సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్‌లపై భారత్‌లో ధరలను తగ్గించింది. రూ.57,900గా ఉన్న గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.53,900కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక రూ.64,900గా ఉన్న గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా రూ.58,900కు తగ్గించింది. అంటే మొత్తంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్ ధరను రూ.4000, రూ.6000 మేర తగ్గించినట్టు ప్రకటించింది. నవరాత్రి సందర్భంగా ఈ రెండు హ్యాండ్‌సెట్లపై ప్రమోషనల్ డిస్కౌంట్ కింద రూ.4000ను కూడా ఆఫర్ చేసింది. అంతేకాక ఈ నెల మొదట్లో గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్లపై కూడా శాంసంగ్ ధరలను కోత పెట్టింది. ధరల తగ్గింపు అనంతరం గెలాక్సీ జే7 ప్రైమ్‌ను రూ.14,900కు, గెలాక్సీ జే5 ప్రైమ్‌ను రూ.12,990కు అందుబాటులోకి తీసుకొచ్చింది.
గెలాక్సీ ఎస్8 ఫీచర్లు..
5.8 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫీచర్లు...
6.2 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ఆక్టాకోర్ ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్
12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.
Comments
Please login to add a commentAdd a comment