
కమర్షియల్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వీలున్నంతగా హీరోను ఆకాశానికి ఎత్తేసేలా, ఫ్యాన్స్ విజిల్స్‌తో థియేటర్స్ దద్దరిల్లేట్టు ఉండేలా ప్లాన్ చేస్తుంటారు దర్శకులు. తాజాగా విజయ్ కొత్తచిత్రంలో ఎంట్రీసాంగ్‌ను వందమంది పిల్లలతో షూట్ చేస్తున్నారట. తమిళంలో హీరో విజయ్–దర్శకుడు అట్లీది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘తేరీ, మెర్సల్’ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. మూడోసారి కలసిన ఈ హిట్ కాంబినేషన్ ఫస్ట్ రెండు సినిమాలకంటే భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుంది. ఈ సినిమాలో విజయ్ పరిచయ గీతాన్ని సుమారు వందమంది పిల్లలతో షూట్ చేస్తున్నారట. దీనికోసం చెన్నైలో ఓ భారీ సెట్‌ను కూడా నిర్మించారట. స్పోర్ట్స్ బ్యాడ్రాప్‌లో సాగనున్న ఈ చిత్రంలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపిస్తారు. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్.
Comments
Please login to add a commentAdd a comment