శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఎస్-సిరీస్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్‌ను విడుదల చేసిన అనంతరం, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్8 64జీబీ మోడల్ రూ.49,990కు, గెలాక్సీ ఎస్8 ప్లస్ 64జీబీ మోడల్ రూ.53,990కు అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎస్8ప్లస్ 128జీబీ మోడల్ ధరను రూ.64,900కు తగ్గించింది. అంటే అంతకముందు ధరలతో పోలిస్తే గెలాక్సీ ఎస్8పై 8వేల రూపాయల డిస్కౌంట్‌ను, గెలాక్సీ ఎస్8ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై 11వేల రూపాయల డిస్కౌంట్‌ను శాంసంగ్ ప్రకటించింది. ఈ తగ్గించిన ధరలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్లోనూ, శాంసంగ్ అధికారిక రిటైల్ ఛానల్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయాలనుకునే వారు రూ.10వేల పేటీఎం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8ప్లస్ వేరియంట్లు శాంసంగ్ ఎక్సీనోస్ 8895 ఎస్‌ఓసీతో రూపొందాయి. గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్ 5.8 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉండగా.. గెలాక్సీ ఎస్8ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల స్క్రీన్ షేరింగ్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ను కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా 4జీబీ ర్యామ్‌నే కలిగి ఉన్నాయి. కానీ స్టోరేజ్ విషయంలో గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 256జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి రాగ, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఐరిష్ స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేసియల్ రికగ్నైజేషన్, 3000 ఎంఏహెచ్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీలతో రూపొందాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను అతిపెద్ద హైలెట్ బిక్స్బీ వర్చ్యువల్ అసిస్టెంట్.
Comments
Please login to add a commentAdd a comment