జెర్సీ మూవీ టీంకు భారీ షాక్‌, గంటల వ్యవధిలోని ఆన్‌లైన్‌లో లీక్‌ | Shahid Kapoor Jersey Movie Leaked Online On Telegram, Tamilrockers | Sakshi
Sakshi News home page

Jersey-Shahid Kapoor: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్‌, ఆన్‌లైన్‌లో లీకైన సినిమా

Apr 22 2022 6:19 PM | Updated on Apr 22 2022 6:23 PM

Shahid Kapoor Jersey Movie Leaked Online On Telegram, Tamilrockers - Sakshi

Shahid Kapoor Jersey Movie Leaked Online: షాహిద్‌ కపూర్‌ తాజా చిత్రం జెర్సీ మూవీ టీంకు షాక్‌ తగిలింది. ఎన్నోసార్లు వాయిదా పుడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు నేడు(ఏప్రిల్‌ 22న) విడుదలైంది. ఇప్పటికే తెలుగు అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’తో హిట్‌ కొట్టిన షాహిద్‌ ఈ మూవీతో మరో హిట్‌కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో జెర్సీ విడుదలైన గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో లీకవడంతో మూవీ టీం, హీరో షాహిద్‌ ఆందోళనకు గురవుతున్నారు. ఈ మూవీ విడులైన గంట వ్యవధిలోనే తమిళ్‌రాక్స్‌, టెలిగ్రామలో లీకైంది. అయితే ఈ సినిమా పైరసి పట్ల చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి లీకువీరులు తమ చేతివాటం చూపించారు. 

చదవండి: సమంత ఫేక్‌ ఫొటో షేర్‌ చేసిన విజయ్‌, పడిపడి నవ్విన సామ్‌

కేజీయఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పాన్‌ చిత్రాలు గట్టి పోటి ఇస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాగా వచ్చిన జెర్సీ తొలి రోజే ఆన్‌లైన్‌లోకి లీకవడం మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో షాహిద్‌ ఎమోషనల్‌గా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో అతడి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు నేచురల్‌ స్టార్‌ నాని నటించిన జెర్సీని హిందీలో అదే పేరుతో డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి రీమేక్‌ చేశాడు. ఇందులో షాహిద్‌కు జోడిగా బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. దిల్ రాజు, నాగ‌వంశీ, అమ‌న్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ ప‌రంప‌ర మ్యూజిక్‌ అందించారు.

చదవండి: హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement