శాంసంగ్ గెలాక్సీ సీ5, సీ7 ఆన్ లైన్ లో లీక్
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు లీకేజ్ ల బెడద ఎదురైంది. మార్కెట్లోకి త్వరలో విడుదల చేయాలనుకుంటున్న మిడ్ రేంజ్ సీ-సిరీస్ కొత్త డివైజ్ లు ఆన్ లైన్ లో లీకయ్యాయి. వాటి ప్రత్యేకతలు, ధర సమాచారం ప్రస్తుతం ఆన్ లైన్ హల్ చల్ చస్తోంది. రెండు మెటల్ క్లాడ్ సీ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ సీ5, సీ7 లను ఆవిష్కరించేందుకు శ్యామ్ సంగ్ ప్లాన్ చేస్తుందని ఈ కొత్త లీకేజ్ ల సమాచారం తెలుపుతోంది.
గెలాక్సీ సీ5 రూ. 16,400, గెలాక్సీ సీ7 రూ.18,500 ఉండబోతుందని సమాచారం. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు డ్యూయల్ సిమ్ లను సపోర్టు చేస్తుందని, ఆరు నుంచి ఏడు మిల్లీమీటర్ల థింక్ గా పనిచేస్తుందంట. ఆల్ట్రా హై క్వాలిటీ ఆడియోతో ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగదారుల ముందుకు రాబోతున్నాయట. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కేవలం ఆన్ లైన్ లోనే అందుబాటులో ఉంటాయట. ఇప్పటివరకూ శ్యామ్ సంగ్ విడుదలచేసిన మొబైల్ లు ఆన్ లైన్ లోనూ, రిటైల్ స్టోర్స్ లోనూ లభ్యమయ్యేవి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కేవలం సైజ్, బ్యాటరీ లోనే వేరుగా ఉంటాయని మిగతా ఫీచర్లని ఒకే మాదిరిగా ఉంటాయని తెలుస్తోంది.
శ్యామ్ సంగ్ గెలాక్సీ సీ5, సీ7 ల లీకేజీల ఫీచర్లు...
5.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో గెలాక్సీ సీ5
5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో గెలాక్సీ సీ7
గెలాక్సీ సీ5 బ్యాటరీ సామర్థ్యం 2,600 ఎంఏహెచ్
గెలాక్సీ సీ7 బ్యాటరీ సామర్థ్యం 3,300 ఎంఏహెచ్
64 బిట్ స్నాప్ డ్రాగన్ 617 ఆక్టా కోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్
16 మోగా పిక్సెల్ వెనుక కెమెరా
8 మెగా పిక్సెల్ ముందు కెమెరా
సిల్వర్, గోల్డ్, పింక్, గ్రే రంగుల్లో వేరియంట్లు లభ్యం