
సాక్షి, హైదరాబాద్ : పైరసీ భూతం మరోసారి కాటేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా యాక్షన్ చిత్రం కాలా విడుదలకు ముందే సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో దాదాపు 45 నిమిషాల వీడియో లైవ్ టెలికాస్ట్ అయింది. భారత్ కంటే ముందుగా సింగపూర్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో అక్కడే ఉంటున్న ప్రవీణ్ దేవర సినిమాకు వెళ్లి, తన మొబైల్‌తో దాదాపు 45 నిమిషాలపాటు సినిమాను ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ప్రపంచవాప్తంగా గురువారం విడుదల కానుంది. నేపథ్యంలో ఈ సంఘటన సినీ వర్గాల్లో కలకలం రేపింది. ముఖ్యంగా రజనీ అభిమానులు ఆందోళనలకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment