
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘సైరట్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘ధడక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ సోదరుడైన ఇషాన్ ఖట్టర్, జాన్వీకి జోడిగా నటిస్తున్నాడు.
జాన్వీ నటిస్తోన్న తొలి చిత్రం కావడంతో లుక్ విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ వరుసగా పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మించగా, శశాంక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ జూలై 20న విడుదల కానంది.
Trailer launch on Mon [11 June 2018]... Ishaan Khatter and Janhvi Kapoor... New poster of #Dhadak... Remake of Marathi blockbuster #Sairat... Directed by Shashank Khaitan... 20 July 2018 release. pic.twitter.com/PpWdPtIxUF
— taran adarsh (@taran_adarsh) June 9, 2018
Comments
Please login to add a commentAdd a comment