మెప్మాకు రెండు జాతీయ అవార్డులు
ఒకేసారి ‘స్పార్క్, ప్రయిస్’ పురస్కారాలు ప్రదానం
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని మహిళలకు ఉపాధి చూపడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసి న సంస్కరణలకు మరోసారి జాతీయ స్తాయి గుర్తింపు లభించింది. ‘దీన్ దయాళ్ అంత్యోదయ యోజ న–జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్’ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకుగా ను పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)ను అ వార్డులు వరించాయి. 2023–24 సంవత్సరానికి గా ను సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ (స్పార్క్) అవార్డు, పెర్ఫార్మెన్స్ రికగ్నేషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్సియల్ ఇంక్లూజన్ అండ్ స్ట్రీట్ వెండోర్స్ ఎంపవర్‌మెంట్ (ప్రయిస్) పురస్కారం వచ్చాయి.
ఈ అవార్డులు మెప్మాకు రావడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. గురువారం న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సహాయమంత్రి తోఖాన్ సాహు చేతుల మీదుగా మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి అవార్డులను అందుకున్నారు. స్టేట్ మిషన్ మేనేజర్‌లు ఆది నారాయణ, రంగాచార్యులు, ఎన్‌ఎన్‌ఆర్ శ్రీనివాస్, ప్రభావతి పాల్గొన్నారు.
జగన్ ప్రభుత్వం కృషితో..
సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందించే నగదుతో మహిళలను స్వయం ఉపాధి వైపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంత మహిళలను ప్రోత్సహించి 2 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యుల భాగస్వామ్యంతో జగనన్న మహిళా మార్టులను 15 మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలే పెట్టుబడిదారులు, ఉద్యోగులు, నిర్వాహకులు, వాటాదార్లుగా ఉన్న ఈ మార్టులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది లాభాలను ఆర్జిస్తున్నాయి.
మార్టులు ఏర్పాటు చేసిన అతితక్కువ కాలంలోనే రూ.60 కోట్లకు పైగా వ్యాపారం చేయడం గమనా ర్హం. వీటి నిర్వహణ పనితీరును పరిశీలించిన కేంద్రం స్పార్క్ అవార్డు ప్రదానం చేసింది. ఆర్థిక చేయూత, సాధికారత సాధించడంలో మెప్మా విభాగం అత్యుత్తమ పనితీరు కనబర్చింది. వీధి వ్యాపారులకు సరైన సమయంలో ఆర్థిక సాయం అందించడంతో పాటు వారు సరైన మార్గంలో వ్యాపారాలు చేసేలా ప్రోత్సహించినందుకుగాను ప్రయిస్ అవార్డును ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment