Leak Online
-
జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, గంటల వ్యవధిలోని ఆన్లైన్లో లీక్
Shahid Kapoor Jersey Movie Leaked Online: షాహిద్ కపూర్ తాజా చిత్రం జెర్సీ మూవీ టీంకు షాక్ తగిలింది. ఎన్నోసార్లు వాయిదా పుడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు నేడు(ఏప్రిల్ 22న) విడుదలైంది. ఇప్పటికే తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’తో హిట్ కొట్టిన షాహిద్ ఈ మూవీతో మరో హిట్కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో జెర్సీ విడుదలైన గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో లీకవడంతో మూవీ టీం, హీరో షాహిద్ ఆందోళనకు గురవుతున్నారు. ఈ మూవీ విడులైన గంట వ్యవధిలోనే తమిళ్రాక్స్, టెలిగ్రామలో లీకైంది. అయితే ఈ సినిమా పైరసి పట్ల చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి లీకువీరులు తమ చేతివాటం చూపించారు. చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్ కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ చిత్రాలు గట్టి పోటి ఇస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాగా వచ్చిన జెర్సీ తొలి రోజే ఆన్‌లైన్‌లోకి లీకవడం మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో షాహిద్ ఎమోషనల్‌గా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో అతడి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీని హిందీలో అదే పేరుతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్‌కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు. చదవండి: హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే.. -
హార్ట్ బ్రేకింగ్: వాడికి పనిస్తే.. ఈ పని చేస్తాడని అనుకోలేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి గతంలో మూవీ టీజర్ లీక్ కాగా తాజాగా కళావతి పాట కూడా లీక్ కావడంతో మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఇదే విషయంపై సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు. తన మాటల్లో.. నా మనసు చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట వీడియో కోసం ఎంతెంతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం. ఈ పాట షూటింగ్ సమయంలో 9మందికి కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. మేము మా హీరోగారికి చూపించిల్సిన ప్రేమ, మా అభిమానం. మా పాటలో ఉండే ప్రాణం. మా కవి రాసిన అద్భుతమైన లిరిక్స్. మా డైరెక్టర్ గారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా చేసిన లిరికల్ వీడియో. మాస్టరింగ్, మిక్సింగ్ టెక్నాలజీ వాడాం ఈ పాట కోసం. అలా ఎంతో కష్టపడి తయారు చేసిన పాటను ఎవడో చాలా ఈజీగా నెట్లో పెట్టేశాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె తరుక్కుపోతోంది. కోపంగా వుండాలా, బాధ పడాలా.. మూవ్ ఆన్ అవ్వాలా తెలియట్లేదు. ఎంతో హార్ట్ బ్రేకింగా వుంది. నేను మామూలుగా ఇంత హార్ట్ బ్రేక్ అవ్వను. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఎన్నో ఎదుర్కొన్నాను లైఫ్‌లో. నేనెందుకు పబ్లిక్ డొమైన్లో ఈ ఆడియో నోట్ పెడుతున్నానంటే వాడికి అర్దం కావాలి పైరసి అనేది ఎంత ఘోరమైన విషయమో వాడికి తెలియాలి అంటూ తమన్ ట్వీట్ ద్వారా తన ఆవేదనను తెలిపాడు. ఇక పాట లీకైన నేపథ్యంలో కళావతి పూర్తి పాటను నేడు అధికారికంగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. Heartbroken 💔 !! pic.twitter.com/tO75lsUND6 — thaman S (@MusicThaman) February 12, 2022 -
విజయ్ దేవరకొండకు మరో పెద్ద షాక్..
సాక్షి, సిటీబ్యూరో: ‘అరవింద సమేత వీర రాఘవ’ కేసు కొలిక్కిరాకముందే మరో సినిమా ‘ట్యాక్సీవాలా’ వంతు వచ్చింది. ఆ చిత్రానికి సంబంధించిన నిర్మాణ దృశ్యాలు లీక్ కాగా... ఈ సినిమా ఎడిటిం గ్ సైతం కాకముందే హెచ్డీ ప్రింట్ నెట్‌కెక్కింది. నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘ట్యాక్సీవాలా’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎడిటింగ్‌కు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్డీ ప్రింట్‌తో పూర్తి సినిమాను యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అప్లోడ్ చేసి వైరల్ చేశారని నిర్మాణ సంస్థ గుర్తించింది. దీంతో దాని ప్రతినిధి సానం నాగ అశోక్‌కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ చాంద్‌బాషా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే తాము తెలుగు ఫిలిమ్ చాంబర్ ఆధీనంలోని యాంటీ వీడియో పైరసీ సెల్‌కు ఫిర్యాదు చేశామని, వారి ద్వారా కీలక సమాచారం సేకరించామని ఫిర్యాదులో పేర్కొన్న నిర్మాణ సంస్థ ఆయా లింకుల్ని సైతం సైబర్ క్రైమ్ పోలీసులకు అందించింది. గూగుల్ డ్రైవ్‌ల నుంచి ఈ సినిమా షేర్ అవుతోందని పేర్కొన్నారు. రెల్ల కమల్, భార్గవ్‌కుమార్, బీఆర్ పేర్లతో ఉన్న జీ–మెయిల్ ఐడీలకు సంబంధించిన డ్రైవ్ అకౌంట్ల ద్వారా లింకులు షేర్ అవుతున్నాయంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా కూడా లీకైన విషయం విదితమే. -
బ్రేకింగ్ : విడుదలకు ముందే ఆన్లైన్లో 'కాలా'
సాక్షి, హైదరాబాద్ : పైరసీ భూతం మరోసారి కాటేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా యాక్షన్ చిత్రం కాలా విడుదలకు ముందే సోషల్ మీడియా ఫేస్బుక్లో దాదాపు 45 నిమిషాల వీడియో లైవ్ టెలికాస్ట్ అయింది. భారత్ కంటే ముందుగా సింగపూర్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో అక్కడే ఉంటున్న ప్రవీణ్ దేవర సినిమాకు వెళ్లి, తన మొబైల్‌తో దాదాపు 45 నిమిషాలపాటు సినిమాను ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ప్రపంచవాప్తంగా గురువారం విడుదల కానుంది. నేపథ్యంలో ఈ సంఘటన సినీ వర్గాల్లో కలకలం రేపింది. ముఖ్యంగా రజనీ అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. -
శ్రీదేవి కూతురు సినిమా వీడియో లీక్
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలిసారిగా నటిస్తున్న చిత్రం ధడక్. మరాఠీలో సంచలనం సృష్టించిన సైరాట్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జాన్వీ క్యారెక్టర్, లుక్స్ కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తప్ప సినిమాలో జాన్వీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు. జాన్వీ తొలి చిత్రం కావడం, శ్రీదేవీ వారసురాలు తెరపై ఎలా ఉంటుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తమ సినిమా వీడియో లీకవ్వడం బాధాకరమని చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో లీకైన సమాచారం తెలియడంతో వెంటనే స్పందించిన యూనిట్ నెట్లో లింకులను తొలగించేశారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇన్‌స్టాగ్రాంలో వైరల్‌గా మారిన వీడియోను ఎంతో మంది వీక్షించారు. దీంతో చిత్ర బృందం ఒక నిర్ణయానికి వచ్చింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఎవరూ సెల్ఫోన్లు తీసుకురాకూడదని నిబంధనను పెట్టింది. ఇలా నిబంధనలు జారీ చేయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా రామ్‌లీలా, బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాల విషయాల్లో వీడియోలు, పోస్టర్స్‌లు లీకవ్వడంతో ఇలాంటి రూల్సే పెట్టారు. ఇంత చేస్తున్నారు కానీ, పబ్లిక్ ప్లేస్‌లో షూటింగ్ చేస్తే ఎంతమందిని కంట్రోల్ చేయగలరు మరి? -
శాంసంగ్ గెలాక్సీ సీ5, సీ7 ఆన్ లైన్ లో లీక్
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు లీకేజ్ ల బెడద ఎదురైంది. మార్కెట్లోకి త్వరలో విడుదల చేయాలనుకుంటున్న మిడ్ రేంజ్ సీ-సిరీస్ కొత్త డివైజ్ లు ఆన్ లైన్ లో లీకయ్యాయి. వాటి ప్రత్యేకతలు, ధర సమాచారం ప్రస్తుతం ఆన్ లైన్ హల్ చల్ చస్తోంది. రెండు మెటల్ క్లాడ్ సీ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ సీ5, సీ7 లను ఆవిష్కరించేందుకు శ్యామ్ సంగ్ ప్లాన్ చేస్తుందని ఈ కొత్త లీకేజ్ ల సమాచారం తెలుపుతోంది. గెలాక్సీ సీ5 రూ. 16,400, గెలాక్సీ సీ7 రూ.18,500 ఉండబోతుందని సమాచారం. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు డ్యూయల్ సిమ్ లను సపోర్టు చేస్తుందని, ఆరు నుంచి ఏడు మిల్లీమీటర్ల థింక్ గా పనిచేస్తుందంట. ఆల్ట్రా హై క్వాలిటీ ఆడియోతో ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగదారుల ముందుకు రాబోతున్నాయట. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కేవలం ఆన్ లైన్ లోనే అందుబాటులో ఉంటాయట. ఇప్పటివరకూ శ్యామ్ సంగ్ విడుదలచేసిన మొబైల్ లు ఆన్ లైన్ లోనూ, రిటైల్ స్టోర్స్ లోనూ లభ్యమయ్యేవి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కేవలం సైజ్, బ్యాటరీ లోనే వేరుగా ఉంటాయని మిగతా ఫీచర్లని ఒకే మాదిరిగా ఉంటాయని తెలుస్తోంది. శ్యామ్ సంగ్ గెలాక్సీ సీ5, సీ7 ల లీకేజీల ఫీచర్లు... 5.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో గెలాక్సీ సీ5 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో గెలాక్సీ సీ7 గెలాక్సీ సీ5 బ్యాటరీ సామర్థ్యం 2,600 ఎంఏహెచ్ గెలాక్సీ సీ7 బ్యాటరీ సామర్థ్యం 3,300 ఎంఏహెచ్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 617 ఆక్టా కోర్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ 16 మోగా పిక్సెల్ వెనుక కెమెరా 8 మెగా పిక్సెల్ ముందు కెమెరా సిల్వర్, గోల్డ్, పింక్, గ్రే రంగుల్లో వేరియంట్లు లభ్యం