
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులు ప్రకటించింది. వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ అమలులో ఏపీకి జాతీయ అవార్డులు దక్కాయి. వ్యవసాయ ఉత్పత్తుల కేటగిరీలో అల్లూరి జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. కాఫీ సాగుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉత్తమ జిల్లాగా నిలిచింది. వ్యవసాయేతర ఉత్పత్తుల సాగులో దేశంలోనే ఉత్తమ జిల్లాకు కాకినాడకు జాతీయ అవార్డు దక్కింది. అన్నమయ్య, గుంటూరు జిల్లాలు స్పెషల్ మెన్షన్ అవార్డులకు ఎంపికయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment