మహేష్ డైరెక్టర్ మళ్లీ ఫైర్ అయ్యాడు..!
జాతీయ అవార్డుల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ జాతీయ అవార్డులు ఈ సారి వివాదాలకు తెరతీస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలపై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, విజేతల ఎంపికపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'అవార్డుల కమిటీ, ఒత్తిళ్లకు తలొగ్గి పక్షపాత ధోరణితో విజేతలను ఎంపిక చేసిందంటూ విమర్శించారు'. అయితే ప్రతీ విమర్శకు వ్యక్తిగతంగా బదులిస్తున్న జ్యూరీ అధ్యక్షుడు ప్రియదర్శన్, 'అక్షయ్ కుమార్తో సినిమా చేయాలనకున్న దర్శకుడికి అక్షయ్ నో చెప్పాడు... అందుకే ఆయనకు అవార్డ్ రావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు' అంటూ మురుగదాస్పై పరోక్షంగా విమర్శలు చేశాడు.
ప్రియదర్శన్ కామెంట్స్ మురుగదాస్ కూడా ఘాటుగానే స్పంధించాడు. ' మిస్టర్ జ్యూరీ, ఇది కేవలం నా అభిప్రాయం కాదు. భారతీయ ప్రేక్షకులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాధించటం కన్నా, నిజాన్ని బయటకు తీస్తే మంచిది' అంటూ కౌంటర్ ఇచ్చాడు. దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా జ్యూరీ మీద గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా దంగల్ సినిమాకు అమీర్ ఖాన్ తప్పకుండా అవార్డ్ వస్తుందని భావించిన ఆయన అభిమానులు ప్రియదర్శన్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
#NationalAwards #Biased
— A.R.Murugadoss (@ARMurugadoss) 14 April 2017
Mr. jury, It's nt only my opinion it's the voice of whole Indian audience, better nt to argue & dig out the truth