Thaman Emotional Words About Kalaavati Song Leak From Sarkari Vari Pata Movie - Sakshi
Sakshi News home page

Heart Breaking: వాడికి పనిస్తే.. ఈ పని చేస్తాడని అనుకోలేదు

Published Sun, Feb 13 2022 1:33 AM | Last Updated on Mon, Feb 14 2022 6:27 PM

Thaman Emotional Comments On Sarkaru Vaari Paata Song Leak - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి గతంలో మూవీ టీజర్ లీక్‌ కాగా తాజాగా కళావతి పాట కూడా లీక్ కావడంతో మహేష్‌ బాబు అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఇదే విషయంపై సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు. తన మాటల్లో.. నా మనసు చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట వీడియో కోసం ఎంతెంతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం.  

ఈ పాట షూటింగ్‌ సమయంలో 9మందికి కరోనా పాజిటివ్‌ కూడా వచ్చింది. మేము మా హీరోగారికి చూపించిల్సిన ప్రేమ, మా అభిమానం. మా పాటలో ఉండే ప్రాణం. మా కవి రాసిన అద్భుతమైన లిరిక్స్‌. మా డైరెక్టర్‌ గారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా  చేసిన లిరికల్‌ వీడియో. మాస్టరింగ్‌, మిక్సింగ్‌ టెక్నాలజీ వాడాం ఈ పాట కోసం. 

అలా ఎంతో కష్టపడి తయారు చేసిన పాటను ఎవడో చాలా ఈజీగా నెట్‌లో పెట్టేశాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె తరుక్కుపోతోంది. కోపంగా వుండాలా, బాధ పడాలా.. మూవ్‌ ఆన్‌ అవ్వాలా తెలియట్లేదు. ఎంతో హార్ట్‌ బ్రేకింగా వుంది. నేను మామూలుగా ఇంత హార్ట్‌ బ్రేక్‌ అవ్వను. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఎన్నో ఎదుర్కొన్నాను లైఫ్‌లో. నేనెందుకు పబ్లిక్‌ డొమైన్‌లో ఈ ఆడియో నోట్‌ పెడుతున్నానంటే వాడికి అర్దం కావాలి పైరసి అనేది ఎంత ఘోరమైన విషయమో వాడికి తెలియాలి అంటూ తమన్‌ ట్వీట్‌ ద్వారా తన ఆవేదనను తెలిపాడు. ఇక పాట లీకైన నేపథ్యంలో కళావతి పూర్తి పాటను నేడు అధికారికంగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement