పెంబర్తిలో పనిలో నిమగ్నమైన కళాకారులు
సాక్షి, న్యూఢిల్లీ/చిన్నకోడూరు(సిద్దిపేట): రెండు తెలంగాణ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన జనగామ జిల్లా పెంబర్తితోపాటు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం ఈ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. చంద్లాపూర్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల మంత్రి హరీశ్‌రావు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. హరీశ్‌రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ అన్నారు.
పెంబర్తి... చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీక
ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి.
దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్రం చొరవతీసుకుంది.
చంద్లాపూర్.. కళాత్మకత, చేనేతల కలబోత
రంగనాయక స్వామి ఆలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభా మ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యా నికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబో తకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పె రుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీర ల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది.
రంగనాయక స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు గ్రామీ ణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటు గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కార ణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవతో చంద్లాపూర్ లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది.
Comments
Please login to add a commentAdd a comment