![Invitation To Application For National Children Awards - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/26/Kesali-Apparao.jpg.webp?itok=ohhXLGnQ)
సాక్షి, విజయవాడ: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాలు-2024 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఏపీకి చెందిన వివిధ రంగాలలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన 18 సంవత్సరాల లోపు బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
క్రీడలు, సామాజిక సేవా రంగం, ధైర్య సాహసాలు, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ , సాంస్కృతిక సంప్రదాయాలు, శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానం రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలలు 31, ఆగస్టు, 2023 లోపు http://awards.gov.in వెబ్ సైట్ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అప్పారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment