Producer S Naga Vamshi Said Jersey Is A Movie Fully deserved Of The National Awards, Very Happy To Have Received Two Awards - Sakshi
Sakshi News home page

జెర్సీకి ఆ అర్హత ఉంది

Published Wed, Mar 24 2021 12:00 AM | Last Updated on Wed, Mar 24 2021 9:16 AM

Jersey Is Fully Deserving Of National Awards, Said Director - Sakshi

నాగవంశీ 

‘‘జెర్సీ’కి బెస్ట్‌ యాక్టర్‌గా నానీకి, బెస్ట్‌ డైరెక్టర్‌గా గౌతమ్‌కు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వస్తాయని నమ్మాను. అయితే రెండు జాతీయ అవార్డ్స్‌ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ అవార్డులకు ‘జెర్సీ’కి పూర్తి అర్హత ఉంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’కి ఉత్తమ తెలుగు చిత్రంగా, ఈ సినిమా ఎడిటర్‌ నవీన్‌ నూలికి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులు వచ్చాయి.

నాగవంశీ మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ కథలోని ఎమోషన్స్‌ను నమ్మి నాని, నేను ఈ సినిమా చేశాం. ఈ 26న మా ‘రంగ్‌ దే’ రిలీజవుతుంది. వేసవిలో ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుంది. ‘వరుడు కావలెను’, ‘నరుడి బ్రతుకు నటన’, బెల్లంకొండ గణేష్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నాం. మలయాళ చిత్రాలు ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’, ‘కప్పేలా’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నాం’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement