
ఈసారి రంజాన్‌కు వారం ముందే పండగ స్టార్ట్ కానుంది. ఎందుకంటే రజనీకాంత్ వారం ముందే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అవును.. జూన్ 7న ‘కాలా’ రిలీజ్ కానుంది. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించారు.
అంజలీ పాటిల్, హ్యూమా ఖురేషీ కథానాయికలు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను తొలుత ఈ నెల 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, కోలీవుడ్ ఇండస్ట్రీ స్ట్రైక్ వల్ల ‘కాలా’ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యిందని ఊహించవచ్చు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ‘కాలా’ సినిమాను జూన్7న రీలీజ్ చేయబోతున్నామని చెప్పడానికి ఆనందంగా ఉంది. మేక్ వే ఫర్ ది కింగ్(రాజుకి దారి ఇవ్వండి)’’ అని పేర్కొన్నారు ధనుష్. నానా పటేకర్, సముద్రఖని తదితరులు నటించిన ‘కాలా’ చిత్రానికి సంతోష్ నారాయణ్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment