెనపల్లి: ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ ఇదీ.. జాతిపిత మహాత్మాగాంధీ మాట. దీనిని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. గ్రామం పంచాయతీలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. దీనిలో భాగంగానే గ్రామ పాలనలో ఉత్తమంగా నిలిచిన పంచాయతీలకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏటా జాతీయ స్థాయిలో పురస్కారాలు అందజేస్తోంది. ఈసారి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 9 అంశాల్లో అక్టోబరు 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. 9 అంశాలివే.. పేదరిక నిర్మూలనకు మెరుగైన జీవనోపాధి ఆరోగ్యవంతమైన గ్రామం పిల్లల స్నేహపూర్వక పంచాయతీ తాగునీటి లభ్యత హరిత, స్వచ్ఛ గ్రామం స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు సామాజిక భద్రత, సుపరిపాలన మహిళా స్నేహపూర్వక పంచాయతీ ప్రత్యేక పోర్టల్ ఈ అంశాల్లో చేపట్టిన అభివృద్ధి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. దీనికోసం పంచాయతీవార్డ్.జీవోవీ.ఇన్ పోర్టల్ అందుబాటులో ఉంచారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల వారీగా పనులను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఒక్కో అంశానికి సంబంధించి ప్రతిబింబించే ఫొటోలు, వీడియోలు, కేస్ స్టడీస్‌తో దరఖాస్తు చేయాలి. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైతే వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున అవార్డును ప్రదానం చేస్తారు. అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో చూపించే ఆదర్శ పంచాయతీలకు ఇది సదవకాశం. పరిశుభ్రత, పచ్చదనం, తాగునీరు, ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో జిల్లాలోని చాలా గ్రామాలు ప్రగతిని చూపుతున్నాయి. పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో 366 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంచి అవకాశం జాతీయ స్థాయిలో పురస్కారం అందుకునేందుకు ఇది మంచి అవకాశం. చేపట్టిన అభివృద్ధి తదితర వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఎంపికైతే పురస్కారం ద్వారా లభించే నజరానాతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. – జీవీ సత్యనారాయణ, ఎంపీడీవో, సత్తెనపల్లి -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు (ఫొటోలు)
-
సాక్షి ఫొటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో తొమ్మిదిమంది సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ మధ్యలో తీసిన ఫొటోలను పోటీలకు ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 463 మంది 826 ఫొటోలను పంపించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, సోషల్ ఆంత్రోపాలజిస్ట్ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, సోషల్ హిస్టోరియన్ డాక్టర్ కొంపల్లి హెచ్.హెచ్.ఎస్.సుందర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి 75 ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపికచేశారని అకాడమీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అకాడమీ ఆవిర్భావ దినోత్సవం (ఆగస్టు 18వ తేదీ) సందర్భంగా విజేతలకు గురువారం విజయవాడలో ‘ప్లాటినం జూబ్లీ ఇమేజ్ అవార్డులు’ ఇవ్వనున్నట్లు చెప్పారు. 75 చిత్రాలతో ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేసి, ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు. అవార్డులు పొందిన సాక్షి ఫోటోగ్రాఫర్లు: వి.రూబెన్ బెసాలియల్ (విజయవాడ), ఎన్.కిషోర్ (విజయవాడ), ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ), పి.ఎల్. మోహనరావు (వైజాగ్), ఎండీ నవాజ్ (వైజాగ్), వడ్డే శ్రీనివాసులు (కర్నూలు), కె.మోహనకృష్ణ (తిరుపతి), మహబూబ్ బాషా (అనంతపురం), శివ కొల్లోజు (తెలంగాణ). ఇదీ చదవండి: YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం -
నేషనల్ అవార్డ్ విన్నర్ సూర్య ఫొటోలు..
-
Nanjiyamma: ప్రకృతి తల్లి పాటకు పట్టాభిషేకం
‘‘ఉన్నపళంగా నా కొడుకు ఫోన్ చేశాడు. అమ్మా.. ఒక్కసారి టీవీ చూడే అన్నాడు. నాకు దేశం నుంచి ఏదో అవార్డు వచ్చిందని చెప్పాడు. ఈ అవార్డు ఏంటో నాకు తెల్వదు. దాని గొప్పతనం ఏంటో కూడా తెల్వదు. కానీ, నా కొడుకు మాటలే నాకు సంతోషాన్ని ఇచ్చాయి. అసలు ఈ వయసులో సినిమా పాటలు పాడతానని, నటిస్తానని ఎవరైనా అనుకుంటారా?’’ అని అమాయకపు నవ్వులతో చెప్తోంది అరవై ఏళ్ల వయసున్న నాంజియమ్మ. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రంలో ‘కళకాత్తా సందనమేరే’.. పాటకు 2020-నేషనల్ బెస్ట్ సింగర్ అవార్డుకు ఎంపికైంది ఈ తల్లి. పుట్టింది ఎక్కడో మామూలు గిరిజన పల్లెలో. కాకపోతే.. జానపద కళాకారిణి. సినిమా అంటే ఏంటో తెలుసు. కానీ, అందులో నటించే వాళ్లు ఎవరు? వాళ్ల పేర్లేంటి? వాళ్ల గురించి ఆమెకు ఎంత మాత్రం అవగాహన లేదు. కేవలం ప్రకృతిని.. దాని నుంచి పుట్టిన పాటల్ని నమ్ముకుని పెరిగింది నాంజియమ్మ. అలాంటిది ఒక్క సినిమాతోనే ఇవాళ దేశం ఆమె గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది. అన్నట్లు.. ఆ పాటకు సాహిత్యం కూడా ఆమెదే. అందుకే పాట రచయిత కూడా సంతోషంగా ఉన్నారా? అంటే.. ‘అవును..’ అంటూ ముసిముసి నవ్వులతో బదులు ఇచ్చింది. పలక్కడ్ జిల్లా అట్టపడి.. కేరళలో ఉన్న ఏకైక గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం షూటింగ్ చేసుకుంది. 2020లో వచ్చిన ఈ చిత్రం మాలీవుడ్‌లో ఓ చెరగని ముద్ర వేసుకుంది. ఈ చిత్ర దర్శకుడు, రచయిత సాచీకి ఇది రెండో చిత్రం.. దురదృష్టవశాత్తూ ఆఖరి చిత్రం కూడా. అయితే ఆ ప్రాంతంతోనే ముడిపడిన సినిమా కావడంతో.. అక్కడి కల్చర్‌నే సినిమాలో ఎక్కువ భాగం చేశాడు ఆయన. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. నాంజియమ్మ గురించే. అట్టపడిలో నుక్కుపథి పిరివు అనే గిరిజన పల్లె నాంజియమ్మ స్వగ్రామం. ఇరుల గిరిజన తెగకు చెందిన ఈమె.. జానపద కళాకారిని. ప్రకృతిని నమ్ముకున్న నాంజియమ్మ.. చెట్టు, గట్టు, పుట్ట, పశువులను చూస్తూనే అలవోకగా పాటలు పాడుతుంది. గిరిజన కళాకారుల సంఘం ఆట కళాసంఘం, ఆజాద్ కళా సమితిలో ఆమె సభ్యురాలు కూడా. పళని స్వామి ఆజాద్ కళా సమితి వ్యవస్థాపకుడు. ఈయన ద్వారానే నాంజియమ్మ గురించి తెలుసుకున్న సాచీ.. పాడేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇరుల భాషకు ఒక లిపి అంటూ లేదు. అందుకే అదే భాషలో ఆశువుగా మాట్లాడడం, పాడడం నేర్చుకుంది నాంజియమ్మ. పదిహేనేళ్ల వయసులో వివాహం చేసుకున్న ఆమెకి.. భర్త ప్రోత్సహం కొండంత బలాన్ని ఇచ్చింది. ఆమెకు ఒక కొడుకు.. ఒక కూతురు. కొడుకు అగలిలోని ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఉద్యోగి. ఇక దశాబ్దాలుగా వ్యవసాయం, పశువులను మేపుతూనే ఆమె జీవనం కొనసాగిస్తోంది. ఆ సమయంలోనే పాటల్ని సృష్టించుకుని.. పాడుతుంటుంది. అదే జీవనశైలిలోనే ఇంకా బతుకుతోంది. అన్నట్లు సినిమాలో టైటిల్ ట్రాక్ తో సహా మూడు పాటలు ఆమె పాడారు. అంతేకాదు.. చిత్రంలో ప్రధాన పాత్రధారి అయ్యప్పన్ క్యారెక్టర్‌కి అత్త క్యారెక్టర్లోనూ మెరిశారు ఆమె. పళని(ఎడమ), జేక్స్ బిజోయ్‌తో.. కళకాత్తా సందనమేరే.. ఈ పాట నంజియమ్మ జీవితానికి ముడిపడిన పాట. అందుకే సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్.. రికార్డింగ్ సమయంలో నాంజియమ్మకు ఎంతో సహకారం అందించాడు. పరాయి, దావిల్, కోకల్, జల్త్రా వంటి సాంప్రదాయ గిరిజన వాయిద్యాలను పాటలో ఉపయోగించాడు. ఆమె ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని.. అందుకు తగ్గట్లుగానే సాంగ్స్ రీ-రికార్డ్ చేయించాడు.ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్ అయిన నెల రోజులకే 10 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. మలయాళీలకు మాత్రమే కాదు.. సౌత్ చిత్రాలకు ఆదరించే ఎందరికో ఇదొక ఫేవరెట్ సాంగ్. అటవీ భూముల్లోని గంధపుచెట్లు, పువ్వులు, వృక్షజాలాన్ని వివరిస్తుంది ఈ పాట. మనవళ్లకు గోరు ముద్దులు తినిపించే అవ్వల తాలుకా భావోద్వేగాలను పంచుతుంది కూడా. (క్లిక్: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది) - సాక్షి, వెబ్ స్పెషల్ -
జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది
‘‘ఆశలు నెరవేర్చుకోవడానికి ఆకాశమే హద్దు అవ్వాలి.. అప్పుడే ఆకాశం వరకూ ఎగిరే రెక్కలు దక్కుతాయి’’... ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!) స్టోరీలైన్ ఇది. సూర్య, అపర్ణ బాలమురళి జంటగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్ ప్లే (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్‌కుమార్).. ఇలా మొత్తం ఐదు అవార్డులు దక్కాయ అలా జాతీయ అవార్డుల్లో ‘ఆకాశం..’ మెరిసింది. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్ దేవగన్ (‘తన్హాజీ’)ని ఎంపిక చేశారు. ఇక తెలుగుకి నాలుగు అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా తమన్ (‘అల.. వైకుంఠపురములో’), ‘నాట్యం’ చిత్రకథానాయిక సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి, ఇదే చిత్రానికిగాను టీవీ రాంబాబుకి ఉత్తమ మేకప్ అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఇంకా శుక్రవారం వెలువడిన 68వ జాతీయ అవార్డుల వివరాలు ఈ విధంగా... 68వ జాతీయ అవార్డులను ఐదు విభాగాలుగా విభజించడం విశేషం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్... ఇలా ఐదు భాగాలుగా అవార్డులను ప్రకటించారు. 30 భాషల్లో దాదాపు 305 చిత్రాలు ఫీచర్ ఫిల్మ్ స్క్రీనింగ్‌కు, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో దాదాపు 148 చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఈ అవార్డుల్లో తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా..!) హవా కనిపించింది. ఈ చిత్రం ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు చిత్రపరిశ్రమకు నాలుగు అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిం చిన ‘అల.. వైకుంఠపురుములో...’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు తమన్. సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేశ్ నిర్మించిన ‘కలర్ ఫోటో’ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రేవంత్ దర్శకత్వంలో సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకోగలిగింది. మరోవైపు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ నేపథ్య గానం, స్టంట్ కొరియోగ్రఫీ)లను దక్కించు కుంది. అలాగే తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కు మూడు విభాగాల్లో (ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఎడిటింగ్, ఉత్తమ సహాయ నటి), ‘హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’కు మూడు (బెస్ట్ యాక్టర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్) జాతీయ అవార్డులు దక్కాయి. తమిళ పరిశ్రమకు మొత్తం 10 (సూరరైపోట్రుకి 5, ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కి 3, మండేలాకి 2) అవార్డులు దక్కడం విశేషం. అలాగే మధ్యప్రదేశ్ మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. ‘ద లాంగెస్ట్ కిస్’కు ‘ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది. ఇక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మరో సందర్భంలో ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిల్మ్ క్రిటిక్ అవార్డు విభాగంలో ఎవర్నీ ఎంపిక చేయలేకపోయామని జ్యూరీ పేర్కొంది. సేమ్ సీన్! 67వ జాతీయ అవార్డుల్లోని సీన్ ఒకటి 68వ జాతీయ అవార్డుల్లోనూ రిపీట్ అయ్యింది. 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు ధనుష్ (‘అసురన్’ చిత్రానికి గాను..). హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (భోన్స్లే)లు షేర్ చేసుకున్నారు. ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు సూర్య (‘సూరరై పోట్రు’ చిత్రానికిగాను..), హిందీ నటుడు అజయ్ దేవగన్ (హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ చిత్రానికిగాను..) బెస్ట్ యాక్టర్ అవార్డును షేర్ చేసుకున్నారు. ఇక కెరీర్లో సూర్యకు తొలిసారి జాతీయ అవార్డు దక్కగా, అజయ్ దేవగన్‌కు మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు ‘జఖ్మ్’ (1998), ‘ది లెజండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్ దేవగన్ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. దివంగత దర్శకుడికి అవార్డు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ నాలుగు అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు విభాగం కూడా ఉంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిగాను దర్శకుడు కేఆర్ సచ్చిదానందన్ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే 2020 జూన్‌లో ఆయన గుండెపోటుతో మరణించడం ఓ విషాదం. దీంతో ఈ సంతోషకర సమయంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రయూనిట్‌కు ఓ లోటు ఉండిపోయింది. ఇక ఈ నాలుగుతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్, ఆడియోగ్రఫీ, ఉత్తమ పుస్తకం.. ఇలా మలయాళ పరిశ్రమకు తొమ్మిది అవార్డులు దక్కాయి. ఓటీటీ చిత్రాల హవా! 68వ జాతీయ అవార్డుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన చిత్రాల జోరు కనిపించింది. ఐదు అవార్డులను గెల్చుకున్న ‘సూరరైపోట్రు’, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కలర్ ఫోటో’ చిత్రాలు డైరెక్టర్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే రెండు అవార్డులను గెల్చుకున్న తమిళ చిత్రం ‘మండేలా’ ముందుగా టీవీలో ప్రదర్శితమై, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు వెళ్లింది. అవార్డులు సాధించిన వాటిలో మరికొన్ని ఓటీటీ చిత్రాలు ఉన్నాయి. తొమ్మిదో అవార్డు కెరీర్లో తొమ్మిదో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 68వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కిగాను ఎడిటింగ్ విభాగంలో శ్రీకర్ ప్రసాద్‌కు అవార్డు దక్కింది. ఇది ఆయనకు 9వ అవార్డు. గతంలో ‘రాక్’ (1989), ‘రాగ్ బైరాగ్’ (1997), ‘నౌకా కరిత్రము’ (1997), ‘ది టెర్రరిస్ట్’ (1998), ‘వనప్రస్థం’ (2000), ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (2002), ‘ఫిరాక్’ (2008), 2010లో ‘కుట్టి స్రాంక్’, ‘కమినీ’, ‘కేరళ వర్మ పళస్సి రాజా’లకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ క్రెడిట్ నాది కాదు ► ‘నీ కాళ్లను చూడు’ అన్నారు.. ‘బుట్ట బొమ్మ’ అన్నారు.. ‘రాములో’ అన్నారు.. జాతీయ అవార్డుని బుట్టలో వేసుకున్నారు.. మీ ఆనందాన్ని షేర్ చేసుకుంటారా? నిజానికి ‘అల వైకుంఠపురము’లో విజయాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. మొత్తం క్రెడిట్ అంతా త్రివిక్రమ్‌గారిదే. ఈ జాతీయ అవార్డు క్రెడిట్ కూడా ఆయనదే. ► ట్యూన్స్ ఇచ్చింది మీరు కదా.. (నవ్వుతూ). నేనే. కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చేతుల్లోనే అంతా ఉంటుంది. కరెక్ట్‌గా పిక్ చేయగల డైరెక్టర్ కాబట్టే కరెక్ట్ ట్యూన్స్‌ని త్రివిక్రమ్‌గారు ఎంచుకున్నారు. అలాగే లిరిక్స్ విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..’, ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా..’ ఇవన్నీ క్యాచీగా ఉన్నాయి కాబట్టే ట్యూన్ ఎలివేట్ అయిందంటాను. ► ఈ సినిమా విషయంలో మీరేమైనా ఒత్తిడికి గురయ్యేవారా? ఏమాత్రం టెన్షన్ పడలేదు. త్రివిక్రమ్‌గారు మమ్మల్నందర్నీ కూల్‌గా ముందుకు నడిపించారు. ఆయన ప్రపంచలోకి వెళ్లి మేం పని చేశాం. అందుకే క్రెడిట్ ఆయనకే ఇస్తున్నాను. ► మరి.. పూర్తి క్రెడిట్‌ని మీరెప్పుడు తీసుకుంటారు? ‘ఇండిపెండెంట్ మ్యూజిక్’కి అవార్డు దక్కినప్పుడు తీసుకుంటాను. విదేశాల్లో ‘గ్రామీ అవార్డ్స్’ ఉన్నాయి. మ్యూజికల్ అవార్డ్స్ అవి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి అవార్డులు ఇస్తారు. ఇండియాలో నాకు తెలిసి అలాంటి అవార్డులు లేవు. అందుకే మావరకూ ‘సినిమా ఈజ్ బిగ్’. ఏడాదికి ఓ పది సినిమాలు చేస్తాం. అంటే దాదాపు అరవై పాటలు ఇస్తాం. వాటిలో ఒక పాటకు అవార్డు రావడం అంటే ఆనందించదగ్గ విషయమే. అయితే సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్. అందుకే అవార్డు క్రెడిట్‌ని ఒక్కడినే తీసుకోవడంలేదు. – తమన్ బాధ్యత పెరిగింది – సాయి రాజేష్ నిజంగా మా ప్రేమకథ (‘కలర్ ఫోటో’ను ఉద్దేశించి...) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు సాధిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నాతో పాటు చిత్రయూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. నా జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా ‘కలర్ ఫోటో’ కథను రాసుకున్నాను. నేను నల్లగా ఉంటానని నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఈ అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించాం. రైటింగ్, ప్రొడక్షన్, దర్శకత్వం విభాగాల్లో ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందనే నమ్ముతున్నాను. అయితే ‘కలర్ ఫోటో’ సినిమా రిలీజ్‌కు ముందే మా నాన్నగారు మాకు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఇంకా హ్యాపీ ఫీలయ్యేవాడిని. అవార్డుల విజేతల వివరాలు ∙ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు ∙ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగన్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు) ∙ఉత్తమ సహాయ నటుడు: బీజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్) ∙ఉత్తమ దర్శకుడు: దివంగత కేఆర్ సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అనిశ్ మంగేశ్ గోస్వామి (టక్టక్), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్ తెందుల్కర్ (సుమీ) ∙ఉత్తమ తెలుగు చిత్రం: కలర్ ఫోటో ∙ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్ ∙ఉత్తమ కన్నడ చిత్రం: డోలు ∙ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్ ∙ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్ ∙ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి) ∙ఇందిరాగాందీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్: మండోన్నా అశ్విన్ (మండేలా తమిళ ఫిల్మ్) ∙ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్సంగ్ వారియర్ ∙పర్యావరణ పరిరక్షణపై చిత్రం: తలెండా (కన్నడ) ∙బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూ: ఫ్యూర్నల్ (మరాఠి) ∙ఉత్తమ స్క్రీన్ ప్లే: షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం) ∙ఉత్తమ మేకప్: టీవీ రాంబాబు (నాట్యం) ∙ఉత్తమ కాస్ట్యూమ్స్: నచికేత్ బార్వే, మహేశ్ శర్లా (హిందీ చిత్రం తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ సంగీతం (పాటలు): ఎస్ఎస్ తమన్ (అల...వైకుంఠపురములో...) ∙ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్‌కుమార్ (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ గీత రచన : మనోజ్ ముంతిషిర్ (సైనా – హిందీ) ∙ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీష్ నదోడి (కప్పెలా– మలయాళం ఫిల్మ్) ∙ఉత్తమ సౌండ్ డిజైనర్: అనుమోల్ భవే (ఎమ్ఐ వసంతరావు – మరాఠి) ∙ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్– తమిళం) ∙ఉత్తమ ఆడియోగ్రఫీ: జాబిన్ జయాన్ (డోలు– కన్నడ) ∙ఉత్తమ సౌండ్ డిజైనింగ్ (ఫైనల్ మిక్స్): విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మాలిక్ –మలయాళం) ∙ఉత్తమ సంభాషణలు: మడొన్నే అశ్విన్ (మండేలా– తమిళం) ∙ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్ –మలయాళం) ∙ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్ పాండే (మీ వసంతరావు– మరాఠి) ∙ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్ భోల్ (అవిజాత్రిక్– బెంగాలీ). -
దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ ప్రతిభతో దక్షిణ మధ్య రైల్వే ఐదు విభాగాల్లో జాతీయ పురస్కారాలు సాధించింది. భద్రత, సిబ్బంది ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, స్టోర్స్ విభాగాల్లో అవార్డులు లభించాయి. 67వ రైల్వే వారోత్సవాల్లో భాగంగా భువనేశ్వర్ రైల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్, ఆయా విభాగాల అధికారులు వీటిని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ... రైల్వే తనను తాను సమూలంగా మార్చుకుంటూ దేశ పురోగతిలో తనవంతు పాత్ర పోషించాలని సూచించారు. రోలింగ్ స్టాక్, నిర్మాణ పనులు, భద్రతా విభాగాలను ఉన్నతీకరించేందుకు అవసరమైన కొత్త సాంకేతికతను అందిపుచ్చు కోవాలన్నారు. రైల్వేలో పెట్టుబడులు రూ.1.37లక్షల కోట్లకు చేరుకున్నాయని, ‘ప్రధాన మంత్రి గతి శక్తి’ కింద ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు రైల్వే బోర్డు ఆధ్వర్యంలో కొత్త డైరెక్టరేట్‌ను ప్రారంభిం చినట్టు మంత్రి తెలిపారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 156 మంది అధికారులు, సిబ్బంది కి వ్యక్తిగత పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్నవారిలో జోన్ ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్‌తోపాటు విభాగాధిపతులు భద్రత– రాజారామ్, స్టోర్స్–సుధాకరరావు, సివిల్ ఇంజినీరింగ్– సంజీవ్ అగర్వాల్, కన్స్ట్రక్షన్ విభాగం– అమిత్ గోయల్, ఆరోగ్య సంరక్షణ–డాక్టర్ సి.కె.వెంకటేశ్వర్లు, వ్యక్తిగత విభాగాల్లో మరికొంతమంది అధికారులు ఉన్నారు. -
మామతో కలిసి ఒకేసారి అవార్డు అందుకోడం అద్భుతం: ధనుష్
తమిళ నటుడు ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తమిళ చిత్రం ‘అసురన్’లో ఆయన నటనకు గానూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నాడు. అయితే అదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్‌ని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో ఇది వర్ణనాతీతమైన అనుభూతి అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఈ హీరో. ధనుష్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మామ, స్టార్ రజనీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. దానికి.. ‘‘తలైవర్’ దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న అదే వేదికపై, అదే రోజు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకోవడం వర్ణించడానికి మాటలు లేని అనుభూతి. ఇలాంటి గొప్ప బహుమతి ఇచ్చినందుకు జాతీయ అవార్డు జ్యూరీకి ధన్యవాదాలు. నాకు సపోర్టుగా నిలిచిన ప్రెస్, మీడియాకి కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ఈ నటుడు ఫ్యాన్స్ కోసం అంటూ మెడల్ పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) To my fans ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/USEEJLRGFR — Dhanush (@dhanushkraja) October 25, 2021 అంతేకాకుండా ధనుష్ పోస్ట్‌కంటే ముందు, ఆయన భార్య తన తండ్రి, భర్త ఉన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. రజనీకి కూతురిగా, ధనుష్‌కి భార్యగా ఉండడం గర్వంగా ఉందని తెలిపింది. అయితే ‘భోంస్లే’ చిత్రానికి గానూ మనోజ్ బాజ్‌పేయితో కలిసి ధనుష్ ఈ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు ఆయన నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) చదవండి: టాలీవుడ్‌పై ధనుష్ స్పెషల్ ఫోకస్.. మరో ఇద్దరితో చర్చలు! -
67th National Film Awards: తెలుగులో జెర్సీకి రెండు,మహర్షికి 3 అవార్డులు
-
67th National Film Awards: జాతీయ ఉత్తమ నటిగా కంగనా..
-
టెస్కాబ్‌కు 4 జాతీయ ఉత్తమ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు నాలుగు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కాయి. ముంబైకు చెందిన బ్యాంకింగ్ ఫ్రంటియర్ మేగజైన్ ఈ అవార్డులను ప్రకటించిందని టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎండీ డాక్టర్ నేతి మురళీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సమ్మిట్ (ఎన్సీబీఎస్), ఫ్రాంటియర్స్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ అవార్డ్స్ (ఎఫ్సీబీఏ) నేతృత్వంలోని బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ వర్చువల్ మోడ్ పద్ధతిలో నాలుగు అవార్డులను ప్రకటించిందని వివరించారు. జాతీయ ఉత్తమ సహకార బ్యాంకు, ఉత్తమ ఎన్పీఏ నిర్వహణ, ఉత్తమ పెట్టుబడి, ఉత్తమ హెచ్ఆర్ ఆవిష్కరణ అవార్డులను టెస్కాబ్ గెలుచుకుందన్నారు. గతంలో టెస్కాబ్ నాబార్డు ద్వారా దేశంలోనే జాతీయ అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికైందని ఆయన గుర్తుచేశారు. అవార్డులను త్వరలో అందుకుంటామని వెల్లడించారు. -
జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉంది :పుష్ప శ్రీవాణి
-
ఏపీ గిరిజన సంక్షేమ శాఖకు 5 జాతీయ అవార్డులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖకు 5 జాతీయ అవార్డులు దక్కాయి. దాంతో పాటు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ) దేశంలోనే మూడు నంబర్‌వన్ అవార్డులు సాధించింది. వన్ ధన్ యోజన, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను కల్పించడంలోనూ, సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ జీసీసీ.. జాతీయ స్థాయిలో దేశంలోనే మొదటి ర్యాంకులను సాధించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. జీసీసీ వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు ట్రైఫెడ్ ఈ అవార్డులను ఇవ్వనుందని పుష్ప శ్రీవాణి తెలిపారు. వన్ ధన్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలోనూ, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ఇప్పించడంలోనూ ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకును కేటాయించిందని పుష్ప శ్రీవాణి తెలిపారు. సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడంలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు మొదటి ర్యాంకును ఇచ్చారని పుష్ప శ్రీవాణి వివరించారు. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4.50 కోట్ల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు జీసీసీకి దక్కిందని తెలిపారు. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి తీసుకున్న చర్యలు, పటిష్టమైన పర్యవేక్షణ కారణంగానే ఇది సాధ్యమైయిందని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే జీసీసీ అధికార సిబ్బందికి పుష్ప శ్రీవాణి అభినందనలు తెలిపారు. సీఎం జగన్ మార్గదర్శనంతోనే జీసీసీ ఉత్తమంగా పనిచేస్తోందనడానికి జాతీయ స్థాయిలో వచ్చిన 5 అవార్డులే నిదర్శమన్నారు. -
గ్రామ పాలనకు గౌరవం
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో 17 అవార్డులు పొందిన రాష్ట్రంలోని పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పురస్కారాలను ప్రదానం చేశారు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాగా పనితీరు కనబరిచిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నాలుగు కేటగిరీల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది రాష్ట్రానికి 15 అవార్డులు రాగా.. ఈసారి 17 వచ్చాయి. అవార్డుల పరంగా ఏపీ జాతీయ స్థాయిలో నాలుగో స్థానం దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్ర స్థాయి రెండో అవార్డుతోపాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈసారి రాష్ట్రానికి దక్కాయి. జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డు కింద రూ.25 వేలు, పంచాయతీ స్థాయిలో జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి అందించారు. గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభం కావాలి: ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కి అవార్డులు పొందిన పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఖాతాల్లో నగదు బహుమతి జమ చేశారు. అలాగే మరో బటన్ నొక్కి 7 రాష్ట్రాల్లోని 5 వేల గ్రామాల్లో ప్రాపర్టీ కార్డుల జారీని కూడా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. కోవిడ్ కష్టకాలంలోనూ గ్రామ పంచాయతీలు గతేడాది నుంచి చాలా చక్కగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నందువల్ల పంచాయతీలు అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమవ్వాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఈ–పంచాయత్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, కమిషనర్ గిరిజా శంకర్ అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, జిల్లా స్థాయిలో.. గుంటూరు, కృష్ణా జిల్లాలు పొందిన అవార్డులు (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారం) ఆ జిల్లాల జెడ్పీ సీఈవోలు డి.చైతన్య, పీఎస్ సూర్యప్రకాశరావు, మండలాల స్థాయిలో.. చిత్తూరు జిల్లా సొడెం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీవోలు అవార్డులు అందుకున్నారు. అలాగే పంచాయతీల స్థాయిలో.. కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖపట్నం జిల్లా పెదలబూడు, గుంటూరు జిల్లా గుల్లపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ కండ్రిగ, తాళ్లపాలెం, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పుగోదావరి జిల్లా జి.రంగంపేట, ప్రకాశం జిల్లా కొడెపల్లి పంచాయతీలకు సీఎం పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ల్యాండ్ రికార్డ్స్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్తోపాటు వివిధ జిల్లాలు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
‘సశక్తికరణ్’ అవార్డులపై కేటీఆర్ హర్షం
హైదరాబాద్: దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాల్లో భాగంగా రాష్ట్రానికి 12 జాతీయ అవార్డులు రావడం పట్ల మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రావును ఆయన సన్మానించారు. రాష్ట్రానికి అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బందిని ఆయన అభినందించారు. గురువారం ప్రగతి భవన్లో ఎర్రబెల్లిని కలసిన సందర్భంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తూ, జాతీయస్థాయిలో రాష్ట్రానికి చెందిన 9 ఉత్తమ గ్రామ పంచాయతీలు, 2 మండలాలు, ఒక జిల్లా పరిషత్‌లకు అవార్డులు రావడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ వరుసగా అవార్డులు సాధించడం గొప్ప విషయమని, సీఎం కేసీఆర్ వినూత్నంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్న కారణంగానే గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం ముందడుగు వేస్తోందని కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అసలైన గ్రామ స్వరాజ్య స్థాపన కేసీఆర్ హయాంలో జరుగుతోం దన్నారు. ఇదే తరహా పనితీరుని కొనసాగిస్తూ, రాష్ట్రానికి మరింత పేరు వచ్చే విధంగా పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. -
తెలుగు వాళ్లూ కలిసి పరిగెత్తారు
మొన్నటి 67వ జాతీయ అవార్డుల హడావిడిలో ఒక బక్కచిక్కిన ముసలమ్మ, ఇద్దరు కరీంనగర్ కుర్రాళ్లు పత్రికలలో స్థలాభావం వల్ల కనపడకుండా పోయారు. ఆ అవార్డులలో వీరికీ స్థానం ఉంది. భర్త గుండె పరీక్షల కోసం 67 ఏళ్ల వయసులో మహరాష్ట్రలో మారథాన్ చేసిన ‘లతా భగవాన్ కరే’ జీవితాన్ని ఆమెతోనే సినిమా తీశారు దర్శకుడు నవీన్ దేశబోయిన, నిర్మాత అర్రబోతు కృష్ణ. 2020లో మరాఠీలో రిలీజ్ చేస్తే ఇప్పుడు దానికి జాతీయ ఉత్తమ చిత్రం (ప్రత్యేక ప్రస్తావన) దక్కింది. ఆమె విజయమూ వారి విజయమూ మనకు బాగా కనపడాలి... వినపడాలి. ‘నా దృష్టిలో ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అనేవి లేవు. కథను నిజాయితీగా చెప్పే సినిమాయే ఉంది. కమర్షియల్‌గా కొలతలు వేసుకుని సినిమాలు తీస్తే అవన్నీ హిట్ అవ్వాలి కదా. నూటికి ఒకటో రెండో మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయి?’ అంటారు దర్శకుడు నవీన్ దేశబోయిన. ఈ కరీంనగర్ సృజనశీలి ఇప్పుడు జాతీయస్థాయిలో తన ప్రతిభ చాటుకున్నాడు. మొన్న ప్రకటితమైన జాతీయ సినిమా అవార్డులలో ఇతను దర్శకత్వం వహించిన ‘లతా భగవాన్ కారే’ మరాఠీ సినిమాకు ఉత్తమ చిత్రం (స్పెషల్ మెన్షన్) అవార్డు దక్కింది. నిజానికి ఇది ఒక తెలుగువాడికి దక్కిన గౌరవం. దాంతో పాటు ఒక సామాన్యురాలి పట్టుదలకు దక్కిన గౌరవం కూడా. ఎవరా సామాన్యురాలు? అంత అసమాన్యమైన పని ఏమి చేసింది? 2013లో పరుగు లతా కారేది మహారాష్ట్రలోని బారామతి. ఆమె భర్త భగవాన్ సెక్యూరిటీ గార్డు. వారికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురి పెళ్లిళ్లు చేసే సరికి వారి దగ్గర ఉన్న చివరి రూపాయి అయిపోయింది. ఆ సమయంలోనే భగవాన్‌కు గుండె జబ్బు పట్టుకుంది. డాక్టర్లు స్కానింగ్‌లు ఇతర పరీక్షలు చేయాలి అందుకు 5 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఆ సమయానికి లతా కారే వయసు 60 సంవత్సరాలు. ఏదో గుట్టుగా బతికిందే తప్ప ఒకరి దగ్గర చేయి చాపింది లేదు. కాని భర్త కోసం ప్రయత్నాలు చేస్తే ఏమీ సాయం దక్కలేదు. ఆ సమయంలోనే ఒక కాలేజీ కుర్రాడి ద్వారా బారామతిలో ‘సీనియర్ సిటిజెన్స్ మారథాన్’ జరగనుందని తెలిసింది. అందులో గెలిచిన వారికి 5 వేల రూపాయలు ఇస్తారని కూడా తెలిసింది. భర్త ప్రాణాల కోసం ఆ 5 వేల రూపాయలు గెలవాలని నిశ్చయించుకుందామె. 9 గజాల చీరలో పోటీ సంగతి తెలిసిన నాటి నుంచి లతా కారే తెల్లవారు జామునే లేచి ఊళ్లో ఎవరూ చూడకుండా పరిగెత్తడం మొదలెట్టింది. చాలాసార్లు కింద పడింది. అయినా సరే పట్టుదలగా సాధన చేసింది. పోటీ రోజు స్లిప్పర్లు వేసుకుని 9 గజాల చీర కట్టుకుని వచ్చిన ఆమెను అందరూ వింతగా చూశారు. మిగిలిన వారు ట్రాక్సూట్లలో, షూలలో ఉండేసరికి ఆమె కూడా కంగారు పడింది. నిర్వాహకులు మొదట అభ్యంతరం చెప్పినా తర్వాత ఆమె పరిస్థితి తెలుసుకుని అనుమతి ఇచ్చారు. 3 కిలోమీటర్ల మారథాన్ అది. అందరూ పరిగెత్తడం మొదలెట్టారు. లతా కారే కూడా పరిగెత్తింది. వెంటనే ఒక స్లిప్పర్ తెగిపోయింది. ఆమె రెండో స్లిప్పర్ కూడా వదిలిపెట్టి పరుగు అందుకుంది. కొద్ది సేపటిలోనే పోటీదారులంతా వెనుకపడ్డారు. జనం కరతాళధ్వనుల మధ్య ఆమె గెలుపు సాధించింది. అయితే ఆమె ఏ కారణం చేత పరిగెత్తిందో తెలుసున్న జనం పెద్ద ఎత్తున సాయం చేశారు. సంస్థలు కూడా ఆర్థికంగా ఆదుకున్నాయి. భర్త ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె ఇప్పుడు నిశ్చింతగా ఉంది. ఆ తర్వాత 2014లో, 2016లో కూడా ఆమె మారథాన్లు గెలిచింది. సినిమాగా ఈ వార్తను టీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న నవీన్ దేశబోయిన చూసి 2017లో ఆమెను సంప్రదించి తన తొలిసినిమాగా ఆమె కథను 2019లో తీశారు. ఆమె పాత్రను ఆమె చేతే పోషింప చేయడానికి ఆమెను ఒప్పించారు. మరాఠీలో తయారైన ఈ సినిమా ‘లతా భగవాన్ కారే’ పేరుతో 2020 జనవరిలో విడుదల అయ్యింది. కారే జీవితాన్ని సినిమాగా తీసేందుకు నవీన్ మిత్రుడు కరీంనగర్ వాసి అర్రబోతు కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తెలుగువారి ప్రయత్నం లతా కారేను వెండి తెర మీద శాశ్వతం చేసింది. ఇప్పుడు జాతీయ అవార్డుతో మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ తెలంగాణ మిత్రులు ఇద్దరూ మరాఠి, తెలుగు భాషల్లో లతా కారే జీవితాన్ని సీక్వెల్‌గా తీస్తున్నారు. ఆ సినిమా కూడా ఇలానే ప్రశంసలు పొందాలని ఆశిద్దాం. -
జెర్సీకి ఆ అర్హత ఉంది
‘‘జెర్సీ’కి బెస్ట్ యాక్టర్‌గా నానీకి, బెస్ట్ డైరెక్టర్‌గా గౌతమ్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వస్తాయని నమ్మాను. అయితే రెండు జాతీయ అవార్డ్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ అవార్డులకు ‘జెర్సీ’కి పూర్తి అర్హత ఉంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’కి ఉత్తమ తెలుగు చిత్రంగా, ఈ సినిమా ఎడిటర్ నవీన్ నూలికి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులు వచ్చాయి. నాగవంశీ మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ కథలోని ఎమోషన్స్‌ను నమ్మి నాని, నేను ఈ సినిమా చేశాం. ఈ 26న మా ‘రంగ్ దే’ రిలీజవుతుంది. వేసవిలో ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. ‘వరుడు కావలెను’, ‘నరుడి బ్రతుకు నటన’, బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాం. మలయాళ చిత్రాలు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’, ‘కప్పేలా’ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం’’ అన్నారు. -
పోలీస్‌శాఖకు సీఎం అభినందన
-
పోలీస్‌శాఖకు సీఎం అభినందన
సాక్షి, అమరావతి: పలు అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇప్పటివరకు 125 జాతీయ అవార్డులు అందుకున్న నేపథ్యంలో సోమవారం డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ అవార్డులకు సంబంధించిన3 వివరాలను తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దిశ’ కార్యక్రమానికి అనేక జాతీయ అవార్డులు దక్కాయని చెప్పారు. తాజాగా జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీగా తనకు అవార్డు వచ్చిందని తెలిపారు. అత్యుత్తమ పోలీసింగ్ నిర్వహించడంలో 13 జాతీయస్థాయి అవార్డులను రెండు రోజుల కిందట సాధించినట్లు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ డీజీపీ సవాంగ్‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి పోలీస్‌శాఖకు గౌరవ ప్రతిష్టలను పెంచాలని సీఎం ఆదేశించారు. సీఎంను కలిసిన వారిలో ఇంటెలిజెన్స్ చీఫ్ (డీజీ) కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏపీ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జి.పాలరాజు ఉన్నారు. -
జాతీయ ఉత్తమ నటి కంగన.. తెలుగు చిత్రం జెర్సీ
న్యూఢిల్లీ: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను సోమవారం ప్రకటించారు. జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణి కర్ణిక), ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి గానూ మనోజ్ బాజ్‌పాయ్, అసురన్ సినిమాకు గానూ ధనుష్‌లను పురస్కారాలు వరించాయి. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించిన జెర్సీ నిలిచింది. కాగా ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో ఈసారి 461, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 220 చిత్రాలు పోటీపడ్డాయి. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా ►మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: సిక్కిం ►ఉత్తమ సినీ విమర్శకులు: సోహిని ఛటోపాధ్యాయ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీ ఉత్తమ చిత్రాలు ఉత్తమ తులు చిత్రం: పింగారా ఉత్తమ పనియా చిత్రం: కెంజీరా ఉత్తమ మిషింగ్ చిత్రం: అను రువాడ్ ఉత్తమ ఖాసీ చిత్రం: లూద్ ఉత్తమ హర్యాన్వీ చిత్రం: చోరియాన్ చోరోంసే కమ్ నహీ హోతీ ఉత్తమ ఛత్తీస్‌గఢీ చిత్రం: భులన్ ది మేజ్ ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ ఉత్తమ తమిళ చిత్రం: అసురన్ ఉత్తమ పంజాబీ చిత్రం: రబ్ దా రేడియో 2 ఉత్తమ ఒడియా చిత్రం: సాలా బుధార్ బద్లా అండ్ కలీరా అటీటా ఉత్తమ మణిపురి చిత్రం: ఈగీ కోనా ఉత్తమ మలయాళ చిత్రం: కల్లా నోట్టం ఉత్తమ మరాఠీ చిత్రం: బార్దో ఉత్తమ కొంకణి చిత్రం: కాజ్రో ఉత్తమ కన్నడ చిత్రం: అక్షి ఉత్తమ హిందీ చిత్రం: చిచోరే ఉత్తమ బెంగాళీ చిత్రం: గుమ్నామీ ఉత్తమ అస్సామీ చిత్రం: రొనువా- హూ నెవర్ సరెండర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ►పాటలు: విశ్వాసం(తమిళం) ►మ్యూజిక్ డైరెక్టర్: యేష్తోపుట్రో ►మేకప్ ఆర్టిస్టు: హెలెన్ ►బెస్ట్ స్టంట్: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ) ►బెస్ట్ కొరియోగ్రఫి: మహర్షి(తెలుగు) ►బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: మరాక్కర్ అరబికాదలింతే సింహం(మలయాళం) ►స్సెషల్ జ్యూరీ అవార్డు: ఒత్త సెరుప్పు సైజ్-7(తమిళం) ►బెస్ట్ లిరిక్స్: కొలాంబీ(మలయాళం) తెలుగు చిత్రాలు: ఉత్తమ తెలుగు చిత్రం - జెర్సీ ఉత్తమ వినోదాత్మక చిత్రం - మహర్షి ఉత్తమ దర్శకుడు - గౌతమ్ తిన్ననూరి ఉత్తమ కొరియోగ్రాఫర్ - రాజు సుందరం (మహర్షి) ఉత్తమ ఎడిటర్ - నవీన్ నూలి (జెర్సీ) -
జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డులు
సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అవార్డులు దక్కించుకుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవార్డులను ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు వరించాయి. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్) ఓడిఎఫ్, జీరో వేస్ట్ మేనేజ్మెంట్, నూతన టెక్నాలజీలకు అవార్డులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి కలెక్టర్లకు అవార్డులను కేంద్ర మంత్రి షెకావత్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో నిర్వహణ సులభతరమైందని పేర్కొన్నారు. (చదవండి: ‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’) విశాఖ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ.. విశాఖ: అంతర్జాతీయ పోటీల్లో విశాఖ నగరం మూడో స్థానంలో నిలవడం శుభపరిణామం అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు.. ప్రజలు సహకరించటంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అన్ని పార్టీల ప్రజలు ఉన్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకున్నా.. సీఎం వైఎస్ జగన్ మాత్రం పేదల విషయంలో రాజీ పడలేదన్నారు. ఇళ్ల పట్టాలు తీసుకోబోతున్న వ్యక్తుల్లో టీడీపీ సానుభూతి పరులు కూడా ఉన్నారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
సీఐడీకి రెండు స్కోచ్ జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ)కి రెండు స్కోచ్ జాతీయ అవార్డులు వచ్చినట్టు అడిషనల్ డీజీ, ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ చెప్పారు. సీఐడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19, ఈ–నిర్దేశ కార్యక్రమాలకు రజత పతకాలు వచ్చినట్టు శనివారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► జాతీయ స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక వినియోగం, అత్యుత్తమ నూతన ఆవిష్కరణలకు ఏటా స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులను అందజేస్తుంది. ► ఈ ఏడాది దేశ వ్యాప్తంగా టెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్కరణలకు 84 అవార్డులు అందజేయగా అందులో 48 అవార్డులు ఏపీ పోలీస్ శాఖకు దక్కడం గర్వకారణం. ► ఏపీ పోలీస్ విభాగంలో వచ్చిన అవార్డుల్లో ఏపీ సీఐడీకి రెండు జాతీయ రజత పతకాలు రావడం విశేషం. జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ఆన్లైన్ కార్యక్రమంలో సీఐడీ తరఫున రెండు రజత పతకాలు అందుకున్నాం. ► సీఐడీ విభాగం అధ్వర్యంలో రూపొందించిన ఈ–నిర్దేశ, ఆపరేషన్ ముస్కాన్–కోవిడ్ 19 ప్రాజెక్టులకు రజత పతకాలు గెలుపొందగా ఏపీ సీఐడీ ‘ఫర్ ఎస్ ఫర్ యూ’, ఈ–రక్షాబంధన్’ కార్యక్రమాలు స్కోచ్ ఆర్డర్ అఫ్ మెరిట్లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. ► శాంతి భద్రతల పరిరక్షణలో, కేసుల ఛేదింపు, వివిధ పోలీసింగ్ విధుల్లో టెక్నాలజీ వినియోగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ► వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు తోడు సైబర్ నేరాలు అదే స్థాయిలో సవాల్‌గా మారాయి. సైబర్ నేరాలను అదుపు చేయాలంటే అత్యున్నత స్థాయిలో మన టెక్నాలజీ వినియోగం, రూపకల్పనలు ఉండాలి. అటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న సీఐడీ విభాగం ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులను గెలుచుకోగలిగింది. ► సీఐడీని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ డి.గౌతమ్ సవాంగ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు జాతీయ అవార్డులు
శంషాబాద్: ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి. 2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ జాతీయ అవార్డుల్లో భాగంగా ‘నేషనల్ ఎనర్జీ లీడర్’అవార్డుతో పాటు ‘ఎక్స్లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్’అవార్డును పొందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లుగా శంషాబాద్ విమానాశ్రయం ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా 4.55 మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసింది. హైదరాబాద్ విమానాశ్రయం ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో అవార్డులు పొందిందని, తమ పనితీరుకు అవార్డులు కొలమానమని జీహెచ్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ అన్నారు. -
ఏపీ పోలీస్‌కు అవార్డుల పంట
సాక్షి, అమరావతి: ఇప్పటికే అనేక విభాగాల్లో జాతీయస్థాయి గుర్తింపును పొందడంతోపాటు అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు తాజాగా మరో ఐదు అవార్డులు వచ్చాయి. ఓ ప్రైవేటు సంస్థ ఒడిశాలోని భువనేశ్వర్‌లో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన జాతీయ సెమినార్ సందర్భంగా ‘టెక్నాలజీ సభ అవార్డ్స్–2020’ను ప్రదానం చేశారు. ఇందులో ఏపీ పోలీసులకు ఐదు జాతీయ అవార్డులు లభించాయి. సాంకేతికపరంగా వివిధ అంశాల్లో చూపిన ప్రతిభకుగాను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు ఈ అవార్డులు దక్కాయి. రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్న పోలీసు వీక్లీ ఆఫ్ విధానానికి తొలి అవార్డు లభించింది. అలాగే దర్యాప్తులో భాగంగా అమలు పరుస్తున్న ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకర్’, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం, ఎన్నికల్లో పోలీసు విధులు(బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్), ఎస్సీ, ఎస్టీ యాక్ట్ మానిటరింగ్ డ్యాష్ బోర్డు విధానానికి కూడా అవార్డులు లభించాయి. ఒడిశా ఐటీ శాఖ మంత్రి చేతుల మీదుగా ఏపీ పోలీసు ప్రతినిధులు ఈ అవార్డులను అందుకున్నారు. డీజీపీ అభినందనలు.. ఏపీ పోలీసులు వరుసగా జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం ఒక ప్రకటనలో వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అత్యుత్తమ పోలీసింగ్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపట్టారని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న పోలీసు శాఖ ఇటీవలి కాలంలో ఎన్నో జాతీయ అవార్డులను అందుకుందని డీజీపీ గుర్తుచేశారు. కేంద్ర హోంశాఖతోపాటు జాతీయస్థాయి ప్రైవేటు సంస్థల నుంచి కూడా ఏపీ పోలీసులు సాంకేతిక, దర్యాప్తు తదితర అంశాల్లో అవార్డులు అందుకున్నారన్నారు. ఏపీ పోలీసులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మంచిపేరు తేవాలని ఆయన కోరారు. -
ఉపాధిహామీలో ఉత్తమ పనితీరుకు రాష్ట్రానికి 5 పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఐదు అవార్డులను సాధించింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావుతోపాటు పలువురు అధికారులు ఈ పురస్కారాలు అందుకున్నారు. జల సంరక్షణ కార్యక్రమంలో ఉత్తమ పనితీరుకు గాను జాతీయ స్థాయిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచినందుకు ఓ అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని రఘునందన్‌రావు అందుకున్నారు. ప్రతిభ చూపిన జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జాతీయస్థాయిలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. -
క్షమాపణ చెప్పిన మమ్ముట్టి
తమిళసినిమా : మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి క్షమాపణ చెప్పారు. ఇందుకు కారణం ఆయన వీరాభిమానులే. ఆ కథేంటో చూద్దాం. ఇటీవల 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరాది చిత్రపరిశ్రమతో పాటు దక్షిణాదిలో ఒక్క తమిళచిత్ర పరిశ్రమ మినహా అన్నీ సినీ పరిశ్రమలను ఈ అవార్డులు వరించాయి. తమిళంలోనే రెండు జాతీయ అవార్డులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాగా మమ్ముట్టి అభిమానులు అవార్డుల కమిటీ చైర్మన్ రాహుల్ రవిపై దండయాత్ర చేస్తున్నారు. ఆయన ఫేస్బుక్లో ఇస్టానుసారంగా ఏకేస్తున్నారు. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. అందుకు కారణం మమ్ముట్టి నటించిన చిత్రానికి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవడమే. మమ్ముట్టి మలయాళంలోనూ కాకుండా తమిళం, తెలుగు, హింది బాషల్లో నటించి బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈయన తమిళంలో నటించిన చిత్రం పేరంబు. పలువురు సినీ ప్రముఖుల ప్రసంశలను అందుకున్న ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అలాంటి పేరంబు చిత్రానికి ఒక్క జాతీయ అవార్డు రాకపోవడమే మమ్ముట్టి అభిమానుల ఆగ్రహానికి కారణం. అవార్డు కమిటీపై ఆరోపణలు రావడం సహజమేకానీ, ఇలా అభిమానులు మండిపడడం అరుదే. మమ్ముట్టి అభిమానులు జాతీయ అవార్డుల కమిటీ చైర్మన్ రాహుల్రవిపై ఫేస్బుక్లో విమర్శల దాడికి దిగారు. చాలా అసభ్య పదజాలంను వాడడంతో వేదన చెందిన రాహుల్రవి వెంటనే నటుడు మమ్ముట్టికి ఒక వివరణను ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అందులో మిస్టర్ మమ్ముట్టి మీ అభిమానులు పరుష పదజాలంతో నాపై దాడి చేస్తున్నారు. పేరంబు చిత్రానికి అవార్డును ప్రకటించలేదని దూషిస్తున్నారు. అందుకు వివరణ ఇస్తున్నాను. ముఖ్యంగా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కమిటీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నంచరాదు. ఇకపోతే మీ పేరుంబు చిత్రాన్ని ప్రాంతీయ కమిటీనే తిరష్కరించడంతో కేంద్ర కమిటీ పరిశీలనకు రాలేదు. ఈ విషయం తెలియక మీ అభిమానులు గొడవ చేస్తున్నారు అని పేర్కొన్నారు. దీంతో కొద్ది సమయంలోనే మమ్ముట్టి రాహుల్ రవి ట్వీట్‌కు స్పందిస్తూ ‘క్షమించండి. ఈ విషయాలేమీ నాకు తెలియవు. అయినా జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను’అని ట్విట్టర్లో బదులిచ్చారు. చూశారా? ఒక్కోసారి మితివీురిన అభిమానం కూడా తలవంపులు తెచ్చిపెడుతుందన్నదానికి ఈ ఉదంతమే ఉదాహరణ. -
రామ్ చరణ్ యాక్టింగ్‌పై మంచు విష్ణు ట్వీట్
66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా 7 విభాగాల్లో అవార్డులు సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో మరో అవార్డు కూడా రావాల్సింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. రంగస్థలం సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని అంతా భావించారు. తాజాగా హీరో మంచు విష్ణు జాతీయ అవార్డులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘అవార్డులు సాధించిన వారి విషయంలో ఎలాంటి కంప్లయింట్ లేకపోయినా.. రంగస్థలంలో సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రామ్ చరణ్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకునే అర్హత ఉంది. ఇటీవల కాలంలో ఇదే అత్యుత్తమ నటన. ఏది ఏమైన అభిమానుల ప్రేమే అన్నింటికన్నా పెద్ద అవార్డ్’ అంటూ ట్వీట్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా రంగస్థలంలో చిట్టి బాబు పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు రామ్‌చరణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించారు. No offense to the other winners, but in my honest opinion my bruh Ram Charan deserved to win the National award for best actor in Rangasthalam. By far it was one of the best performances by any actor in the recent times. Anyways the audience love is the biggest award. — Vishnu Manchu (@iVishnuManchu) August 10, 2019 -
కన్నడ చిత్రాలకు అవార్డుల పంట
సాక్షి బెంగళూరు : 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కన్నడ సినిమాలు పంట పండించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 అవార్డులను కన్నడ సినిమాలు దక్కించుకున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రముఖ నటి శ్రుతి హరిహరన్ నటించిన నాతిచరామి సినిమా అత్యధిక అవార్డులను దక్కించుకుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేజీఎఫ్ సినిమా ఉత్తమ యాక్షన్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. నాతిచరామి సినిమాకు మొత్తం5 అవార్డులు, కేజీఎఫ్ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. అలాగే ప్రముఖ కథానాయకుడు రిషబ్ శెట్టి నటించిన ‘సర్కారి హిరియ ప్రాథమిక శాలె కాసరగోడు’ చిత్రం కూడా అవార్డును గెలుచుకుంది. ఈసారి ఏకంగా 11 అవార్డులను దక్కించుకుంది. కన్నడ చలనచిత్ర చరిత్రలో ఇంతటిస్థాయిలో కర్ణాటకకు అవార్డులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముంబైలోని శాస్త్రి భవన్ హాల్లో ఈ అవార్డులను అందజేశారు. మొత్తం 31 విభాగాల్లో పురస్కారాలను ఇచ్చారు. కాగా, నాతిచరామి సినిమాలో చక్కని నటనకు గాను ప్రత్యేక అవార్డు పొందిన శ్రుతి హరిహరన్ సంతోషం రెట్టింపయింది. ఒకవైపు అవార్డు వచ్చిన ఆనందం కాగా, మరోవైపు తన జీవితంలో ఒక పండంటి ఆడబిడ్డకు శ్రుతి హరిహరన్ జన్మనిచ్చారు. కన్నడ సినిమాల అవార్డుల జాబితా 1. ఉత్తమ ప్రాంతీయ చిత్రం నాతిచరామి 2. ఉత్తమ మహిళా గాయని – బింధు మాలిని (నాతిచరామి–మాయావి మానవే హాడు) 3. ఉత్తమ సాహిత్యం – నాతిచరామి 4. ఉత్తమ ఎడిటింగ్ – నాతిచరామి 5. ఉత్తమ సాహస చిత్రం – కేజీఎఫ్ 6. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం – కేజీఎఫ్ 7. ఉత్తమ జాతీయ ఏకత్వ చిత్రం – ఒందల్ల, ఎరడల్ల 8. ఉత్తమ బాల నటుడు – పీవీ రోహిత్ (చిత్రం– ఒందల్ల, ఎరడల్లా) 9. ఉత్తమ బాలల చిత్రం – ‘సర్కారీ హిరియ ప్రాథమిక శాలే కాసరగోడ 10. ఉత్తమ చిత్రం– మూకజ్జియకనసుగళు 11. ప్రత్యేక అవార్డు – నాతిచరామి చిత్రానికి గాను శ్రుతి హరిహరణ్ -
‘మహానటి’.. కీర్తి సురేష్
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాను భారీ పురస్కారాలు వరించాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు అవార్డునుఆయుష్మాన్ ఖురానా(అంధాధూన్), విక్కీ కౌశల్(ఉడి)కు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా ఆధిర్ ధర్ (ఉడి) ఎంపికయ్యారు. ఇక బెస్ట్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే , ఉత్తమ ఆడియోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ‘తెలుగు వెలిగింది’. తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఈ దారిలో మరింత విస్తృతంగా నడవడానికి కావాల్సింది అవార్డులు, రివార్డులు. తెలుగులో వస్తున్న కొత్తతరం సినిమాలకు ప్రేక్షకులు అభినందనలతో ప్రేమను అందిస్తుంటే, జాతీయ అవార్డులు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు వెలిగింది. చిన్నూ.. అవార్డ్ వచ్చిందని అరిచాను – రాహుల్ రవీంద్రన్ (‘చిలసౌ’ దర్శకుడు) పదేళ్ల క్రితం మా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘చిలసౌ’ కథ తయారు చేసుకున్నాను. కెరీర్లో ఇలాంటి అవార్డ్ వస్తుందని ఊహించలేదు. ఇవాళ చాలా స్పెషల్ రోజు. నా మొదటి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం, రెండో సినిమా రిలీజ్ కావడం, డెబ్యూ డైరెక్టర్‌గా ‘సాక్షి’ నాకు అవార్డ్ ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని మెచ్చుకున్నా, మన పని నచ్చినా సరే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల ఆశీర్వాదం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. ‘మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది’ అని చాలా ఫోన్లు వచ్చాయి. నాకు అర్థం కాలేదు. వెంటనే చిన్ను (రాహుల్ భార్య చిన్మయి)కి ఫోన్ చేసి గట్టిగా ‘చిన్నూ...నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది..’ అని అరిచాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవార్డ్ కోసం ‘చిలసౌ’ ఎప్పుడో పంపించి మర్చిపోయాం. ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. కథను నమ్మిన హీరో, నిర్మాతలకు, నాగార్జున సార్‌కి అందరికీ థ్యాంక్స్. క్రెడిట్ ముగ్గురికి దక్కుతుంది – ప్రశాంత్ వర్మ, (’అ!’ దర్శకుడు) చాéలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. దర్శకుడిగా ఫస్ట్ సినిమాకే అవార్డ్స్ రావడం ప్రోత్సాహంలా ఉంటుంది. విభిన్నమైన సినిమాలు తీయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కమర్షియల్ సినిమాలా? డిఫరెంట్ సినిమాలా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ అవార్డ్స్ ఇంట్రెస్ట్ పెంచుతాయి. నేషనల్ అవార్డ్స్‌కు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ‘అ!’ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు ఎందుకో ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకొని చూస్తూ ఉన్నా. అర్ధగంట అవగానే నేషనల్ అవార్డ్ వచ్చిందంటూ కాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్‌గా నిలబడినందుకు నానీగారికి స్పెషల్ థ్యాంక్స్. మేకప్ చీఫ్ రంజిత్‌తో పాటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శాంతి, అదితీ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ల ముగ్గురికీ ఈ క్రెడిట్ వెళ్లాలనుకుంటున్నాను. అస్సలు ఊహించలేదు – రాజాకృష్ణన్ (‘రంగస్థలం’ ఆడియోగ్రాఫర్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు సాధించినందుకు సంతోషంగా ఉంది. అది కూడా నేను చేసిన తెలుగు సినిమాకు రావడం హ్యాపీ. జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్‌చరణ్ సగం చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్రలో బాగా నటించారు. హీరోకు వినికిడి సమస్య ఉండటంతో సౌండింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. సౌండింగ్‌కు మంచి స్కోప్ దొరికింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా చేశాను. సుకుమార్‌గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు థ్యాంక్స్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మా బాధ్యత పెరిగింది – నాని మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ‘అ’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని, ప్రశాంతి తిపిరనేని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల హీరో, నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘అ’ మంచి విజయాన్ని సాధించి, ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ‘మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్నవారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో అవార్డులు గెలుచుకున్నవారికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఈ సినిమాల రిలీజ్‌కు ముందే చిరంజీవి ఊహించి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మహానటి’ సినిమా విడుదల తరవాత కూడా ఓ సందర్భంలో యూనిట్ సభ్యులను చిరంజీవి అభినందించిన సంగతి విదితమే. మరాఠీలో మెరిసిన తెలుగు తేజం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సుధాకర్ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. మరాఠీ చిత్రం ‘నాల్’ (బొడ్డుతాడు) చిత్రానికి సుధాకర్ రెడ్డి ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ వంటి టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల్యంతో పెనవేసుకున్న అనుభవాలను, తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో సుధాకర్ ఉద్వేగభరితంగా చూపారు. అదే విధంగా ‘నాల్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలనటుడు శ్రీనివాస్ పోకలేకు మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించడం విశేషం. కేజీఎఫ్‌కు డబుల్ ధమాకా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు యష్, ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేజీఎఫ్ చాప్టర్2’ను త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పాటకు తొలి అవార్డు ‘పద్మావత్’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఆయనే సంగీత దర్శకుడు కూడా. భన్సాలీ మాట్లాడుతూ– ‘‘క్రియేటివ్ ఫిల్డ్‌లో ఆర్టిస్టులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. కానీ ‘పద్మావత్’ సినిమా విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువగానే సమస్యలను ఫేస్ చేశాను. నేను చేసిన సినిమాల్లో కల్లా ‘పద్మావత్’ చాలా కష్టతరమైనది. చిత్రీకరణ సమయంలో మాపై దాడులు జరిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు, మార్చ్‌లు చేశారు. బ్యాన్ చేయమన్నారు. ఇలా ఈ సినిమాకి ప్రతి విషయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ కారణాల చేత నేను ఫీలైన ప్రతిసారీ ఓ పాట తీసేవాడిని. కొంచెం రిలీఫ్‌గా అనిపించేది. అన్ని సమస్యల మధ్య కూడా నేను ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే ఆలోచించా. ఈ సినిమా విజయం సాధించడానికి అదొక కారణం అనిపించింది. ఇప్పుడు మా సినిమాకు అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. ఇదొక ఎమోషనల్ మూమెంట్ మాకు. నా ప్రతి సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుంది. సంగీతమే నా ప్రపంచం’’ అని అన్నారు. అయితే.. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్‌కు అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. బుల్బుల్ పాడగలదు! అస్సామీ సినిమాకు ‘జాతీయ ఉత్తమ చిత్రం’ అవార్డు అందని ద్రాక్ష. అది 2018 వరకే. రీమా దాస్ తన మొదటి సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో ఆ డ్రీమ్‌ను డెబ్యూ (తొలి) సినిమాతోనే తీర్చేశారు. అస్సామీ రాక్‌స్టార్‌గా నిలిచారు. తొలి సినిమాయే అవార్డు అందుకునే స్థాయిలో ఉన్నప్పుడు తదుపరి సినిమా మీద అంచనాలు మామూలే. ఆ అంచనాలను రెండో సినిమాతోనూ సునాయాసంగా అందుకొని అందర్నీ మరొక్కసారి రీమా దాస్ ఆశ్చర్యపరిచారు. రీమా రెండో చిత్రం ‘బుల్బుల్ కెన్ సింగ్’ ఉత్తమ అస్సామీ చిత్రం అవార్డు గెలుచుకుంది. బుల్బుల్, బోణీ, సుము అనే ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమ సమాజం కోరుకున్నట్టు ఉండలేక, తాను అనుకున్నట్టు ఉండాలనే పోరాటం చేస్తూ తన గొంతుని వినిపించాలనుకుంటుంది బుల్బుల్. తన గొంతుని వినిపిస్తుంది. ఇది విన్న జ్యూరీ కూడా అవార్డు ఇవ్వకుండా ఉండగలదా? ‘బుల్ బుల్..’ లో ఓ దృశ్యం 66వ జాతీయఅవార్డుల ఎంపికలో ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్’ చిత్రానికి నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్) అవార్డులు వచ్చాయి. కానీ 2019, జనవరి 11న విడుదలైన ఈ చిత్రం 2018 జాతీయ అవార్డులకు ఎలా అర్హత సాధించిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. ఒక ఏడాదిలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వరకు సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబీఎఫ్సీ ) చేయించుకున్న సినిమాలను జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా 31, 2018న ‘ఉరి’ సిబీఎఫ్సీ వద్ద సర్టిఫికేట్ పొందింది. ఆ విధంగా ‘ఉరి’ చిత్రం జాతీయ అవార్డుల రేస్‌లో నిలిచి అవార్డులను సొంతం చేసుకుంది. – ముసిమి శివాంజనేయులు, డేరంగుల జగన్ -
ఈ అవార్డు మా అమ్మకు అంకితం
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్, నాగ్ అశ్విన్‌తో ‘సాక్షి’ స్పెషల్ టాక్. ► హార్టీ కంగ్రాట్స్. 1990లో ‘కర్తవ్యం’ సినిమాకి విజయశాంతి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 28 ఏళ్ల తర్వాత తెలుగు నుంచి ఉత్తమ కథానాయిక అవార్డు గెలుచుకున్న నటి మీరే... కీర్తీ సురేశ్: చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ అవార్డును మా అమ్మకు అంకితం చేస్తున్నాను. అమ్మ (మలయాళ నటి మేనక) నటించిన ఓ మలయాళం సినిమా నేషనల్ అవార్డుకి నామినేట్ అయింది. కానీ అవార్డు రాలేదు. అలా అమ్మ కల నెరవేరలేదు. అప్పుడే తనకోసం ఓ అవార్డు తీసుకురావాలని అనుకున్నాను. ‘నీ కోసం జాతీయ అవార్డు తీసుకొస్తాను’ అని అమ్మతో కూడా చెప్పాను. ఇప్పుడు అది నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లవుతోంది. ఇంత త్వరగా జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. అమ్మ కల మాత్రమే కాదు.. ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవాలనే నా కల నెరవేరినట్టుంది. ఇది కేవలం మొదలే.. నా జర్నీ ఇంకా చాలా ఉంది (నవ్వుతూ). ► ఈ సందర్భంగా సావిత్రిగారి గురించి రెండు మాటలు... సావిత్రిగారి ఆశీస్సులు, సపోర్ట్ లేకపోతే ఇంత దూరం కచ్చితంగా వచ్చేవాళ్లం కాదు. సావిత్రి అమ్మ, ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి అమ్మకు చాలా చాలా థ్యాంక్స్. సినిమా చేస్తున్నప్పుడు వచ్చిన అడ్డంకులన్నీ సావిత్రమ్మ ఆశీస్సులతోనే ఎదుర్కొన్నాం. ఆవిడ ఎప్పుడూ మమ్మల్ని గైడ్ చేస్తూనే వచ్చారని నా ఫీలింగ్ ► ‘మాయాబజార్’లోని ‘అహ నా పెళ్లంట’ ఎపిసోడ్లో బాగా చేశారు. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఆ సినిమాలో ఆ పాట అందరికి ఫేవరెట్ కూడా. ఆ సన్నివేశానికి 40– 50 టేకులు తీసుకున్నాను. షూట్ చేసే మూడు రోజుల ముందే ప్రిపరేషప్ మొదలుపెట్టాను. టేక్ చేసిన ప్రతిసారీ పర్ఫెక్ట్గా రావాలనుకునే చేశాను. ఫైనల్లీ చేయగలిగాను. చాలా బాగా చేశావని అందరూ అభినందించారు. అయితే ఇప్పుడు చూసుకుంటే నాకు చిన్నచిన్న తప్పులు కనిపిస్తాయి (నవ్వుతూ). ► ఇంత బాధ్యత ఉన్న పాత్ర చేస్తున్నాం అని నిద్రలేని రాత్రులు ఏమైనా? ‘మహానటి’ కోసం చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. పాత్రలోనుంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉండేది. ఎమోషనల్ సీన్స్ చేసినా ఏం చేసినా షూటింగ్ పూర్తయిన తర్వాత చాలా కష్టంగా ఉండేది. రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను. నిద్రలేకపోతే ఆ ఎఫెక్ట్ మర్నాడు షూటింగ్ మీద పడుతుందని భయం. సావిత్ర అమ్మ పాత్ర నా మీద చాలా ప్రభావం చూపించింది. ► కాస్ట్యూమ్స్‌కి కూడా అవార్డ్ వచ్చింది. అలనాటి సావిత్రిగారు వేసుకున్న కాస్ట్యూమ్స్ పోలినవి ఈనాటి కీర్తి వేసుకున్నప్పుడు ఏమనిపించింది? కాస్ట్యూమ్ డిజైనర్లు్ల కూడా చాలా కష్టపడ్డారు. ఆవిడ ఫిట్టింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫిట్టింగ్ దొరకడం లేదు కూడా. ఆ ఫిట్టింగ్ ఉంటే తప్ప షాట్‌కి రాను అని చెప్పేదాన్ని. ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేనంత ‘టైట్ బ్లౌజులు’ వేసుకునేవారు. కష్టం అనిపించినప్పటికీ నేనూ అదే ఫిటింగ్నే ప్రిఫర్ చేశాను. ఇక లావుగా కనపడాల్సిన సీన్స్‌లో ప్రొస్థెటిక్ మేకప్ కూడా ఉపయోగించాం. సమ్మర్లో చిత్రీకరించాం. ప్రొస్థెటిక్ మేకప్‌కి నాలుగు గంటలు పట్టేది. ► ఈ సినిమాలో మిమ్మల్ని సావిత్రి పాత్రకు ప్రకటించినప్పుడు కొందరు ‘మిస్ ఫిట్’ అన్నారు. విమర్శలు కూడా వచ్చాయి..? సావిత్రిగారు మహానటి. ఆమె పాత్రకు న్యాయం చేయగలను అనే నమ్మకంతోనే ఒప్పుకున్నారు. అయితే ముందు క్రిటిసిజమ్ వచ్చిందని నాకు తెలియదు. తర్వాత చాలామంది చెప్పారు. అలాగే సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు తెలిసింది. అప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది. పోస్టర్, టీజర్ వచ్చినప్పుడు అందరికీ నమ్మకం కలిగింది. అందరూ అభినందించారు. మంచి రెస్పాన్స్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ► ‘మహానటి’ సినిమా గుర్తుగా ఏదైనా మీతో దాచుకున్నారా? ఈ సినిమాకు నా మనసులో స్పెషల్ ప్లేస్ ఉంది. ‘మహానటి’ చివరి రోజు చిత్రీకరణలో నేను ధరించిన చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్. అదే నా దగ్గరున్న మెమొరీ. పేరు చెడగొట్టకూడదనుకున్నాను – నాగ్ అశ్విన్ ‘మహానటి’ దర్శకుడు నేషనల్ లెవల్లో గుర్తింపు రావడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ‘మహానటి’కి మూడు అవార్డులు వచ్చాయి. నేషనల్ లెవల్లో గట్టి పోటీ ఇచ్చిన కీర్తీ సురేశ్ అవార్డు సాధించడం సంతోషంగా ఉంది. సావిత్రిగారి టైమ్‌లో ఆమెకు నేషనల్ అవార్డు రాలేదు. కానీ అవార్డ్‌కు తగినంత పెర్ఫార్మెన్స్లు చాలా ఇచ్చారు. ఆమె మీద తీసిన సినిమాతో నేషనల్ అవార్డు తీసుకురాగలిగాం. ఇది ఊహించలేదు. కానీ మంచి ప్రశంసలు, అభినందనలు వస్తాయని చాలా మంది చెప్పారు. సినిమా రిలీజ్ అయి కూడా చాలా రోజులైంది. మర్చిపోయాను కూడా. సినిమాలో చాలెంజ్‌లు, కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాతో మాకు బాధ్యత ఎక్కువ ఉండేది. సావిత్రి అమ్మ మీద సినిమా తీస్తున్నాం. అవకాశాన్ని వృథా చేసుకోకూడదు అని కష్టపడ్డాం. సావిత్రిగారికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లు మా సినిమా చూస్తే సంతృప్తి చెందాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. బాక్సాఫీస్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించలేదు. రిలీజ్ అయిన తర్వాత ‘న్యాయం చేశారు, చెడగొట్టలేదు’ అంటే చాలు అనుకున్నాను. ఆమె లైఫ్ అంతా షూటింగ్ గ్యాప్‌లో జరిగిందే కదా. సమస్య అయినా ప్రేమ అయినా షూటింగ్స్ మధ్యలోనే జరిగాయి. సినిమా కూడా అలానే తీశాను. మనకు చాలా కథలున్నాయి. వాళ్లందరి గురించి కూడా సినిమాలు తీయాలి. తీసేవాళ్లు మాత్రం చాలా నిజాయితీగా వెతికి, నిజాయితీగా తీయాలి. నెక్ట్స్ కొత్త కథలు చెప్పాలనుంది. ప్రస్తుతం ఓ కథను రాస్తున్నాను. తొందర తొందరగా సినిమా తీసేయాలని లేదు. ఇప్పుడు చేయబోతున్న సినిమా మాత్రం నా గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. -
‘ఉపాధి’లో భేష్
సాక్షి, వికారాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఈజీఎస్)లో అత్యుత్తమ సేవలకు గాను తెలంగాణ నుంచి రెండు జిల్లాలు జాతీయ అవార్డుకు ఎంపికయ్యాయి. వివిధ కేటగిరీల్లో దేశవ్యాప్తంగా 18 జిల్లాలను కేంద్రం ఎంపిక చేయగా.. రాష్ట్రం నుంచి వికారాబాద్, కామారెడ్డి అవార్డు కైవసం చేసుకున్నాయి. ఉపాధి హామీ పనులు సమర్థంగా నిర్వహించడం, ఎక్కువ మంది కూలీలకు పని కల్పించడం తదితర అంశాల్లో అవార్డుకు ఈ జిల్లాలు ఎంపికయ్యాయి. పనులపై ప్రజెంటేషన్ ఉపాధి హామీ పథకంలో ఉత్తమ సేవలకు ఆయా జిల్లాల నుంచి అవార్డులకు జాబితా పంపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించగా.. వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, నిర్మల్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. జిల్లాల్లో చేసిన ఉపాధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కలెక్టర్లు పథకం ద్వారా చెపట్టిన పనులు, లబ్ధిదారుల ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందిన కేంద్రం జిల్లాలను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 11న ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా కలెక్టర్లు అవార్డు అందుకోనున్నారు. మరింత బాధ్యతగా పని చేస్తాం జిల్లాలోని గ్రామీణాభివృద్ధి అధికారులు, ఉద్యోగుల సహకారంతో లక్ష్య సాధనలో సఫలీకృతమయ్యాం. దీంతో కేంద్రం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. ఇకపై మరింత బాధ్యతగా పని చేస్తాం. – జాన్సన్, డీఆర్డీఓ, వికారాబాద్ జిల్లా -
రాజమౌళికి మహేష్ శుభాకాంక్షలు
బాహుబలి 2 సినిమా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగును అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శక ధీరుడు రాజమౌళిని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆకానికెత్తేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళికి, బాహుబలి టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఘనవిజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీ సినిమా బాహుబలి భారతీయ సినీచరిత్రలో ఓ మైలురాయి. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కేయల్ నారాయణ ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. Congratulations @ssrajamouli for the massive win at the #NationalAwards2018. Your film, Baahubali is an important landmark in Indian cinema. We are all very proud of you. — Mahesh Babu (@urstrulyMahesh) 14 April 2018 -
సంగీత మాంత్రికుడి మరో రికార్డు
కీర్తి అంతా భగవంతుడికే. మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆయన ఆలోచనల సముద్రం. మణిరత్నం చిత్రం తనకెప్పుడూ ప్రత్యేకమే. మణిరత్నం అన్నయ్య, కార్తీ, చిత్ర యూనిట్ అందరికీ కృతజ్ఞతలు. దేశానికి చాలా అవసరమైన చిత్రానికి తనకు జాతీయ అవార్డు రావడం సంతోషం అన్నారు. మామ్ చిత్రం కోసం నటి శ్రీదేవి చెన్నైకి వచ్చినప్పుడు ఇది చాలా స్పెషల్. అయితే నటి శ్రీదేవినే మిస్ అయ్యాం. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మరో రికార్డును సాధించారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఉప్పొంగే ఓ కెరటం ఏఆర్ రెహ్మాన్. సినీ సంగీతాన్ని కొత్తబాట పట్టించిన ధ్రువతార ఈయన. శాస్త్రీయ, కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలతో సినీ ప్రేక్షకులను ఓలలాడించిన సంగీత మాంత్రికుడు రెహ్మాన్. సంగీతాన్ని ఎప్పటికప్పుడు కొత్త పుంతులు తొక్కిస్తూ ప్రయోగాల వీరుడిగా పేరు గాంచిన ఏఆర్ రెహ్మాన్ సినీ సంగీతానికే ఒక బ్రాండ్‌గా నిలిచారు. 25 ఏళ్ల కిందట రోజా చిత్రంతో సువాసనలు వెదజల్లి తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును కొల్లగొట్టిన సంగీత గని రెహ్మన్. అలా మొదలైన ఈయన సంగీత పయనం కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్లో పరవళ్లు తొక్కింది. మహామహులైన భారత సినీ కళాకారులకు కలగా మిగిలిన ఆస్కార్ అవార్డును స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంతో అవలీలగా సాధించారు. సినీ భారతావని కీర్తి కిరీటాలను ప్రపంచానికి చాటారు. సంగీతం ఎల్లలు చెరిపేసిన ఈయన ఎందరో నూతన గాయనీగాయకులకు అవకాశాలను కల్పించి అందులోనూ రికార్డు సాధించారు. రోజా చిత్రంతోనే జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును గెలుచుకున్న ఏఆర్.రెహ్మాన్ ఆ తరువాత మిన్సార కనువు, కన్నత్తిల్ ముత్తమిట్టాల్ చిత్రాలకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అదే విధంగా ఉత్తరాది చిత్ర పరిశ్రమకు వెళ్లి అక్కడ లగాన్ చిత్రానికి జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. తాజాగా కాట్రువెలియిడై తమిళ చిత్రానికి ఉత్తమ సంగీతదర్శకుడి అవార్డును, హిందీ చిత్రం మామ్ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గానూ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 65వ జాతీయ సినీ అవార్డులను వివరాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందు ఒకే వేదికపై స్లమ్‌డాగ్ మిలీనియర్ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్న రెహ్మాన్ రికార్డు నెలకొల్పారు. అదే విధంగా ఇప్పుడు ఒకే సారి రెండు జాతీయ అవార్డులను అందుకోనున్నారు.ఇదీ రికార్డే. ఇళయరాజా రికార్డు బ్రేక్ ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఇళయరాజా సాధించిన జాతీయ అవార్డుల రికార్డును రెహ్మాన్ బ్రేక్ చేశారు. ఇళయరాజా ఇప్పటి వరకూ 5 జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఏఆర్.రెహ్మాన్ ఇంతకు ముందు రోజా, కన్నత్తిల్ ముత్తమిట్టాల్, మిన్సార కనవు, లగాన్ చిత్రాలకు జాతీయ పురష్కారాలను అందుకున్నారు. తాజాగా కాట్రువెలియిడై తమిళ చిత్రంకు, హింది చిత్రం మామ్‌కు గానూ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుని ఆరు జాతీయ పురష్కారాలను అందుకున్న సంగీత దర్శకుడిగా ఇళయరాజా రికార్డును బ్రేక్ చేశారు. 65 వ జాతీయ అవార్డుల ప్రకటనలో ఈ సారి తమిళ చిత్ర పరిశ్రమ మూడు అవార్డులను గెలుచుకుంది. అందులో కాట్రువెలియిడై చిత్రానికి గానూ ఏఆర్.రెహ్మాన్, టూలెట్ అనే తమిళ చిత్రానికి ప్రాంతీయ చిత్రాల కేటగిరిలో ఉత్తమ చిత్రంగానూ, కాట్రులియిడై చిత్రంలోని వాన వరువాన్ అనే పాటకుగానూ గాయని శాషా త్రిపాధి జాతీయ అవార్డులను ప్రకటించారు. ఇలా ఈ సారి మణిరత్నం తమిళ చిత్రపరిశ్రమ గౌరవాన్ని కాస్త కాపాడారనే చెప్పాలి. -
9 మంది టీచర్లకు జాతీయ అవార్డులు
ఢిల్లీలో ఉపరాష్ట్రపతి చేతులమీదుగా అందజేత సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది టీచర్లు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా మంగళవారం అవార్డులు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తొమ్మిది మంది టీచర్లు అవార్డులు అందుకున్నారు. పురస్కారాలు స్వీకరించిన వారిలో గోరంట్ల శ్రీనివాసరావు, చిలుకూరి శ్రీనివాసరావు, నల్లెబోయిన విమలకుమారి, ఎర్రా ఎస్‌ఎస్‌జీఎస్ చక్రవర్తి, గొట్టేటి రవి, చాగంటి శ్రీనివాసరావు, బొంతలకోటి శంకరరావు, డి.ధర్మరాజు, రెడ్డి లోకానందరెడ్డి ఉన్నారు. -
14 స్కూళ్లకు స్వచ్ఛ పురస్కారం
- జిల్లాల కేటగిరీలో ఖమ్మం, నల్లగొండకు అవార్డులు - ఢిల్లీలో జాతీయ అవార్డులు అందజేసిన కేంద్ర మంత్రి జవదేకర్ సాక్షి, న్యూఢిల్లీ: నీరు, పరిశుభ్రత వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించే ప్రభుత్వ పాఠశాలలకు కేంద్రం జాతీయ స్థాయిలో ఇచ్చే ‘స్వచ్ఛ విద్యాలయ’ పురస్కార్ కింద రాష్ట్రానికి చెందిన 14 స్కూళ్లు అవార్డులు అందుకున్నాయి. రాష్ట్రాల కేటగిరీలో 2016–17కి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాష్ట్రాలు, జిల్లాలు, పాఠశాలల కేటగిరీల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన మూడు రాష్ట్రాలు, 11 జిల్లాలు, 172 పాఠశాలలకు ఈ అవార్డులు అందజేశారు. తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, ఏపీలోని పశ్చిమ గోదావరి... జిల్లాల కేటగిరీలో అవార్డులు అందుకున్నాయి. పురస్కారాలు దక్కిన పాఠశాలలకు రూ. 50 వేల నగదు అందజేశారు. ఈ పురస్కారాల కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలలకు పురస్కారాలు అందజేయనున్నట్టు మంత్రి తెలిపారు. పురస్కారాలు అందుకున్న పాఠశాలలు ఇవీ.. తెలంగాణ నుంచి మొత్తం 14 పాఠశాలలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ పుర స్కారాలు అందుకున్నాయి. అం దులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎంపీయూపీఎస్ బండల్ నాగ పూర్, టీఎస్ఎస్డబ్ల్యూఎస్ బాలు ర పాఠశాల–బెల్లంపల్లి, కరీంనగర్ జిల్లాకు చెందిన అంబారీపేట జడ్పీహెచ్ఎస్, గంగాధర టీఎస్ ఎంఎస్, కొత్తపల్లి(పీఎన్) ఎంపీ యూపీఎస్, మెదక్ జిల్లాలోని ఎంపీయూపీఎస్ ఇబ్రహీంపూర్, రంగారెడ్డి జిల్లా నుంచి ఎంపీపీఎస్ బుద్దారం, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎంపీపీఎస్ చౌటగడ్డ తండ, నల్లగొండ జిల్లా నుంచి జడ్పీహెచ్ఎస్ అనంతారం, వరంగల్ నుంచి జడ్పీహెచ్ఎస్ తిమ్మాపేట్, ఖమ్మం నుంచి టీఎస్ఎంఎస్ కారేపల్లి, ఎంపీపీఎస్ మల్లారం, టీఎస్ఎస్డబ్ల్యూఈఐఎస్ సింగారెడ్డిపాలెం, ఎంపీయూపీఎస్ గండగలపాడు ఈ పురస్కారాలు అందుకున్నాయి. కాగా, ఏపీ నుంచి మొత్తం 21 పాఠశాలలు పురస్కారాలు అందుకున్నాయి. -
ఇద్దరు యువ శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో పరిశోధనలకుగానూ విశేష కృషి చేస్తున్న ఇద్దరు యువ శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు దక్కాయి. ఆహారోత్పత్తి పంటలు, హార్టికల్చర్ సైన్స్ విభాగంలో పరిశోధనలకుగానూ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్ఆర్)లో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఎం.సతేంద్రకుమార్కు లాల్‌బహదూర్ శాస్త్రి యువ శాస్త్రవేత్త అవార్డు దక్కింది. అలాగే బయోటెక్నాలజీ విభాగంలో డాక్టోరల్ థీసెస్, అల్లైడ్ సైన్స్‌లో పరిశోధనలకుగానూ పటాన్‌చెరులోని ఐసీఆర్ఐఎస్ఏటీలో పనిచేస్తున్న యువ శాస్త్రవేత్త డా.బి.శైలజాకు జవహార్‌లాల్ నెహ్రు అవార్డు వరించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఈ అవార్డులు వారికి అందజేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో పరిశోధనలు చేస్తున్న యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. -
శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా మెట్ట వ్యవసాయ పరిశోధనా స్థానంలో పని చేస్తున్న శాస్త్రవేత్తలకు వసంతరావునాయక్ జాతీయ పురస్కారం లభించినట్లు పరిశోధనాస్థానం అధిపతి డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆవిర్భావం సందర్భంగా ప్రతి ఏటా జులై - 16న జాతీయ స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉత్తమ పరిశోధనలలో భాగస్వాములైన శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు అందిస్తారన్నారు. ఇందులో భాగంగానే రేకులకుంటలో వర్షాధార వ్యవసాయం, నీటి సంరక్షణ, నేలల సంరక్షణ పద్ధతులపై, వేరుశనగకు అనుకూలమైన యాంత్రీకరణ పరికరాలు రూపకల్పన చేపట్టడం, సమగ్ర వ్యవసాయ పద్ధతులు అమలు పర్చడంలో రేకులకుంటలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ రవీంద్రారెడ్డి, సహదేవరెడ్డి, రెడ్డిపల్లి ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, రేకులకుంట సీనియర్ శాస్త్రవేత్తలు విజయశంకర్‌బాబు, డాక్టర్ మధుసూధన్‌రెడ్డి, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ రాధాకుమారిలు చేసిన ప్రయోగాలకు జాతీయస్థాయిలో వసంతరావునాయక్ పురస్కారాలు దక్కాయన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్, ఆచార్య ఎన్జీరంగా ఉపకులపతి డాక్టర్ దామోదరనాయుడు, పరిశోధనా సంచాలకులు ఎన్వీ నాయుడులు ఈ అవార్డులను అందించారని చెప్పారు. -
ముగ్గురు తెలుగు వైద్యాధికారిణులకు జాతీయ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ/రేపల్లె: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నర్సులకు 2017 ఏడాదికిగానూ జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు దక్కాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అవార్డులు అందుకున్నారు. కర్నూలులోని ప్రాంతీయ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న సమన్వయ అధికారిణి మాదెల్ల ఎంహెచ్. ప్రమీలాదేవి, గుంటూరు జిల్లా కనగల్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న గోవిందమ్మ అవార్డులు అందుకున్నారు. తెలంగాణ నుంచి చింతపల్లికి చెందిన దున్న జయ రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. -
మహేష్ డైరెక్టర్ మళ్లీ ఫైర్ అయ్యాడు..!
జాతీయ అవార్డుల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ జాతీయ అవార్డులు ఈ సారి వివాదాలకు తెరతీస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలపై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, విజేతల ఎంపికపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'అవార్డుల కమిటీ, ఒత్తిళ్లకు తలొగ్గి పక్షపాత ధోరణితో విజేతలను ఎంపిక చేసిందంటూ విమర్శించారు'. అయితే ప్రతీ విమర్శకు వ్యక్తిగతంగా బదులిస్తున్న జ్యూరీ అధ్యక్షుడు ప్రియదర్శన్, 'అక్షయ్ కుమార్‌తో సినిమా చేయాలనకున్న దర్శకుడికి అక్షయ్ నో చెప్పాడు... అందుకే ఆయనకు అవార్డ్ రావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు' అంటూ మురుగదాస్‌పై పరోక్షంగా విమర్శలు చేశాడు. ప్రియదర్శన్ కామెంట్స్ మురుగదాస్ కూడా ఘాటుగానే స్పంధించాడు. ' మిస్టర్ జ్యూరీ, ఇది కేవలం నా అభిప్రాయం కాదు. భారతీయ ప్రేక్షకులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాధించటం కన్నా, నిజాన్ని బయటకు తీస్తే మంచిది' అంటూ కౌంటర్ ఇచ్చాడు. దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా జ్యూరీ మీద గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా దంగల్ సినిమాకు అమీర్ ఖాన్ తప్పకుండా అవార్డ్ వస్తుందని భావించిన ఆయన అభిమానులు ప్రియదర్శన్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. #NationalAwards #Biased Mr. jury, It's nt only my opinion it's the voice of whole Indian audience, better nt to argue & dig out the truth — A.R.Murugadoss (@ARMurugadoss) 14 April 2017 -
పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది
సదువు సక్కంగా బుర్రకు ఎక్కని ఓ ఆవారా కుర్రాడు బీటెక్ పూర్తి చేస్తాడు. షెఫ్ కావాలనేది అతడి కోరిక. పిల్లను సూడనీకి ఓ ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి వెళ్తాడు. ఆ పిల్లేమో ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. మరక మంచిదే అన్నట్టు... రాంగ్ అడ్రస్‌కు వెళ్లడం వల్ల ఇద్దరికీ మేలు జరిగింది. విభిన్న వ్యక్తిత్వాలు గల ఇద్దరూ కలసి ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, తర్వాత ప్రేమలో పడతారు. చిన్న సంఘర్షణ తర్వాత ఒక్కటవుతారు – తరుణ్ భాస్కర్ దర్శకునిగా పరిచయమైన ‘పెళ్ళి చూపులు’ చిత్రకథ సాదాసీదాగానే అనిపిస్తుంది. మరి, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఒకటి, ఉత్తమ సంభాషణలకు గాను తరుణ్ భాస్కర్‌కి మరొకటి... రెండు నేషనల్ అవార్డులు ఎందుకొచ్చాయి? అనడిగితే... ‘పెళ్లి చూపులు’లో సహజత్వం ఉంది. ‘నా సావు నేను సస్తా... నీకెందుకు?’ వంటి మాటలు నుంచి మొదలుపెడితే... ఇప్పటి యువతీయువకుల ఆలోచనా ధోరణి వరకూ ప్రతి అంశంలోనూ దర్శకుడు సహజత్వం చూపించాడు. ఏదో మన పక్కింట్లో, మనింట్లో జరిగే కథగా అనిపిస్తుంది. అందుకే, సూపర్ హిట్టయ్యింది. కంటెంట్ ఈజ్ కింగ్ సినిమా సక్సెస్, ఇప్పటివరకూ వచ్చిన అవార్డులు ఒకెత్తు అయితే... నేషనల్ అవార్డు రావడం మరో ఎత్తు. సూపర్ స్టార్స్ చేసిన చిత్రమా? కొత్తవాళ్లు చేసిన చిత్రమా? అని ఆలోచించకుండా... సినిమా హైప్‌తో, బడ్జెట్‌తో సంబంధం లేకుండా... మా చిత్రాన్ని గౌరవించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నా. ‘కంటెంట్ ఈజ్ కింగ్’ అని మేము ఏ నమ్మకంతో అయితే సినిమా తీశామో? ప్రేక్షకులు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. ‘పెళ్లి చూపులు’కు భారీ విజయాన్ని అందించారు. దీనివల్ల నేను లేదా మరో కొత్త నిర్మాత... ఎవరైనా కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీయడానికి ముందుకొస్తారు. ఈ ప్రోత్సాహాన్ని మరో పదిమంది స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తున్నా. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందిస్తే... మిగతా అంశాలు ఏవీ చూడకుండా ఓటు వేస్తారని మరోసారి రుజువైంది. ఈ సందర్భంగా ‘పెళ్లి చూపులు’ టీమ్, నిర్మాత డి. సురేశ్‌బాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – నిర్మాత రాజ్ కందుకూరి ప్రేక్షకుల వల్లే ఇది సాధ్యమైంది! ‘‘సూపర్ హ్యాపీ. ‘పెళ్ళి చూపులు’కు నేషనల్ అవార్డు వస్తుందని ఊహించలేదు. ఈ సినిమా రిలీజవుతుందా? లేదా? అని భయపడేవాణ్ణి. ప్రతి ఒక్కరి (ప్రేక్షకుల) ప్రశంసలతో ఇంత దూరం వచ్చింది. 2015లో మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఆశీస్సులతోనే ఇవన్నీ దక్కుతున్నాయని అనుకుంటున్నా. నాన్నగారు ఉండుంటే ఈ సంతోషం వేరేలా ఉండేదేమో. పైనుంచి ఆయన చూసి, ఆశీర్వదిస్తున్నారనే నమ్మకంతో హ్యాపీగా ఉన్నాను. ఇది పక్కన పెడితే... మా నిర్మాతలు నా ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశారు. మంచి ప్రయత్నం చేద్దామనుకున్నాం తప్ప... డబ్బులొస్తాయి, వందరోజులు ఆడుతుంది, నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. దీన్నో గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. – దర్శకుడు తరుణ్ భాస్కర్ -
అవార్డు కొనలేదు
‘‘ఈ అవార్డును నేను నిజాయితీతో సంపాదించుకున్నాను. నేనిప్పటివరకూ మోసం చేయలేదు. అవార్డు కోసం ఎవరికైనా ఫోన్ చేయడం గాని, నాకు ఫేవర్ చేయమని డబ్బులు ఇవ్వడం గానీ చేయలేదు’’ అన్నారు హిందీ హీరో అక్షయ్ కుమార్. జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్‌కు అవార్డు ఇవ్వడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతకు ముందు అవార్డు పట్ల అక్షయ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఈ అవార్డును నా పేరెంట్స్, ఫ్యామిలీ, నా వైఫ్ (ట్వింకిల్ ఖన్నా)కు అంకితం చేస్తున్నాను. ‘మీరు అవార్డు ఫంక్షన్లకు వెళ్లడం మానేశారా? మీకెప్పుడైనా అవార్డు వస్తుందా?’ అని ట్వింకిల్ అన్నప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు హ్యాపీ. అవార్డ్స్ కమిటీ జ్యూరీ, ఫ్యాన్స్, అందరికీ థ్యాంక్స్’’ అన్నారు అక్షయ్. అన్నట్టు... జాతీయ ఉత్తమ హిందీ చిత్రం ‘నీర్జా’లోని నటనకు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న సోనమ్‌కపూర్‌తో కలసి అక్షయ్ ‘పాడ్‌మ్యాన్’ అనే సినిమా చేస్తున్నారు. జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడు వీరిద్దరూ ఆ సినిమా లొకేషన్లోనే ఉన్నారు. -
పిగ్గీ చాప్స్.. ట్రిపుల్ హ్యాపీనెస్!
ప్రియాంకా చోప్రా నిర్మించిన మొదటి మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’ దర్శకుడు రాజేశ్, ఎడిటర్ రామేశ్వర్ ఎస్. భగత్, సౌండ్ మిక్సింగ్ టెక్నీషియన్ అలోక్... ముగ్గురికీ జాతీయ అవార్డులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబం కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. వినాయక చవితికి కొన్ని రోజుల ముందు... ఓ పెద్దాయన అనారోగ్యానికి గురి కావడంతో వెంటిలేటర్‌పై పెడతారు. అప్పుడు ఉమ్మడి కుటుంబం, బంధువులు... వాళ్ల మధ్య జరిగే వాదోపవాదనలు, గొడవలే సినిమా కథ. ‘లగాన్’, ‘స్వదేశ్’, ‘జోధా అక్బర్’ వంటి చిత్రాలు తీసిన ప్రముఖ హిందీ దర్శకుడు, నటుడు, నిర్మాత అశుతోష్ గోవారికర్ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాలో సుమారు వందమంది కీలక పాత్రల్లో కనిపించారు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి 3 నేషనల్ అవార్డులు రావడంతో పిగ్గీ చాప్స్ (ప్రియాంకా చోప్రా) ట్రిపుల్ హ్యాపీగా ఉన్నారు. నిర్మాతగా ఆమెకిది రెండో సినిమా. దీనికి ముందు భోజ్‌పురిలో ఓ సినిమా తీశారు. ‘‘ఐయామ్ స్పీచ్లెస్. నేను దర్శకత్వం వహించిన మొదటి మరాఠీ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చిందోచ్! నా కల నిజమైంది. ‘వెంటిలేటర్’ సినిమా యూనిట్‌కి, ముఖ్యంగా నాపై నమ్మకంతో ఈ సినిమా నిర్మించిన ప్రియాంకా చోప్రా, మధు చోప్రా (ప్రియాంక తల్లి)లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ – ‘వెంటిలేటర్’ దర్శకుడు రాజేశ్ -
డాక్టర్ పోలిరెడ్డికి రెండు జాతీయ అవార్డులు
గిద్దలూరు : పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.పోలిరెడ్డి రెండు జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నారు. న్యూ ఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ వారు ఇచ్చే లైఫ్ టైమ్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు, మహాత్మాగాంధీ నేషనల్ పీస్ అవార్డులకు ఎంపికయ్యారు. ఆ మేరకు ఇటీవల అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో ఈనెల 18వ తేదీన జైళ్లశాఖ పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.ఎన్.గోపినాథరెడ్డి చేతుల మీదుగా మహాత్మాగాంధీ నేషనల్ శాంతి అవార్డును అందుకున్నారు. శాంతి, మానవతా విలువలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి ఈ అవార్డును ఇచ్చారని పోలిరెడ్డి తెలిపారు. లైఫ్‌టైమ్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ అవార్డును నేరుగా పంపినట్లు చెప్పారు. ఆంగ్ల సాహిత్యంలో 15మంది పీహెచ్డీ స్కాలర్స్, ఐదు మంది ఎంఫిల్ స్కాలర్స్‌కు ఆచార్య నాగార్జున యూనియవర్సిటీ నుంచి రీసర్చ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంగ్లంలో ఈయన రచించిన రెండు గ్రంథములు, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని సమర్పించిన పలు పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమయ్యాయి. జాతీయ స్థాయిలో అవార్డులందుకుంటున్న పోలిరెడ్డిని ఎస్వీ కళాశాలల కరస్పాండెంట్, మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పనారెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, కళాశాల కార్యదర్శి పి.అభిషేక్‌రెడ్డి, కళాశాలల కో ఆర్డినేటర్ విఠా సుబ్బరావు, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. -
రాష్ట్రపతి టీచరైన వేళ
ఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో ఉపాధ్యాయ దినోత్సవ(గురుపూజోత్సవం) వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ఒక పూట ఉపాధ్యాయుడిగా మారారు. సర్వోదయ పాఠశాలలోని విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించారు. మరోపక్క, గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పురస్కరాలు అందజేశారు. -
అత్యంత స్వార్థపరులకు అత్యున్నత పురస్కారాలా?
తరచుగా ప్రభుత్వం వ్యక్తుల కీర్తిప్రతిష్టల ఆకర్షణకులోనై వారికి పురస్కారాలను ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనికి ఇక స్వస్తి పలికాలి. సేవాతత్పరతను ప్రదర్శించిన వారికి మాత్రమే జాతీయ పురస్కారాల ప్రదానం జరగాలి. భారతరత్న వంటి పురస్కారాలను అందుకుంటున్న వ్యక్తులు తాము ప్రజలకు చేసిన సేవకు గాక, తమ ప్రతిభకుగానూ వాటిని పొందడం పరిహాసాస్పదం. మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. క్రికెటర్లకు, బాలీవుడ్ ప్రముఖులకు ఉన్న కీర్తిప్రతిష్టలు, ప్రతిభ కారణంగా వారికి ఆ పురస్కా రాన్నిఇవ్వడం తప్పని నా అభిప్రాయం. అలా చేయడం ద్వారా ఆ పురస్కారానికి ఉన్న విలువ తరిగి పోవడమే కాదు, దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. రాజ్యసభకు నామినేట్ చేసిన క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖుల విషయంలో కూడా అలాంటిదే జరుగుతుందని నేనంటాను. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్లు ఇద్దరి ఉదారణనే తీసుకుందాం. ఆ ఇరువురిలో ఎవరూ భారత రత్న పురస్కారాన్ని అందుకోదగినవారు కారు. ఇద్దరూ దానివల్ల తమకు వచ్చిన ఖ్యాతిని దుర్వినియోగపరచినవారే. సచిన్, తన ఒకప్పటి వ్యాపార భాగస్వామిని రక్షణ మంత్రి వద్దకు తీసుకు వెళ్లి, అతనికి సంబంధించిన ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరినం దుకుగానూ వార్తలకెక్కారు. అది, రక్షణ శాఖకు చెందిన ఒక ప్రాంతానికి సమీపం లోని ఒక వాణిజ్య సముదాయం నిర్మాణానికి సంబంధించిన సమస్య. ఆ వ్యవ హారంలో తనకు ఎలాంటి వ్యాపార ప్రయోజనాలూ లేవని సచిన్ ప్రకటిం చారు. బహుశా ఉండకపోవచ్చు. కానీ, వ్యాపార సంబంధమైన ప్రయోజనాల వంటి చిల్లరమల్లర విషయాలను మంత్రుల ముందు ఉంచడమేనా భారతరత్నల పని? ఈ విషయాన్ని సరైన కోణం నుంచి చూడాలంటే... సచిన్ రాజ్యసభలో తన మొట్టమొదటి ప్రశ్నను అడగడానికి మూడేళ్లు పట్టిందని తెలుసుకోవాలి. ఆయన రాజ్యసభలో మూడేళ్లు గడిపారంటున్నానూ అంటే అందులో ఎక్కువ సేపు సభకు బయటనే ఉన్నారని అర్థం. రాజ్యసభకు సచిన్ హాజరు 6 శాతం మాత్రమేనని, ఆయన ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదని డిసెంబర్ 2015 నాటి ఒక నివేదిక వెల్లడించింది. అయినాగానీ, ఆయనకు తన స్నేహితులను, వ్యాపార భాగస్వాము లను రక్షణ మంత్రి వద్దకు తీసుకెళ్లి, వారి ఒప్పందాలను ముందుకు నెట్టడానికి మాత్రం సమయం ఉన్నదా? అలాంటి వ్యక్తికి భారతరత్నను ఇచ్చారనేది నాకు ఆమోదయోగ్యంకానిదిగా కనిపిస్తోంది. భారతరత్నను అందుకున్న తర్వాత కూడా సచిన్ బీఎండబ్ల్యూ వంటి బ్రాండ్లకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఇది, ప్రజా జీవితంలోని వ్యక్తులకు, ప్రత్యేకించి సచిన్ అంతటి సంపన్నవంతులకు తగిన పనేనా? ఇది అత్యంత అవమానకరం, ఆ పురస్కారాన్నే న్యూనపరచేది. అలాంటి వ్యక్తులకు భారతరత్నను ఇచ్చినప్పుడు ఆవశ్యకంగా మనం వారి ప్రతిభను గుర్తించి ఇస్తున్నాం. అంతేగానీ పౌర పురస్కారాలను ఇవ్వడంలోని అసలు లక్ష్యమైన ప్రజాసేవను గుర్తించి మాత్రం కాదు. సచిన్, తనకు ఒక ఫెరారీ కారు బహుమతిగా లభిస్తే, దానికి దిగుమతి సుంకం మినహాయింపును కోరారు. ఒక కోటీశ్వరుని ఆట వస్తువుల కోసం ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాలి? చివరకు ఓ కోర్టు జోక్యం చేసుకుని ఆయన దిగుమతి సుంకాన్ని చెల్లిం చేలా చేయాల్సి వచ్చింది. బాంద్రాలో తాను ఒక పెద్ద భవంతిని నిర్మిస్తున్నపుడు సచిన్ పరిమితికి మించి దాన్ని నిర్మించడానికి ప్రభుత్వ అనుమతిని కోరారు. అందుకు అతన్ని ఎందుకు అనుమతించాలి? మనలో ఎవరమూ అడగని దాన్ని లేదా అలాంటి ఇతర ఉపకారాలను చేయాలని కోరడం అతని స్వార్థపరత్వం. ఈ ఏడాది జూన్ 13న ‘బెంగాల్ స్కూలుకు రూ. 76 లక్షలు విరాళం ఇచ్చిన సచిన్ టెండూల్కర్’ అనే పతాక శీర్షికలను పత్రికలు ప్రచురించాయి. ఆ కథనమేమిటో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. తీరా చూస్తే, సచిన్ ప్రకటించిన ‘విరాళం’ ఆతని సొంత డబ్బు కాదు, తన రాజ్య సభ ఎంపీ నిధి నుంచి ఇచ్చినది అని తేలింది. అంటే అది దేశం డబ్బే. అదసలు ‘విరాళమే’ కాదు. మాజీ ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ మహ్మద్ ఆలీ అన్యాయా నికి, జాతివిద్వేషాలకు వ్యతిరేకంగా నిలకడగా, ధైర్యంగా చేపట్టిన వైఖరి కార ణంగా ఎన్నో పౌర పురస్కారాలను అందుకున్నారు. ఆయన తన విశ్వాసాల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడ్డారు. సచిన్, మహ్మద్ అలీ వంటి క్రీడాకారుడు కాదు. అలాంటి సమస్యలకు సంబంధించి సచిన్ అర్థవంతమైన కృషి ఏమైనా చేసినట్టు ఎప్పుడైనా విన్నారా? లతా మంగేష్కర్‌కు 2001లో భారతరత్న ఇచ్చారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమె ముంబై పొద్దర్ రోడ్డులోని తన ఇంటికి ఎదురుగా ఫ్లైఓవర్‌ను నిర్మిస్తే దుబాయ్‌కు వెళ్లిపోతానని అన్నారు. ఆమె, ఆమె చెల్లెలు ఆశా భోస్లే దాన్ని ఎంత సమర్థవంతంగా అడ్డుకున్నారంటే ఇప్పటికీ దాన్ని నిర్మించనే లేదు. రాజ్యసభ హాజరు విషయంలో లతా మంగేష్కర్ది అత్యంత అధ్వానమైన రికార్డని 2012 ఏప్రిల్‌లో వెలువడ్డ ఒక నివేదిక తెలిపింది. ఆమెకు, సచిన్‌కు ఈ దేశం పట్ల ఉన్న పూర్తి నిరాసక్తతను ఇది తెలియజేస్తుంది. దీన్ని తృణీకార భావమని కూడా నేనంటాను. ఒక భారతరత్న ప్రవర్తించాల్సింది ఇలాగేనా? తమ వ్యక్తిగత అవ సరాలను, స్వార్థపరత్వాన్ని చాలామంది అవసరాలకన్నా ఉన్నతంగా నిలప డమేనా చేయాల్సింది? అలాంటి వ్యక్తులు వారు చేసిన సేవకు గాక, వారి ప్రతి భకు పురస్కారాలను పొందడం పరిహాసాస్పదం. వారి ప్రతిభకు సంబంధించినంతవరకు వారు తగినంత ప్రతిఫలాన్ని పొందలేదా? వారు చాలా చాలా సంపన్నులయ్యారు. బాగుంది, సరైనదే. వారు డబ్బును, కీర్తిని సంపాదించుకున్నారు సరే, దానితోపాటు మరింత ప్రజాప్రయో జనకర స్ఫూర్తిగల నడవడికను కూడా ప్రదర్శిస్తే మన గౌరవాన్ని కూడా సంపా దించుకోగలిగేవారు. అందుకు బదులుగా వారు ఆ విషయంలో ఎలాంటి పట్టింపూ చూపలేదు. పార్లమెంటుకు హాజరుకావడాన్ని సైతం వారు ఖాతరు చేయలేదు (సచిన్ ఎన్నిసార్లు ఒక మ్యాచ్‌కు లేదా వ్యాపార ప్రకటన షూటింగ్‌కు హాజరు కాలేకపోయి ఉంటారు?). తరచుగా ప్రభుత్వం వ్యక్తులకున్న కీర్తిప్రతిష్టల ఆకర్షణకు లోనై అలాంటి వారికి పురస్కారాలను ఇవ్వాల్సివస్తుంటుంది (తరచుగా వాటి కోసం చాలా తీవ్ర స్థాయిలో లాబీయింగ్ జరుగుతుంటుంది). దీనికి ఇక స్వస్తి పలికాలి. వ్యక్తులకున్న ప్రతిభాప్రపత్తులను, వారి సేవాతత్పరతను వేరు చేసి చూడగలగాలి. సేవాతత్పరతను ప్రదర్శించినవారికి మాత్రమే జాతీయ పురస్కారాల ప్రదానం జరగాలి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
దక్షిణమధ్య రైల్వేకు అవార్డుల పంట
ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు విజయవాడ (రైల్వేస్టేషన్): 2015-16 సంవత్సరానికిగాను పలు విభాగాల్లో నిర్వహణ, సామర్థ్యం ప్రదర్శించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ స్థాయి అవార్డులు పొందింది. 61వ జాతీయ రైల్వే వారోత్సవాల ముగింపు వేడుకలు శనివారం భువనేశ్వర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు చేతుల మీదుగా దక్షిణమధ్య రైల్వే జి.ఎం రవీంద్రగుప్తా అవార్డులు అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, స్టోర్స్, సివిల్ ఇంజనీరింగ్, భద్రత, వాణిజ్య విభాగం, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ అవార్డులు అందుకుంది. జాతీయ స్థాయిలో విశిష్ట సేవా అవార్డులు పి.చైతన్య (ఆపరేషన్స్ మేనేజర్ సికింద్రాబాద్ డివిజన్), ఎం.రమేష్‌కుమార్ (గుంతకల్ డివిజన్ ఇంజనీర్), డి.జయకర్ (సీనియర్ సెక్షన్ ఇంజనీర్), ఎన్.తారకేశ్వర్ (టెక్నీషియన్ లాలాగూడ) గెజిటెడ్ విభాగంలో హరికిషోర్ (సి.సి.ఎం. కార్యదర్శి), నాన్ గెజిటెడ్ విభాగంలో ఫిరోజ్ ఫాతిమా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సహాయ మంత్రి మనోజ్‌సిన్హా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
ఉన్నత శిఖరంపై ‘బాహుబలి’
సగటు ప్రేక్షకులను కలల లోకంలో విహరింపజేయగల బలమైన మాధ్యమం సినిమా. అలాంటి రంగంలో శిఖరాయమానమైన కళాఖండం రూపుదిద్దుకోవడం ఎప్పుడోగానీ సాధ్యం కాదు. 2015 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం బహుమతిని గెల్చుకున్న ‘బాహుబలి’ అలాంటి అపురూపమైన దృశ్య కావ్యం. ఉత్తమ కళాఖండాన్ని నిర్మించి చరితార్ధులం కావాలని స్వప్నించేవారు చాలామందే ఉండవచ్చు. కానీ దాన్ని సాకారం చేసుకోగలిగిన ప్రతిభావ్యుత్పత్తులు, సృజనాత్మకత, అంకితభావం గలవారు అరుదుగా ఉంటారు. ‘బాహుబలి’ నిర్మించడం ద్వారా తనకు అలాంటి అరుదైన లక్షణాలున్నాయని ఎస్.ఎస్. రాజమౌళి నిరూపించుకోవడంతోపాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తి ప్రతిష్టలను ఆకాశపుటంచులకు తీసుకెళ్లారు. ఎలా మొదలైందో గానీ సినిమాల్లో కమర్షియల్ సినిమాలు, అవార్డు సినిమాలంటూ ఒక తెలియని విభజన రేఖ ఏర్పడింది. దాని ఆధారంగా మిగిలిన వాదనలు బయల్దేరాయి. కమర్షియల్ సినిమాలకు వసూళ్లు బాగా ఉంటాయి గనుక చాలామంది ఆ తరహా సినిమాలు తీసేందుకే మొగ్గు చూపుతారని...అవార్డు సినిమాలకు పెట్టుబడులు పెట్టేవారు దొరకరని అంటారు. అందుకే ‘మంచి’ సినిమాలు రావడం లేదని కూడా చెబుతుంటారు. కానీ ‘బాహుబలి’ అలాంటి వాదనలన్నిటినీ పటాపంచలు చేసింది. ‘మంచి’ సినిమాలు, ‘పాపులర్’ సినిమాలన్న పేరుతో విభజన చేసుకున్నది మనమేనని...తగిన సత్తా ఉంటే ఆ రెండూ ఒకటి కావడం అసాధ్యమేమీ కాదని ఆ చిత్రం తేటతెల్లం చేసింది. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తే, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగలిగితే వాణిజ్యపరంగా సూపర్‌హిట్ కావడంతోపాటు జ్యూరీ సభ్యుల మన్ననల్ని పొంది అవార్డుల్ని కూడా సునాయాసంగా సాధించవచ్చునని ‘బాహుబలి’ నిరూపించింది. దీనికి ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరీలోనూ అవార్డు లభించడమే రుజువు. చలనచిత్రాలకు జాతీయ స్థాయి అవార్డులిచ్చే సంప్రదాయం మొదలుపెట్టకముందు...అంటే 1953కు ముందు తెలుగులో ‘పాతాళభైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి గొప్ప చిత్రాలొచ్చాయి. ఆ తర్వాత ‘లవకుశ’, ‘మాయాబజార్’ వంటి కళాఖండాలు వచ్చాయి. కానీ 1964లో ‘నర్తనశాల’ జాతీయస్థాయిలో ఉత్తమ ద్వితీయచిత్రంగా అవార్డుగా ఎంపికయ్యేవరకూ మన చిత్రాలకు సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 1979లో ‘శంకరాభరణం’ మళ్లీ అరుదైన గుర్తింపు తెచ్చుకుని స్వర్ణకమలాన్ని సాధించినా అది జాతీయ ఉత్తమ చిత్రంగా కాదు...స్పెషల్ జ్యూరీ అవార్డు కేటగిరీలో ఆ అవార్డును సాధించింది. ఇన్నాళ్లకు రాజమౌళి తెలుగు చలనచిత్రానికి మళ్లీ జాతీయస్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. వాస్తవానికి ‘బాహుబలి’ దీనికి చాలా ముందే దేశంలో మాత్రమే కాదు...ఖండాంతరాల్లో కూడా తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘కంచె’ సినిమా కూడా ‘బాహుబలి’ తరహాలోనే యుద్ధ నేపథ్యంతో రూపొందిన చిత్రం. రెండో ప్రపంచ యుద్ధ సమయంనాటి సామాజిక సంబంధాలను ప్రతిభావంతంగా చర్చించి, ఆ సంబంధాల్లో భాగమైన వ్యక్తుల భావోద్వేగాలను ఎంతో హృద్యంగా చూపిన సినిమా ‘కంచె’. సమాజంలోని కుల,మతాల కంచెను కూల్చాలని ఈ చిత్రం ప్రబోధిస్తుంది. మన పొరుగునున్న తమిళ, మళయాళ చలనచిత్ర పరిశ్రమలు వాణిజ్యపరమైన విలువలతోపాటు కళాత్మకతను కూడా రంగరిస్తూ... సామాజిక సమస్యలను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తూ ఆయా రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశం నలుమూలలా ప్రేక్షకుల మన్ననల్ని పొందేవి. అలాగే చిత్ర నిర్మాణానికి సంబంధించినంతవరకూ రాశిలోనూ, వాసిలోనూ హిందీ చిత్రాలకు తెలుగు చిత్రాలతోసహా మరే భాషా చిత్రాలూ పోటీ కాదన్న పేరుండేది. తెలుగు చలనచిత్ర రంగం చాన్నాళ్లక్రితమే వాటన్నిటినీ అధిగమించే యత్నం చేసింది. అందుకు పరాకాష్టగా ‘బాహుబలి’నీ, ‘కంచె’నూ చెప్పుకోవచ్చు. ఈసారి ఉత్తమ పాపులర్ చిత్రంగా అవార్డు సొంతం చేసుకున్న ‘బజ్రంగీ భాయ్‌జాన్’ సైతం సామాజిక విలువలను చర్చించిన చిత్రం. ‘బాహుబలి’కి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కూడా కథా రచయిత కావడం విశేషం. మన దేశం వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన తల్లినుంచి తప్పిపోయిన ఒక చిన్నారిని ఆంజనేయుడి భక్తుడైన హీరో ఎన్నో అవరోధాలనూ, అవాంతరాలనూ అధిగమించి మళ్లీ ఆమె దేశానికి చేర్చడం ఈ చిత్రం ఇతివృత్తం. అందువల్లే ఈ చిత్రం మన దేశంతోపాటు పాకిస్తాన్లో కూడా విజయవంతమైంది. సరిహద్దులకు రెండు వైపులా ఉండే పరస్పర అపనమ్మకాలనూ, అనుమానాలనూ చూపడంతో పాటు నిజాలు తెలుసుకున్నాక కథానాయకుడికి నీరాజనాలు పట్టడం ఇందులో కనిపిస్తుంది. ఇరు దేశాల పౌరులమధ్యా సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి ఇలాంటి చిత్రాలు దోహదం చేస్తాయి. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం హర్షించదగింది. మహారాష్ట్రను పాలించిన బాజీరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘బాజీరావు మస్తానీ’కి దర్శకత్వం వహించిన సంజయ్ లీలా బన్సాలీకి ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. దీంతో పాటు మరో ఆరు కేటగిరీలో కూడా అవార్డులు వచ్చాయి. పీష్వాల కాలంలో ఉండే సంప్రదాయాలు, జీవనం, ఆనాటి భవంతులు వగైరాలను కళ్లకు కట్టేలా చిత్రించడంలో బన్సాలీ ఎంతో శ్రమించారు. అందుకోసం ఆయన లోతైన పరిశోధనలు చేశారు. ‘పీకూ’ చిత్రం లో అద్భుతంగా నటించిన అమితాబ్ బచ్చన్‌కు ఉత్తమ నటుడిగా, ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’ చిత్రంలో ప్రతిభావంతమైన నటన చూపిన కంగనా రనౌత్‌కి ఉత్తమ నటిగా అవార్డులు లభించాయి. సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడుతున్న పాత్రలో జీవించిన కల్కి కోషెలిన్కూ ప్రత్యేక జ్యూరీ అవార్డు వచ్చింది. తొలిసారి దర్శకత్వం చేపట్టి ప్రతిభను ప్రదర్శించిన వారికిచ్చే ఇందిరాగాంధీ అవార్డును ‘మసాన్’కు దర్శకత్వం వహించిన నీరజ్ ఘైవాన్ దక్కించుకున్నారు. పెద్ద పెద్ద తారలు లేకుండా, భారీ పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ చిత్రం సమకాలీన జీవితంలోని భావోద్వేగాలనూ, సంఘర్షణనూ అద్భుతంగా ఆవిష్కరించింది. మొత్తానికి రమేష్ సిప్పీ నేతృత్వంలోని జాతీయ అవార్డుల కమిటీ జనం మెచ్చిన చిత్రాలకూ, ప్రతిభావంతులైన నటులకూ, సాంకేతిక నిపుణులకూ పట్టంగట్టిందని చెప్పవచ్చు. -
'క్వీన్' అరుదైన ఘనత
ముంబై: హీరో హృతిక్ రోషన్ తో వివాదాలతో నలిగిపోతున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ కు తీపికబురు అందింది. జాతీయ ఉత్తమ నటిగా ఆమె ఎంపికైంది. 29 ఏళ్ల కంగనా రౌనత్ మూడోసారి జాతీయ అవార్డుకు ఎంపికై అరుదైన ఘనత సాధించింది. 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను సోమవారం ప్రకటించారు. 'తను వెడ్స్ మను రిటర్న్స్' సినిమాలో నటనగానూ కంగన ఉత్తమ నటిగా ఎంపికైంది. వరుసగా రెండో పర్యాయం ఆమె ఈ అవార్డు దక్కించుకుంది. 'క్వీన్' చిత్రానికి గతేడాది ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. 'ఫ్యాషన్' సినిమాలో నటించినందుకు 2009లో ఉత్తమ సహాయ నటి పురస్కారం సొంతం చేసుకుంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నాలుగోసారి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 'పీకు' సినిమాలో నటనకుగానూ ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 73 ఏళ్ల అమితాబ్ గతంలో అగ్నిపథ్, బ్లాక్, పా సినిమాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. -
ఆర్టీసీకి నాలుగు జాతీయ అవార్డులు
- బెంగుళూరులో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నుంచి ఎండీ స్వీకరణ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (ఏపీఎస్ఆర్టీసీ) ప్రతిష్టాత్మక అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ (ఎఎస్ఆర్టీయూ) నుంచి నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. 2014-15 సంవత్సరానికిగాను గ్రామీణ సర్వీసులలో వాహన ఉత్పాదకతలో గరిష్ట పెరుగుదల సాధించినందుకు, అతి తక్కువ ఆపరేషనల్ (పన్ను ఎలిమెంట్ లేకుండా కి.మీ.కు 26.02 రూపాయలు వ్యయం) కలిగి ఉన్నందుకు ఆర్టీసీకి ఈ అవార్డులు లభించాయి. మంగళవారం బెంగుళూరులో జరిగిన ఎఎస్ఆర్టీయూ 60వ వార్షికోత్సవ సభలో ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. గ్రూపు-1 కేటగిరీ మొఫిసిల్ (గ్రామీణ) సర్వీసుల్లో విన్నర్ అవార్డు, ఇంధన వినియోగంలో అత్యధిక కె.ఎం.పి.ల్. (5.23) సాధించినందుకు, గ్రామీణ సర్వీసుల్లో వాహన ఉత్పాదకతలో గరిష్ట పెరుగుదల (వాహనం రోజుకు నడుపుతున్న కిలోమీటర్లు 320.59 నుంచి 381.19 వరకు పెరుగుదల) సాధించినందుకు విన్నర్ అవార్డులు ఆర్టీసీ సాధించింది. వీటితో పాటు సెక్రటేరియల్ సామర్ధ్యంలో మరో అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డులు ఆర్టీసీకి లభించడం పట్ల సంస్థ ఎండీ సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల అంకితభావం, సూపర్వైజర్లు, అధికారులు, సిబ్బంది అంతా కలిసికట్టుగా చేసిన కృషి దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘అసహనం’పై సినీ బాణం
* ఒకే రోజు జాతీయ అవార్డులు తిరిగిచ్చిన 24 మంది ఫిల్మ్మేకర్లు * తన అవార్డును సైతం వెనక్కిచ్చిన రచయిత్రి అరుంధతీ రాయ్ న్యూఢిల్లీ/ముంబై: దేశంలో అసహన పరిస్థితుల పెరిగిపోతున్నాయంటూ నిరసన గళం వినిపిస్తున్న మేధావుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం ఏకంగా 24 మంది ఫిల్మ్మేకర్లు వారికి లభించిన జాతీయ అవార్డులను వెనక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో ప్రముఖ దర్శక రచయిత కుందన్ షా, దర్శకుడు సయీద్ మిర్జా, రచయిత్రి, బుకర్‌ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్, అన్వర్ జమల్, వీకేంద్ర సైనీ, ప్రదీప్ కృష్ణన్, మనోజ్ లోబో, సుధాకర్‌రెడ్డి యెక్కంటి తదితరులున్నారు. వీరితో కలిపి జాతీయ లేదా సాహిత్య అవార్డులు తిరిగిస్తున్నట్లు ప్రకటించిన మేధావుల సంఖ్య 75కు చేరింది. భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులతోపాటు ముగ్గురు మేధావుల హత్యకు నిరసనగా వీరంతా గళమెత్తుతున్నారు. సైద్ధాంతిక క్రూరత్వానికి నిరసనగా 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ టు దోజ్ వన్స్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే విభాగంలో అందుకున్న జాతీయ అవార్డును తిరిగిస్తున్నట్లు అరుంధతీ రాయ్ ప్రకటించారు. ఎఫ్‌ఈఐఐ చైర్మన్‌గా బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్‌ను నియామకానికి నిరసనగా జాతీయ అవార్డును వెనక్కిస్తున్నట్లు కుందన్ చెప్పారు. మోదీ సర్కారుకు కళాకారుల బాసట అవార్డులను తిరిగిస్తున్న మేధావుల తీరును పలువురు కళాకారులు తప్పుబట్టారు. మోదీ సారథ్యంలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆశ్చర్యపోయిన దేశంలోని ఒక వర్గం మేధావులు వారి కక్ష తీర్చుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షుడు లోకేశ్, రచయిత భైరప్ప సహా 36 మంది మేధావులు సర్కారుకు మద్దతు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. -
నా అవార్డులు వెనక్కివ్వను
-
నా అవార్డులు వెనక్కివ్వను: కమల్ హాసన్
పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, ఇతరులు తమకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని తాను సమర్థించబోనని, తనకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని లోకనాయకుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. తన లేటెస్ట్ మూవీ చీకటిరాజ్యం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలతో పాటు ఇతర విషయాలు కూడా పంచుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవుతోంది. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మినిమమ్ బడ్జెట్‌తో అతి తక్కువ రోజుల్లో షూట్ చేశారు. ఒక్క రాత్రిలో జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కమల్ శిష్యుడు రాజేష్ ఎం సెల్వా దర్శకుడు. కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్‌తో పాటు త్రిష, ప్రకాష్ రాజ్, కిశోర్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత కమల్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కావటంతో ఈ సినిమాపై తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి. -
ఇప్పుడు సినీ దర్శకుల వంతు..
ప్రముఖ హేతువాది, రచయిత కల్బుర్బీ సహా ప్రజాస్వామిక వాదుల హత్యలు, దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విపరీత పరిస్థితులను నిరసిస్తూ పలువురు రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వదులుకుంటున్న తరుణంలో.. తొమ్మిది మంది సినీ దర్శకులు తమకు లభించిన జాతీయ అవార్డులను తిరిగిస్తున్నట్లు ప్రకటించారు. 'బాంబే టాకీస్', 'ఖోస్లా కా ఘోస్లా', 'ఒయ్ లక్కీ లక్కీ..' తదితర హిట్ సినిమాల దర్శకుడు దివాకర్ బెనర్జీ సహా తొమ్మిది మంది దర్శకులు జాతీయ అవార్డులను వదులుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. గజేంద్ర చౌహాన్ ను చైర్మన్ గా తొలగించాలన్న పుణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థుల డిమాండ్ కు మద్దతు తెలపడంతోపాటు కల్బుర్గీ హత్యకు నిరసనగా తామీ పనికి పూనుకున్నట్లు వారు చెప్పారు. బెనర్జీ సహా అవార్డును వెనక్కిచ్చిన వారిలో లిపికా సింగ్, నిష్టా జౌన్, ఆనంద్ పట్వర్ధన్, కీర్తి నఖ్వా, హర్షా కులకర్ణి, హరి నాయర్ తదితరులున్నారు. -
ఆ వరుసలో మరో ముగ్గురు
పుణే: దేశంలో పెరుగుతున్న అశాంతి, అసహనానికి నిరసనగా తమ ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న వారికి మరో ముగ్గురు జత కలిశారు. ఎఫ్టిఐఐ పూర్వ విద్యార్థులు ముగ్గురు... తమ జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన విక్రాంత్ పవార్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాకేశ్ శుక్ల, గోవాకు చెందిన ప్రతీక్ సినీ రంగంలో తాము సాధించిన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా దేశంలో నెలకొన్న అవాంఛనీయ పరిణామాలకు నిరసనగా తమ అవార్డులను తిరిగి ఇస్తున్నట్టు వారు పేర్కొన్నారు. 'పవార్ కతాల్' ఫిక్షన్ మూవీకి గాను, 2012 లో రాష్ట్రపతి బంగారు పతకాన్ని, శుక్ల 'డాంకీ ఫెయిర్' 2013 స్పెషల్ జ్యూరీ అవార్డు, ప్రతీక్ 'కాల్' ఉత్తమ షార్ట్ ఫిలిం రజత్ కమల్ అవార్డును గెల్చుకున్నారు. కాగా పుణే ఫిలిం అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గత 139 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని విరమించి క్లాసులకు హాజరవుతామని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వివిధ దశల్లో జరిగిన చర్చల ప్రతిష్టంభన అనంతరం క్లాసులకు హాజరైనా, తమ శాంతియుత నిరసన,ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు ప్రకటించారు. సంస్థ చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకంపై ఎఫ్టిఐఐ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.