డబ్బింగ్‌ షురూ | Rajinikanth starts dubbing for `Kaala` | Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ షురూ

Published Mon, Jan 22 2018 1:57 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Rajinikanth starts dubbing for `Kaala` - Sakshi

కాలా స్టార్ట్‌ చేశాడు. డబ్బింగ్‌ షురూ చేశాడు. ‘కబాలి’ ఫేమ్‌ రంజిత్‌. పా దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘కాలా’. హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్‌ కథానాయికలు. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ రీసెంట్‌గా స్టారై్టన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని తన క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ చెప్పడానికి చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చారు రజనీ. ‘కాలా’ చిత్రాన్ని శంకర్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందిన ‘2.0’ రిలీజైన రెండు నెలల తర్వాత రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్‌ టాక్‌.

‘2.0’ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. పొలిటికల్‌ ఎంట్రీపై రజనీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేసిన తర్వాత రజనీ సినిమాలకు గుడ్‌బై చెబుతారన్న వార్తలు కోలీవుడ్‌లో ఊపందుకున్నాయి. మరోవైపు రజనీ సినిమాలను తగ్గిస్తారేమో కానీ పూర్తిగా ఫుల్‌స్టాప్‌ పెట్టరన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రజనీ అధికారికంగా ప్రకటన ఇస్తే గానీ ఇలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడదని అభిమానులు అనుకుంటున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement