శ్రీదేవి కూతురు సినిమా వీడియో లీక్‌ | Jhanvi Kapoors Dhadak Movie Video Leaked | Sakshi
Sakshi News home page

శ్రీదేవి కూతురు సినిమా వీడియో లీక్‌

Published Tue, Mar 13 2018 12:07 PM | Last Updated on Tue, Mar 13 2018 2:20 PM

Jhanvi Kapoors Dhadak Movie Video Leaked - Sakshi

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తొలిసారిగా నటిస్తున్న చిత్రం ధడక్‌. మరాఠీలో సంచలనం సృష్టించిన సైరాట్‌ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు  సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో జాన్వీ క్యారెక్టర్‌, లుక్స్‌ కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసిన ఫస్ట్‌ లుక్ తప్ప సినిమాలో జాన్వీ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు.

జాన్వీ తొలి చిత్రం కావడం, శ్రీదేవీ వారసురాలు తెరపై ఎలా ఉంటుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తమ సినిమా వీడియో లీకవ్వడం బాధాకరమని చిత్రనిర్మాత కరణ్‌ జోహార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో లీకైన సమాచారం తెలియడంతో వెంటనే స్పందించిన యూనిట్‌ నెట్‌లో లింకులను తొలగించేశారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇన్‌స్టాగ్రాంలో వైరల్‌గా మారిన వీడియోను ఎంతో మంది వీక్షించారు.

దీంతో చిత్ర బృందం ఒక నిర్ణయానికి వచ్చింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఎవరూ సెల్‌ఫోన్‌లు తీసుకురాకూడదని నిబంధనను పెట్టింది. ఇలా నిబంధనలు జారీ చేయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా రామ్‌లీలా, బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాల విషయాల్లో వీడియోలు, పోస్టర్స్‌లు లీకవ్వడంతో ఇలాంటి  రూల్సే పెట్టారు. ఇంత చేస్తున్నారు కానీ, పబ్లిక్‌ ప్లేస్‌లో షూటింగ్‌ చేస్తే ఎంతమందిని కంట్రోల్‌ చేయగలరు మరి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement