Galaxy S8
-
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ధరలు తగ్గింపు
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఎస్-సిరీస్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్‌ను విడుదల చేసిన అనంతరం, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్8 64జీబీ మోడల్ రూ.49,990కు, గెలాక్సీ ఎస్8 ప్లస్ 64జీబీ మోడల్ రూ.53,990కు అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎస్8ప్లస్ 128జీబీ మోడల్ ధరను రూ.64,900కు తగ్గించింది. అంటే అంతకముందు ధరలతో పోలిస్తే గెలాక్సీ ఎస్8పై 8వేల రూపాయల డిస్కౌంట్‌ను, గెలాక్సీ ఎస్8ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై 11వేల రూపాయల డిస్కౌంట్‌ను శాంసంగ్ ప్రకటించింది. ఈ తగ్గించిన ధరలు కంపెనీ అధికారిక వెబ్సైట్లోనూ, శాంసంగ్ అధికారిక రిటైల్ ఛానల్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయాలనుకునే వారు రూ.10వేల పేటీఎం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8ప్లస్ వేరియంట్లు శాంసంగ్ ఎక్సీనోస్ 8895 ఎస్ఓసీతో రూపొందాయి. గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్ 5.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉండగా.. గెలాక్సీ ఎస్8ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల స్క్రీన్ షేరింగ్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ను కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు కూడా 4జీబీ ర్యామ్‌నే కలిగి ఉన్నాయి. కానీ స్టోరేజ్ విషయంలో గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 256జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌తో మార్కెట్లోకి రాగ, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఐరిష్ స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేసియల్ రికగ్నైజేషన్, 3000 ఎంఏహెచ్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీలతో రూపొందాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లను అతిపెద్ద హైలెట్ బిక్స్బీ వర్చ్యువల్ అసిస్టెంట్. -
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లపై ధర కోత
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్‌లపై భారత్‌లో ధరలను తగ్గించింది. రూ.57,900గా ఉన్న గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.53,900కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక రూ.64,900గా ఉన్న గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా రూ.58,900కు తగ్గించింది. అంటే మొత్తంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్ ధరను రూ.4000, రూ.6000 మేర తగ్గించినట్టు ప్రకటించింది. నవరాత్రి సందర్భంగా ఈ రెండు హ్యాండ్సెట్లపై ప్రమోషనల్ డిస్కౌంట్ కింద రూ.4000ను కూడా ఆఫర్ చేసింది. అంతేకాక ఈ నెల మొదట్లో గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్ స్మార్ట్ఫోన్లపై కూడా శాంసంగ్ ధరలను కోత పెట్టింది. ధరల తగ్గింపు అనంతరం గెలాక్సీ జే7 ప్రైమ్‌ను రూ.14,900కు, గెలాక్సీ జే5 ప్రైమ్‌ను రూ.12,990కు అందుబాటులోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్8 ఫీచర్లు.. 5.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫీచర్లు... 6.2 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్. -
గెలాక్సీ ఎస్8, నోట్8 లలో కొత్త ఎడిషన్
న్యూఢిల్లీ : శాంసంగ్ కంపెనీ యూజర్లకు ఆశ్చర్యకరమైన కానుక ఇచ్చింది. అమ్మకాల్లో దూసుకుపోతున్న గెలాక్సీ నోట్8, గెలాక్సీ ఎస్8లలో 'ఎంటర్ప్రైజ్ ఎడిషన్' వేరియంట్లను శాంసంగ్ విడుదల చేసింది. ఈ కొత్త బిజినెస్ టూ బిజినెస్ ప్రొడక్ట్‌లు, బిజినెస్ వాడకాన్ని లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి వచ్చాయి. గెలాక్సీ ఎస్8, నోట్ 8 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ల తయారీ గ్యారెంటీని శాంసంగ్ మూడేళ్లు పొడిగించింది. అయితే ఈ కొత్త వేరియంట్ల ధరలను కంపెనీ వెల్లడించలేదు. సాఫ్ట్‌వేర్‌ను మినహాయిస్తే, మిగతా స్పెషిఫికేషన్లన్నీ ముందస్తు వెర్షన్లకు ఈ వేరియంట్లకు ఒకేవిధంగా ఉన్నాయి. గెలాక్సీ ఎస్8 ఫీచర్లు.. 5.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరుజ్ 12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ నోట్8 ఫీచర్లు... 6.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ షూటర్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఐఫోన్ ఎక్స్ లాభాలు ఆఖరికి శాంసంగ్‌కే..
శాంసంగ్, ఆపిల్ రెండూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నువ్వానేనా అంటూ తలపడుతుంటాయి. తమ లాభాలను అసలు పక్క కంపెనీకి వదలకుండా పోటీపడుతుంటాయి. ఇటీవల ఈ రెండు కంపెనీలు తమ ప్రీమియం స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లను విడుదల చేస్తే, ఆపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆపిల్ నుంచి వచ్చిన ఆల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్. ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టింది. మరో నెలలో ఇది విక్రయానికి వచ్చేస్తోంది. అయితే ఐఫోన్ ఎక్స్ మార్కెట్లోకి వస్తే ఎక్కువగా లాభపడేది శాంసంగ్ కంపెనీనేనట. అదేమిటి? ఐఫోన్ ఎక్స్ మార్కెట్లోకి వస్తే లాభాలు వచ్చేది ఆపిల్‌కి కదా..? శాంసంగ్‌కు ఎలా అనుకుంటున్నారా? ఐఫోన్ ఎక్స్ కు కావాల్సిన ఓలెడ్ ప్యానల్స్‌ను, ఎన్ఏఎన్డీ ఫ్లాష్, డీర్యామ్ చిప్‌లను శాంసంగ్ కంపెనీనే అందించింది. ఈ కాంపోనెంట్లను సరఫరా చేసిన ఏకైక సప్లయిర్ శాంసంగ్ కంపెనీనే. దీంతో 999 డాలర్ల విలువైన ఐఫోన్ ఎక్స్ ఒక్కో యూనిట్ విక్రయంపై 110 డాలర్లు వరకు శాంసంగ్ కంపెనీకే వెళ్లనున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. అంటే ఐఫోన్ ఎక్స్ మొత్తం మార్కెట్ ధరల్లో 10 శాతం శాంసంగ్ కంపెనీకేనట. వచ్చే రెండేళ్లలో 130 మిలియన్ యూనిట్లను ఆపిల్ విక్రయించాలని చూస్తోంది. దీంతో గెలాక్సీ ఎస్ 8ల విక్రయం కంటే ఎక్కువ లాభాలు, ఆపిల్ ఎక్స్ నుంచే శాంసంగ్‌కు రానున్నట్టు రిపోర్టు పేర్కొంది. శాంసంగ్ కంపెనీకి 35 శాతం రెవెన్యూలు కూడా తను అందించే కాంపోనెంట్ల నుంచే వస్తున్నట్టు తెలిపింది. మొత్తం ఐఫోన్ ఎక్స్ నుంచి 14 బిలియన్ డాలర్ల వరకు లాభాలను ఆర్జించవచ్చని ఈ కొరియా కంపెనీ అంచనావేస్తోంది. ఇదే కాలంలో గెలాక్సీ ఎస్8 నుంచి 10 బిలియన్ డాలర్ల వస్తాయని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీదారిగా ఉన్న శాంసంగ్‌కు ఇంతమొత్తంలో రెవెన్యూలను అందించడం ఇష్టం లేని ఆపిల్, ఒకానొక సమయంలో మరో సప్లయర్ కోసం కూడా చూసిందని వార్తలు వచ్చాయి. 2019 నుంచి ఎల్జీని సప్లయర్‌గా ఎంపికచేసుకుంటుందని రూమర్లు ఉన్నాయి. అయితే మార్కెట్లో ఎంత పోటీ ఉన్నప్పటికీ, శాంసంగ్, ఆపిల్ మధ్య గత కొన్నేళ్లుగా ఉన్న స్వీట్ రీలేషన్షిప్ ఇదేనని టెక్ వర్గాలంటున్నాయి. -
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లపై స్పెషల్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్ మొదలైంది. కంపెనీలన్నీ వరుసబెట్టి తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించేస్తున్నాయి. ఈ-కామర్స్ కంపెనీలైతే ఏకంగా భారీ భారీ డిస్కౌంట్లతో మెగా సేల్స్‌కు తెరలేపాయి. తాజాగా స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ కూడా 'నవ్రాత్ర స్పెషల్ ఆఫర్' ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా తన గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై ధరను తగ్గించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధరను 4వేల రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో లాంచింగ్ సందర్భంగా రూ.57,900 ఉన్న గెలాక్సీ ఎస్8, 53,990 రూపాయలకు దిగొచ్చింది. అలాగే 64,900 రూపాయలున్న గెలాక్సీ ఎస్8 ప్లస్ ఇక 60,990 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకైతే మరో 4000 రూపాయలను అదనంగా క్యాష్‌బ్యాక్ కింద అందిస్తుంది. అంటే మొత్తంగా 8వేల రూపాయల మేర ధర తగ్గించినట్టు తెలిసింది. అయితే ఈ తగ్గించిన ధరలు ఇంకా కంపెనీ సొంత ఆన్లైన్ స్టోర్‌లో అప్డేట్ కాకపోవడం గమనార్హం. ఈ ఫోన్లు ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ అయిన తర్వాత చేపట్టిన ఈ కోత, అత్యంత ముఖ్యమైన ధర తగ్గింపుగా కంపెనీ తెలిపింది. గెలాక్సీ ఎస్8 ప్లస్ 6జీబీ ర్యామ్ వేరియంట్‌కు రెండు భిన్నమైన విధానాల్లో ధరల తగ్గింపు శాంసంగ్ చేపట్టింది. గెలాక్సీ ఎస్8 ప్లస్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై కేవలం రూ.1000 ధర మాత్రమే తగ్గించి, 64,900 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధరల తగ్గింపు ఫెస్టివ్ సీజన్‌కు కాస్త ముందుగా కంపెనీ చేపట్టింది. అంతేకాక త్వరలోనే శాంసంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ నోట్ 8 మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ గతవారమే భారత్‌లో విడుదలైంది. ప్రస్తుతం భారత్‌లో దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్21 నుంచి సరుకు రవాణా అవుతోంది. గెలాక్సీ నోట్ 8 ధర 67,900 రూపాయలు. -
ఈ స్మార్ట్ఫోన్లకు గ్లోబల్‌గా మస్తు గిరాకీ!
ప్రతి వారం ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతూ.. వినియోగదారులను అలరిస్తూనే ఉంది. కొత్త కొత్త స్మార్ట్ఫోన్ల లాంచింగ్స్‌తో రోజురోజుకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా విపరీతంగా విస్తరిస్తోంది. అయితే వీటిలో ఏ ఏ స్మార్ట్ఫోన్లు వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి? బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లుగా ఏవి నిలుస్తున్నాయి? అంటే.. ఈ క్వార్టర్లో ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ వచ్చిన స్మార్ట్ఫోన్ల జాబితాను రీసెర్చ్ కంపెనీ స్ట్రాటజీ అనాలిటిక్స్ తన క్వార్టర్లీ రిపోర్టులో వెల్లడించింది. 2017 క్యూ 2 ఎక్కువగా సేల్ అయిన స్మార్ట్ఫోన్లు... ఆపిల్ ఐఫోన్ 7... ప్రారంభ ధర రూ.56,200 ఆపిల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 7, ఈ క్వార్టర్లో ఎక్కువగా మార్కెట్ షేరును సంపాదించుకుంది. 4.7 శాతం మార్కెట్ షేరుతో 16.9 మిలియన్ యూనిట్లు ఈ క్వార్టర్లో అమ్ముడుపోయాయి. ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్.. ప్రారంభ ధర రూ.76,300 ఐఫోన్ 7లో అతిపెద్ద వేరియంట్ ఈ ఐఫోన్ 7 ప్లస్. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 7 తర్వాత రెండో స్థానంలో నిలుస్తోంది. ఈ క్వార్టర్లో 4.2 శాతం మార్కెట్ షేరును సంపాదించుకున్న ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్, 15.1 మిలియన్ యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8... ధర రూ.57,900 దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 10.2 మిలియన్ హ్యాండ్సెట్ల షిప్మెంట్లతో ఇది 2.8 శాతం మార్కెట్ షేరును దక్కించుకుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్... ప్రారంభ ధర రూ.64,900 గ్లోబల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ఈ క్వార్టర్లో 2.5 శాతం మార్కెట్ షేరును సంపాదించింది. ఈ క్వార్టర్లో 9 మిలియన్ యూనిట్లు రవాణా అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ విక్రయాలను నమోదుచేసిన స్మార్ట్ఫోన్లలో గెలాక్సీ ఎస్8 ప్లస్, నాలుగో స్థానంలో నిలిచింది. షావోమి రెడ్మి 4ఏ... ధర రూ.5,999 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మధ్యలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి 4ఏ ఐదో స్థానంలో నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండో క్వార్టర్లో 5.5 మిలియన్ యూనిట్ల సరుకు రవాణాను రికార్డు చేశాయి. గ్లోబల్‌గా ప్రస్తుతం దీని మార్కెట్ షేరు 1.5 శాతం. -
గెలాక్సీ ఎస్8,ఎస్8ప్లస్‌లపై షాకింగ్న్యూస్
దిగ్గజ మొబైల్ మేకర్ శాంసంగ్ సంస్థకు స్మార్ట్ఫోన్ల కష్టాలు వీడేలా కనిపించడంలేదు. శాంసంగ్ నోట్ 7 పేలుళ్లతో అటు ఆర్థికంగాగానూ, ఇటు నైతికంగానూ బాగా దెబ్బతింది. దీంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యాన్ని చలాయిస్తున్న సౌత్ కొరియన్ మొబైల్ మేకర్ శాంసంగ్ ప్రతిష్ట మరింత మసకబారనుంది. ఇటీవల లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ ఫోన్లు గెలాక్స్ 8, గెలాక్సీ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లలో కూడా సమస్యలు తలెత్తినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇవి తరచూ రీస్టార్ట్ అవుతున్నాయని అమెరికా, తదితర దేశాల యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇది మరిన్ని జోన్లకు విస్తరించే ప్రమాదం ఉందని అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. ఈ సమస్యపై అనేక గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ వినియోగదారులు సంస్థ అధికారిక ఫోరమ్‌ను, ఎక్స్‌డీఏ డెవలపర్స్ ఫోరమ్‌ను ఆశ్రయించారు. తన గెలాక్సీ ఎస్ 8 దానికదే రిస్టార్ట్ అవుతోందనీ, ఇది తప్ప మిగతా అంతా బావుందని కమ్యూనిటీ ఫోరంను ఆశ్రయించిన మొదటి ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. 10 గంటల్లో ఇప్పటికే 7 సార్లు రీస్టార్ట్ అయిందని ఫిర్యాదు చేశాడు. కెమెరా, శాంసంగ్ థీమ్స్ ఆప్స్ వాడుతున్నపుడు సడెన్‌గా యాప్ ఫ్రీజ్ అయ్యి, కొన్ని సెకన్ల తర్వాత స్క్రీన్ ఆఫ్ అయిపోతోందని తెలిపారు. ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య ఎదురైందా? దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని ప్రశ్నించాడు. యాదృచ్ఛికంగా, ఎస్ 8 స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ఏవేవో దృశ్యాలు కనిపించి (దిగువ భాగంలో) పునఃప్రారంభమవుంతోని మరో యూజర్ ఫిర్యాదు. ఇది యాప్ ప్రాబ్లమ్‌లా తనకు అనిపించడంలేదనీ తెలిపాడు. అంతేకాదు శాంసంగ్‌కు ఫోన్ చేస్తే రీటైలర్ తిరిగి ఇచ్చేసి.. కొత్తది రిప్లేస్మెంట్ అడగమని చెప్పారని పేర్కొన్నాడు. దాదాపు ఎస్ 8 ప్లస్ విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే రావడం గమనార్హం. అయితే వీటిపై శాంసంగ్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు టర్కీ, యూకే లలో ఇలాంటి ఫిర్యాదులే అందుతున్నాయని శాంమొబైల్ నివేదించింది. జర్మనీ టర్కీలలో ఎస్8 ప్లస్‌లో సమస్యలు తలెత్తినట్టు నివేదించింది. ఈ డిస్ప్లే సమస్యలపై శాంసంగ్ పరిశీలిస్తోందని తెలిపింది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ వినియోగదారులచే నివేదించబడిన రెడ్ టింట్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఉందని పేర్కొంది. గత వారంలో, దక్షిణ కొరియా వినియోగదారుల కంప్లయింట్లపై బగ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నిస్తోందని తెలిపింది. -
గెలాక్సీ ఎస్8 తయారీ ఖర్చెంతో తెలుసా?
న్యూఢిల్లీ : శాంసంగ్ గెలాక్సీ ఎస్8.. ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లలోకి విడుదలైంది. గెలాక్సీ నోట్7 పేలుళ్ల అనంతరం ఎంతో సురక్షితమైన ఫోన్‌గా ఈ దక్షిణ కొరియా దిగ్గజం గెలాక్సీ ఎస్8ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.57,900గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇది గెలాక్సీ ఎస్8 అసలు ధర కాదంట. కంపెనీలు మార్కెట్లోకి ఏ ప్రొడక్ట్‌ను ప్రవేశపెడుతున్నా దానిపై కొంత లాభాలను, ఇతర వ్యయాలను కలుపుకుని ధరను నిర్ణయిస్తాయి. శాంసంగ్ కూడా అలానే గెలాక్సీ ఎస్8ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే గెలాక్సీ ఎస్8 రూపొందడానికి అసలు ఖర్చెంత అయిందో వెల్లడిస్తూ ఐహెచ్ఎస్ మార్కిట్ ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్8 స్మార్ట్ ఫోన్ 64 స్టోరేజ్ వేరియంట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్(బీఓఎస్)లకు కంపెనీ సుమారు 19,500 రూపాయల వరకు ఖర్చు చేసిందట. తయారీ ఖర్చు సుమారు 392 రూపాయలని, మొత్తంగా ఈ ఖర్చు 19,900 రూపాయల వరకు అయిందని ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదించింది. ఈ ఖర్చు శాంసంగ్ గెలాక్సీ ఎస్7 తయారీ ఖర్చు కంటే 2,800 రూపాయలు ఎక్కువని తెలిపింది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఖర్చు కూడా దీని కంటే 2,300 తక్కువేనని వెల్లడైంది. అయితే ఒక్కో కాంపొనెంట్ ధరను ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించనప్పటికీ, ఎన్ఏఎన్డీ ఫ్లాష్ మెమరీ, డీఏఆర్ఎమ్ ధర సుమారు 2,700 అయి ఉంటుందని, బ్యాటరీ ధర 291 రూపాయలు ఉంటుందని తెలిపింది. గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ధరలు కంపెనీ ఎలా నిర్ణయించిందో రివీల్ కానప్పటికీ, గెలాక్సీ నోట్7ను కచ్చితంగా మేజర్ అంశంగా కంపెనీ భావించినట్టు తెలిసింది. కంపెనీ చౌక వెర్షన్‌ను 46,548 రూపాయలకు విక్రయిస్తుంది. ఈ ధర తయారీ ఖర్చు కంటే సుమారు 26,700 రూపాయలు ఎక్కువని రిపోర్టు వెల్లడించింది. అయితే ఇవన్నీ కంపెనీకి వచ్చే లాభాలని మాత్రం ఊహించవద్దంట. ఎందుకంటే మిగతా ఖర్చులు మార్కెటింగ్ వ్యయాలు, పన్నులు, రిటైలర్, క్యారియర్ ఖర్చులు వంటి వాటిని కలుపుకుంటే ఒక్కో యూనిట్‌పై కంపెనీ భరించేది ఎక్కువే ఉంటుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. -
జియో 448జీబీ ఫ్రీ డేటా..ఎవరికో తెలుసా?
రిలయన్స్ జియో సంచలనమైన ఆఫర్లతో దూసుకెళ్తోంది. బుధవారం మార్కెట్లోకి లాంచ్ అయిన శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ కొనుగోలుదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో, శాంసంగ్ భాగస్వామ్యంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసిన జియో యూజర్లకు డబుల్ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద జియో నెట్ వర్క్‌పై కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు 448జీబీ 4జీ డేటాను 8 ఎనిమిది నెలల పాటు ఉచితంగా అందించనున్నట్టు వెల్లడిచింది. అయితే నెలకు 309 రూపాయలతో ఆ యూజర్లు కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిందేనట. జియో ధన్ ధనా ధన్ ప్లాన్ కిందనే గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ కొనుగోలుదారులు ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధన్ ధనా ధన్ ఆఫర్‌పై జియో ప్రైమ్ మెంబర్లు 309 రూపాయల రీఛార్జ్‌తో, నెలకు 28జీబీ డేటా చొప్పున మూడు నెలల పాటు కంపెనీ డేటా సర్వీసులను వాడుకోవచ్చు. ప్రస్తుతం శాంసంగ్ కొత్త గెలాక్సీ కొనుగోలుదారులకు నెలకు వాడుకునే డేటా డబుల్ అవుతుంది. వీరు నెలకు 56 జీబీ చొప్పున ఎనిమిది నెలల పాటు 448జీబీని వాడుకునే అవకాశం పొందుతారు. కాగ, ఈ ఫోన్లను శాంసంగ్ నేడే మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్8 ధర రూ.57,900కాగ, గెలాక్సీ ఎస్8 ప్లస్ ధర రూ.64,900. ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను కంపెనీ ప్రారంభించేసింది. -
శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ లాంచ్
న్యూఢిల్లీ: ప్రముఖ సెల్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్8, ఎస్ 8ప్లస్’ ను విడుదల చేసింది. భారత మార్కెట్లోబుధవారం గ్రాండ్ గా లాంచ్ చేసింది. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్,యూఎస్బీ టైప్-సి, వాటర్ రెసిస్టెన్స్ లాంటి ప్రీమియం ఫీచర్స్‌తో ఆ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అతి చిన్న 10 ఎన్ఎం ప్రాసెసర్ అమర్చినట్టు శాంసంగ్ తెలిపింది. తన కొత్త ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సర్వీస్ బ్రిగ్జ్బీ తోపాటు, ఇటీవల లాంచ్ చేసిన శాంసంగ్ పేయాప్ ను కూడా జోడించింది. తమ ప్రతి శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ లో భారతదేశం టచ్ ఉంటుందని లాంచింగ్ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ హెచ్‌సీ హాంగ్ వ్యాఖ్యానించారు. శాంసంగ్ మొబై ల్బిజినెస్ జనరల్ మేనేజర్ ఆదిత్య బబ్బర్ ఎస్ 8 లో కొత్త ఇంటిలిజెన్స్ సర్వీసును పరిచయం చేశారు. ఎస్8 విలువ రూ .57,900 గాను, ఎస్ 8 ప్లస్ రూ.64,900 గా నిర్ణయించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో మే 5 నుంచి అందుబాటులోఉండనున్నాయి. అయితే ప్రి బుకింగ్ ఆర్డర్లు మాత్రమే ఈరోజునుంచే ప్రారంభం.అలాగే ప్రీ బుకింగ్‌పై స్పెషల్ ఆఫర్‌గా వైర్లెస్ చార్జర్‌ను అందిస్తోంది. గెలాక్సీ ఎస్-8 ఫీచర్లు 6.2 ఇంచెస్ క్యూహెచ్డీ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7 నౌగట్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్ 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఎస్ 8 లో 3,000 ఏంఏహెచ్ బ్యాటరీ ఎస్8ప్లస్‌లో 3,500 ఏంఏహెచ్ బ్యాటరీ అమర్చింది. -
గెలాక్సీ ఎస్7ను మించిపోయిన ఎస్8
సియోల్ : సియోల్ : ఐఫోన్ కిల్లర్ గా తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్8 స్మార్ట్ ఫోన్ ప్రీఆర్డర్స్ లో అదరగొడుతుందట. తన ముందస్తు స్మార్ట్ ఫోన్ ఎస్7 కంటే మించిపోయిన ప్రీ-ఆర్డర్లను రికార్డు చేసినట్టు శాంసంగ్ మొబైల్ బిజినెస్ చీఫ్ కోహ్ డాంగ్-జిన్ వెల్లడించారు. దక్షిణకొరియా, అమెరికా, కెనడాలో ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ విక్రయాలను ఏప్రిల్ 21 నుంచి కంపెనీ చేపట్టబోతుంది. నోట్ 7 దెబ్బకు అతలాకుతలమైన శాంసంగ్, ఎలాగైనా మార్కెట్లో నిలదొక్కుకుని, ఆపిల్ కు చెక్ పెట్టాలని ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజానికి తొలి ఏడాది విక్రయ రికార్డును ఈ ఫోన్ ఇస్తుందని కొంతమంది ఇన్వెస్టర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లను ప్రారంభించామని, అంచనావేసిన దానికంటే మెరుగ్గా దీని ప్రీ-ఆర్డర్లు రికార్డవుతున్నట్టు కోహ్ చెప్పారు. ఎలాంటి బ్యాటరీ పేలుళ్ల ఘటనలు సంభవించకుండా.. ఎంతో సురక్షితమైన ఫోన్ గా దీన్ని ప్రవేశపెట్టామన్నారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్ కంపెనీకి బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గా నమోదవుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్ట్రాంగ్ ఎస్8 అమ్మకాలు, మెమరీ చిప్ మార్కెట్ బూమ్ కంపెనీకి మంచి వద్ధి రికార్డు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
ఎస్8తో యాపిల్‌కు శాంసంగ్ సవాల్
న్యూయార్క్: ఐఫోన్–7 విజయంతో జోరుమీదున్న యాపిల్‌కు శాంసంగ్ తన కొత్త ఫోన్లతో సవాల్ విసిరినట్లు కనిపిస్తోంది. నోట్–7 ఫోన్‌తో ఫెయిలైన శాంసంగ్ ఇప్పుడు గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ అనే రెండు హైఎండ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధర 720 డాలర్ల నుంచి ప్రారంభమౌతోంది. కస్టమర్లు ఈ ఫోన్లను గురువారం 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అయితే ఇవి ఏప్రిల్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఎస్8 ఫోన్లో 5.8 అంగుళాల స్క్రీన్, ఎస్8 ప్లస్‌లో 6.2 అంగుళాల స్క్రీన్ ఉంది. ఆండ్రాయిడ్ 7.0 నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే రెండు స్మార్ట్ఫోన్లలోనూ 12 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, వాటప్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్, ఐరిస్/ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. కంపెనీ ఎస్8, ఎస్8 ప్లస్ ఫోన్లతోపాటు కొత్త 360 డిగ్రీ కెమెరాను (360 డిగ్రీల్లోనూ వీడియో తీసుకోవచ్చు), వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ‘గేర్ వీఆర్’ను, ఫోన్ డాక్ ‘డెక్స్’ వంటి పలు ప్రొడక్టులను కూడా ఆవిష్కరించింది. ఫోన్స్ ప్రత్యేకతలు... ఇన్ఫినిటీ డిస్ప్లే: స్క్రీన్ డిస్ప్లే పెద్దదిగా ఉంటుంది. దాదాపు ఫోన్ మొత్తం స్క్రీనే ఉన్నట్లు కనిసిస్తుంది. ఫేస్ స్కానర్: ముఖాన్ని స్కాన్‌చేయడం ద్వారా ఫోన్‌ను ఆన్‌లాక్ చేయవచ్చు. బిక్స్బి: ఇది ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ఉదాహరణకు మీరు మీ స్నేహితుడికి ఒక స్క్రీన్‌షాట్ పంపాలి అనుకున్నారు. అప్పుడు మీరు మీ చేతులతో పనిలేకుండా కేవలం వాయిస్ ద్వారా స్క్రీన్‌షాట్ పంపొచ్చు. అలాగే ఇది ఇమేజ్‌లను గుర్తుపడుతుంది. స్మార్ట్‌హోమ్ ఉపకణాలను కంట్రోల్ చేస్తుంది. శాంసంగ్ బిక్స్బి.. యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాలకు గట్టిపోటి ఇవ్వనుంది. -
సామ్సంగ్ గెలాక్సీ ఎస్8 లాంచ్!
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం సామ్సాంగ్ కంపెనీ బుధవారం రాత్రి ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మోడల్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన టెక్నాలజీతో ఈ స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నట్టు సామ్సంగ్ ఈ సందర్భంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన అనేక ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి. వినియోగదారులను ఊరించినట్టుగానే అనేక అత్యాధునిక ఫీచర్లతో గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మార్కెట్లోకి రానున్నాయి. ఏప్రిల్ 21 నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్లోని కొన్ని ఫీచర్లు ఇవి.. గత మోడళ్లలాగే ఎస్8, ఎస్8 ప్లస్ కూడా వాటర్, డస్ట్ రెసిస్టెంట్.. గత మోడళ్ల కన్నా ఈ మోడల్ ప్రాసెసర్ 10శాతం, జీపీయూ 21శాతం వేగంగా పనిచేస్తాయి. వైర్లెస్ చార్జర్‌ను సైతం ఈ మోడళ్లు సపోర్ట్ చేస్తాయి అత్యంత రక్షణతో కూడిన 8పాయింట్ బ్యాటరీతో రానున్నాయి. ఈ మోడల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్‌తోపాటు ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ కూడా ఉండనుంది. పాస్వర్డ్, ప్యాటర్న్ అవసరం లేకుండా ఫేస్ రికగ్నిషన్ తో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. అత్యాధునిక సేవలను అందించేందుకు సాంసంగ్ ప్రత్యేకంగా వాయిస్ అసిస్టెంట్ టూల్ బిక్స్బైను తీసుకొచ్చింది. ఎన్నో ప్రత్యేక సేవలను ఈ టూల్ అందిస్తుంది. -
గెలాక్సీ ఎస్ 8 కమింగ్ సూన్..!
న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానికి దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 8 త్వరలోనే మార్కెట్లను పలకరించనుంది. మీడియా నివేదికలు ప్రకారం, అనుకున్న దానికంటే ముందుగానే ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులో ఉంచడానికి శాంసంగ్ సిద్ధపడుతోంది. వినియోగదారుల విశ్వాసం పొందేందుకు గాను ఫిబ్రవరి 2017 లోను దీన్ని లాంచ్ చేయనుంది. ముందు ఇది ఏప్రిల్ 2017 లో రానుందని అంచనావేశారు. ఫీచర్లు, ధర తదితర వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడి చేయనప్పటికీ...వివిధ అంచనాల ప్రకారం ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్ 8 ఫీచర్లు 1440 x 2560 ఎంపీ రిజల్యూషన్ 4కె స్క్రీన్, 6 జీబీ ర్యామ్ 256 జీబీ ఎక్స్ పాండబుల్ మొమొరీ 30 మెగాపిక్సెల్ కెమెరా 4,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అయితే 3.5ఎంఎం ఆడియో జాక్ ను ఎస్ 8 లో తొలగించినట్టు తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే ఎస్ 7 ఎస్ 7ఎడ్జ్ రేంజ్ లోనే ఉండొచ్చని భావిస్తున్నారు. రెండు వేరియంట్లలో వస్తున్న గెలాక్సీ ఎస్ 8 64 జీబీ రూ.55,000, 128 జీబీ రూ. 60,000 ఉండొచ్చని అంచనా. కాగా గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్ కారణంగా వినియోగదారుల విశ్వసనీయతను కోల్పొవటంతో పాటు వేల కోట్ల నష్టపోయింది. దీంతో బ్యాటరీ లో మరిన్ని జాగ్రత్తలతో పాటు, ఎక్సినాస్ 8895 ప్రాసెసర్ విత్ మాలి-జీ71 జీపీయుతో గెలాక్స్ ఎస్ 7కంటే 1.8 రెట్ల అధిక సామర్ధ్యంతో రానుందని తెలుస్తోంది. అలాగే వైర్ లెస్ ఎయిర్ బడ్స్ ను కూడా లాంచ్ చేయనుంది. సామ్సంగ్ తన అప్ కమింగ్ గెలాక్సీ ఎస్8 ద్వారా తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. -
శాంసంగ్ న్యూ గెలాక్సీ ఎలా ఉంటుందో తెలుసా?
గెలాక్సీ నోట్7 సంక్షోభంతో ఇటు మార్కెట్లో తమ కీర్తిప్రతిష్టలను.. అటు కంపెనీ లాభాలను భారీగా కోల్పోయిన శాంసంగ్, తన అప్‌కమింగ్ డివైజ్‌పై నమ్మకాలను భారీగా ఆశలు పెంచేసుకుంది. ఎలాగైనా మళ్లీ మార్కెట్లో తమ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం, గెలాక్సీ ఎస్8ను పలు జాగ్రత్తలతో రూపొందిస్తోంది. సరికొత్త డిజైన్, మెరుగైన కెమెరాలతో వినియోగదారుల ముందుకు తీసుకొస్తామని శాంసంగ్ చెప్పింది. ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్ రూపరేఖలను కంపెనీ రివీల్ చేసింది. మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఈ హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను స్లిక్ డిజైన్‌తో రూపొందిస్తున్నామని, కెమెరాను మెరుగుపరిచామని పేర్కొంది. మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సర్వీసుతో ఇది వినియోగదారులను అలరించనుందని వెల్లడించింది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఒక్క ఫీచర్‌ను కూడా కంపెనీ రివీల్ చేయలేదు. అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్-ఇంటిలిజెన్స్ సాప్ట్వేర్ కంపెనీని కొనుగోలు చేసిన శాంసంగ్, ఏఐ రంగంలో మార్కెట్లో తమ పరపతిని పెంచుకోవాలని ఆశిస్తోంది. ఆపిల్ మొబైల్ డివైజ్‌ల కోసం డిజిటల్ వాయిస్-అసిస్టెంట్ కింద సిరి యాప్‌ను ఈ వివ్ డెవలపర్లే అభివృద్ధి చేశారు. ఈ సంస్థను గత నెలలో శాంసంగ్ కొనుగోలు చేసేసింది. ప్రాథమిక లీకేజీల ప్రకారం మార్కెట్లోకి రాబోతున్న అప్‌కమింగ్ శాంసంగ్ ఫీచర్లు.. 5.5 అంగుళాల 4కే సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, డ్యూయల్ కెమెరా సెట్అప్(16 ఎంపీ, 8ఎంపీ కెమెరాలు)గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే అప్టికల్ ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీతో రాబోతున్న కంపెనీ మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనట. అయితే పలు రిపోర్టుల ప్రకారం గెలాక్సీ ఎస్7లో నెలకొన్న సమస్యను కనుగొనడానికి కంపెనీ తలమునకలై ఉన్న నేపథ్యంలో గెలాక్సీ ఎస్8 రూపకల్పన ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.