
వచ్చే ఏడాది 12 గంట కొట్టగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఫుల్ జోష్‌లో ఉంటారందరూ. కానీ ఆ కేరింతల్ని భయంతో, ఊహించని థ్రిల్‌తో వచ్చే అరుపులుగా మార్చబోతున్నాం అంటున్నారు జాన్వీ కపూర్. వచ్చే ఏడాదిని ‘ఘోస్ట్ స్టోరీస్’తో ప్రారంభించబోతున్నారు జాన్వీ కపూర్. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘లస్ట్‌స్టోరీస్’ యాంథాలజీ తరహాలోనే ‘ఘోస్ట్ స్టోరీస్’ రూపొందించబడింది. ‘లస్ట్‌స్టోరీస్’ను తెరకెక్కించిన కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్ ఈ యాంథాలజీను డైరెక్ట్ చేశారు. ఇది జనవరి 1వ తారీఖున రాత్రి 12గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. కాగా కరణ్ జోహార్ డైరెక్ట్ చేసిన కథలో జాన్వీ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment